Mar 31, 2012

త్వరలో కేంద్ర మంత్రిగా చిరు!

న్యూఢిల్లీ, మార్చి 31 : పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండోదశ మొదలయ్యేలోపే (ఏప్రిల్ 24) ఇటు పార్టీలోను.. అటు కేంద్ర మంత్రివర్గంలోను భారీ మార్పులు చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించినట్లు తెలిసింది. డీఎంకేకు చెందిన మరో ఇద్దరిని, ఇఇటీవల రాజ్యసభకు ఎంపికైన చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి చేర్చుకునే అవకాశాలున్నాయి. ఇంకా.. సమాజ్‌వాదీ పార్టీని కూడా మంత్రివర్గంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

కీలక శాఖల్లో కూడా మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా మంత్రివర్గ మార్పులకు ముందు పార్టీలో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ జరగనుందని ఈ వర్గాలు తెలిపాయి. ఒకే వ్యక్తికి ఒకే పదవి సూత్రం ఆధారంగా బాధ్యతలు కల్పిస్తారని, ఒకరిద్దరు మంత్రులను పూర్తిగా పార్టీకి కేటాయిస్తారని తెలిసింది. గులాంనబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ పార్టీ బాధ్యతలతో పాటు మంత్రివర్గ బాధ్యతల్ని కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక సీడబ్ల్యుసీ, పార్టీ ఆఫీసు బేరర్ల పదవుల్లో అన్ని రాష్ట్రాల వారికి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది.
Read more ...

మద్యం వ్యవహారంలో ఎంతో ఫీలవుతున్నా:బొత్స సత్యనారాయణ

 "విజయనగరం జిల్లా సీఐ తనపై అధికారులకు జారీ చేసిన లీగల్ నోటీసుల్లో నన్ను, నా కుటుంబానికి సంబంధించి పేర్కొన్న వ్యాఖ్యలను చూసి ఎంతగానో బాధపడ్డాను'' అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శనివారం ఇక్కడి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తాను ఢిల్లీ బయలుదేరే ముందు విజయనగరం జిల్లాకు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ తనపై అధికారులకు ఇచ్చిన ఒక లీగల్ నోటీసు ప్రతి తన వద్దకు వచ్చిందని, దానిని చదివి తాను చాలా బాధపడ్డానని బొత్స చెప్పారు. 

విమానాశ్రయంలో జిరాక్స్ తీయించి, ఒక కాపీని తన వద్ద ఉంచుకుని, మరొక కాపీని ముఖ్యమంత్రికి పంపించాలంటూ సంబంధిత అధికారులను తాను ఆదేశించానన్నారు. ఆ లీగల్ నోటీసులో పేర్కొన్న అంశాలను చదివిన తర్వాత తాను చాలా చాలా బాధ పడ్డానని, ఇప్పటికీ తాను తేరుకోలేదని చెప్పారు. తాను చాలా ఫీలయ్యానని, దాని గురించి మాట్లాడదల్చుకోలేదని అన్నారు. తాను ఢిల్లీ వచ్చిన తర్వాత దీనిపై అధికారులు, ముఖ్యమంత్రితో మాట్లాడానని తెలిపారు. "సో శాడ్. చాలా బాధగా ఉంది. నేను చాలా ఫీలవుతున్నాను. సరే మీ ఇష్టం. ఏం చేస్తారో చేసుకోండి.. అని సీఎంతో ఫోన్‌లో అన్నాను'' అని వివరించారు. 

అయితే, 'నువ్వెంత.. నీ లెక్కెంత' అని మాత్రం సీఎంను తాను అనలేదన్నారు. ఎందుకంటే, ముఖ్యమంత్రి అంటే ఒక వ్యవస్థ అని అన్నారు. వ్యక్తులతో మాట్లాడటం వేరు, వ్యవస్థతో మాట్లాడటం వేరని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రితో పాటు పీసీసీ అధ్యక్షుడిగా తాను కూడా ఒక వ్యవస్థేనన్నారు. కాబట్టే, ఉదయాన్నే తాను ముఖ్యమంత్రికి ఫోన్ చేసి.. 'నువ్వెంత.. నీ లెక్కెంత' అంటూ పత్రికల్లో వచ్చింది వాస్తవం కాదని వివరణ ఇచ్చానన్నారు. 

కాగా, ఆ నోటీసులో ఒక మంత్రి తనకు పదేపదే ఫోన్లు చేస్తున్నారని 'మద్యం కేసులో మిమ్మల్నే ఎందుకు ఇరికించాలని చూస్తున్నారు?' అని ప్రశ్నించగా.. "ఆ విషయం నాకు తెలీదు. దయచేసి ఇంకో విషయానికి వెళతారా.. లేక విలేకరుల సమావేశం ఆపేయనా?'' అని బొత్స ఎదురు ప్రశ్నించారు. అధిష్ఠానం దృష్టికి ఈ నోటీసుల వ్యవహారాన్ని ఎవరో ఒకరు తీసుకెళుతూనే ఉంటారని, అదొక సంప్రదాయమని చెప్పారు. రాబోయే ఉప ఎన్నికల్లో టీడీపీకి మూడో స్థానం వస్తుందని జోస్యం చెప్పారు. 

తెలంగాణకు పరిష్కారం దిశగా కసరత్తు: బొత్స
జయాపజయాలు, రాజకీయ ప్రయోజనాలతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల మేరకే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందని బొత్స అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు అందరం బాధపడుతున్నామని, సమస్యకు అవి పరిష్కారం కాదని, పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. పరిష్కారం జరుగుతుందని తాము ఆశిస్తున్నామన్నారు. 

విద్యుత్ చార్జీల పెంపు సబబే
విద్యుత్ చార్జీలు గత 7,8 ఏళ్లలో పెంచలేదని, అందువల్ల చార్జీలు పెంచక తప్పదని బొత్స అన్నారు. 2009 ఎన్నికల ప్రణాళికలో రాబోయే ఐదేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచబోమని వైఎస్ హామీ ఇవ్వలేదని పీసీసీ చీఫ్ చెప్పారు. 

లాలూచీలకు మా బాధ్యత లేదు
తనపై కక్ష కడుతున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలపై బొత్స స్పందిస్తూ.. దోచుకున్నది దాచుకునేందుకే సెంటిమెంటును కవచంగా జగన్ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. 2004లో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మంత్రులందరిదీ బాధ్యతేనన్నారు. ఆ నిర్ణయాల వెనుక జరిగిన లాలూచీలకు మాత్రం తాము బాధ్యులం కాదన్నారు.
Read more ...

ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి ఏసీబీ సవాల్

విజయనగరం జిల్లాలో సగానికి పైగా మద్యం షాపులు ఒకే వ్యక్తి లేదా ఒకే సిండికేట్ అధీనంలో ఉన్నాయి. షాపుల వేలం నుంచి ఇప్పటి వరకు అధికారులతో కుమ్మక్కై వ్యాపారం చేస్తున్నారు. ఇది మామూలు అవినీతి కాదు. వ్యవస్థీకృత నేరం. ఈ కేసులో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తి అసలే లేదు. ఈ కేసుల దర్యాప్తును ప్రొఫెషనల్‌గానే చేస్తున్నాం. దర్యాప్తు తీరుపై ఎవరైనా ఆందోళన చెందితే.. కోర్టులకు పోవచ్చు. అంతే తప్ప.. అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు!! .. మద్యం సిండికేట్ కేసులపై వివాదాల నేపథ్యంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ భూబతిబాబు చేసిన 'విజ్ఞప్తి' ఇది. మద్యం షాపుల తెర వెనుక పాత్రధారులను బయటపెట్టే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు. 

నిరుపేదలను ముందు పెట్టి పెట్టుబడులు పెట్టిన 'పెద్దల' గుట్టును రట్టు చేసే పనిలో ఉన్నామని తేల్చి చెప్పారు. విజయనగరం జిల్లాలో బొత్స టార్గెట్‌గా ఏసీబీ ఆపరేషన్ జరుగుతోందన్న కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని నిర్థారిస్తూ.. విజయనగరం మద్యం సిండికేట్ కేసులో మంత్రి బొత్స, ఆయన కుటుంబీకుల పేర్లను ఇరికించాలంటూ ఏసీబీ సిట్ చీఫ్ శ్రీనివాసరెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని విజయనగరం ఎక్సైజ్ మాజీ సీఐ గణేశ్ ఆరోపించారు కూడా. నలుగురిలోనూ తనను దూషించారంటూ శ్రీనివాస రెడ్డికి ఆయన కోర్టు నోటీసులు కూడా పంపారు. దీంతో, బొత్స టార్గెట్‌గా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తన అధీనంలోని ఏసీబీ ద్వారా పావులు కదుపుతున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. 

మద్యం సిండికేట్ కేసుల వ్యవహారం సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణల మధ్య 'వార్'గా మారింది కూడా. 'నువ్వెంతంటే.. నా సంగతి తెలియదు' అనే స్థాయికి ఈ వ్యవహారం చేరింది. ఈ నేపథ్యంలోనే.. ఏసీబీ డైరెక్టర్ జనరల్ భూబతిబాబు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం సిండికేట్ కేసుల వెనక చాలా చరిత్ర ఉందంటూనే.. విజయనగరం జిల్లాలో మద్యం వ్యాపారం వ్యవస్థీకృత నేరంగా జరిగిందని స్పష్టం చేశారు. "గత ఏడాది డిసెంబర్‌లో మద్యం సిండికేట్ కార్యాలయాల్లో జరిగిన సోదాల్లో లభించిన సమాచారం ఆధారంగా 25 కేసులు నమోదు చేశాం. 

మద్యం షాపుల వేలం సందర్భంగా రికార్డులు తారుమారు చేసిన నలుగురు ఎక్సైజ్ అధికారులను అరెస్టు చేశాం. ఖమ్మం జిల్లాలోని 16 మద్యం దుకాణాలను ఒకే సిండికేట్‌కు వీరు అప్పగించడాన్ని గుర్తించాం. ఈ కేసును పరిశీలిస్తుండగా.. కొత్తగూడెంలోనూ షాపుల వేలం ప్రక్రియను పక్కదారి పట్టించారన్న విషయాన్ని గుర్తించాం. దీంతో, ఇక్కడ తొమ్మిదిమంది అధికారులను అరెస్టు చేశాం. వాస్తవానికి, ఇక్కడి షాపులను వేలంలో కొంతమంది దక్కించుకున్నారు. వారి పేర్లను రిజిస్టర్లో రాసి సంబంధిత అధికారి సంతకం చేశారు. కానీ, ఈ అధికారులు రికార్డులను తారుమారు చేశారు. ఇతర పేర్లను అందులో చొప్పించారు. 64 మద్యం షాపుల రికార్డులను తారుమారు చేసి వారికి అప్పగించారు. కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలోని ఈ దుకాణాలను గిరిజనేతరులు దక్కించుకున్నారు. ఇటువంటి అక్రమాలు ఇతర జిల్లాల్లోనూ జరిగాయని తెలుసుకుని వాటిని బయటపెట్టేందుకు చర్యలు తీసుకున్నాం. 

ఇందులో భాగంగానే విజయనగరం జిల్లాలో సోదాలు జరిపాం. అక్కడ కూడా అక్రమాలు జరిగాయని గుర్తించి కేసు నమోదు చేశాం. ఆ రికార్డుల పరిశీలన సందర్భంగా కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విజయనగరంలో 202 మంది లైసెన్స్‌దారులు ఉన్నారు. వారిలో 103 మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ముగ్గురికి అంత్యోదయ కార్డులు ఉన్నాయి. మరో తొమ్మిది మందికి తాత్కాలిక రేషన్ కార్డులు ఉన్నాయి. 33 మంది తాము లైసెన్స్ తీసుకున్న మద్యం షాపుల్లోనే పని చేస్తున్నవారు లేదా కూలీలు. వీటిలో చాలా మద్యం దుకాణాల పేర్లు ఒకటే. బహుశా ఇవన్నీ ఒకే వ్యక్తి లేదా ఒకే సిండికేట్ అధీనంలో ఉన్నాయి. జిల్లాలో సగానికిపైగా షాపులు వీరి నియంత్రణలోనే ఉన్నాయి. 

మద్యం షాపుల వేలం ప్రక్రియ నుంచి ఇప్పటి వరకు ఎక్సైజ్ అధికారులతో కుమ్మక్కై వ్యాపారం చేస్తున్నారు. దర్యాప్తును బట్టి చూస్తే.. ఇవి మామూలు అవినీతి కేసులు కావు. వ్యవస్థీకృత నేరాలు అనడానికి ఆధారాలు ఉన్నాయి. అందుకే ఈ కేసులో బాధ్యులు అందరిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం'' అని ఆయన పేర్కొన్నారు. అంతేనా.. ఏయే మద్యం షాపునకు ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు? ఆయా చెక్కులను ఎవరెవరు జారీ చేశారు? ఈ పెట్టుబడుల వెనుక ఎవరున్నారు? తదితర వివరాలను బయటపెట్టేందుకు దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. తాము చట్ట పరిధిలో నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నామని, ఒత్తిళ్లకు లొంగేది లేదని, ఆధారాలు లభిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

తమ దర్యాప్తు తీరుపై ఎవరికైనా ఆందోళన ఉంటే కోర్టులకు వెళ్లొచ్చని స్పష్టం చేశారు. అంతే తప్ప బహిరంగ వ్యాఖ్యలు చేసి అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని హితవు పలికారు. వాస్తవానికి, విజయనగరం జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వారంతా పేదలు, నిరుపేదలని గుర్తించిన ఏసీబీ.. కోట్ల రూపాయలు వెచ్చించి వారు మద్యం దుకాణాలు ఎలా పొందారని ఆరా తీసింది. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన వ్యక్తులు ఎవరో వారి వెనక ఉండి కథను నడిపించారని తేల్చింది. ఇప్పుడు, దుకాణాలు దక్కించుకోవడానికి పెట్టుబడులు ఎక్కడినుంచి ఎలా వచ్చాయి అనే దానిపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది.
Read more ...

రామోజీ జలదాహానికి బ్రేక్!

రామోజీరావు జలదాహానికి తాత్కాలికంగా రెవెన్యూ అధికారులు చెక్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో రామోజీరావు ఇటీవల కొనుగోలు చేసిన వ్యవసాయ బావినుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా రామోజీ ఫిలింసిటీకి తరలిస్తున్నారని, దీన్ని వెంటనే అడ్డుకోవాలని గ్రామస్తులు హయత్‌నగర్ తహసీల్దార్ సురేందర్‌రావుకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా రామోజీ ఫిలింసిటీకి నీటి రవాణాను అధికారులు నిలిపేశారు. రెవెన్యూ సిబ్బంది ట్యాంకర్లను వెనక్కి పంపారు. 

రామోజీరావు అనాజ్‌పూర్ గ్రామంలో తాను కొనుగోలు చేసిన గొల్లోనిబావిని లోతు చేయటంతోపాటు సైడ్ బోర్లు వేశారు. అంతేగాక అక్కడినుంచి పెద్ద ఎత్తున ట్యాంకర్ల ద్వారా నీటిని ఫిలింసిటీకి తరలిస్తున్నారు. దీంతో రామోజీ బావిని ఆనుకుని ఉన్న రైతుల బావులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ఫలితంగా తమ కళ్లముందే పంటలు ఎండిపోతుండడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతులు ట్యాంకర్ల ద్వారా ఫిలింసిటీకి నీటిని తరలిస్తుండడాన్ని శుక్రవారం అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. దీనిపై వారు హయత్‌నగర్ తహసీల్దారుకు శనివారం ఫిర్యాదు చేయడంతో రామోజీ ఫిలింసిటీకి నీటి రవాణాను అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న రాఘవేందర్‌రెడ్డి అనే రైతును కూడా వదిలేశారు.
Read more ...

ఒక జగన్ కేసు, రెండు కధనాలు

సాక్షి కధనం:

వైఎస్సార్‌ను టార్గెట్ చేయటానికే డ్రామాలు
రూ.16 కోట్ల లబ్ధికి... రూ.30 కోట్ల ప్రతిఫలమట!

ఇదీ... చార్జిషీట్లో సీబీఐ మోపిన ప్రధాన అభియోగం
ప్రస్తుతానికి హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలపైనే గురి
వాటికి జడ్చర్ల సెజ్‌లో భూములిచ్చినందుకే పెట్టుబడులట!
ఎకరా రూ.7 లక్షల చొప్పున లీజుకివ్వటం వల్ల రూ.12 కోట్ల నష్టమట.. అరబిందో
తన భూమిని అనుబంధ సంస్థకు బదలాయించుకోవటమూ నేరమేనట
నాడు ‘ఈనాడు’లో ఏం రాశారో... నేడు చార్జిషీట్లోనూ అదే
దానికి జీవోలతో సహా ‘సాక్షి’ నాడే సమాధానమిచ్చినా పట్టని సీబీఐ
మరణించిన వ్యక్తి ఎలాగూ రాలేరనే ఆయనపై నిందలు .. నేరుగా అభాండాలు
కేసులో ఏమీ లేకున్నా సాగదీసి బురదజల్లడానికే కుయుక్తులు

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
కోర్టుకు రాసిన లేఖ నుంచి... కోర్టుకిచ్చిన అభియోగపత్రం వరకూ అంతా కుట్రే. పక్కా పథకం ప్రకారం సాగిన కుతంత్రమే. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎలాగూ తిరిగి రాలేరు. ఎన్ని నిందలు మోపినా సమాధానం చెప్పుకోలేరు. సీబీఐకయినా... ఎల్లో సిండికేట్‌కయినా అదే ధైర్యం. అందుకే... నిండు సభలో ఆయన ఎదురొడ్డి తిప్పికొట్టిన విపక్షాల విమర్శలన్నిటినీ సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచింది. నాడు జడ్చర్ల సెజ్‌పై వైఎస్‌తో పాటు మంత్రి గీతారెడ్డి ప్రభృతులంతా... కేటాయింపులన్నీ ప్రభుత్వ విధివిధానాల మేరకే జరిగాయని చెప్పిన వాస్తవాల్ని పక్కనపెట్టేసింది. రూ. 16 కోట్లు లబ్ధి చేకూర్చారని.. అందుకే ఆ కంపెనీలు రూ.30 కోట్లు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టాయని.. అతకని అబద్ధాల్ని వినిపించింది. మొత్తమ్మీద సీబీఐ అభియోగపత్రం తేల్చిందొక్కటే. ఈ కేసులో ఏమీ లేదని! ఈ 9 నెలలూ తవ్వి వీళ్లు తేల్చిందేమీ లేదని. ఎలాగైనా కేసును ఇంకొన్నాళ్లు సాగదీసి... బురద జల్లే కార్యక్రమాన్ని మాత్రం ఎల్లో ఫెలోల సాయంతో కొనసాగిస్తారని...! ఇంకా స్పష్టంగా తేలిందేమిటంటే... ఈ దర్యాప్తు రిమోట్ ఢిల్లీలోనే ఉందని..!

రూపాయి లబ్ధి చేకూర్చినందుకు... మూడు రూపాయలు ఎదురిస్తారా ఎవరైనా? ఇవ్వరనేది కామన్‌సెన్స్. ఇస్తారనటం నాన్సెన్స్. సీబీఐ తనది ఈ రెండవ సెన్సే అంటోంది. ‘టార్గెట్ వైఎస్సార్’ అజెండాతో ముందుకెళుతున్న దర్యాప్తు సంస్థ... కోర్టులకు, జనానికి కూడా ఆలోచించే శక్తి ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించేసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఫార్మా సెజ్‌లో అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్‌లకు భూమిని కేటాయించటం ద్వారా ైవె .ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వారికి లబ్ధి చేకూర్చిందని... అందుకు ప్రతిగానే వారు ‘సాక్షి’ గ్రూపులో పెట్టుబడులు పెట్టారని శనివారం దాఖలు చేసిన చార్జిషీట్లో సీబీఐ ప్రధానంగా పేర్కొంది. ఇలా భూములు కేటాయించటం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.16 కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ... అందుకు ప్రతిఫలంగా ఆ కంపెనీలు ‘సాక్షి’ గ్రూపులో 29.5 కోట్లు పెట్టుబడి పెట్టాయని పేర్కొంది. దీన్ని క్విడ్ ప్రోక్వోగా అభివర్ణించింది. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. గడిచిన తొమ్మిది నెలలుగా సీబీఐ కొండను తవ్వుతూనే ఉంది. రాజకీయ పక్షాలు, ‘ఈనాడు’, దాని తోకలు అందించిన మందుగుండు సాయంతో రెచ్చిపోయి మరీ తవ్వింది. ఏమీ దొరక్క చివరికో చచ్చిన ఎలుకను పట్టుకుంది. విధిలేక దాన్నే ఓ అద్భుతమైన ఖనిజమంటూ నమ్మించే కసరత్తు మొదలెట్టింది. ఇదీ... ‘సాక్షి’ పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు తీరు.

సీబీఐ ప్రధాన అభియోగమిదీ...

‘‘హెటెరో డ్రగ్స్, హెటెరో ల్యాబ్స్, హెటెరో హెల్త్‌కేర్ వంటి కంపెనీలున్న హెటెరో గ్రూప్... సాక్షి గ్రూపులో మొత్తంగా 19.50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అరబిందో ఫార్మా కూడా జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ రెండింటికీ విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లను కేటాయించటంతో పాటు జడ్చర్ల సెజ్‌లో భూముల్ని కేటాయించారు’’ ఇదీ సీబీఐ ఛార్జిషీట్లో మోపిన ప్రధాన అభియోగం. మరి దీన్లో నిజమెంత?

ఇదెక్కడైనా సాధ్యమా?

16 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారని... అందుకు ప్రతిగా ఆ కంపెనీలు రూ.29.5 కోట్లు ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టాయని సీబీఐ చేస్తున్న వాదన ఏమాత్రమైనా నమ్మేదిగా ఉందా? అసలిందులో తర్కం ఏ కోశాన్నయినా ఉందా? అసలు ఆ భూముల కేటాయింపు ద్వారా ఆయా కంపెనీలకు రూ.16.5 కోట్లు లబ్ధి కలిగిందనటం నిజమేనా?

నిజంగా ఆ మేరకు లబ్ధి కలిగిందా? ఓ సారి చూస్తే...

జడ్చర్ల సెజ్‌లో అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్‌కు తలా 75 ఎకరాలను ఎకరా రూ.7 లక్షల చొప్పున పాతికేళ్ల పాటు లీజుకిచ్చిన మాట వాస్తవమే. దీనికి ధరల నిర్ణాయక కమిటీ ఎకరాకు రూ.15 లక్షల్ని నిర్ణయించి ఉండొచ్చు కూడా. కానీ ప్రభుత్వం రూ.7 లక్షలకు కేటాయించడానికి కూడా సహేతుకమైన కారణాలున్నాయి. ఎక్కడైనా ఏపీఐఐసీ ఏ కంపెనీకి భూమి కేటాయించినా చుట్టూ కంచె, మధ్యలో రోడ్లు, ఇతరత్రా సదుపాయాల్ని కల్పించి ఇస్తుంది. జడ్చర్లలో మాత్రం ఈ రెండు కంపెనీలకూ అభివృద్ధి చేయని భూమిని అప్పగించారు. చుట్టూ కంచె వేసుకోవటంతో పాటు రోడ్ల నిర్మాణాన్నీ ఈ కంపెనీలే చేపట్టాయి. దీంతో పాటు ఇక్కడ భూ సేకరణ ద్వారా నిర్వాసితులైన వారికి సహాయ పునరావాసాల్ని కల్పించే బాధ్యత కూడా ఈ కంపెనీలే తీసుకున్నాయి. పెపైచ్చు 250 ఎకరాల సెజ్‌లో ఏ సంస్థలూ ముందుకు రాకపోయేటప్పటికి... యాంకర్ యూనిట్లుగా ఇవి వస్తే మిగతా వాటికి మార్గం సుగమమవుతుందని భావించి ఈ కేటాయింపులు చేశారు. మరి వాటికి కంచె వేయటానికి, రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించడానికి వేరే ఖర్చులవకుండా ఉంటాయా? సీబీఐ గనక నిజాయతీగా తన దర్యాప్తును చేసి ఉంటే ఆ మొత్తాన్ని కూడా కలపాలిగా? ఈ అంశాల్ని కూడా ఛార్జిషీట్లో ప్రస్తావించాలిగా? మరి విస్మరించిందెందుకు? అడ్డగోలు అబద్ధాలెందుకు?

ఇదీ... సీబీఐ చె ప్పిన కథ

జడ్చర్లలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయటానికి ఏపీఐఐసీ 954 ఎకరాల్ని సేకరించింది. నాటి ఏపీఐఐసీ ఎండీగా ఉన్న బి.పి.ఆచార్య... దీన్లో 250 ఎకరాల్ని ప్రత్యేక ఆర్థిక మండలికి కేటాయిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. 2006 అక్టోబర్ 27న కేంద్ర వాణిజ్య శాఖ అనుమతినిచ్చింది. తరవాత ఏపీఐఐసీలోని ధరల నిర్ణాయక కమిటీ దీనికి ధరను నిర్ణయిస్తూ... 2006 డిసెంబర్ 31లోపు గడువును నిర్దేశించి ఎకరా రూ.15 లక్షల చొప్పున కేటాయించవచ్చని, లేదంటే యాంకర్ యూనిట్లను ప్రోత్సహించేందుకు 50 ఎకరాలు కేటాయించొచ్చని... వీటిలో ఏది ముందయితే అది చేయాలని సూచించింది. తరవాత డిసెంబరు 27న మళ్లీ భేటీ అయి 15 లక్షల ధరను ఎకరాకు రూ.20.23 లక్షలకు సవరించింది. అయితే ధర సవరించకముందే... అంటే 2006 నవంబర్ 17నే అరబిందో ఫార్మా ఎండీ కె.నిత్యానందరెడ్డి, హెటెరో డెరైక్టరు ఎం.శ్రీనివాసరెడ్డి తమకు తలా 75 ఎకరాలు కావాలంటూ ఏపీఐఐసీకి లేఖ రాశారు. ఎకరా రూ.7 లక్షల చొప్పున కేటాయించాలంటూ దాన్లో 10 శాతం మొత్తాన్ని ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) కింద చెక్కు కూడా ఇచ్చారు. దాన్ని కిందిస్థాయి అధికారులు ఆమోదించి ఏపీఐఐసీ ఎండీకి పంపారు. ఆయన దాన్ని చూసి... ఆఫర్ లెటర్లు సిద్ధం చేయాలని వారికి ఆదేశాలిచ్చారు.

‘‘ధరల నిర్ణాయక కమిటీ చెప్పినట్లుగా ఎకరా రూ.15 లక్షలకు కేటాయించి ఉంటే ఎకరాకు మరో రూ.8 లక్షలు వచ్చి ఉండేది. అలా చేయకపోవటం వల్ల ఏపీఐఐసీకి మొత్తమ్మీద 150 ఎకరాలపై రూ.12.26 కోట్ల నష్టం వచ్చినట్లు కాగ్ కూడా గతంలో చెప్పింది. మరోవంక మెదక్ జిల్లా పాశమైలారంలోని ఈపీఐపీలో అరబిందోకు 33.33 ఎకరాలు కేటాయించారు. కానీ దీన్ని అరబిందో సంస్థ ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు బదలాయించింది. ట్రైడెంట్‌కు ఏపీఐఐసీ నేరుగా ఇచ్చి ఉంటే నాటి ధర ప్రకారం చదరపు మీటరు రూ.500కు ఇవ్వాల్సి ఉండేది. కానీ అరబిందోనే బదలాయించటం వల్ల దానికి చదరపు మీటరు రూ.150 చొప్పున దక్కినట్లయింది. తద్వారా దానికి రూ.4.3 కోట్ల అనుచిత లబ్ధి కలిగింది. ఇదండీ.. సీబీఐ చెప్పిన కథ. నక్కపల్లి సెజ్‌లో ఈ రెండు కంపెనీలకూ భూములు కేటాయించారని చెప్పిన సీబీఐ.. తన చార్జిషీట్లో దాని వివరాల్ని ప్రస్తావించలేదు. మొత్తమ్మీద ఏపీఐఐసీ ఈ భూముల్ని తక్కువకు విక్రయించటం ద్వారా ఆయా కంపెనీలకు రూ.16.56 కోట్ల లబ్ధి చేకూరినట్లు తేల్చింది. అందుకు ప్రతిగా ఆ కంపెనీలు సాక్షి గ్రూపులో రూ.29.5 కోట్లు పెట్టుబడిగా పెట్టాయని అభియోగం మోపింది.

చార్జిషీట్లో... ‘ఈనాడు’ కథనం!

‘బోనులో బీపీ ఆచార్య’ అంటూ 2011 జనవరిలో ‘ఈనాడు’లో ఓ కథనం అచ్చయింది. జడ్చర్ల సెజ్‌లో హెటిరో, అరబిందో సంస్థలకు తక్కువ ధరకే భూములు కేటాయించినా లీ ఫార్మా అనే సంస్థకు మాత్రం ఎకరా రూ.33 లక్షల ధర నిర్ణయించారని ‘ఈనాడు’ అప్పట్లో వాపోయింది. లీ సంస్థ ఈ రెండింటికన్నా ముందే ధరఖాస్తు చేసుకున్నా దాన్ని అనుమతించలేదని పేర్కొంది. ఇదంతా సీబీఐ విచారణలో తేలినట్టుగా రాసి పారేసింది. దానికి సమాధానంగా ఆ నెల 8న ‘సాక్షి’ పూర్తి వివరాలు అందించింది. అవేంటంటే...

1) అరబిందో, హెటిరో సంస్థలకు 2006 నవంబరు 17న చెరో 75 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇవి లీ ఫార్మా కన్నా ముందే దరఖాస్తు చేసుకున్నాయి. 2) లీ ఫార్మాకు కూడా 2006 నవంబరు 28న అది కోరిన 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆఫర్ లెటర్ ఇచ్చారు. 3) లీ సంస్థకు ఆఫర్ చేసిన ధర రూ.10 లక్షలు. అంతేతప్ప రూ.33 లక్షలు కాదు. 4) ఎకరా రూ.10 లక్షలుగా నిర్ణయించడానికి కారణం... చుట్టూ కంచె వేయటం, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించటం... ఇవన్నీ ఈ పదెకరాలకూ ఏపీఐఐసీనే చేస్తుంది. అందుకే ఎకరాకు రూ.3 లక్షలు అదనంగా పేర్కొంది.

అదీ అసలు విషయం.

ఇవన్నీ విస్మరించిన ‘ఈనాడు’ అదేదో మహా పాతకమైనట్లుగా కథనం వండి పారేసింది. చిత్రమేమిటంటే ప్రస్తుత సీబీఐ చార్జిషీట్లో అక్షరం పొల్లుపోకుండా ‘ఈనాడు’ కథనాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేయటం!! సీబీఐతో ఎల్లో సిండికేట్ సాగిస్తున్న దోస్తీకి ఇంతకన్నా ఆధారాలేం కావాలి? మున్ముందు ఎల్లో బుర్రల్లో ఏం పుడుతుందో... ఈ దర్యాప్తు కూడా అన్ని మలుపులు తిరుగుతుందని చెప్పటానికి ఇంతకన్నా రుజువులేం కావాలి?

అనుబంధ కంపెనీకి బదలాయించటమూ లబ్ధేనా?

అరబిందో సంస్థ తన అనుబంధ కంపెనీకి భూమిని బదలాయించటం వల్ల కూడా ఏపీఐఐసీకి నష్టం వచ్చినట్లు చూపిం చిన సీబీఐ... దాన్ని కూడా క్విడ్ ప్రో క్వోకు సాక్ష్యంగా తీసుకోవటం దేనికి పరాకాష్టన్నది ఆ సంస్థకే తెలియాలి. ఎందుకంటే ట్రైడెంట్ లైఫ్‌సెన్సైస్ సంస్థ అరబిందోకు అనుబంధం కాదని ఒకచోట పేర్కొన్న సీబీఐ... అనుబంధ సంస్థో కాదో తెలియటం లేదని మరోచోట పేర్కొంది. నిజానికి ట్రైడెంట్ పూర్తిగా అరబిందోకు అనుబంధమని గతంలోనే పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. 2009 చివర్లో వాటాదారుల ఆమోదంతో ఇది అరబిందోలో విలీనమైపోయింది కూడా.

జోనల్ మేనేజరుతో సీఎం కుమ్మక్కవుతారా?

ఈ బదలాయింపునకు సంబంధించి సీబీఐ చెప్పిన కథ వింటే ఆశ్చర్యమనిపిస్తుంది. జోనల్ మేనేజరు స్థాయి వ్యక్తి సీఎంతో కలిసి కుట్రపన్నారనే స్థాయికి సీబీఐ దిగజారిపోయిందని తెలిసి బాధనిపిస్తుంది. అదెలాగంటే... ట్రైడెంట్ లైఫ్‌సెన్సైస్ సంస్థ అరబిందోకు పూర్తి అనుబంధమని కె.నాగరాజు అనే ఛార్టర్డ్ అకౌంటెంట్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను నాటి ఏపీఐఐసీ జోనల్ మేనేజరు తీసుకున్నారట. మిగిలిన ధ్రువపత్రాలు లేకున్నా ఓకే చేసేశారట. ఈయన ఓకే చేయటం వల్లే అరబిందో తన భూమిని ట్రైడెంట్‌కు బదలాయించిందని, దానివల్లే ఏపీఐఐసీకి నష్టం వచ్చిందని... ఈ రకంగా లబ్ధి పొందింది కాబట్టే అరబిందో పెట్టుబడి పెట్టిందంటూ బోడిగుండుకూ- మోకాలుకూ ముడివేసే ప్రయత్నం చేశారు. వినటానికే వింతనిపిస్తోంది కదూ!!!.

ఆంధ్రజ్యోతి కధనం:

వైఎస్ రాజశేఖరరెడ్డి: బతికి...పోయారు
ఈ కేసులో అసలు నేరస్తుడు ఆయనే. కానీ... ఆయన మరణించారు కాబట్టి... బోనులో నిలబెట్టలేకపోతున్నాం!
జగన్: తండ్రితో కలిసి కుట్రలు
నేరపూరిత కుట్రకు పాల్పడేలా ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. తండ్రితో కలిసి కుట్రలు పన్నారు.
సాయిరెడ్డి: పెట్టుబడి లంచాల ఏజెంట్
జగన్‌తో కలిసి కుట్రలో భాగస్వామి అయ్యారు. కంపెనీల నుంచి పెట్టుబడుల రూపంలో లంచాలను వసూలు చేసే ఏజెంట్ పాత్ర పోషించారు. 

హైదరాబాద్, మార్చి 31 : తండ్రి... కొడుకు... ఓ చార్టడ్ అకౌంటెంట్! ముఠాకట్టి, కుట్రలు పన్ని రాష్ట్రాన్ని దోచుకున్న వైనాన్ని సీబీఐ అక్షరాలా వివరించింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ శనివారం తన తొలి చార్జిషీటును దాఖలు చేసింది. విష వృక్షంలా విస్తరించిన అవినీతిలో... ప్రస్తుతానికి ఒక్క కోణాన్ని మాత్రమే బయటపెట్టింది. ఏపీఐఐసీ ప్రమోట్ చేసిన పోలేపల్లి సెజ్‌లో అరబిందో, హెటెరో సంస్థలకు జరిగిన అడ్డగోలు భూ పందేరం.... దీనికి ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లోకి ఆ రెండు సంస్థలకు చెందిన వారు పెట్టిన కోట్ల పెట్టుబడుల చిత్రాన్ని అక్షరాల్లో, అంకెల్లో తేటతెల్లం చేసింది. 68 పేజీల చార్జిషీటులో జగన్‌ను మొదటి నిందితుడి(ఏ-1)గా పేర్కొంది. 

విజయ సాయిరెడ్డి (ఏ-2)తోపాటు అరబిందో, హెటెరో ప్రతినిధులతో సహా మొత్తం 13 మందిని నిందితులుగా చూపింది. ఎమ్మార్ కేసులో అరెస్టయిన సీనియర్ ఐఏఎస్ బీపీ ఆచార్యకు సీబీఐ మరో షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనను తొమ్మిదో నిందితుడిగా పేర్కొంది. నేరపూరిత కుట్రలో బీపీ ఆచార్య భాగస్వామి అయ్యారని, విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, అధికార దుర్వినియోగం చేశారని స్పష్టం చేసింది. 'వైఎస్ చెప్పారు. నేను చేశాను' అంటూ... భూపందేరానికి యథాశక్తి సహకరించినట్లు తెలిపింది. 

అరబిందో, హెటెరో ప్రతినిధులు స్థలం కోసం దరఖాస్తు చేసిన రోజే... ఫైలు పుట్టించి, కిందిస్థాయి అధికారులతో కదిలించి, భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు రూపొందించి... వైఎస్ సమక్షంలోనే భూకేటాయింపు లేఖలను ఆ కంపెనీల ప్రతినిధులకు ఆచార్య సవినయంగా సమర్పించుకున్నారని తెలిపింది. ఎకరం రూ.20 లక్షలకు కేటాయించాల్సి ఉన్నా... కంపెనీలు కోరుకున్నట్లుగా రూ.7 లక్షలకే కట్టబెట్టిన సంగతి వివరించింది. ఈ కంపెనీలకంటే ముందే లీఫార్మా అనే సంస్థ సెజ్‌లో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా... దానిని పక్కన పెట్టినట్లు వివరించింది. పాశమైలారం పారిశ్రామికవాడలో అరబిందో ఫార్మాకు కేటాయించిన 30 ఎకరాల స్థలాన్ని అక్రమంగా ట్రైడెంట్‌కు బదిలీ చేసేందుకు సహకరించిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వైవీఎల్ ప్రసాద్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చింది. 

సీబీఐ 68 పేజీల చార్జిషీటుతో 263 డాక్యుమెంట్లను జత చేసింది. 66 మందిని సాక్షులుగా పేర్కొంది. నిందితులపై అవినీతి నిరోధక చట్టాన్ని కూడా ప్రయోగించింది. నిందితులు నేరపూరిత కుట్ర, విశ్వాస ఘాతుకం, మోసం తదితర నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేసింది. చార్జిషీటు దాఖలు నేపథ్యంలో గుం'టూరు'లో ఉన్న వైఎస్ జగన్ ముఖంలో నీరసం కనిపించింది. 'ఇక అరెస్టు తప్పదేమో' అంటూ ఆయన పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. 'ముందున్నది ముసళ్ల పండగ' అంటూ ఈ కేసులో మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేయనున్నట్లు సీబీఐ తెలిపింది.
Read more ...

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో33 మంది కూలీల పేర్లతో మద్యం లెసైన్సులు

హైదరాబాద్: మ్యదం సిండికేట్ల వ్యవహారంపై ఏసీబీ మరోసారి అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనవరి నెలాఖరు వరకు మొత్తం 25 కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. మార్చి 2న నలుగురు ఎక్సైజ్ అధికారులు, 5న మరికొన్ని జిల్లాల్లో తనిఖీలు చేసినట్టు పేర్కొంది. మార్చి 27న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సోదాలు జరిపినట్టు తెలిపింది. విజయనగరం జిల్లాలో ఉన్న 202 మద్యం దుకాణాల యాజమానుల్లో 103 మంది బినామీలేనని వెల్లడించింది. 33 మంది కూలీల పేర్లతో మద్యం లెసైన్సులు పొందినట్టు కూడా గుర్తించామని ఏసీబీ తెలిపింది. మద్యం సిండికేట్ల వ్యవహారంలో నేతల ఆరోపణలతో అధికారులు మనోవేదనకు గురవుతున్నారని పేర్కొంది.
Read more ...

జగన్ ఆస్తుల కేసులో చార్జిషీటు దాఖలు


Read more ...

Mar 30, 2012

ఈ సారి డర్టీ పిక్చర్ అనుష్క వంతా?

ఈ పిక్చర్ డర్టీగా ఉంటుందని టైటిల్‌లో చెప్పి మరీ ఏక్తాకపూర్ నిర్భయంగా విడుదల చేసిన చిత్రం ‘డర్టీ పిక్చర్’. కానీ ఈ బొమ్మ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటివరకు హోమ్లీగా కనిపించిన విద్యాబాలన్ ఈ చిత్రంలో హద్దులు దాటారు. కథకు న్యాయం చేయాలనే ఒక్క విషయాన్ని మాత్రమే ఆమె దృష్టిలో పెట్టుకుని, అంగాంగ ప్రదర్శనకు అడ్డు చెప్పలేదు. శృంగార సన్నివేశాల్లో ఆమె రెచ్చిపోయినా ప్రేక్షకులు పెదవి విరవలేదు. సరికదా.. ‘భేష్.. బాలన్ బాగా చేసింది’ అని కితాబులిచ్చేశారు.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అనువదించి విడుదల చేశారు. కానీ ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. దాంతో ‘డర్టీ పిక్చర్’ని ఈ రెండు భాషల్లోనూ పునర్నిర్మించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. విద్యాబాలన్‌లా హాట్‌గా కనిపించి, ప్రేక్షకుల నుంచి విమర్శలు కాకుండా శభాష్ అనిపించుకోదగ్గ సత్తా దక్షిణాదిన ఏ తారకు ఉంది? అని ఆలోచించారట. వారి దృష్టిలో అనుష్క పడ్డారని వినికిడి. సదరు నిర్మాత దృష్టిలో అనుష్క పడటానికి ‘అరుంధతి, వేదం’ చిత్రాలు ఒక కారణం అయ్యుండొచ్చేమో. 

‘అరుంధతి’లో పవర్‌ఫుల్ బొమ్మాళిగా, ‘వేదం’లో వేశ్యగా... భిన్న కోణాలున్న ఈ పాత్రలకు ఆహార్యం, అభినయం పరంగా అనుష్క కనబర్చిన వ్యత్యాసాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా తెలుగు, తమిళ భాషల్లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి... దక్షిణాది ‘డర్టీ పిక్చర్’కి అనుష్కే కరెక్ట్ అని కూడా నిర్మాత ఫిక్స్ అయ్యారట. త్వరలో ఈ రీమేక్ గురించి అనుష్కను సంప్రదించాలనుకుంటున్నారట.
Read more ...

'మహంకాళి' ఈ సరయినా హిట్ ఇవ్వు తల్లీ!

రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన 'మహంకాళి' చిత్రం విడుదలకు సిద్ధమైంది. జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అంజేరి ఆర్ట్స్, ఎస్.ఎస్. మూవీస్ పతాకాలపై యేలూరు సురేందర్‌రెడ్డి, ఎ. పరంధామరెడ్డి, మురళి ఎస్.ఆర్. నిర్మించారు. వల్లభనేని అశోక్ చిత్ర సమర్పకుడు. రాజశేఖర్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో మధురిమ కథానాయికగా నటించింది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులూ పూర్తయ్యాయి. ఈ నెల ప్రథమార్థంలో విడుదల చేస్తామని దర్శకురాలు జీవిత చెప్పారు.

అందరి అంచనాలకు తగినట్లుగా సినిమా రూపుదిద్దుకుందని, రాజశేఖర్ నుంచి ఆయన అభిమానులు ఆశించే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రదీప్ రావత్, చలపతిరావు, అభినయ, సత్యప్రకాశ్, అన్నపూర్ణమ్మ, జీవా, ప్రభాకర్, నళిని, వినోద్‌కుమార్, కాదంబరి కిరణ్, రఘు, సుత్తివేలు, నర్సింగ్‌యాదవ్, సలీం పండా తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: రాజశేఖర్, కృష్ణమోహన్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, సాహిత్య సాగర్, పైడిశెట్టి రామ్, సంగీతం: చిన్నా, సినిమాటోగ్రఫీ: మధు ఎ. నాయుడు, ఫైట్స్: కణల్ కణ్ణన్, మార్షల్ రమణ, కళ: ధర్మేంద్ర.
Read more ...

ఎర్రకోకలో ఫోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌

ఇండో-కెనడియన్‌ ఫోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌ త్వరలో బాలీ వుడ్‌లోకి అడు గుపెడుతున్న సంగతి తెలిసిందే. మహేష్‌ భట్‌ నిర్మిస్తున్న జిస్మ్‌2 చిత్రంలో అమ్మడు నటిస్తోంది. పెద్దలకు మాత్రమే పరిమితం అయిన అశ్లీల చిత్రాల్లో నటించే తార అయిన సన్నీ అందాలను పెట్టుబడిగా పెట్టి కాసులు కురిపిం చుకోవాలనేది బాలీవుడ్‌ నిర్మాతల ఆలోచన.

త్వరలోనే జిస్మ్‌ 2 చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. పూజా భట్‌ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాపై ఇప్పటి నుంచి హైప్‌ పెంచేందుకు సన్నీతో ఫోటో షూట్లు ప్రారం భించారు. సన్నీ ఎర్ర చీరలో దిగిన ఫోటోలను ఇటీవలే విడుదల చేశారు.
Read more ...

రాజమౌళి ఈగ పాటలు


Read more ...

ఎమ్మెల్యేలకూ నో వర్క్-నో పే! జనచైతన్యవేదిక డిమాండ్

 శాసనసభ సమావేశాలు వృథాప్రయాసగా మారాయని జనచైతన్య వేదిక అభిప్రాయపడింది. బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు ఏ మాత్రం ప్రజోపయోగం కాదని, చట్టసభలను రచ్చసభలుగా మార్చవద్దని వేదిక నేతలు వ్యాఖ్యానించారు. సభ జరగని రోజుల్లో ఎమ్మెల్యేలకు వేతనం ఇవ్వకుండా నోవర్క్ - నోపే విధానాన్ని వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల తీరుతెన్నులపై వేదిక ప్రతినిధులు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్ రాజకీయ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు, శాసనసభ మాజీ కార్యదర్శి సదాశివరెడ్డి, ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు డాక్టర్ త్రిపురనేని హనుమాన్‌చౌదరి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ కవి ఉండేల మాలకొండారెడ్డి తదితరులు మాట్లాడారు. బీఏసీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలుకాకపోవడమే సభ సజావుగా జరగకపోవడానికి కారణమన్నారు. వాయిదా తీర్మానాలను సభ్యులు ప్రవేశపెట్టడం, వాటిని స్పీకర్ తిరస్కరించడం, అనంతరం సభ్యుల ఆందోళనతో ప్రశ్నోత్తరాలు వాయిదా పడడం రివాజుగా మారిందన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు సభ జరగకుండా ఉండేందుకు ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చర్యలూ తీసుకున్నారని ఆరోపించారు. అవినీతి, రైతాంగ సమస్యలు, విద్యుత్, తాగునీటి సమస్యలు, తెలంగాణ లాంటి సమస్యలను చర్చించలేకపోవడం దురదృష్టకరమన్నారు. అన్ని పార్టీలూ శాసనసభ గౌరవాన్ని, సాంప్రదాయాలను కాపాడేలా కృషిచేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
Read more ...

కిరణ్‌తో తలపడ్డ బొత్స ఫోన్‌లో ఢిల్లీ నుంచి నిప్పులు

న్యూఢిల్లీ, మార్చి 30 : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకూ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మద్యం కేసులో తనను ఇరికించేందుకు ఏసీబీ ద్వారా సీఎం ప్రయత్నిస్తున్నారన్న సమాచారం వెల్లడవటంతో.. గురువారం ఢిల్లీకి బొత్స ఆగమేఘాలపై వచ్చారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచే ఫోన్ చేసి.. ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ వెంటనే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ను పీసీసీ చీఫ్ శుక్రవారం ఉదయం కలుసుకున్నారు. సీఎం వైఖరిపై ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో, 18 స్థానాల్లో ఉప ఎన్నికలయ్యేంత వరకూ ఓపిక పట్టవలసిందిగా బొత్సను ఆజాద్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా మద్యం దుకాణాల వేలం కేసులో బొత్స, ఆయన సోదరుడు, బంధువుల పేర్లను ఇరికించనందుకు గానూ.. ఏసీబీ సీఐ గణేశ్‌ను ఏసీబీ సిట్ చీఫ్ శ్రీనివాస రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారని, దీనిపై శ్రీనివాస రెడ్డికి గణేశ్ లీగల్ నోటీసు పంపారని తెలియడంతో పీసీసీ అధ్యక్షుడు మండిపడుతున్నట్లు తెలిసింది. దీని వెనుక సీఎం హస్తం ఉన్నదని అనుమానిస్తున్న బొత్స.. ఢిల్లీలోని ఒక ఎంపీ నివాసం నుంచి సీఎంకి ఫోన్ చేశారు. 

"మీరేమనుకుంటున్నారు? అందర్నీ కేసుల్లో ఇరికించి మీరు బాగుపడదామనుకుంటున్నారా? నన్ను తక్కువ అంచనా వేయవద్దు.. మీ సంగతి చూస్తా!'' అంటూ సీఎంపై పీసీసీ చీఫ్ విరుచుకుపడ్డట్లు తెలిసింది. ఆ వెంటనే స్వరాన్ని పెంచిన బొత్స.. "నీకు నువ్వు ఏమనుకుంటున్నావ్? నా గురించి ఏమని భావిస్తున్నావ్ సీఎం? నీ సంగతేంది? నీ వ్యవహారం ఏంది? అధిష్ఠానం వద్ద తాడోపేడో తేల్చుకుంటాను'' అని కిరణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

దీంతో, దిగ్భ్రాంతి చెందిన సీఎం కిరణ్ అసలు ఈ ఉదంతమే తనకు తెలియదని, ఏసీబీపై తాను ఎలాంటి ఒత్తిడి చేయలేదని బొత్సకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. "నన్ను నమ్మండి. మీరవన్నీ ఎలా విశ్వసిస్తారు?'' అని కిరణ్ చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో సీఎం, బొత్స మధ్య మాటల యుద్ధమే జరిగిందని తెలిసింది.

సీఎంపై ఆజాద్‌కు ఫిర్యాదు
శుక్రవారం ఆజాద్‌ను కలుసుకున్న బొత్స మద్యం దుకాణాల వ్యవహారంలో కిరణ్ తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ సీఐ గణేశ్ పంపిన లీగల్ నోటీసు ప్రతిని తన వాదనకు మద్దతుగా ఆజాద్‌కు పీసీసీ చీఫ్ అందజేసినట్లు తెలిసింది. ఉప ఎన్నికల కోసం పార్టీ నేతలందర్నీ కలుపుకొని, ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన ముఖ్యమంత్రే పార్టీలో నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆజాద్‌కు బొత్స చెప్పినట్లు తెలిసింది.

కాగా, ఉప ఎన్నికలను జూన్‌లోపే నిర్వహించాలని తాము భావిస్తున్నామని, అందుకు తగిన వ్యూహరచనను ప్రారంభించామని, ఎంపీలతో చర్చలు జరుపుతున్నానని బొత్సకు ఆజాద్ చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. "ఎన్నికల్లో కలిసి పనిచేయాలని సీఎంకి చెబుతాం. మీరు ఈ విషయం రచ్చచేయకుండా జూన్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆగండి'' అని బొత్సను ఆజా ద్ బుజ్జగించినట్లు తెలిసింది. అయితే, ఆగస్టులో ఎన్నికలు నిర్వహించాలని సీఎం భావిస్తుండగా.. ఆజాద్, బొ త్స జూన్‌లోపే నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

పొన్నాల తీరుపై బొత్స వర్గం అనుమానం
ఇక, తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ రావడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎంపీలతో ఆజాద్ ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నాల పాల్గొన్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు ఆజాద్‌తో ఆయన ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

పీసీసీ అధ్యక్ష పదవిని తెలంగాణకు ఇవ్వాలంటూ పార్టీ నేత దామోదర్ రెడ్డి ఇటీవల డిమాండ్ చేసిన నేపథ్యంలో.. పొన్నాల ఢిల్లీలో తన ప్రయత్నాలు ప్రారంభించారని, ఇందుకు సీఎం ఆశీస్సులు కూడా ఉన్నాయని బొత్స వర్గం అనుమానిస్తోంది. ఇలా ఒకర్నొకరు దెబ్బతీసుకునేందుకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు పావులు కదపడం చర్చనీయాంశమవుతోంది.
Read more ...

వ్యవసాయ బావి నుంచి నీటిని తోడి రామోజీ ఫిలింసిటీకి తరలింపు

పంటలు ఎండిపోయి రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్ గ్రామ రైతుల ఆందోళన
అడ్డుకున్న రైతులపై పోలీసులకు ఫిలిం సిటీ యాజమాన్యం ఫిర్యాదు
ఓ రైతును అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం జలదాహానికి పచ్చని పొలాలు బీళ్లుగా మారిపోతున్నాయి. ఫిలింసిటీకి అక్రమంగా నీటిని తరలిస్తుండడంతో వ్యవసాయ బావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు వేసిన రైతులు కళ్లముందే తమ పంటలు ఎండిపోతుండడంతో లబోదిబోమంటున్నారు. దీంతో అక్రమ నీటి తరలింపును రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై ఫిలింసిటీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఫిలింసిటీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ తమపై వేధింపులకు దిగారని రైతులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలోని ఫిలింసిటీ పరిసరాల్లోని రైతుల దీన పరిస్థితికి అద్దం పడుతున్న ఘటన వివరాలివీ.. 

గ్రామంలోని సర్వే నం-397, 398, 399లలోని గొల్లోనిబావి(వ్యవసాయ బావి)ని ఫిలింసిటీ యాజమాన్యం కొనుగోలు చేసింది. గతంలో పూడుకుపోయిన ఈ బావిని ఇటీవల పూడికతీసి లోతును పెంచింది. దీంతో చుట్టుపక్కలున్న వ్యవసాయ బావులు, బోర్లలోని నీరంతా గొల్లోని బావిలోకి మళ్లింది. 

ఫిలింసిటీ యాజమాన్యం ఆయిల్ ఇంజిన్ ఏర్పాటు చేసి ఈ బావిలోని నీటినంతా ట్యాంకర్ల ద్వారా ఫిలింసిటీకి తరలిస్తోంది. సుమారు 20 రోజులుగా నీటిని తోడి ట్యాంకర్లలో నిరంతరంగా తరలిస్తుండడంతో చుట్టుపక్కలున్న బావుల్లో నీరంతా అడుగంటింది. దీంతో ఈ బావుల్ని నమ్ముకుని పంటలేసుకున్న రైతులు పంటలెండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కడుపు మండిన రైతులు గురువారం సాయంత్రం ట్యాంకర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. యాజమాన్యం తన మనుషులను వారిపైకి ఉసిగొల్పింది. ఈ నేపథ్యంలో వారిమధ్య వాగ్వాదం జరిగింది. తమ సిబ్బందిపై దాడి చేశారంటూ ఫిలింసిటీ యాజమాన్యం రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం రైతుల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. దీంతో వ్యవసాయ బావినుంచి అక్రమంగా నీటిని తరలిస్తున్న ఫిలింసిటీ యాజమాన్యాన్ని వదిలి తమను అరెస్ట్ చేయడమేమిటంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఈ సందర్భంగా రాఘవేందర్‌రెడ్డి అనే రైతును అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ట్యాంకర్లను తిప్పి పంపించాం: వీఆర్‌ఓ

వ్యవసాయ బావి నుంచి నీటిని తరలిస్తున్నట్లు తన దృష్టికి రాగానే ట్యాంకర్లను తిప్పి పంపించినట్లు గ్రామ వీఆర్‌ఓ కృష్ణ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వ్యవసాయ బావి నుంచి నీటిని తరలించడం వాల్టా చట్టం పరిధిలోకి వస్తుందో లేదో చూసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమస్యపై గ్రామపంచాయతీ కార్యదర్శి సునీల్‌ను వివరణ కోరగా దీనిపై తమకింతవరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం జలదాహానికి పచ్చని పొలాలు బీళ్లుగా మారిపోతున్నాయి. ఫిలింసిటీకి అక్రమంగా నీటిని తరలిస్తుండడంతో వ్యవసాయ బావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు వేసిన రైతులు కళ్లముందే తమ పంటలు ఎండిపోతుండడంతో లబోదిబోమంటున్నారు. దీంతో అక్రమ నీటి తరలింపును రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై ఫిలింసిటీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఫిలింసిటీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ తమపై వేధింపులకు దిగారని రైతులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలోని ఫిలింసిటీ పరిసరాల్లోని రైతుల దీన పరిస్థితికి అద్దం పడుతున్న ఘటన వివరాలివీ..

గ్రామంలోని సర్వే నం-397, 398, 399లలోని గొల్లోనిబావి(వ్యవసాయ బావి)ని ఫిలింసిటీ యాజమాన్యం కొనుగోలు చేసింది. గతంలో పూడుకుపోయిన ఈ బావిని ఇటీవల పూడికతీసి లోతును పెంచింది. దీంతో చుట్టుపక్కలున్న వ్యవసాయ బావులు, బోర్లలోని నీరంతా గొల్లోని బావిలోకి మళ్లింది. ఫిలింసిటీ యాజమాన్యం ఆయిల్ ఇంజిన్ ఏర్పాటు చేసి ఈ బావిలోని నీటినంతా ట్యాంకర్ల ద్వారా ఫిలింసిటీకి తరలిస్తోంది. సుమారు 20 రోజులుగా నీటిని తోడి ట్యాంకర్లలో నిరంతరంగా తరలిస్తుండడంతో చుట్టుపక్కలున్న బావుల్లో నీరంతా అడుగంటింది. దీంతో ఈ బావుల్ని నమ్ముకుని పంటలేసుకున్న రైతులు పంటలెండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కడుపు మండిన రైతులు గురువారం సాయంత్రం ట్యాంకర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. యాజమాన్యం తన మనుషులను వారిపైకి ఉసిగొల్పింది. ఈ నేపథ్యంలో వారిమధ్య వాగ్వాదం జరిగింది. తమ సిబ్బందిపై దాడి చేశారంటూ ఫిలింసిటీ యాజమాన్యం రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం రైతుల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. దీంతో వ్యవసాయ బావినుంచి అక్రమంగా నీటిని తరలిస్తున్న ఫిలింసిటీ యాజమాన్యాన్ని వదిలి తమను అరెస్ట్ చేయడమేమిటంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఈ సందర్భంగా రాఘవేందర్‌రెడ్డి అనే రైతును అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ట్యాంకర్లను తిప్పి పంపించాం: వీఆర్‌ఓ

వ్యవసాయ బావి నుంచి నీటిని తరలిస్తున్నట్లు తన దృష్టికి రాగానే ట్యాంకర్లను తిప్పి పంపించినట్లు గ్రామ వీఆర్‌ఓ కృష్ణ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వ్యవసాయ బావి నుంచి నీటిని తరలించడం వాల్టా చట్టం పరిధిలోకి వస్తుందో లేదో చూసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమస్యపై గ్రామపంచాయతీ కార్యదర్శి సునీల్‌ను వివరణ కోరగా దీనిపై తమకింతవరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
Read more ...

మొదటి వారంలో రచ్చ

రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రచ్చ' షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. రామ్‌చరణ్, తమన్నాపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారక్కడ. దీంతో చిత్రనిర్మాణం పూర్తవుతుంది. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పార స్‌జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలను సమకూర్చారు. చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ పాటల్ని రాశారు. ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ "ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభించింది. ఈ నెల 5న సినిమా విడుదల చేస్తున్నాం'' అని అన్నారు.

కోట శ్రీనివాసరావు, నాజర్, దేవ్‌గిల్, ముఖేష్‌రుషి, పార్తీబన్, ఆజ్మల్, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్‌రెడ్డి, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, కృష్ణభగవాన్, రవిబాబు, శ్రీనివాసరెడ్డి, ఉత్తేజ్, ఫిష్ వెంకట్, తాగుబోతు రమేష్, గీత, ప్రగతి, సుధ, ఝాన్సీ, హేమ,సత్యకృష్ణ, విజా హెడెన్, గీతాసింగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: సమీర్‌రెడ్డి, కళ: ఆనంద్‌సాయి, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: ఆర్.బి.చౌదరి, నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌నంది.
Read more ...

గృహ వినియోగదారులకు భారీ విద్యుత్ షాక్

కుటీర, చేతి వృత్తుల వారిపైనా దయలేదు.. 
పంచాయతీలు, మునిసిపాలిటీల్లో చీకట్లే 
చిన్న, భారీ పరిశ్రమలకూ బాదుడే...
ప్రార్థనా మందిరాలనూ వదల్లేదు..
ఉచిత కరెంటుకు కూడా చార్జీలు
నర్సరీలు, ఉప్పు కయ్యలకూ షాక్..
బిల్లు లేటుగా కడితే డబుల్ షాక్
ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమలు
ఎవర్నీ వదల్లేదు.. అందరికీ షాకులే
రూ. 4,442 కోట్ల బాదుడు.. సర్కారు శ్రీరామనవమి స్పెషల్.


శ్రీ రామనవమి కానుకగా రాష్ట్ర ప్రజలకు కిరణ్ సర్కారు మర్చిపోలేని షాకిచ్చింది. కనీవినీ ఎరగని రీతిలో కరెంటు చార్జీలను వడ్డించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా ప్రజలపై రూ.4,442 కోట్ల భారం మోపింది. చివరికి ఉచిత కరెంటును కూడా వదల్లేదు. వారూ వీరని తేడా లేకుండా అన్ని వర్గాలకూ భారీగా వడ్డించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసీ ముగియగానే జనాల వీపును విమానం మోత మోగించింది! ఈఆర్‌సీ నుంచి ప్రతిపాదనలు వచ్చాక సబ్సిడీ భారాన్ని భరించడాన్ని పరిశీలిస్తామంటూ ఇంతకాలంగా మభ్యపెడుతూ వచ్చి, చివరికి శుక్రవారం ఒక్కసారిగా బాంబు పేల్చింది. ఆదివారం నుంచి కొత్త చార్జీలను అమలు చేస్తామని ప్రకటించి జనాన్ని ఏప్రిల్ ఫూల్స్ చేసింది.

2012-13కు నూతన కరెంటు టారిఫ్‌ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈఆర్‌సీ నుంచి నాలుగు రోజుల క్రితమే వచ్చిన ఈ ప్రతిపాదనలకు ఎలాంటి మార్పులూ చేయకుండానే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పచ్చజెండా ఊపారు. పైగా పంచాయతీలకు, కుటీర పరిశ్రమలకు, వ్యవసాయానికి లేని కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలు కూడా చివరి ఆదేశాల్లో వచ్చి చేరాయి. కరెంటు చార్జీలను మరో ఐదేళ్లు పెంచేది లేదన్న దివంగత సీఎం వైఎస్ హామీని కిరణ్ సర్కారు నిలువునా తుంగలో తొక్కింది. అన్ని వర్గాల ప్రజలకూ చార్జీలను పెంచింది. టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేసి గృహ వినియోగదారులకు భారీ షాకిచ్చింది. సాగుకు ఏడు గంటలకు మించి కరెంటు వాడితే యూనిట్‌కు ఏకంగా రూ.3.25 వసూలు చేసే ఉచిత విద్యుత్‌కూ క్రమంగా మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తద్వారా వైఎస్ ఇచ్చిన 9 గంటల ఉచిత విద్యుత్ హామీని తుంగలో తొక్కింది. 2012-13కు రూ.36,090 కోట్ల స్థూల వార్షికాదాయ వ్యయాన్ని డిస్కంలు ప్రతిపాదించగా, రూ.34,343.89 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. వ్యవసాయం, గృహ, ఎత్తిపోతల పథకాలకు రూ.5,358.67 కోట్ల సబ్సిడీని భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మొత్తానికి మే నెలలో ఎండలతో పాటు కరెంటు బిల్లులు కూడా జనాలకు ముచ్చెమటలు పట్టించనున్నాయి. - న్యూస్‌లైన్, హైదరాబాద్
ఇంటికి షాక్....

మీ ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, ఫ్రిజ్, టీవీ ఉన్నాయా? ఉంటే ఇక మీ ఇల్లు గుల్లే! కరెంటు బిల్లుతో మీ గుండె గు‘బిల్లు’మనడం ఖాయం. 0-50 యూనిట్ల లోపు వినియోగించే వారికి తప్ప మిగతా వారందరికీ, అంటే కోటికి పైగా వినియోగదారులకు షాక్ కొట్టనుంది. యూనిట్ విద్యుత్ చార్జీలు ఏకంగా 55 పైసల నుంచి రూపాయి దాకా పెరిగాయి! కనెక్టెడ్ లోడ్ (ఇంట్లోని కరెంటు ఉపకరణాల సామర్థ్యం) 500 వాట్స్‌లోపు ఉన్న వారిని ఒక కేటగిరీగా పేర్కొనగా, దాటిన వారిని ప్రత్యేక కేటగిరీగా పేర్కొన్నారు. వినియోగదారుల్లో మెజారిటీ ఇలా 500 వాట్లు దాటినవారే. వారికి 100 యూనిట్ల దాకా అమలవుతున్న టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేశారు. ఫలితంగా 100 యూనిట్ల వరకు యూనిట్‌కు ఏకంగా రూ.2.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా వారిపై ఏకంగా 60 శాతం దాకా భారం పడనుంది.
ఇంటికి షాక్....

మీ ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, ఫ్రిజ్, టీవీ ఉన్నాయా? ఉంటే ఇక మీ ఇల్లు గుల్లే! కరెంటు బిల్లుతో మీ గుండె గు‘బిల్లు’మనడం ఖాయం. 0-50 యూనిట్ల లోపు వినియోగించే వారికి తప్ప మిగతా వారందరికీ, అంటే కోటికి పైగా వినియోగదారులకు షాక్ కొట్టనుంది. యూనిట్ విద్యుత్ చార్జీలు ఏకంగా 55 పైసల నుంచి రూపాయి దాకా పెరిగాయి! కనెక్టెడ్ లోడ్ (ఇంట్లోని కరెంటు ఉపకరణాల సామర్థ్యం) 500 వాట్స్‌లోపు ఉన్న వారిని ఒక కేటగిరీగా పేర్కొనగా, దాటిన వారిని ప్రత్యేక కేటగిరీగా పేర్కొన్నారు. వినియోగదారుల్లో మెజారిటీ ఇలా 500 వాట్లు దాటినవారే. వారికి 100 యూనిట్ల దాకా అమలవుతున్న టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేశారు. ఫలితంగా 100 యూనిట్ల వరకు యూనిట్‌కు ఏకంగా రూ.2.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా వారిపై ఏకంగా 60 శాతం దాకా భారం పడనుంది.

చేతి వృత్తులు ఖలాస్...

గ్రామాల్లో కరెంటు కోతలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చిన్నాభిన్నమవుతుంటే.. గోరుచుట్టుపై రోకటిపోటులా చేతి, కుల వృత్తులకూ సర్కారు షాకిచ్చింది. మరమగ్గాలు, దోబీ ఘాట్లతో పాటు పౌల్ట్రీ ఫారాలు, విస్తర్ల తయారీ వంటి చేతి, కుల వృత్తులవారు వాడే కరెంటుకు చార్జీలను యూనిట్‌కు ప్రస్తుతమున్న రూ.1.80 నుంచి ఏకంగా రూ.2.67కు పెంచింది. విద్యుత్ సంస్థలు ఈ ప్రతిపాదనే చేయకపోవడం గమనార్హం. వ్యవసాయాధారిత చిన్న పరిశ్రమలకు కూడా చార్జీలను రూ.1.80 నుంచి రూ. 2.67కు పెంచారు. ఆత్మహత్యలతో కుదేలవుతున్న మరమగ్గ కార్మికులను పట్టించుకోకపోగా, వారిపైనా మరింతగా చార్జీల భారం మోపారు! 

ఉచిత కరెంటుకు మంగళం....

వైఎస్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకానికి క్రమంగా మంగళం పాడాలని ప్రభుత్వం భావిస్తోంది. 2009 ఎన్నికల హామీ అయిన 9 గంటల ఉచిత విద్యుత్‌ను కూడా అమలు చేయబోమని తాజా టారిఫ్ ద్వారా చెప్పకనే చెప్పింది. ఉచిత విద్యుత్ పరిమితి 7 గంటలు దాటితే ప్రతి అదనపు యూనిట్‌కూ రూ.3.25 వసూలు చేయాలని ఈఆర్‌సీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చార్జీలను మున్ముందు క్రమంగా 7 గంటల కరెంటుకు కూడా వర్తింపజేస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే ఎత్తిపోతల పథకాల కరెంటు భారాన్నీ జనం నెత్తినే రుద్దేందుకు రంగం సిద్ధమైంది. ఎత్తిపోతల కింది రైతులు 7 గంటలకు మించి వాడే ప్రతి యూనిట్‌కూ రూ.3.50 వసూలు చేయాలని నిర్ణయించారు. కార్పొరేట్, ఐటీ రైతులకు చార్జీలను రూ.1.50 నుంచి రూ.2.50కు పెంచారు. 2.5 ఎకరాలకు మించిన మాగాణి ఉన్న రైతులతో పాటు మూడుకు మించి కరెంటు కనెక్షన్లున్న మెట్ట రైతుల కరెంటు చార్జీలనూ పెంచేశారు.

చిన్న పరిశ్రమలకు చేదే..

ఇప్పటికే విద్యుత్ కోతలతో లక్షలాది చిన్నపరిశ్రమలు మూసివేతకు గురి అవుతున్నాయి. వీటిపై ఆధారపడిన 20 లక్షల మంది కార్మికుల జీవితాలు గాలిలో దీపాల మాదిరిగా వేలాడుతున్నాయి. వాటిపై కనికరం చూపాల్సింది పోయి, చార్జీలను యూనిట్‌కు రూ.4.13 నుంచి రూ.5కు పెంచారు. పుట్టగొడుగులు, కుందేళ్ల పెంపకంతో పాటు పౌల్ట్రీ ఫారాల చార్జీలను రూ.4.13 నుంచి 5కు పెంచారు. చెరకు క్రషింగ్ చార్జీలను 75 పైసల నుంచి ఏకంగా రూ.1.62కు పెంచారు. చేపల, రొయ్యల పెంపకానికి కరెంటు చార్జీలను రూ.1.25 నుంచి 2.12కు పెంచారు. చిన్నతరహా పరిశ్రమలతో పాటు చిన్నతరహా వాణిజ్య సంస్థలకు రూ.50 పైసల దాకా పెంచారు. కనెక్టెడ్ లోడు 500 వాట్లు దాటిన చిన్నతరహా వాణిజ్య సంస్థలకు కూడా టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేయడంతో వాటిపైనా భారం మరింతగా పడనుంది.

పంచాయతీల్లో ఇక చీకట్లే..
పంచాయతీలకు వచ్చే కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని వైఎస్ హామీనిచ్చారు. కానీ ఆయన మరణానంతరం ఈ ప్రభుత్వం ఆ భారాన్ని పంచాయతీలపైనే మోపింది. పంచాయతీలు ఇప్పటికే సుమారు రూ.600 కోట్ల దాకా బిల్లులు బకాయి పడ్డాయి. వాటిని తీర్చకపోవడంతో అనేక పంచాయతీల్లో చీకట్లు అలుముకున్నాయి. తాజాగా వాటికీ చార్జీలు పెంచారు. వీధి దీపాలు, మంచినీటి సరఫరా కరెంటు చార్జీలను 100 శాతానికిపైగా పెంచారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మంచినీటి, వీధి దీపాల చార్జీలను 50 పైసల నుంచి 82 పైసల దాకా పెంచారు.

భారీ పరిశ్రమలకు బాదుడు..

భారీ పరిశ్రమలనూ ప్రభుత్వం భారీగా బాదేసింది. హెచ్‌టీ కేటగిరీ పరిశ్రమలకు యూనిట్‌కు రూపాయి నుంచి రూ.1.28 దాకా పెంచింది. వాటి ఫ్యాన్లు, లైట్ల వాడకం చార్జీలనూ భారీగా పెంచింది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు యూనిట్‌కు రూ.2.65 ఉన్న చార్జీలను కేవీని బట్టి 3.65 నుంచి 4.48 దాకా పెంచింది.
ఇతర అంశాలు....
వైమానిక రంగానికి ప్రస్తుతం వాణిజ్య కేటగిరీ కింద విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారు. తాజాగా దాన్ని ప్రత్యేక కేటగిరీగా గుర్తించి, కేవీని బట్టి యూనిట్‌కు రూ.4.54 నుంచి రూ.5.39 దాకా బాదాలని నిర్ణయించారు.
ప్రార్థనా మందిరాలకు 200 యూనిట్ల వరకు ప్రస్తుతమున్న రూ.2 చార్జీని 2.60కి, ఆపైన రూ.4 నుంచి 4.60కి పెంచారు.
తాత్కాలిక విద్యుత్ సరఫరా చార్జీలను కూడా యూనిట్‌కు 68 పైసల నుంచి 70 పైసల వరకూ పెంచారు.
రైల్వే ట్రాక్షన్ విద్యుత్ చార్జీలు 4.45 నుంచి 5.43కు పెరిగాయి.
గ్రామీణ విద్యుత్ సహకార సంస్థల్లో అనకాపల్లి రెస్కోకు 0.83 నుంచి 1.20కు, చీపురుపల్లి రెస్కోకు 0.62 నుంచి 0.67కు, సిరిసిల్ల రెస్కోకు 0.47 నుంచి 0.66, కుప్పం రెస్కోకు 0.28 నుంచి 0.32కు చార్జీలను పెంచారు.
అడ్వర్‌టైజింగ్ హోర్డింగ్స్‌కు రూ.8.50 నుంచి రూ.9కు పెరిగాయి.
ఉప్పు కయ్యలు, గ్రామీణ నర్సరీలకు రూపాయి నుంచి రూ. 2.12కు పెరిగాయి.





Read more ...

నా పేరు వింటే సోనియా ఉలిక్కిపడి లేస్తోంది:జగన్

గుంటూరు, మార్చి 29 : జనంలో తనకు పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ, కాంగ్రెస్ నేతలకు కంటిమీద కునుకు ఉండట్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. "యూపీఏ చైర్‌పర్సన్ సోనియా సైతం జగన్ పేరు వింటే నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి కూర్చుంటోంది'' అని అన్నారు. అందుకే వాళ్లంతా కలిసి తనను అరెస్టు చేయించాలని చూస్తున్నట్లు ఆరోపించారు. ఓదార్పు యాత్రలో భాగంగా గుంటూరులో గురువారం జరిగిన సభలో జగన్ మాట్లాడారు. "నా తండ్రి హయాంలో ఏనాడైనా సచివాలయానికి వెళ్లి పైరవీలు చేశానా? ఏ ఐఏఎస్ అధికారితోనైనా కనీసం ఫోన్లోనైనా మాట్లాడానా? ఏ కంపెనీతోనైనా సంబంధాలు పెట్టుకున్నానా?'' అని ప్రశ్నించారు. 

కేవలం సోనియాకి తల వంచనందుకే తనవాళ్లను అరెస్టు చేస్తున్నారంటూ ఆగ్రహించారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఎక్కడిదని ధ్వజమెత్తారు. కోవూరు ఎన్నికల్లో రూ.500 నోట్లు పంచింది చంద్రబాబు కాదా అని అడిగారు. చంద్రబాబులా తాను నీచ రాజకీయాలు చేయలేనని, చీకట్లో చిదంబరాన్ని కలవనని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ సంస్థను స్థాపించడానికి చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడదని ప్రశ్నించారు. నీతి వాక్యాలు వల్లించే చంద్రబాబుకు సీబీఐతో విచారణ చేయించుకునే దమ్ముందా అని విరుచుకుపడ్డారు.
Read more ...

ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి యత్నం

తెలంగాణ జేఏసీ చేపట్టిన శాంతియాత్ర ఉద్రిక్తంగా మారింది. ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ సుందరయ్యవిజ్ఞాన కేంద్రం నుంచి ప్రారంభమైన ర్యాలీ అశోక్‌నగర్ చైరస్తా చేరుకోగానే కొందరు తెలంగాణ వాదులు ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి యత్నించారు. వారిని పోలీసుల అడ్డుకోవడంతో తెలంగాణ వాదులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది.
Read more ...

త్వరలో పెట్రోల్ ధరలు పెంపు

మరోసారి ప్రజలపై పెట్రో బాంబ్ పేలనుంది. త్వరలో పెట్రోల్ ధరలు పెంచడానికి కేంద్రం సిద ్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లీటర్‌కు రూ.3 నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం ఉంది. పెట్రో కంపెనీలు కేంద్రం ఒత్తిడి తేవడంతో ధరలు పెరగనున్నాట్లు సమాచారం.
Read more ...

'గబ్బర్ సింగ్' షూటింగ్ లో ప్రమాదం

'గబ్బర్ సింగ్' చిత్రం షూటింగులో హీరో పవన్ కళ్యాన్ గాయపడినట్టుగా వచ్చిన వార్తలను ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ బాబు ఖండించారు. ఈ విషయం పట్ల చిత్ర నిర్మాత స్పందిస్తూ ... అలాంటిదేవీ జరగలేదని చెప్పారు. గుజరాత్ షెడ్యూల్ పూర్తి అయిందనీ ... తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ 5 నుంచి హైదరాబాదులో యధాతధంగానే జరుగుతుందని అంటున్నారు. ఓ వైపున 'గబ్బర్ సింగ్' షూటింగ్ లో ప్రమాదం జరిగిందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తుంటే ... మరో వైపున నిర్మాత అలాంటిదేవీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఏది నిజమో తెలియక అభిమానులు అయోమయానికి లోనౌతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ స్పందిస్తేనే బావుంటుందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.   
Read more ...

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు

హైదరాబాద్: గృహ వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలు మరింతభారం కానున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ 1 తేది నుంచి అమల్లోకి వస్తాయి. విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్రంలోని వినియోగదారులపై 3434.89కోట్ల భారం పడనుంది.
Read more ...

Mar 29, 2012

దమ్ము ట్రైలర్

Read more ...

ఎన్టిఆర్ దమ్ము కబుర్లు


Read more ...

అభిమానులకి అభివాదం చేస్తున్న జూ.ఎన్టిఆర్ ('దమ్ము')






Read more ...

జూ.యన్.టి.ఆర్. భార్య తో 'దమ్ము' ఆడియో ఫంక్షన్ లో





Read more ...

లొంగిపోయన బీపీ ఆచార్య


హైదరాబాద్, మార్చి 29: సీనియర్ ఐఏఎస్ అధికారి,
ఎమ్మార్ కేసులో నిందితుడు బిపి ఆచార్య గురువారం
నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయారు.
శుక్రవారం వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో
ఆయనను సిబిఐ అధికారులు చంచల్‌గూడ జైలుకు
తరలించారు. ఎమ్మార్ కేసులో ఆచార్యను ప్రధాన
నిందితుడిగా సిబిఐ పేర్కొంది. ఆయనను విచారించేందుకు
సిబిఐ కేంద్రం నుంచి అనుమతి తీసుకు రాలేకపోవడంతో
ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆయన
జైలు నుంచి విడుదలయ్యారు. కానీ సిబిఐ అధికారులు
ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని
కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ
జరిపిన అనంతరం సిబిఐ కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన
హైకోర్టు ఆచార్య బెయిల్‌ను రద్దు చేసింది. ఈ ఉత్తర్వులు
అందిన తక్షణమే ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు
ఆచార్యను ఆదేశించింది. ఈ ఆదేశాలను అందుకున్న ఆచార్య
సిబిఐ కోర్టులో లొంగిపోయారు. ఆ వెంటనే తనను స్పెషల్
కేటగిరి ఖైదీగా పరిగణించాలని కోరుతూ పిటీషన్ దాఖలు
చేసుకున్నారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు ఎ కేటగిరి
కింద పరిగణించాలని చంచల్‌గూడ జైలు అధికారులను
ఆదేశించింది. అనంతరం ఆచార్యను చంచల్‌గూడ జైలుకు
తరలించారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు.
Read more ...

నా జీవితం జయకే అంకితం!

చెన్నై, మార్చి 28 : కలలోనైనా జయకు ద్రోహం తలపెట్టనని చిన్నమ్మ వీకే శశికళ స్పష్టం చేశారు. అంతే కాదు.. తన 'అక్క'ను మోసగించిన వారి(బంధువుల)తో తెగదెంపులు కూడా చేసుకున్నానని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రియనెచ్చెలి అయిన శశికళ ఎట్టకేలకు మనసు విప్పారు. తన భర్త నటరాజన్, మరో ఇద్దరు బంధువులు చేసిన కుట్రలకు కుమిలిపోయారు. తన జీవితాన్ని 'అక్క'కే అర్పించుకున్నానని చెప్పారు. ఆమెను మళ్లీ కలుసుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. బుధవారం ఆమె మీడియాతో తన మనోభావాలను పంచుకున్నారు. 

బంధువుల కుట్రలను తాను గ్రహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి, హత్యాయత్నం, భూకబ్జా, మోసం తదితర ఆరోపణలపై శశికళ భర్త నటరాజన్, ఆమె బంధువులు రావణన్, దివాకరన్‌లను తమిళనాడు పోలీసులు అరెస్టు చేసిన విష యం తెలిసిందే. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య మన్నార్‌గుడి మాఫియాగా పేరొందిన శశికళ, ఆమె దగ్గరి బం ధువులు 14 మందిపై జయలలిత 2011 డిసెంబర్‌లో బహిష్కరణ వేటు వేశారు. ఏఐఏడీఎంకే ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. పోయెస్‌గార్డెన్‌లోని తన నివాసం వేద నిలయం నుంచి శశికళను జయ గెంటేశారు. అంతకన్నా ముందే జయ రాజసౌధం లో పెద్ద కుట్ర జరిగిందన్న వదంతులూ లేకపోలేదు. దీనికి సూత్రధారి నటరాజనేనని ఆరోపణలున్నాయి. 

కుట్రలో భాగంగా శశికళ, ఆమె బంధువులు బెంగళూరులో ఓ జ్యోతిష్కుడిని సంప్రదించినట్టు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా నటరాజన్ ప్రమాణానికి ఓ మంచి ముహూర్తం కోసమే ఆ జ్యోతిష్కుడిని కలిసినట్టు వార్తలొచ్చాయి. దీంతో జయ కఠినంగా వ్యవహరించారు. శశిపై వేటు వేయడంతో పాటు.. కీలక పదవుల్లో ఉన్న ఆమె సన్నిహిత అధికా రులనూ తొలగించారు. జయకు దూరమైన మూడు నెలల అనంతరం శశికళ నోరు విప్పారు. ' జయలలితకు కలలో కూడా ద్రోహం తలపెట్టలేను. కొంతమంది ఉద్దేశపూర్వకంగా నా పేరు చెప్పి కొన్ని కుట్రలు చేశారు. వారందరితోనూ సంబంధాలు తెంచుకున్నాను' అని ప్రకటించారు. "3 నెలలుగా నా గురించి పత్రికల్లో ఊహాజనిత కథనాలు రాస్తున్నారు. 

ఇప్పటికైనా నోరు విప్పకుంటే పరిస్థితి చేయి దాటొచ్చు. 1984లో తొలిసారిగా అక్క జయలలితను కలుసుకున్నాను. ఆ తరువాత మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. సొంత చెల్లెలిగా చూసుకున్నారు. నా గుణగణాలను మెచ్చి 1988 నుంచి పోయెస్‌గార్డెన్‌లోని ఆమె ఇంట్లోనే తోడుగా ఉంచుకున్నారు. జయ అభివృద్ధిని ఓర్వలేని కొందరు ఆమె ప్రతిష్టకు కళంకం తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఆమెకు తోడుగా నిలిచిన నన్ను పావుగా వాడుకున్నారు. 24 ఏళ్ల పాటు మా అక్కకు తోడుగా ఉన్నాను. దురదృష్టవశాత్తు ఆమెను వదలాల్సి వచ్చింది. బయటికొచ్చినప్పుడే నాకు జ్ఞానోదయమైంది. 

నా వల్ల అక్కకు ఎంత చెడ్డ పేరు వచ్చిందో తెలుసుకోగలిగాను. నా బంధువులు, స్నేహితులు కొందరు నా పేరు ఉపయోగించుకుని కొన్ని కుట్రపూరిత పనులకు పాల్పడ్డారు. పార్టీకే కళంకం తెచ్చే విధంగా పావులు కదిపారు. జయ నుంచి పగ్గాలు లాగేసుకునేందుకూ పథకాలు రూపొందించారు. ఇవన్నీ తెలిసిన తరువాత చాలా బా«ధేసింది. ఈ కుట్రంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. నేను అక్కను ఎప్పుడూ తలచుకుంటూనే వుంటాను. ఆమెను నేరుగా కలుసుకుని క్షమాపణ చెప్పుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. అక్కకు ద్రోహం తలపెట్టిన నా బంధువులు, స్నేహితులందరితోనూ ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లోనూ సంబం దాలు ఉండవు'' అని శశికళ ప్రకటించారు.
Read more ...