ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు మాత్రమే గడువుండగా హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను పలు కార్పొరేట్, ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. మార్చి 2 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే చాలా కళాశాలల్లో విద్యార్థులకు హాల్‌టికెట్లు అందజేయలేదు. ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామంటున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కళాశాల ప్రారంభంలో ఫీజులో రాయితీలు ఇచ్చి, అడ్మిషన్లు ఇచ్చిన యాజమాన్యాలు ఇప్పుడు అంతకంటే ఫీజు ఎక్కువ ఇస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని బెదిరిస్తున్నాయని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. అలాంటిదేమీ లేదని, నిర్ణయించిన ఫీజునే అడుగుతున్నామని, హాల్‌టికెట్లు అందరికీ ఇస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి.
Feb 29, 2012
డబ్బులిస్తేనే హాల్‌టికెట్లు?
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
7:13 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
'ఆంధ్రజ్యోతి' ఎండీ రాధాకృష్ణకు సచ్చిదానంద శిష్యుడి బెదిరింపు లేఖ
వినేది నీతులు.. వాడేది బూతులు! స్వామీజీవి శాంతి వచనాలు.. ఆయనగారి శిష్యులవి 'నరుకుడు' మాటలు! వాస్తవాలను జీర్ణించుకోలేని గణపతి సచ్చిదానంద శిష్యుడు మురళీకృష్ణ 'ఆంధ్రజ్యోతి' మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై అక్కసు వెళ్లగక్కారు. ఏడుకొండల వెంకన్న సన్నిధిలో గణపతి సచ్చిదానందకు ఆయన శిష్యులు జేజేలు కొట్టడం, ఆయనకు పాదాభివందనాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని 'ఆంధ్రజ్యోతి' బయటపెట్టడంతో సహించలేకపోయారు. బెదిరింపులు, తిట్లు, శాపనార్థాలతో వేమూరి రాధాకృష్ణకు లేఖ పంపారు.
"ఈ ఫిబ్రవరి లో మీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ గణపతి సచ్చిదానందపై రెండు నిరాధార కథనాలను ప్రసారం చేసింది. ఇకపై అలాంటి కథనాలను ప్రసారం చేయడం మానుకోకపోతే.. ముందుగా మీ కుమారుడిని చంపేస్తాం. ఆ తర్వాత మిమ్మల్ని, నాన్సెన్స్ వాగే వాళ్లనూ చంపేస్తాం. సీబీసీఐడీ అదనపు డీజీ రమణమూర్తి సహా ఎందరో అధికారులు, హైకోర్టు న్యాయవాదులు, రాజకీయ నాయకులు తమ జీవితాలను గణపతి సచ్చిదానందకు అంకితం చేశారు. మా దత్తసేనకు చెందిన నారాయణరావును 11 హత్య కేసుల్లో నిందితుడుగా చిత్రీకరించేందుకు మీలాంటివాళ్లు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు.
సచ్చిదానంద ఆశీస్సులతో నారాయణరావు ఆ కేసులన్నిటి నుంచీ సురక్షితంగా బయటపడ్డారు'' అని ఆ లేఖలో తెలిపారు. 'శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ ఇన్‌ఫర్మేషన్ సెంటర్' అని ఉన్న లెటర్ హెడ్ మీద మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ బెదిరింపు లేఖ పంపారు. 'మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ సంస్థకు, మీ సంస్థ ఉద్యోగులందరికీ స్వామీజీ శాపం తప్పదు' అని శాపనార్థాలు పెట్టారు. తిరుమలేశుడి సన్నిధిలో స్వామీజీ పాద నమస్కారాలు చేయించుకుంటే తప్పేముందని ప్రశ్నించారు.
"వేంకటేశ్వరస్వామి అర్చావతారమైతే (విగ్రహరూపంలో భక్తుల ఆరాధనలను స్వీకరించే భగవంతుడు)... స్వామీజీ సాక్షాత్తూ నడయాడే దైవం' అని అభివర్ణించారు. 'స్వామీజీ ఆగ్రహం నుంచి, ఆయన మంత్ర, తంత్ర, తపో బలాల నుంచీ మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు' అంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆపలేదు.. ఆ లేఖకు మరో పత్రాన్ని జతచేశారు. మొదటి లేఖలో బెదిరింపులకు మాత్రమే పాల్పడిన సదరు మురళీ కృష్ణ... అందులో సభ్యసమాజం తలొంచుకునే రీతిలో బూతు పంచాంగం విప్పారు! నడయాడే దైవానికి శిష్యులమంటూనే దారుణమైన భాషను ప్రయోగించారు.

7:12 PM
1 comment:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
కోహ్లికి వైస్ కెప్టెన్సీ
(సూర్య వార్త)
ముంబై: టీమిండియా చిచ్చరపిడుగు విరాట్ కోహ్లికి ప్రమోషన్ లభించింది. ఆస్ట్రేలియా టూర్‌లో మెరిసిన ఒకే ఒక్క హీరో విరాట్ కోహ్లి నిలకడైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆసీస్‌లో టెస్టుల్లో, వన్డేల్లో సెంచరీ చేసిన(ఇరు జట్లలో) ఒకే ఒక్క బ్యాట్స్‌మన్. టెస్టుల్లో, వన్డేల్లో 300పైగా పరుగులు చేసిన ఒకే ఒక భారత బ్యాట్స్‌మెన్‌గా ఇలా చాలా రికార్డులను ఈ యంగ్ గన్ తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్లు అందరూ కలిసికట్టుగా విఫలమైన చోట నిలబడి సెంచరీ చేసిన హీరో. భారత పరువు మంటగలవకుండా తన శాయశక్తులా ప్రయత్నించిన ధీరుడు. మొన్న జరిగిన వన్డేలో అద్భుత శతకంతో టీమిండియాను ఒడ్డున పడేసిన మెగా పవర్. ఒకప్పుడు సచిన్, సెహ్వాగ్‌లో కనిపించిన కసి ఇప్పుడు ఈ చిచ్చరపిడుగులో కనిపిస్తోందని మాజీలు మోసేస్తున్నారు. నిజంగానే విరాట్‌లో అపారమైన ప్రతిభ, పట్టుదల, దీక్ష ఉన్నాయి. ఇవే అతడిని ఈరోజు భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా నిలబెట్టాయి. ఇది అతడి కెరీర్‌లో మరో మెట్టుగా కాకుండా ఓ మైలురాయిగా మిగిలిపోతుంది.ఈ లక్షణాలే సెలెక్టర్లను ప్రభావితం చేసి ఉంటాయి. ఎందుకంటే తన యువ సహచరులు సురేష్ రైనా, రోహిత్ శర్మ విపరీతమైన కష్టాల్లో ఉన్నారు. కనీసం అర్థసెంచరీ చేయడానికి తంటాలు పడ్డారు. అటు వీరూ గైర్హాజరీ కూడా కోహ్లికి కలిసొచ్చింది. ఐతే వీరూ లేనిపక్షంలో ఇన్నిరోజులు వైస్ కెప్టెన్సీ చేసిన గంభీర్‌కు సెలెక్టర్లు షాకిచ్చారు. అతడినుంచి పగ్గాలను కోహ్లికి బదిలీ చేశారు. విశేషమేంటంటే.. వీరూ, గంభీర్, కోహ్లి ముగ్గురూ ఢిల్లీకి చెందిన ఆటగాళ్లే. సెహ్వాగ్‌పైవేటు, సచిన్ కంటిన్యూ ఆస్ట్రేలియా టూర్లో ఘోరంగా విఫలమైన వీరేంద్ర సెహ్వాగ్‌పై సెలెక్టర్లు వేటు వేశారు. పైకి విశ్రాంతినిచ్చాం అని చెప్తున్నా.. వేటు పడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆస్ట్రేలియా టూర్లో ఘోరంగా విఫలమైన వారిలో వీరూ ఒకడు. అంతేకాదు ఆస్ట్రేలియాలో ధోనీతో మనస్పర్థలు వచ్చాయని వార్తలు కూడా హల్ చల్ చేశాయి.
వీరిద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో వీరూను పక్కనబెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఫిట్‌నెస్ కారణంగానే పక్కనబెట్టామని సెలెక్టర్లు అంటున్నా.. వీరూ ఫిట్‌గానే ఉన్నాడన్నది వాస్తవం, ఫిట్‌గా లేకపోతే ఫుల్‌టైమ్ బౌలర్‌గా ఆసీస్‌లో ఎందుకు బౌలింగ్ చేస్తున్నాడు. అతడు పట్టిన రెండు మూడు క్యాచ్‌లు కూడా చూడచక్కగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఫిట్‌నెస్ సాకుతో సెలెక్టర్లు పక్కనబెట్టలేరు. కాని సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ మాత్రం వీరూకి ఫిట్‌నెస్ తగ్గిందని అంతటున్నాడు.
ఇక సచిన్‌ను పక్కనబెట్టే సాహసం సెలెక్టర్లు చేయలేకపోయారు. మాస్టర్‌కు మరో సిరీస్ అవకాశమిచ్చారు. మార్చ్ 11నుంచి ప్రారంభం కానున్న ఏషియా కప్ 15మంది జాబితాలో సచిన్‌కు చోటు లభించింది. ఇటీవల సచిన్ రిటైర్మెంట్ ఇవ్వాలంటూ మాజీలు, విమర్శకులు తెగ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఏషియా కప్ సెలక్షన్ ప్రాధాన్యత సంతరించుకుంది. చివరకు సెలెక్టర్లు సచిన్‌ను తప్పించే సాహసం చేయలేకపోయారు. ఇక జట్టులోనుంచి జహీర్, ఉమేష్ యాదవ్ తప్పించారు. వీరికి కొన్నిరోజులు రెస్ట్ ఇస్తున్నట్లు సెలెక్టర్లు చెప్తున్నారు.జహీర్, ఉమేష్ తప్పుకోవడంతో అశోక్ దిండాకు టీమిండియా తలుపులు తెరుచుకున్నాయి. రంజీల్లో రెండో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన దిండా ఆరు మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీశాడు. మోకాలి గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. దీంతో జడేజా, ఇర్ఫాన్, యూసుఫ్‌తో ఆల్‌రౌండర్ల జాబితా పెరిగింది. ఇక మనోజ్ తివారి, రాహుల్ శర్మ స్థానాలను నిలబెట్టుకోగా పార్థివ్ పటేల్ చోటు కోల్పోయాడు.
- కోహ్లి 2011వ సంవత్సరంలో 34 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.
- 47.62 సగటుతో 1381 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు 8 అర్థసెంచరీలు ఉన్నాయి.
- 2012లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 53.28 యావరేజ్‌తో 373 పరుగులు సాధించాడు
- ఇందులో ఒక సెంచరీ రెండు అర్థసెంచరీలు ఉన్నాయి.
- మరే ఇతర భారత బ్యాట్స్‌మెన్ ఇటువంటి గణాంకాలను నమోదు చేయలేదు.
- అంతేకాదు వన్డేల్లో ప్రస్తుతం భారత్ తరఫున టాప్ ర్యాంక్‌లో.. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌లో ఉన్నాడు.
- అండర్ 19 వరల్డ్ కప్ గెలిపించాడన్న చక్కని బ్యాగ్రౌండ్ ఉంది.
- ఎటువంటి పరిస్థితుల్లో అయినా జట్టును ఆదుకోగలడు, ఒడ్డున పడేయగలడు.
- మంచి ఫీల్డింగ్ కూడా కోహ్లికి పెద్ద ప్లస్ పాయింట్
- ఆస్ట్రేలియా టూర్లో భారత తరఫున సెంచరీ చేసిన ఒకే ఒక ఆటగాడు విరాట్ కోహ్లి భారత జట్టు: ధోని (కెప్టెన్) విరాట్ కోహ్లి (వైస్ కెప్టెన్), సచిన్, రైనా, గంభీర్, రోహిత్ శర్మ, మనోజ్ తివారి, రవీంద్ర జడేజా, అశ్విన్, ప్రవీణ్ కుమార్, వినయ్ కుమార్, రాహుల్ శర్మ, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, అశోక్ దిండా
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
7:01 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌గా గంగూలీ
(సూర్య వార్త)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
6:59 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
విజయావారి పతాకంపై ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీ రామారావు, జి. వరలక్ష్మి జంటగా నాగిరెడ్డి, చక్రపాణి ద్వయం నిర్మించిన హాస్యరస ప్రధాన సాంఘిక సూపర్‌హిట్ చిత్రం 'పెళ్లిచేసి చూడు'. నాలుగేళ్లకోసారి వచ్చే లీపు సంవత్సరం రోజున 1952లో ఫిబ్రవరి 29న విడుదలైన ఈ చిత్రం నేటి లీపు సంవత్సరం రోజుతో అరవై ఏళ్లు పూర్తి చేసుకుంటోంది.
హాస్యానికి కిరీటం
అదివరకు కొద్దిపాటి హాస్యరస ప్రధాన చిత్రాలొచ్చినా వాటిలో ఏవీ అంతగా ప్రేక్షకుల్ని రంజింప చేయలేకపోయాయి. వ్యంగ్యం (సెటైర్)తో కూడిన ఆరోగ్యకర హాస్యాన్ని మేళవించి, సాంఘిక చిత్రాల్ని జనరంజకం చేయవచ్చనే ధోరణికి అంకురార్పణ చేసింది 'పెళ్లిచేసి చూడు'. అప్పట్నించీ ఇదే ఫార్ములాతో జంధ్యాల వంటి ఎంతోమంది దర్శకులు ఎన్నో చిత్రాల్ని రూపొందించి, విజయాలు సాధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే హాస్యరస చిత్రాలకు ఇది ట్రెండ్‌సెట్టర్.
యువ కథానాయక పాత్రలకు పట్టాభిషేకం
తెలుగులో అప్పటివరకు సాంఘికాలలో పిల్లాపాపలతో సతమతమవుతూ సంసార జంజాటంలో ఈదులాడే మధ్యవయసు పాత్రలే కథానాయకులుగా చలామణీ అయ్యేవి. అలాంటి కాలంలో యువత మనోభావాల్నీ, ఆలోచనా విధానాన్నీ ప్రతిబింబిస్తూ యువ పాత్రలకు కథానాయక స్థానం కల్పించడంతో పాటు, ఘన విజయాన్ని సాధించడంతో అప్పట్నించీ ఇప్పటివరకూ తెలుగు సినిమా కథానాయక పాత్రలన్నీ యువత చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి.ఆ రకంగా తెలుగు సినిమా కథానాయకుడి పాత్రలకు చిరకాలంగా నిలిచివున్న ఒరవడిని అందించింది కూడా ఈ సినిమానే.
ఇందులో బడికి వెళ్లనని మారాం చేస్తూ కనిపించిన మాస్టర్ మోహన్ (మోహన్ కందా), తర్వాత కాలంలో ఐఏఎస్ చేసి, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం విశేషం. పదిహేడు పాటలున్న ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఘంటసాల జనరంజకమైన స్వరాల్ని సమకూర్చగా, పింగళి నాగేంద్రరావు, ఊటుకూరి సత్యనారాయణ సాహిత్యాన్ని అందించారు. కథ, స్క్రిప్టు బాధ్యతల్ని చక్రపాణి నిర్వహించారు.
సంచలన విజయం
తొలి విడత 15 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం అప్పటికి అత్యధికంగా 11 కేంద్రాల్లోనూ, మలి విడత కలుపుకొని 26 కేంద్రాల్లోనూ శత దినోత్సవం జరుపుకుంది. విజయవాడ దుర్గా కళామందిరంలో 182 రోజులు ప్రదర్శితమై తెలుగునాట రజతోత్సవం పూర్తిచేసుకున్న తొలి సాంఘిక చిత్రంగా రికార్డులకెక్కింది. ఆ దశాబ్దం వరకూ 'పాతాళభైరవి' తర్వాత ఈ చిత్రానిదే అత్యధిక స్కోరు. ఆ పిమ్మట ఒకటిన్నర దశాబ్దం వరకూ సాంఘిక చిత్రాల ప్రదర్శనలో దీనిదే పైచేయి.
ఇదే చిత్రాన్ని విజయావారు ఎన్టీ రామారావు హీరోగా తమిళంలో 'కల్యాణమ్ పణ్ణిపార్' పేరుతో నిర్మించి, 1952 ఆగస్టు 15న విడుదల చేయగా, అక్కడ కూడా విజయాన్ని సాధించి శత దినోత్సవాలు జరుపుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఎల్వీ ప్రసాద్ తన సొంత సంస్థపై హిందీలో రీమేక్ చేయగా, అక్కడ మాత్రం పరాజయం చవిచూసింది.
హాస్యానికి కిరీటం
అదివరకు కొద్దిపాటి హాస్యరస ప్రధాన చిత్రాలొచ్చినా వాటిలో ఏవీ అంతగా ప్రేక్షకుల్ని రంజింప చేయలేకపోయాయి. వ్యంగ్యం (సెటైర్)తో కూడిన ఆరోగ్యకర హాస్యాన్ని మేళవించి, సాంఘిక చిత్రాల్ని జనరంజకం చేయవచ్చనే ధోరణికి అంకురార్పణ చేసింది 'పెళ్లిచేసి చూడు'. అప్పట్నించీ ఇదే ఫార్ములాతో జంధ్యాల వంటి ఎంతోమంది దర్శకులు ఎన్నో చిత్రాల్ని రూపొందించి, విజయాలు సాధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే హాస్యరస చిత్రాలకు ఇది ట్రెండ్‌సెట్టర్.
యువ కథానాయక పాత్రలకు పట్టాభిషేకంతెలుగులో అప్పటివరకు సాంఘికాలలో పిల్లాపాపలతో సతమతమవుతూ సంసార జంజాటంలో ఈదులాడే మధ్యవయసు పాత్రలే కథానాయకులుగా చలామణీ అయ్యేవి. అలాంటి కాలంలో యువత మనోభావాల్నీ, ఆలోచనా విధానాన్నీ ప్రతిబింబిస్తూ యువ పాత్రలకు కథానాయక స్థానం కల్పించడంతో పాటు, ఘన విజయాన్ని సాధించడంతో అప్పట్నించీ ఇప్పటివరకూ తెలుగు సినిమా కథానాయక పాత్రలన్నీ యువత చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి.ఆ రకంగా తెలుగు సినిమా కథానాయకుడి పాత్రలకు చిరకాలంగా నిలిచివున్న ఒరవడిని అందించింది కూడా ఈ సినిమానే.
ఇందులో బడికి వెళ్లనని మారాం చేస్తూ కనిపించిన మాస్టర్ మోహన్ (మోహన్ కందా), తర్వాత కాలంలో ఐఏఎస్ చేసి, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం విశేషం. పదిహేడు పాటలున్న ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఘంటసాల జనరంజకమైన స్వరాల్ని సమకూర్చగా, పింగళి నాగేంద్రరావు, ఊటుకూరి సత్యనారాయణ సాహిత్యాన్ని అందించారు. కథ, స్క్రిప్టు బాధ్యతల్ని చక్రపాణి నిర్వహించారు.
సంచలన విజయంతొలి విడత 15 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం అప్పటికి అత్యధికంగా 11 కేంద్రాల్లోనూ, మలి విడత కలుపుకొని 26 కేంద్రాల్లోనూ శత దినోత్సవం జరుపుకుంది. విజయవాడ దుర్గా కళామందిరంలో 182 రోజులు ప్రదర్శితమై తెలుగునాట రజతోత్సవం పూర్తిచేసుకున్న తొలి సాంఘిక చిత్రంగా రికార్డులకెక్కింది. ఆ దశాబ్దం వరకూ 'పాతాళభైరవి' తర్వాత ఈ చిత్రానిదే అత్యధిక స్కోరు. ఆ పిమ్మట ఒకటిన్నర దశాబ్దం వరకూ సాంఘిక చిత్రాల ప్రదర్శనలో దీనిదే పైచేయి.
ఇదే చిత్రాన్ని విజయావారు ఎన్టీ రామారావు హీరోగా తమిళంలో 'కల్యాణమ్ పణ్ణిపార్' పేరుతో నిర్మించి, 1952 ఆగస్టు 15న విడుదల చేయగా, అక్కడ కూడా విజయాన్ని సాధించి శత దినోత్సవాలు జరుపుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఎల్వీ ప్రసాద్ తన సొంత సంస్థపై హిందీలో రీమేక్ చేయగా, అక్కడ మాత్రం పరాజయం చవిచూసింది.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
6:56 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
రెండేళ్లలో రూ.2030 కోట్ల భూములు హాంఫట్
(ఆంధ్రజ్యోతి వార్త)
సర్కారీ పెద్దలకు సలామ్ కొట్టే ఓ ఐఏఎస్... ఆ ఐఏఎస్‌కు గులామ్‌లుగా ముగ్గురు ఆర్డీవోలు! ఇదో ముఠా! వీరి దెబ్బకు హైదరాబాద్ ఠా! ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ఆ అధికారే భక్షకుడిగా మారాడు. వందల కోట్ల విలువైన స్థలాలకు రెక్కలు తొడిగాడు. 'మ్యుటేషన్ చక్రవర్తి'గా అవతరించి ప్రభుత్వ భూములను పరాధీనం చేశాడు. ఆ అధికారి పేరు... నవీన్ మిట్టల్. వైఎస్ హయాంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా చక్రం తిప్పారు. ఇప్పుడు... జీహెచ్ఎంసీ ప్రత్యేక కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. మిట్టల్ హయాంలో జరిగిన భూపాపాలను ఇప్పుడు తవ్వితీస్తున్నారు. 2008 - 2010 మధ్య కాలంలో రూ.2,030 కోట్ల విలువైన భూమిని పందేరం చేసినట్లు తేల్చారు. ఈ మ్యుటేషన్‌లన్నింటిపై పునఃసమీక్షకు రంగం సిద్ధమవుతోంది. దర్గా భూమిని దర్జాగా ప్రైవేటుకు కట్టబెట్టిన వైనంపై 'ఆంధ్రజ్యోతి' ఇటీవల ప్రచురించిన కథనంతో మొత్తం డొంక కదిలించాలని రెవెన్యూ యంత్రాంగం నిర్ణయించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 29 : 'ఆంధ్రజ్యోతి' తీగలాగింది. భూ అక్రమాల డొంక కదులుతోంది. పందేరాల జాతరలో జరిగిన అవకతవకల అంతు తేల్చే దిశగా అడుగు పడుతోంది. రాజధానిలో ఖరీదైన ప్రభుత్వ భూములను బడాబాబులు, సంపన్న వర్గాలు, నేతలకు అడ్డదిడ్డంగా కట్టబెట్టిన వైనం అధికారికంగా బయటపడుతోంది. రెండేళ్లలోనే 2030 కోట్ల విలువైన భూములు పరాధీనమైనట్లు లెక్కతేలింది. ప్రభుత్వ భూములను కాపాడటంలో నాటి కలెక్టర్ నవీన్ మిట్టల్, ముగ్గురు ఆర్డీవోలు విఫలమైనట్లు స్పష్టమైంది. హైదరాబాద్ జిల్లా యంత్రాంగం భూముల అక్రమ మ్యుటేషన్లపై మండలం వారీగా ఈ లెక్కలు తీసింది. దీనిపై సమగ్రనివేదిక సిద్ధం చేసింది.
అక్రమ మ్యుటేషన్లపై సమీక్షకు అనుమతించాలని కోరుతూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు నివేదిక సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను 'ఆన్‌లైన్' సేకరించగలిగింది. 'ఆంధ్రజ్యోతి' గతంలో బయటపెట్టిన అనేక అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి. దీంతో ఆ కథనాలన్నీ అక్షరసత్యాలని రుజువవుతోంది. అంతేకాదు... మ్యుటేషన్‌ల పునఃసమీక్షకు కూడా 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనమే మూలకారణం కావడం విశేషం. దర్గాషా ఖామో ష్‌కు చెందిన వక్ఫ్‌భూమిని... దర్గా ముతవలీకే మ్యుటేషన్ చేసిన సంగతిని ఈనెల 21న 'ఆంధ్రజ్యోతి' బయటపెట్టింది.
ఈనేపథ్యంలో... 'ఇలా ఇంకెన్ని జరిగాయో! ఆ లెక్క తీయాల్సిందే!' అని రెవెన్యూ శాఖలో నీతి, నిజాయితీ కలిగిన ఉన్నతస్థాయి అధికారులు భావించారు. 2008 నుంచి 2010 వరకు హైదరాబాద్ జిల్లా పరిధిలో జరిగిన మ్యుటేషన్లపై నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. దీనిపై హైదరాబాద్ జేసీ రంగంలోకి దిగారు. తహసిల్దార్‌లతో అత్యవసర భేటీ ఏర్పాటుచేసి... మ్యుటేషన్ల లోగుట్టు విప్పాలని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. అధికారులు వారం పాటు శ్రమించి నివేదిక ఇచ్చారు. 2030కోట్ల ప్రభుత్వభూమి పెద్దలపాలైందని తేల్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలో ముఖ్యాంశాలివి..
మల్పానీకి 432కోట్ల మేలు...
అది తిరుమలగిరి మండలం తోకట్ట గ్రామం. అక్కడ 18ఎకరాల భూమి ఉంది. ఇది సాలార్‌జంగ్ ఎస్టేట్‌లో భాగమని (గైరాన్ సర్కారీ, అబాదీ) చెబుతున్నారు. తోకట్ట, హస్మత్‌పేట్ గ్రామాల్లో ఉన్న ఈ భూమిపై సరిహద్దు వివాదం ఉండేది. రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే జరిపి హద్దులు నిర్ణయించాల్సి ఉంది. కానీ.. అత్యంత చిత్రంగా ఈ భూమిని మల్పానీ అనే వ్యక్తికి అప్పగించారు. దీని విలువ రూ.432 కోట్లు అని అధికారులు లెక్క తేల్చారు.
పద్మాలయకు 456 కోట్ల వరం
రాజధానిలో సినీ పరిశ్రమ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నామమాత్రపు ధరకు షేక్‌పేట్ గ్రామంలో పద్మాలయ స్టూడియోస్‌కు 9.20 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అందులో కొంత భూమిని జీ-టెలీఫిల్మ్స్‌కు విక్రయించింది. ఆ భూమి విలువ రూ. 456 కోట్లు.
దర్గాకు 222 కోట్ల భూమిపై...
నాంపల్లిలో 37వేల చదరపు మీటర్ల భూమిపై వివాదం నెలకొంది. ఇది వక్ఫ్‌భూమి అని దర్గాషా ఖామోష్ వాదన. కాదు అది ప్రభుత్వ భూమి అని, శ్మశాన వాటికకోసం కేటాయించిందని హైదరాబాద్ జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఈ భూమిలో కొంత మాత్రమే దర్గాదని, మిగిలినది వక్ఫ్ భూమి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశం ఆధారంగా మొత్తం భూమిపై దర్గాకు హక్కులు కల్పిస్తూ నవీన్ మిట్టల్ 2008లో మ్యుటేషన్ చేశారు. ఇలా చేసే అధికారం కలెక్టర్‌కు లేదు. ఈ భూమి విలువ 222 కోట్ల రూపాయలని అధికారులు ఇప్పుడు తేల్చారు. ఈ ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ ప్రస్తుత కలెక్టర్ గత నెల 31న సీసీఎల్ఏకు లేఖ (బి2/9166/2011) రాశారు.
ఇలా ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా దర్గాకు కేటాయించిన నవీన్ మిట్టల్ హయాంలోనే... అదే దర్గాకు చెందిన 9 ఎకరాలా 27 గుంటల భూమిని దర్గా ముతవల్లీకి సొంతం చేశారు. 2008 మార్చి ఒకటో తేదీన దీనిపై ఆర్డీవో ముంతఖాబ్( ఆదేశం) జారీ చేశారు. ఇది తప్పని ప్రస్తుత కలెక్టర్ తేల్చారు. ఈ భూమి విలువ 228 కోట్ల రూపాయలు ఉంటుందని ఇప్పుడు అంచనా వేశారు. ఈ మ్యుటేషన్‌ను పునఃసమీక్షించాలని కలెక్టర్ గత నెల 16న సీసీఎల్ఏకు లేఖ రాశారు. ఈ విషయాలన్నింటినీ ఇటీవలే 'ఆంధ్రజ్యోతి' బయటపెట్టింది.
96 కోట్ల అసైన్డ్ భూమి పరాధీనం...
షేక్‌పేటలో 7792 చదరపు మీటర్ల అసైన్‌మెంట్ భూమి పరులపాలైంది. దీని విలువ ఇప్పుడు 96 కోట్ల రూపాయలు. సర్వే జరిగిన సమయంలో భూమి పొందిన వ్యక్తి (అసైనీ) పొజిషన్‌లో లేరు. అతనికి బదులు పొజిషన్‌లో ఉన్న మరో వ్యక్తిని కబ్జాదారుగా ప్రకటించారు. అయితే... అనుమానిత గిఫ్ట్ డాక్యుమెంట్లతో మూడో పార్టీ వచ్చి ఆ భూమి తనదే అని పేర్కొంది. దీనిని వారికే మ్యుటేషన్ చేశారు. ప్రభుత్వం ఈ ఉత్తర్వును నిలిపివేసింది.
* కందికల్‌లో 8ఎకరాల భూమిపై 2010 ఏప్రిల్‌లో కలెక్టర్ మ్యుటేషన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వివాదం ప్రస్తుతం సీసీఎల్ఏలో కమిషనర్ అప్పీల్స్ ముందు ఉంది. ఈ భూమి విలువ 192 కోట్ల రూపాయలు.
* ఆసిఫ్‌నగర్‌లో 20వేల చదరపు మీటర్ల జి. టెంపుల్ భూమి విలువ రూ.100 కోట్లు. ఇనాం రద్దుచట్టంతో ఈ భూమి ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. దీనిని ప్రైవేటు వ్యక్తులకు మ్యుటేషన్ చేశారు.
* షేక్‌పేట గ్రామంలో 13 కోట్ల విలువైన 1306 చదరపు మీటర్ల భూమిని 2008లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు.
* ముషీరాబాద్‌లో 9 కోట్ల విలువైన భూమి మ్యుటేషన్‌కు అనుమతించారు. ఆర్డీవో తిరస్కరించినా కలెక్టర్ కరుణించారు.
* షేక్‌పేటలో 1378 చదరపు మీటర్ల సర్కారీ పోరంబోకు భూమిని 2009లో ప్రైవేటు వ్యక్తులకు మ్యుటేషన్ చేశారు.
పునఃసమీక్షకు అనుమతిస్తారా?
అధికారులు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇన్ని భూ బాగోతాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం పూర్తిస్థాయి పరిశీలనకు అనుమతిస్తే మరెన్నో వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. ఇప్పుడు... ఈ అక్రమ మ్యుటేషన్‌లపై పునఃసమీక్షకు సర్కారు అనుమతిస్తుందా? అనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అప్పట్లో జరిగిన భూ దందాలో బడా అధికారులతోపాటు నాటి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన ఓ నేత, మాజీ మంత్రి హస్తం కూడా ఉంది.
అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి, కొందరిని భయభ్రాంతులకు గురిచేసి మరీ మ్యుటేషన్‌లు చేయించుకున్నారు. ఇది ఓరకంగా బహిరంగ రహస్యం. ఇప్పుడు సంతకాలు చేసిన అధికారులు మాత్రం దొరికిపోయారు. తెర వెనుక నుంచి ఆదేశాలు జారీ చేసిన పెద్దలు కోట్లు మూటగట్టుకుని, తెరవెనుకే ఉండిపోయారు. పొలిటికల్ పెద్దలను బయటపడేసేందుకు సర్కారు సరేనంటుందా? పునఃసమీక్షకు అనుమతిస్తుందా? వేచి చూడాల్సిందే!
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
6:51 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
ప్రత్యూష తమ్ముడు హీరోగా...
(సూర్య వార్త)
అందాల నటి ప్రత్యూష తమ్ముడు కృష్ణచంద్ర హీరోగా..పరిచయమవుతున్న సినిమా ఉగాది నుంచి ప్రోగ్రెసింగ్‌కి వెళుతోంది. భవ్యశ్రీ కథానాయిక. ఎన్.మల్లిఖార్జునరావు సమర్పకుడు. శ్రీ రాజేశ్వరి ఫిలింస్ సారథ్యంలో శ్రీనివాస్ పిక్చర్స్ పతాకంపై ఎమ్మెస్సార్ నిర్మిస్తున్నారు. మల్లెల చరణ్ దర్శకుడు. ఈ సినిమా రికార్డింగ్ కార్యక్రమాలు సంగీతదర్శకుడు మహతి ఆధ్వర్యంలో హైదరా బాద్ సానాయాదిరెడ్డి రికార్డింగ్ థియేటర్‌లో జరిగాయి. హీరో కృష్ణచంద్ర మాట్లాడుతూ ‘ఇది నా తొలిచిత్రం. ప్రేమ, యాక్షన్ కలగలిసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అన్యాయాలను ఎదురించి తన గ్రామస్తులకు హీరో ఎలాంటి మేలు చేశాడనేదే సినిమా’ అన్నారు. ప్రముఖ కథానాయకుడు, నాయిక కూడా ఈ చిత్రంలో నటిస్తారని నిర్మాత తెలిపారు. చిత్రయూనిట్ సహా గాయని కౌసల్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
6:48 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
నున్న పిల్లి మొగ్గ!
(సూర్య వార్త)
ఏసీబీ థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాంగ్మూలంలో తప్పుడు సాక్షాలను పొందు పరిచిందని ఖమ్మం జిల్లా మద్యం సిండికేట్ నిందితుడు నున్న రమణను ఆరోపించారు. అందుకే ఏసీబీ చెప్పినట్లు తాను చేశానని ఏసీబీ కోర్టులో వివరణ ఇచ్చారు. అంతేకా కుండా ఒత్తిడి తెచ్చి వాంగ్మూలం రాయించుకున్నారని వివ రణ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో తనకు మద్యం సిండికేటు ఉందని, జిల్లా వ్యాప్తంగా మద్యం లావాదేవిల్లో తన నిర్ణ యాలు నడుస్తాయని ఏసీబీ తప్పుడు కథనాలను ప్రచారం చేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా మద్యం సిండికేట్ వ్యవహారంలో అనవసరంగా ఇరికించిందని పేర్కొన్నారు. వ్యవసాయదారునిగా తన గ్రామంలో మంచి పేరుందని, ఆపేరును మద్యంతో ముడిపెట్టినట్లు కోర్టులో వాపోయారు. బలవంతంగా తన గొంతు నొక్కి ఏసీబీ అనవసర విషయాలపై ఆరా తీస్తుందని పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు అనునిత్యం మానసిక హింసకు గురి చేయడమేకాకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తోందన్నారు. మద్యం సిండికేట్‌లపై ఏసీబీ వైఖరిని తనతో బలవంతంగా చెప్పిస్తోందని రమణ వాంగ్మూలంలో పేర్కొన్నారు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
6:47 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
మార్చి రెండోవారంలో జగన్ అరెస్ట్?
(సూర్య వార్త)
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఒక పక్క సీబీఐ విచారణ జోరుగా సాగుతూండగా, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఇడి) మాత్రం చాపకింద నీరులా తన పనితాను చేసుకుపోతోంది. ఇప్పటికే జగన్ ఆస్తులకు సంబంధించి ఆయనకు చెందిన కంపెనీలలో సునామీలా వచ్చిపడిన నిధుల ఉప్పెన గురించి కూలంకషంగా వివరాలు సేకరించిన ఇడి.. ఇక జగన్‌ను అరెస్ట్ చేసేందుకే రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మార్చి రెండో వారంలో జగన్ మోహన్ రెడ్డిని ఇడి అరెస్ట్ చేసేఅవకాశాలున్నాయని తెలిసింది. ముఖ్యంగా జగన్ కంపెనీలలో పెట్టుబడులు, విదే శీ నిధుల మళ్లింపు, ఫెరా, ఫెమా చట్ట ఉల్లంఘనలకు సంబంధించి సమగ్ర సాక్ష్యాధారాలతో సిద్దంగా ఉండాలంటూ ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న అధికారులను ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆదేశించడం ఈ అరెస్ట్ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జగన్ ఆస్తుల కేసులో సీబీఐ విచారణ ప్రారంభించడానికి కొద్దిరోజుల ముందే ఎన్ఫోర్సెమెంట్ డైరక్టరేట్ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అదే సమయంలో ఆదాయపన్ను విభాగం కూడా రంగంలోకి దిగింది.
దీంతో పాటుగా దేశంలోని పరిశ్రమలు, కంపెనీలకు వచ్చే విదేశీ నిధులు, పెట్టుబడులపై నిరంతరం నిఘా ఉంచే రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం కూడా దర్యాప్తు చేపట్టింది. గత ఆరు నెలలుగా ఈ విభాగాలు చేపట్టిన దర్యాప్తులో జగ న్ గ్రూప్ కంపెనీలలో పెట్టుబడుల విషయంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని నిర్దారణకు వచ్చింది. ముఖ్యంగా విదేశీమారక ద్రవ్య పరిమితులు, విదేశీ కంపెనీలనుంచి పెట్టుబడులు స్వీకరించే పద్దతులలో జగన్ గ్రూప్ అనేక అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. దీంతో ఇప్పటికే ఈ విచారణలో బాగంగా జగన్‌తో పాటు ఆయన ప్రతినిధులను పలుమార్లు విచారించిన సీబీఐ ఇక ఫైనల్‌గా జగన్‌ను మరోమారు విచారించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఇందుకోసం మార్చి మొదటివారంలో నోటీసు ఇవ్వనున్నట్లు ఢఫిల్లీ అధికారుల సమాచారం. అయితే విచారణకు పిలిపించిన సమయంలోనే జగన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని బలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఇప్పటికే అన్నిరకాల లిఖితపూర్వక ఆధారాలు (డాక్యుమెంటిరీ ఎవిడెన్స్) సేకరించిందని, ఇక చర్యలు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. మరో పక్క జగన్ కంపెనీలలో పెట్టుబడులకు సంబంధించి విదేశాలకు వెళ్లి విచారించేందుకు సీబీఐ కోర్టునుంచి అనుమతి కూడా పొందడంతో తమవద్ద ఉన్న ఆధారాలతో జగన్‌పై చర్యలు తీసుకోవాలని ఇడి అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ రెండు మూడు రోజుల్లో ఢిల్లీలోని ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ నుంచి జగన్‌కు నోటీసులు జారీ అయ్యే అవకాశాలున్నాయని కొందరు అధికారులంటున్నారు. ‘జగన్ ఆస్తుల కేసులో మాపని మేం చేస్తున్నాం, వాళ్ళపని (ఇడి) వారు చేస్తున్నారు. మాకు అందిన సమాచారం వారికి అందించాం. వారి సమాచారాన్ని మాకు ఇచ్చారు. మాకందిన ఆధారాలను బట్టి మేం చర్యలు తీసుకుంటున్నాం...వాళ్లేం చేస్తారో మాకు చెప్పి చేయరుకదా’ అని సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
కాగా, భద్రతా కారణాలు, రాజకీయ కారణాల దృష్ట్యా జగన్‌ను తీహార్ జైలుకు తరలించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అటు జగన్ శిబిరం కూడా మానసికంగా సిద్ధంగానే ఉండటం ప్రస్తావనార్హం. ‘ జగనన్న తనను ఈడీ అరెస్టు చేస్తుందని చాలారోజుల నుంచే చెబుతున్నారు. దానికి అంతా సిద్ధంగానే ఉన్నాం. ఆయన అరెస్టు తర్వాత సానుభూతి వెల్లువెత్తుతుంద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
6:42 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
Feb 28, 2012
మళ్లీ 'వెండి' మెరుపులు
వెండి మళ్లీ మెరుపులు మెరిపిస్తోంది. గతరాత్రి మ్యాక్స్ లో కేజీ వెండి ధర దాదాపు 2,100 రూపాయలు పెరిగింది. 60,805 రూపాయల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి 35, 36 డాలర్ల వద్ద నిరోధం వస్తోంది. గత రాత్రి ఈ స్థాయికి విజయవంతంగా బ్రేక్ చేసి 37 డాలర్ల సమీపంలోకి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఔన్స్ వెండి ధర 35 శాతం దాకా పెరిగింది. యూరోప్‌లో ఆర్థిక వ్యవస్థల్ని గట్టెక్కించేందుకు పెద్దయెత్తున నిధులు చేస్తారనే అంచనాలు వెండి ధరను పరుగులు పెట్టిస్తాయి.
బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగినందున ఇన్వెస్టర్ల దృష్టి వెండితో పాటు ఇతర మెటల్స్ మీదకు మళ్లుతోంది. ప్రస్తుత వెండి ధర 5 నెలల గరిష్ఠ స్థాయిలో 37 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ నుంచి తదుపరి టార్గెట్ 40 డాలర్లని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. మన రూపాయల్లో 4 నుంచి 5 వేల రూపాయల దాకా పెరగొచ్చని భావిస్తున్నారు. తక్షణం కేజీ వెండి ధర 65 వేల వరకు వెళ్లొచ్చని ఆర్ ఎల్ ఆర్ సెక్యూరిటీస్ కమొడిటీ అనలిస్ట్ రమేష్ తెలిపారు.
బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగినందున ఇన్వెస్టర్ల దృష్టి వెండితో పాటు ఇతర మెటల్స్ మీదకు మళ్లుతోంది. ప్రస్తుత వెండి ధర 5 నెలల గరిష్ఠ స్థాయిలో 37 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ నుంచి తదుపరి టార్గెట్ 40 డాలర్లని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. మన రూపాయల్లో 4 నుంచి 5 వేల రూపాయల దాకా పెరగొచ్చని భావిస్తున్నారు. తక్షణం కేజీ వెండి ధర 65 వేల వరకు వెళ్లొచ్చని ఆర్ ఎల్ ఆర్ సెక్యూరిటీస్ కమొడిటీ అనలిస్ట్ రమేష్ తెలిపారు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
9:47 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
సచిన్,సెహ్వాగ్ భార్య ల క్రికెట్ వ్యాపారం
చెనై: స్టాక్ క్రికెటర్లు వ్యాపారాలు చేయడం అందిరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా వారి భార్యలు కూడా క్రీడారంగానికి చెందిన వ్యాపారాల్లో కాలుమోపుతున్నారు. క్రికెటర్ సచిన్ భార్య అంజలి, సెహ్వాగ్ భార్య ఆరతిలో వ్యాపారంలో కాలుమోపి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చెనై్నకు చెందిన స్పోర్ట్‌స మెషిన్ అనే సంస్థల్లో వీరిద్దరు అంజలి 35 శాతం, ఆరతి 25 శాతం వాటాలు కొనుగోలు చేశారు. మిగిలినవాటానుఈ సంస్థను స్థాపించిన వ్యవస్థాపకుడు ఇండియన్ టీం వీడియో విశ్లేషకుడు సుబ్రమణియన్ రామకృష్ణన్‌కు 38 శాతం వాటా ఉంది. వాస్తవానికి ఈ సంస్థను 2006లో ప్రారంభించారు. అంజలి,ఆరతిలు సంస్థను ప్రారంభించినప్పటి నుంచి బోర్డులో సభ్యులుగా ఉన్నారు. దీనికి పెద్ద ఎత్తున ప్రచారం చేయదలచుకోలేదని రామకృష్ణన్ అన్నారు. క్రీడలకు సంబంధించిన డేటాను సేకరించి టీంలకు అందుబాటులో ఉంచడం వీరి వ్యాపారం. వీరి వీడియోలు క్రీడాకారులకు బాగా ఉపయోగపడతాయి. పలు క్రీడలకు సంబంధించిన డేటాను, వీడియో క్లిప్పింగ్‌ల వల్ల క్రీడాకారులు లాభపడవచ్చు. తమ సంస్థకు పలువురు పేరుమోసిన క్రీడాకారులు మద్దతు తెలుపుతున్నారని... సరైన సమయం వచ్చినప్పుడు అధికారికంగా ప్రకటన చేస్తామని రామకృష్ణన్ చెప్పారు.
రామకృష్ణన్ తమిళనాడు జూనియర్ టీంకు స్కిప్పర్‌గాను, ఇండియన్ బ్యాంకు తరఫున 13 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడారు. గత పదేళ్ల నుంచి వీడియో విశ్లేషకుడుగా పనిచేస్తున్నారు. 2003లో భారత్ క్రికెట్ కోచ్ తనను ప్రోత్సహించి వీడియో విశ్లేషణ గురించి ప్రదర్శించి చూపమన్నారు. దీని వల్ల క్రీడాకారులు తాము చేసిన తప్పులు తెలుసుకుని తమ ఆట నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశం ఉందని అన్నారు. గతంలో జట్టు మీటింగ్‌లు సాధారణంగా జరిగేవి. క్రీడాకారులు ఈ సమావేశాలక హాజరయ్యి కోచ్‌లు ఇచ్చే సూచనలు సలహాలు వినేవారు. ప్రస్తుతం పరిస్థిలు మారిపోయాయి.
ప్రస్తుతం ఈ పద్ధతిని తాము పూర్తిగా మార్చివేశామని... కోచ్‌ల సలహాల స్థానే విజువల్ (వీడియో దృశ్యాలు) ప్రదర్శన ఏర్పాటు చేసి కొత్త కోచింగ్ పద్ధతులను అమల్లోకి తెస్తున్నామని రామకృష్ణన చెప్పారు. జట్టు మీటింగ్‌లు ఉత్సాహభరితంగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగాఉండే విధంగా మీటింగ్‌లను ఏర్పాటు చేస్తామని క్రీడాకారులు ఉత్సాహవంతంగా సమావేశాల్లో పాల్గొనేందుకు ఈ వీడియోలు ప్రోత్సహిస్తాయని ఆయన చెప్పారు.
ప్రస్తుతం రూ.3 కోట్ల టర్నోవర్ వ్యాపారం జరుగుతుందని... భవిష్యత్తులో రూ.100 కోట్ల వ్యాపారానికి విస్తరించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం తమ కంపెనీలో 30 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారని రామకృష్ణన్ చెప్పారు. బెంగళూరులో పది పాఠశాలలో ఒప్పందం కుదుర్చుకున్నామని.. భవిష్యత్తులో మరిన్ని విద్యా సంస్థలతో ఒప్పందం కుదర్చుకునే అవకాశం ఉందన్నారు.

7:23 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
టాపర్‌గా వచ్చినందుకు చంపేశారు
బాగా చదువుకోవడమే శాపమైంది. అన్ని తరగతుల్లోను అతడే టాపర్‌గా నిలవడం తోటి విద్యార్థులకు కంటగింపైంది. ఓ పేద విద్యార్థి తమకన్నా మంచి మార్కులు పొందడం సహించలేని ఇద్దరు విద్యార్థులు ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయారు. ఆ సరస్వతీ పుత్రుడిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించారు. తుపాకితో కాల్చి చంపారు.
ఈ దారుణ ఘటన హర్యానాలోని హిస్సార్‌లో చోటు చేసుకుంది. పేద కుటుంబంనుంచి వచ్చిన ప్రదీప్‌కుమార్ కల్పనా చావ్లా ఇంజనీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అన్ని అంశాల్లోను ఉత్తమ ప్రతిభ కనబరస్తూ కళాశాల టాపర్‌గా నిలిచేవాడు. ఇదే అతడిపాలిట శాపమైంది. ప్రదీప్ టాపర్‌గా రావడం సహించలేని సహ విద్యార్థులు కళ్యాణ్‌సింగ్, రాకేశ్ కుమార్ అతడిపై కక్ష పెంచుకున్నారు. సోమవారం కాలేజీ గేట్ వద్ద ప్రదీప్‌పై కాల్పులు జరిపి వారు పారిపోయారు. ప్రదీప్ అక్కడికక్కడే మరణించాడని, నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

7:17 PM
1 comment:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
మహాత్ముడికే మత మార్పిడి మరణానంతరం బాపూజీకి బాప్టిజం
లేటర్ డే సెయింట్స్ చర్చ్ నిర్వాకం?
బయటపెట్టిన పరిశోధకురాలు రాడ్ కీ
రికార్డులు మాయమయ్యాయని వెల్లడి
మహాత్ముడి మనవడి విస్మయం
మండిపడ్డ హిందూ అమెరికా ఫౌండేషన్
చర్చి అధ్యక్షుడి క్షమాపణకు డిమాండ్
రికార్డులు మాయమయ్యాయని వెల్లడి
మహాత్ముడి మనవడి విస్మయం
మండిపడ్డ హిందూ అమెరికా ఫౌండేషన్
చర్చి అధ్యక్షుడి క్షమాపణకు డిమాండ్
"ప్రపంచంలో అన్ని మతాలూ నిజమే, అన్నిట్లోనూ ఏవో కొన్ని లోపాలున్నాయి. అయినప్పటికీ నా మతం నాకు గొప్పది. ఒక మతం వ్యక్తి మరొక మతంలోకి మారాల్సిన అవసరం లేదు. అయితే, ఒక హిందువు మరింత ఉత్తమమైన హిందువుగా మారాలి. ఒక క్రైస్తవుడు మరింత ఉత్తమమైన క్రైస్తవుడుగా, ఒక ముసల్మాన్ మరింత ఉత్తమమైన ముసల్మాన్‌గా మారాలి.'' - మహాత్మా గాంధీ (యంగ్ ఇండియా 28.01.1928)
వాషింగ్టన్, ఫిబ్రవరి 28: వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మత సంస్థలు... మరణానంతరం మహాత్ములకూ మతాన్ని అంటగడుతున్నాయా? హిందూమత సిద్ధాంతాల్నీ.. గీతాసారాన్నీ బలంగా విశ్వసించిన మహాత్ముడికి ఒక అమెరికన్ చర్చ్ బలవంతంగా క్రైస్తవం ఇచ్చిందా? మరణానంతరం ఆయన పేరు మీద బాప్టిజం 'ప్రసాదించిందా'? ..ఈ ప్రశ్నలన్నిటికీ హెలెన్ రాడ్ కీ అనే పరిశోధకురాలు అవుననే సమాధానమిస్తున్నారు.
1996 మార్చి 27న అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలోని సాల్ట్‌లేక్ నగరంలో ఉన్న చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ (ఎల్డీఎస్) గాంధీజీ పేరిట బాప్టిజం ఇచ్చిందని, సావోపాలో బ్రెజిల్ టెంపుల్‌లో 2007 నవంబరు 17న ఈ ప్రక్రియ పూర్తయిందని చెబుతున్నారు. ఈ ఎల్డీఎస్ చర్చ్ మోర్మన్ చర్చ్‌గా బహుళప్రాచుర్యం పొందింది. గతంలో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్‌కెర్రీ, 2012 అధ్యక్ష పదవి రేసులో ఉన్న మిట్ రోమ్నీ వంటివారు ప్రముఖ మోర్మన్లు. గాంధీజీ పేరు మీదబాప్టిజం ఇచ్చినట్టు వెల్లడించిన హెలెన్ రాడ్‌కీ సైతం ఒకప్పుడు మోర్మనే. అనంతరకాలంలో ఆమె చర్చ్ నుంచి వెలికి గురయ్యారు.
'ది డైరీ ఆఫ్ ఏన్ ప్రాంక్' రాసిన యూదు చిన్నారి ఏన్‌ఫ్రాంక్ కు కూడా ఎల్డీఎస్ ఇలాగే మరణానంతరం బాప్టిజం ఇచ్చినట్టు గతంలో వెల్లడించి సంచలనం సృష్టించిన చరిత్ర రాడ్‌కీకి ఉంది. ఇదే కోవలో.. గాంధీజీకి కూడా లేటర్‌డే సెయింట్స్ చర్చ్ బాప్టిజం ఇచ్చినట్టు నెవడాలోని హిందూ కార్యకర్త రాజన్ జెడ్‌కు ఆమె ఒక ఈమెయిల్ పంపారు. గాంధీజీ పేరు మీద బాప్టిజం ఇచ్చినట్టుగా ఉన్న రికార్డును తాను ఫిబ్రవరి 16న చూసినట్టు అందులో పేర్కొన్నారు. అయితే... తాను చూసిన కొద్దిరోజులకే ఆ రికార్డును మాయం చేశారని, అదిప్పుడు దొరికే అవకాశం లేదని వెల్లడించారు. ఇలా ఒక రికార్డు మాయమవడం అసాధారణమైన విషయమని తన మెయిల్‌లో పేర్కొన్నారు.
ఈ విషయం ఇతరులకు తెలియకూడదన్నది మోర్మన్ల ఉద్దేశంగా భావిస్తున్నానన్నారు. కాగా.. ఈ విషయం తెలిసి మహాత్ముడి మనుమడు అరుణ్‌గాంధీ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఇలా ఒక వ్యక్తి మరణించాక, అతని పేరు మీద ఇష్టం వచ్చినట్టు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. హిందువులుగానీ, ఇతర మతస్థులెవరైనాగానీ... మతమార్పిడికి పాల్పడటాన్ని తన తాతయ్య పూర్తిగా వ్యతిరేకించేవారని అరుణ్ అన్నారు. గాంధీజీ అన్ని మతాలనూ గౌరవించేవారని, ఏ మతాన్ని అనుసరించాలన్నది వ్యక్తులు స్వయంగా నిర్ణయించుకోవాలని, ఇతరులు వారిని బలవంతం చేయకూడదని భావించేవారని అరుణ్‌గాంధీ వివరించారు.
ఇక... హిందూ మతం పట్ల ప్రగాఢ విశ్వాసం గల గాంధీజీ పేరు మీద ఆయన మరణానంతరం బాప్టిజం ఇవ్వడమంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని వాషింగ్టన్‌లోని హిందూ అమెరికా ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్)కు చెందిన సుహాగ్ శుక్లా మండిపడ్డారు. ఈ విషయమై రాడ్‌కీ నుంచి లేఖ అందుకున్న రాజన్ జెడ్... దీనిపై తాను ఎల్‌డీఎస్ చర్చ్ అధ్యక్షుడు థామస్ ఎస్ మాన్సన్‌కు ఫిబ్రవరి 24న లేఖ రాశానని తెలిపారు. అయితే ఇప్పటికీ ఆయన వద్ద నుంచి జవాబు రాలేదన్నారు. "మాన్సన్ దీనికి క్షమాపణ చెప్పాలి. ఇదెలా జరిగిందో ఆయన చెప్పాల్సిందే'' అన్నారు.

7:15 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
న్యూఢిల్లీ : ఖండాంతర ఉపరితల క్షిపణి సామర్థ్యం కలిగిన ప్రముఖ దేశాల సరసన త్వరలో భారత్ చేరబోతోంది. వచ్చే నెలలో ఈ తరహా క్షిపణి అగ్ని-5 తొలి పరీక్షకు రంగం సిద్ధమౌతోంది. విడిభాగాలన్నింటిని జోడించే పనులు హైదరాబాద్‌లో ప్రారంభించారు. డీఆర్‌డీవో ప్రయోగశాలలో ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మార్చి నెలఖరికిగానీ, ఏప్రిల్ మొదటి వారంలో గానీ ఒడిశా తీరంలోని వీలర్ దీవి నుంచి ప్రయోగించనున్నట్లు డీఆర్‌డీవో అధిపతి వి.కె. సారస్వత్ చెప్పారు. పూర్తి స్థాయిలో ఎప్పుడు సిద్ధమౌతోందని ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోందని, మరో ఏడాది పట్టొచ్చని ఆయన చెప్పారు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
7:13 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
నిరుద్యోగులకు సర్కారు తాయిలం
నిరుద్యోగ భృతి ఇచ్చే యోచన
యువ 'ధనం'
కనిష్టంగా రూ.500
గరిష్ఠంగా వెయ్యి రూపాయిలు
కిరణ్ మరో మానస పుత్రిక!
అమలుపై కసరత్తు మొదలు
యువతకు దగ్గరయ్యే 'పథకం'
గరిష్ఠంగా వెయ్యి రూపాయిలు
కిరణ్ మరో మానస పుత్రిక!
అమలుపై కసరత్తు మొదలు
యువతకు దగ్గరయ్యే 'పథకం'
మరో ప్రజాకర్షక పథకం పురుడు పోసుకుంటోందా? శాశ్వత ప్రయోజనాలు లేకున్నా సరే... వందల కోట్లు పోయినా సరే... నాలుగు ఓట్లు రాలితే చాలనుకునే సర్కారు కొత్తగా 'నెలనెలా పందేరం' పథకానికి శ్రీకారం చుడుతోందా? యువతను దగ్గర చేసుకునేందుకు 'నిరుద్యోగ భృతి' చెల్లింపు దిశగా అడుగులు వేస్తోందా? ప్రభుత్వ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... ఈ ప్రశ్నలకు 'ఔను' అనే సమాధానం లభిస్తోంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 28: రెండు రూపాయల కిలో బియ్యాన్ని రూపాయికి దించిన, రాజీవ్ యువకిరణాలను ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మదిలో మరో 'మానస పుత్రిక' పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న కొన్ని వర్గాలు దూరమయ్యే పరిస్థితి నెలకొనడంతో.... వారిని మళ్లీ తమవైపు తిప్పుకోవడంతోపాటు, పెద్దసంఖ్యలో ఉన్న యువతనూ దగ్గర చేసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవైపు రాజీవ్ యువ కిరణాల పేరిట కొలువుల జాతర చేపడుతూనే... మరోవైపు ఉద్యోగాలు రాని యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎవరికి, ఎంత, ఎన్నేళ్లు భృతి ఇవ్వాలనే విధి విధానాలు పూర్తిగా ఖరారు కానప్పటికీ... ఇప్పటికే ఓ స్థాయిలో కసరత్తు మొదలైనట్లు తెలిసింది. నిరుద్యోగులను మూడు వర్గాలుగా విభజించి... పదో తరగతి వరకూ చదువుకున్న వారికి నెలకు రూ.500, ఇంటర్మీడియట్ వరకూ చదివిన వారికి నెలకు రూ.750... డిగ్రీ, సాంకేతిక విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న వారికి రూ.వెయ్యి భృతి చెల్లించే యోచన ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంతమందికి?
నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమందికి భృతి చెల్లించాల్సి వస్తుందనే గణాంకాల సేకరణ ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రాజీవ్ యువ కిరణాలలో వెల్లువెత్తిన దరఖాస్తుల సమాచారం ఆధారంగా... రాష్ట్రంలో సాధారణ, సాంకేతిక విద్య అభ్యసించిన వారి సంఖ్యపై ఒక అంచనాకు వస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన సంస్థల్లో (ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లు) దాదాపు 9 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ సంఖ్య 25 లక్షలకుపైగానే ఉండేది.
ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పడిపోవడం, ఉద్యోగాలను అడపాదడపా ఏపీపీఎస్సీ ద్వారా, టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా మాత్రమే భర్తీ చేస్తుండటంతో ఉపాధి కల్పన కేంద్రాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. వీటిలో పేర్లు నమోదు చేసుకునే వారి సంఖ్య పడిపోయింది. ఇప్పుడు... నిరుద్యోగ భృతి చెల్లింపునకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్‌లలో పేరు నమోదు చేసుకోవాలనే నిబంధన విధించవచ్చు. అప్పుడు... 'నిరుద్యోగుల సంఖ్య' ఒక్కసారిగా పెరగడం ఖాయం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 13 లక్షల మంది పదో తరగతి పాస్ అవుతున్నారు. 20 లక్షల మంది ఇంటర్ గట్టెక్కుతున్నారు.
డిగ్రీ, పీజీ వంటివి 4 లక్షల మంది పూర్తి చేస్తుండగా... ఓ రెండు లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులవుతున్నారు. భృతి చెల్లింపునకు ఉపాధి కల్ప న కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవడమే ప్రాతిపదికగా భావించినా... ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగిలినవారి పేర్లన్నీ నిరుద్యోగుల జాబితాలోనే ఉండటం ఖాయం! పథకాల పరమార్థం ఎలా ఉన్నా... బోగస్ లబ్ధిదారులకు లెక్కే లేదు. ఖరీదైన కార్లు, కోట్ల రూపాయల ఆస్తులున్న వారు కూడా 'మేం నిరుపేదలం' అంటూ బియ్యం కార్డు తీసుకుంటున్నారు.
మరి... ప్రైవేటు రంగంలో వేలకొద్దీ జీతాలు తీసుకుంటున్న వారు నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోబోరని గ్యారంటీ ఏమిటి? నిఖార్సయిన నిరుద్యోగులుగా ఎవరిని గుర్తిస్తారు? ఎన్నేళ్లు భృతి చెల్లిస్తారు? ఇవన్నీ బేతాళ ప్రశ్నలే! అయితే... దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ లెక్క మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. రాజీవ్ యువకిరణాల ద్వారా 2014 నాటికి ప్రైవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని... ఖజానాపై పెద్దగా ఆర్థిక భారం పడబోదని చెబుతున్నారు.
గోవా ఫస్ట్...
మన దేశంలో మొట్టమొదటిసారిగా గోవా ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లింపు పథకాన్ని ప్రకటించింది. గత ఏడాదిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ ఈ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.1200 చొప్పున మూడేళ్లపాటు భృతి చెల్లిస్తామని తెలిపారు. ఇక మరే రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా ఇలాంటి పథకాలు లేవు.

పూవు నుంచి తేనెటీగ తేనె తీసినట్లు పన్నులు విధిస్తున్నాం.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి ‘కవితాత్మక’ వ్యాఖ్యలు
ప్రజలకు తెలియకుండానే.. పన్నులతో బాదేస్తున్నామని
పరోక్షంగా ఒప్పుకున్న కిరణ్
వికటించిన కవిత.. అచ్చ తెలుగులో మాట్లాడి అడ్డంగా దొరికిన సీఎం
పన్నులు విధించక తప్పదంటూ సమర్థించుకున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ ప్రభుత్వ ‘ఘనత’ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే చెప్పుకున్నారు.. మనకు తెలియకుండానే పన్నుల రూపంలో ప్రభుత్వం మన పర్సు కొట్టేస్తున్న విషయాన్ని శాసనసభ సాక్షిగా ఒప్పుకున్నారు.. అదీ కవితాత్మకంగా..! ప్రజలను పూవులతోనూ.. ప్రభుత్వాన్ని తేనెటీగతోనూ పోలుస్తూ..!! పూవు నుంచి తేనెటీగలు తేనె తీసినట్లు(పుష్పానికి తెలియకుండానే దానిలోని మకరందాన్ని పీల్చేయడం అన్నమాట) తాము పన్నులు విధిస్తున్నామని సీఎం సెలవిచ్చారు. ఓవైపు పన్నుల బండకేసి.. ప్రజలను చావబాదేస్తూనే.. అబ్బే అదేం లేదే.. సమ్మగానే బాదుతున్నాం అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. మంగళవారం అసెంబ్లీలో అచ్చతెలుగులో మాట్లాడదామని ప్రయత్నించిన సీఎం అడ్డంగా దొరికిపోయారు. సాధారణ బడ్జెట్ చర్చలో భాగంగా టీడీపీ సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఎడాపెడా పన్నుల భారం మోపి ప్రజలను, మరీ ముఖ్యంగా పేదలను బాదేస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్‌గా ముఖ్యమంత్రి పూవు, తేనెటీగ వ్యాఖ్యలు చేసి.. విపక్షానికి దొరికిపోయారు.
వెంటనే టీడీపీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు లేచి.. పన్నుల రూపంలో సర్కారు తమను పీల్చి పిప్పి చేస్తున్నారనే స్పృహ కూడా ప్రజలకు లేకుండా పన్నులు వసూలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అంగీకరించారంటూ కిరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘పూలు.. కనీసం పుప్పొడి కూడా దెబ్బతినకుండా తేనెటీగలు మకరందాన్ని తీసే విధంగా పన్నులు ఉన్నాయని చెప్పా. అర్థం చేసుకోవడంలో సమస్య ఉండటం వల్లే ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షం మైండ్‌సెట్ మార్చుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి పన్నులు విధించక తప్పదు’ అని వివరణ ఇవ్వడంతో సభ్యులు నవ్వుకున్నారు. ఇంతలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని.. పన్నులు విధించడానికీ పరిమితి ఉండాలని, పేదవాడిని చితక్కొట్టే విధంగా పన్నులు ఉండకూడదని సూచించారు. ‘నేను సరదాగా చేసిన వ్యాఖ్యలను కూడా ప్రతిపక్షం తట్టుకోలేకపోతోంది. ప్రతిపక్ష నేతను చూసి జాలి పడుతున్నాను’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వనందునే..
అనంతరం టీడీపీ సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వనందునే.. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పథకాలు ఆగిపోతున్నాయని ధ్వజమెత్తారు. లక్ష కోట్ల రూపాయలుపైగా బడ్జెట్ పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ‘రాజీవ్ యువకిరణాల కింద అభ్యర్థుల శిక్షణ కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) నిధులను తరలిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కాలరాయడమే. ఈ పద్ధతిని తక్షణం ఆపాలి’ అని డిమాండు చేశారు. మూడేళ్లుగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రాష్ట్రానికి పైసా కూడా రాకున్నా.. మన ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుత బడ్జెట్ మీద ప్రజలకు ఆసక్తి, ఆశలు లేవన్నారు. కరువు గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేకపోవడాన్ని తప్పుబట్టారు. ‘రాష్ట్రంలో అన్ని వర్గాలు రోడ్డెక్కాయి. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది.. అందరూ సమ్మె చేస్తున్నారు. సర్కారు తెస్తున్న అప్పులన్నీ పాత అప్పులు, వడ్డీలు చెల్లించడానికే సరిపోతున్నాయి. ఆస్తుల కల్పనకు వాటిని వినియోగించడం లేదు’ అని విమర్శించారు. జైళ్లలోని బోర్డర్లకు ఇస్తున్న ఆహారం కూడా విద్యార్థులకు ఇవ్వడంలేదని సీపీఐ పక్ష నాయకుడు గుండా మల్లేష్ దుయ్యబట్టారు. హాస్టళ్లలో కంటే జైలులో ఉండడమే మేలన్న అభిప్రాయం విద్యార్థుల్లో వస్తోందన్నారు. ఈ బడ్జెట్‌తో ప్రజా సమస్యలు పరిష్కారం కావన్నారు. నీటిపారుదల శాఖకు కేటాయించిన నిధులతో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు మరో 50 ఏళ్లైనా పూర్తికావని విమర్శించారు.
ప్రైవేట్ ఉద్యోగాలు అన్నీ మన ఖాతాలోకే..
యువ కిరణాలు పథకంపై సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వ్యంగ్యంగా ఓ కథ చెప్పారు. ‘ఓ ఊర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతుంటే.. ఓ నాయకుడు తనను సర్పంచ్‌గా ఎన్నుకుంటే ఆరు నెలల్లోగా అందరికీ ఉద్యోగాలు, విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇస్తాడు. అయితే, ఆరు నెలల తరువాత ప్రజలు వెళ్లి హామీల గురించి ప్రశ్నిస్తే... ఆ సర్పంచ్ బదులిస్తూ.. నేను సర్పంచ్‌గా ఉన్నా కాబట్టే.. మీ పిల్లలకు పెళ్లిళ్లు అవుతున్నాయి, పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అవన్నీ నావల్లే అవుతున్నాయి అని అంటాడు. అలా ఉంది యువకిరణాల సంగతి. ప్రైవేట్ సంస్థలు ఇచ్చే ఉద్యోగాలను మన ఖాతాలో వేసుకుని, అవన్నీ మేమే ఇచ్చాం అన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారు’ అని జూలకంటి అన్నారు. గొప్ప కోసమే భారీ బడ్జెట్ పెట్టారని, ఖర్చు విషయానికి వస్తే అన్ని కోతలనే వ్యాఖ్యానించారు. ఇది దిశానిర్దేశం లేని బడ్జెట్ అని అభివర్ణించారు.
చంద్రబాబుకు మతిమరుపు..
రెండోసారి గెలిస్తే మతిమరుపు వస్తుందన్నది చంద్రబాబు విషయంలో నిజమైందని ఆనం వివేకానందరెడ్డి(కాంగ్రెస్) ఎద్దేవా చేశారు. తాము మాత్రం మతిమరుపు రాకుండా ప్రజలకు సేవలందిస్తామన్నారు. టీడీపీ సభ్యులు ప్రసంగానికి అడ్డుపడతారన్న భయంతోనే తాను ముందుగా రాసుకుని వచ్చి.. ఈ విషయాన్ని చదువుతున్నానని అన్నారు. నెపోలియన్, రోనాల్డ్ రీగన్, స్వామి వివేకానంద, నెహ్రూ, గాంధీ సూక్తులను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ సభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్, వంగా గీత తదితరులు కూడా సభలో మాట్లాడారు.

బిజినెస్ మ్యాన్ 50రోజుల పోస్టర్స్
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
7:14 AM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
శ్రీలంకపై భారత్ సంచలన విజయం
హోంబర్ట్ : ముక్కోణపు టోర్నీలో భాగాంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది, సిరీస్ ఫైనల్‌లో ఆడాలంటే 40 ఓవర్లలోనే 321 పరుగులు సాధించినప్పటికీ 36.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 7 వికెట్లతో అత్యంత భారీ విజయాన్ని అందించారు. భారీ విజయంతోపాటు బోనస్ పాయింట్‌ను దక్కించుకుని ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. విరాట్ కొహ్లీ (133, 86 బంతుల్లో 16 x 4, 2 x 6) శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. సెహ్వాగ్ 30, సచిన్ 39, గంబీర్ 63, రైనా 40 రాణించారు. శ్రీలంక బౌలర్లలో మలింగ, మహరూఫ్ చెరో వికెట్ తీసుకున్నారు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
4:56 AM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
మార్చ్ 14 న 'దమ్ము' ఆడియో
యన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'దమ్ము' సినిమా ఆడియో వేడుక మార్చ్ 14 న హైదరాబాదులో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదట్లో ఈ సినిమా ఆడియోను ఉగాదికి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, షూటింగుతో బాటు అన్ని కార్యక్రమాలు వేగంగా జరుగుతుండడంతో, ఆడియో వేడుక కాస్త ముందుకు వచ్చిందట. ఇదిలా ఉంచితే, ఇటీవలే పొల్లాచ్చిలో ఓ షెడ్యుల్ జరుపుకుని వచ్చిన ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
1:58 AM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
తెలంగాణ తెరపై మళ్లీ ‘మండలి’
తెలంగాణ తెరపై మళ్లీ ‘మండలి’
ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు యోచనలో కాంగ్రెస్
రూ.15,000-20,000 కోట్లతో తెలంగాణకు ప్యాకేజీ
అమలుకు రాజ్యాంగబద్ధ అధికారాలతో మండలి.. యూపీ ఎన్నికలవగానే దృష్టి
స్వరూప స్వభావాలపై ఇప్పటికే ఓ దఫా చర్చలు!.. ఏప్రిల్‌లోగా ప్రకటనకు కసరత్తు
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి మరోసారి తెరపైకి వ స్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం, సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియగానే తెలంగాణ అంశంపై అధిష్టానం దృష్టి సారించనుందని తమకు పక్కా సమాచారమున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు చెబుతున్నారు. ప్రత్యేక మండలి స్వరూప స్వభావాలపై ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్‌లో డార్జిలింగ్ హిల్ కౌన్సిల్ తరహా పరిష్కార మార్గాన్ని తెలంగాణకు కూడా వర్తింపజేయడంలోని సాధ్యాసాధ్యాలను ఢిల్లీలోని ముఖ్య నాయకులు లోతుగా పరిశీలించినట్టు తెలుస్తోంది.
గతంలోనూ ఇలాంటి ప్రత్యేక మండళ్ల ఏర్పాటు, తర్వాత వాటి వైఫల్యం నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించబోయే ప్యాకేజీకి భారీగా నిధులు సమకూర్చడంతో పాటు కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలను కట్టబెట్టాలనే ఆలోచన ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాని ప్రకారం... వెనకబడిన తెలంగాణను అభివృద్ధి చేయడానికి రూ.15,000-20,000 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని, దాని అమలుకు కొన్ని ప్రత్యేక అధికారాలతో ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తారని సమాచారం! తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదని అధిష్టానం ఇప్పటికే నిర్ణయానికి వచ్చిందని ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసొచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే ఒకరు సోమవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఇష్టాగోష్ఠి సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేగాక, రూ.20 వేల కోట్లతో తెలంగాణ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తున్నట్టు ఏప్రిల్ తొలివారంలో ప్రకటించబోతోందని కూడా పేర్కొన్నారు! ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘట్టం మార్చి తొలి వారంతో ముగియనున్నా, మార్చి 18 న తెలంగాణలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రత్యేక ప్యాకేజీపై ఏప్రిల్ తొలివారం నాటికి నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ నేతలు గట్టిగా చెబుతున్నారు.
తెలంగాణపై ఆర్భాటంగా జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ వేసిన యూపీఏ, అది నివేదిక సమర్పించి ఇంకాలమైనా ఏ నిర్ణయమూ తీసుకోకుండా సాగదీస్తోందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దాంతో దీని నుంచి బయటపడే మార్గాంతరాలపై మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్ అధిష్టానం, అందులో భాగంగా ప్యాకేజీ-మండలి యోచనపై దృష్టి సారించినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రకటించాలని యోచిస్తున్న తరుణంలోనే యూపీని నాలుగు ముక్కలు చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. కీలకమైన యూపీ ఎన్నికల వేళ తెలంగాణకు మాత్రం ప్యాకేజీ ప్రకటించి ఆ రాష్ట్రాన్ని విస్మరిస్తే తమకు తీవ్ర నష్టం ఖాయమని ఆందోళన చెందింది. అందుకే యూపీ ఎన్నికలయ్యేదాకా ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏఐసీసీ కీలక నేత ఒకరు ఈ దిశగా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం అధిష్టానం దృష్టంతా యూపీ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. అవి పూర్తవగానే తెలంగాణపై ఓ పరిష్కార ప్రకటన చేస్తారు’ అని ఆయన వివరించారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు కూడా ఈ దిశగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ ఏర్పాటును సీమాంధ్ర నేతలు గట్టిగా వ్యతిరేకిస్తుండటంతో ప్రత్యేక రాష్ట్రం ప్రతిపాదనను అధిష్టానం పెద్దలు పూర్తిగా పక్కనపెట్టేశారు. తెలంగాణవాదులను బుజ్జగించేందుకే మరోసారి ఇలా ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి, రాజీనామాల దాకా వెళ్లి చివరికి విసిగి వేసారిన కాంగ్రెస్ నేతలు కూడా కేంద్రం ఏదో ఒక ప్రకటన చేయాలని కోరుతున్నారు’’ అని ఆయనన్నారు.
సోనియాకు ఆజాద్ ప్రత్యేక నివేదిక: రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలతో పలుమార్లు సమావేశమైన గులాంనబీ ఆజాద్ కూడా..రాజ్యాంగ, చట్టబద్ధ హ క్కులతో తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ, మండలి ప్రకటించడమే మేలంటూ సోనియాగాంధీకి ప్రత్యేకంగా నివేదిక ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణవాదంతో ఇప్పటికే తలబొప్పి కట్టిన కాంగ్రెస్ పెద్దలు కూడా దానివైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. రాష్ట్ర విభజన తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం ఏ ప్రతిపాదనకైనా తాము సిద్ధమేనని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అధిష్టానానికి పలుమార్లు లిఖితపూర్వకంగా కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను కూడా మానసికంగా సిద్ధం చేసేందుకు అధిష్టానం స్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యుల ముందు ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని పెట్టినట్టు తెలిసింది. వీటితో రాష్ట్రంలో పార్టీకి నష్టమే తప్ప లాభముండదని వారిలో కొందరన్నా, మెజారిటీ నేతలు మాత్రం ఆ ప్రతిపాదనకు అంగీకరించినట్టు తెలిసింది!
కేబినెట్ హోదా కలిగిన మరో రాష్ట్ర నేత దీనిపై ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమం ప్రబలడానికి విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులతో పాటు రాజకీయ నిరుద్యోగులు కూడా కారకులే. వీరిలో ఉద్యోగులు, విద్యార్థులు ఉద్యమాలు చేసి ఇప్పటికే చాలా నష్టపోవడంతో మళ్లీ ఆ బాట పట్టేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. ఇక నిరుద్యోగులను బిజీగా ఉంచేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 1.16 లక్షల ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. దాంతో వారంతా ఉద్యమాలను పక్కనపెట్టి పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో మునిగి తేలుతున్నారు. ఇక మిగిలిందల్లా రాజకీయ నిరుద్యోగులే. పదవుల్లేక పోవడంతో వీరంతా మిగతా వర్గాలను అడపాదడపా రెచ్చగొట్టజూస్తున్నారు. అందుకే వీరిని బుజ్జగించేందుకే ‘రూ.20 వేల కోట్లతో తెలంగాణ అభివృద్ధి మండలి’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. తద్వారా ప్రతి గ్రామానికి ఏదో ఒక అభివృద్ధి పనుల పేరిట నిధులు ఖర్చు చేయొచ్చు. అలా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడినీ బిజీగా ఉంచి, తద్వారా తెలంగాణవాదాన్ని మరుగున పడేయాలన్నదే కాంగ్రెస్ పెద్దల వ్యూహం’’అని ఆయనన్నారు!
ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు యోచనలో కాంగ్రెస్
రూ.15,000-20,000 కోట్లతో తెలంగాణకు ప్యాకేజీ
అమలుకు రాజ్యాంగబద్ధ అధికారాలతో మండలి.. యూపీ ఎన్నికలవగానే దృష్టి
స్వరూప స్వభావాలపై ఇప్పటికే ఓ దఫా చర్చలు!.. ఏప్రిల్‌లోగా ప్రకటనకు కసరత్తు
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి మరోసారి తెరపైకి వ స్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం, సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియగానే తెలంగాణ అంశంపై అధిష్టానం దృష్టి సారించనుందని తమకు పక్కా సమాచారమున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు చెబుతున్నారు. ప్రత్యేక మండలి స్వరూప స్వభావాలపై ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్‌లో డార్జిలింగ్ హిల్ కౌన్సిల్ తరహా పరిష్కార మార్గాన్ని తెలంగాణకు కూడా వర్తింపజేయడంలోని సాధ్యాసాధ్యాలను ఢిల్లీలోని ముఖ్య నాయకులు లోతుగా పరిశీలించినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి ప్రత్యేక మండళ్ల ఏర్పాటు, తర్వాత వాటి వైఫల్యం నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించబోయే ప్యాకేజీకి భారీగా నిధులు సమకూర్చడంతో పాటు కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలను కట్టబెట్టాలనే ఆలోచన ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాని ప్రకారం... వెనకబడిన తెలంగాణను అభివృద్ధి చేయడానికి రూ.15,000-20,000 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని, దాని అమలుకు కొన్ని ప్రత్యేక అధికారాలతో ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తారని సమాచారం! తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదని అధిష్టానం ఇప్పటికే నిర్ణయానికి వచ్చిందని ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసొచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే ఒకరు సోమవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఇష్టాగోష్ఠి సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేగాక, రూ.20 వేల కోట్లతో తెలంగాణ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తున్నట్టు ఏప్రిల్ తొలివారంలో ప్రకటించబోతోందని కూడా పేర్కొన్నారు! ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘట్టం మార్చి తొలి వారంతో ముగియనున్నా, మార్చి 18 న తెలంగాణలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రత్యేక ప్యాకేజీపై ఏప్రిల్ తొలివారం నాటికి నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ నేతలు గట్టిగా చెబుతున్నారు.
తెలంగాణపై ఆర్భాటంగా జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ వేసిన యూపీఏ, అది నివేదిక సమర్పించి ఇంకాలమైనా ఏ నిర్ణయమూ తీసుకోకుండా సాగదీస్తోందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దాంతో దీని నుంచి బయటపడే మార్గాంతరాలపై మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్ అధిష్టానం, అందులో భాగంగా ప్యాకేజీ-మండలి యోచనపై దృష్టి సారించినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రకటించాలని యోచిస్తున్న తరుణంలోనే యూపీని నాలుగు ముక్కలు చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. కీలకమైన యూపీ ఎన్నికల వేళ తెలంగాణకు మాత్రం ప్యాకేజీ ప్రకటించి ఆ రాష్ట్రాన్ని విస్మరిస్తే తమకు తీవ్ర నష్టం ఖాయమని ఆందోళన చెందింది. అందుకే యూపీ ఎన్నికలయ్యేదాకా ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏఐసీసీ కీలక నేత ఒకరు ఈ దిశగా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం అధిష్టానం దృష్టంతా యూపీ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. అవి పూర్తవగానే తెలంగాణపై ఓ పరిష్కార ప్రకటన చేస్తారు’ అని ఆయన వివరించారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు కూడా ఈ దిశగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ ఏర్పాటును సీమాంధ్ర నేతలు గట్టిగా వ్యతిరేకిస్తుండటంతో ప్రత్యేక రాష్ట్రం ప్రతిపాదనను అధిష్టానం పెద్దలు పూర్తిగా పక్కనపెట్టేశారు. తెలంగాణవాదులను బుజ్జగించేందుకే మరోసారి ఇలా ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి, రాజీనామాల దాకా వెళ్లి చివరికి విసిగి వేసారిన కాంగ్రెస్ నేతలు కూడా కేంద్రం ఏదో ఒక ప్రకటన చేయాలని కోరుతున్నారు’’ అని ఆయనన్నారు.
సోనియాకు ఆజాద్ ప్రత్యేక నివేదిక: రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలతో పలుమార్లు సమావేశమైన గులాంనబీ ఆజాద్ కూడా..రాజ్యాంగ, చట్టబద్ధ హ క్కులతో తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ, మండలి ప్రకటించడమే మేలంటూ సోనియాగాంధీకి ప్రత్యేకంగా నివేదిక ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణవాదంతో ఇప్పటికే తలబొప్పి కట్టిన కాంగ్రెస్ పెద్దలు కూడా దానివైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. రాష్ట్ర విభజన తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం ఏ ప్రతిపాదనకైనా తాము సిద్ధమేనని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అధిష్టానానికి పలుమార్లు లిఖితపూర్వకంగా కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను కూడా మానసికంగా సిద్ధం చేసేందుకు అధిష్టానం స్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యుల ముందు ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని పెట్టినట్టు తెలిసింది. వీటితో రాష్ట్రంలో పార్టీకి నష్టమే తప్ప లాభముండదని వారిలో కొందరన్నా, మెజారిటీ నేతలు మాత్రం ఆ ప్రతిపాదనకు అంగీకరించినట్టు తెలిసింది!
కేబినెట్ హోదా కలిగిన మరో రాష్ట్ర నేత దీనిపై ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమం ప్రబలడానికి విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులతో పాటు రాజకీయ నిరుద్యోగులు కూడా కారకులే. వీరిలో ఉద్యోగులు, విద్యార్థులు ఉద్యమాలు చేసి ఇప్పటికే చాలా నష్టపోవడంతో మళ్లీ ఆ బాట పట్టేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. ఇక నిరుద్యోగులను బిజీగా ఉంచేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 1.16 లక్షల ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. దాంతో వారంతా ఉద్యమాలను పక్కనపెట్టి పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో మునిగి తేలుతున్నారు. ఇక మిగిలిందల్లా రాజకీయ నిరుద్యోగులే. పదవుల్లేక పోవడంతో వీరంతా మిగతా వర్గాలను అడపాదడపా రెచ్చగొట్టజూస్తున్నారు. అందుకే వీరిని బుజ్జగించేందుకే ‘రూ.20 వేల కోట్లతో తెలంగాణ అభివృద్ధి మండలి’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. తద్వారా ప్రతి గ్రామానికి ఏదో ఒక అభివృద్ధి పనుల పేరిట నిధులు ఖర్చు చేయొచ్చు. అలా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడినీ బిజీగా ఉంచి, తద్వారా తెలంగాణవాదాన్ని మరుగున పడేయాలన్నదే కాంగ్రెస్ పెద్దల వ్యూహం’’అని ఆయనన్నారు!
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
Challapalli Venkateswara Rao
వద్ద
1:57 AM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
Feb 27, 2012
ఆంజనేయుల్నే పెళ్లి చేసుకుంటా:అనన్య
ఆంజనేయులే నా భర్త. ఎవరు కాదన్నా ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అని దఢ నిశ్చయంతో చెబుతోంది నటి అనన్య. కేరళకు చెందిన ఈ భామ తమిళంలో నాడోడిగళ్, శీడన్, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ బ్యూటీ కేరళకు చెందిన ఆంజనేయులు అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. పెద్దల అనుమతితో ఇటీవల వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి వేదిక కూడా నిర్ణయం అయింది. ఆ తరువాతే ఆంజనేయులు అసలు బండారం బయటపడింది.
ఆయనకు ఇంతకుముందే పెళ్లయిందని, భార్యకు కూడా విడాకులు ఇచ్చాడని తెలియడంతో అనన్య తండ్రి కోపోద్రిక్తుడయ్యారు. ఆంజనేయులుపై కొచ్చి సమీపంలోని పెరుంబావూరు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో అనన్య, ఆంజనేయుల పెళ్లి విషయం వివాదాస్పదమయింది. వీరి పెళ్లి కథ కంచికి వెళుతుందని చాలామంది భావించారు.
ఇక అసలైన ‘ట్విస్ట్’ ఏమిటంటే ఆంజనేయులు మొదటి వివాహం గురించి అనన్యకు ముందే తెలుసట. తల్లిదండ్రులు వద్దన్నా ఆయన్నే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. ఆంజనేయులుపై తన తండ్రి పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా కూడా చేసింది. దీని గురించి అనన్య మాట్లాడుతూ తమ వివాహ విషయం గురించి అసత్య ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. వదంతుల వల్ల తమ మధ్య అనుబంధం మరింత పెరుగుతుందనే విశ్వాసాన్ని అనన్య వ్యక్తం చేస్తోంది.

8:52 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
ఇది అన్నిటికన్నా గొప్ప అనుభవం: జెనీలియా
కొత్త పెళ్లికూతురు జెనీలియా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. భర్త రితేష్‌తో తాను కలిసి నటించిన ‘తేరే నాల్ లవ్ హో గయా’ చిత్రం విజయం సాధించడమే ఆమె ఆనందానికి కారణం. ఈ నెల 24న ఈ సినిమాతో పాటు ఇదే కోవకు చెందిన మరో సినిమా కూడా విడుదలైంది. అదే ‘జోడీ బ్రేకర్స్’. మాధవన్, బిపాసాబసు జంటగా నటించిన ఈ చిత్రానికి కూడా మంచి టాకే వినిపిస్తోంది. అయితే... ‘తేరే నాల్ లవ్ హో గయా’ మాత్రం పెద్ద హిట్‌గా ఆడియన్స్ నిర్ణయించారు.
అందుకు ఈ రెండు సినిమాల వసూళ్లే నిదర్శనం. ఈ కారణంగానే జెన్నీ సంబరపడిపోతున్నారు. తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంటూ- ‘‘ఎన్నో మధురమైన ఘట్టాలను నా జీవితంలో చూశాను. వాటన్నింటికంటే గొప్ప అనుభవం మా ‘తేరే నాల్...’ మూవీ హిట్ అవ్వడం. మా వైవాహిక జీవితం ఇంద్రధనుస్సులా అందంగా ఉంటుందని ఈ హిట్‌తో ఆ జీసస్ చెప్పకనే చెప్పాడు.
బాలీవుడ్‌లో చాలాకాలం తర్వాత నాకు పెద్ద హిట్ ఇది. రివ్యూస్ అన్నీ గొప్పగా వచ్చాయి. పెళ్లయిన వెంటనే విడుదలైన ఈ చిత్రం విజయం సాధించడం నా జీవితంలో మరచిపోలేని విషయం’’ అన్నారు జెన్నీ. ‘జోడీ బ్రేకర్స్’ గురించి మాట్లాడుతూ- ‘‘రెండు సినిమాలూ ఒకే జానర్‌కి చెందినవి కావడంతో ఒకదానితో మరొకటి పోల్చడం సహజమే. ‘జోడీ బ్రేకర్స్’కి క్కూడా మంచి టాక్ ఉంది. మా సినిమాతో పాటే ఆ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు జెన్నీ.

8:49 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
రైలు ప్రయాణికులపై సర్‌చార్జి వడ్డన!
రైల్వేలకు ఐదేళ్లలో రూ.2.50 లక్షల కోట్ల జీబీఎస్ కల్పించాలి
పీపీపీ ప్రాజెక్టుల ద్వారా రూ.2.30 లక్షల కోట్లు సమకూర్చుకోవాలి
న్యూఢిల్లీ, ‘సాక్షి’ ప్రతినిధి:రైల్వేల ఆధునికీకరణ కోసం దాదాపు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూర్చుకునేందుకు ప్రయాణికుల నుంచి సర్‌చార్జి వసూలు చేయాలని, రైల్వేకు చెందిన ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని శామ్ పిట్రోడా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రైల్వేల ఆధునికీకరణ కోసం సూచనలు కోరుతూ రైల్వే మంత్రి దినేష్ త్రివేదీ గత సెప్టెంబరులో పిట్రోడా నేతృత్వంలో నియమించిన ఈ కమిటీ సోమవారం ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. రైల్వేల ఆధునికీకరణకు రూ.5,60,396 కోట్లు అవసరమవుతాయని రైల్వే శాఖ అంచనా వేసింది. ఈ నిధులు సమకూర్చుకునేందుకు ప్రయాణికులనుంచి కిలోమీటర్ల లెక్కన సర్‌చార్జి వసూలు చేయాలని సూచించడంతో పాటు పిట్రోడా కమిటీ మరిన్ని సిఫారసులు చేసింది. వాటిలో ముఖ్యమైనవి...
రానున్న ఐదేళ్లలో రైల్వేలకు రూ.2.50 లక్షల కోట్ల స్థూల బడ్జెటరీ మద్దతు (జీబీఎస్) కల్పించాలి. అంతర్గత వనరుల ద్వారా రూ.2.01 లక్షల కోట్లు సమకూర్చుకోవాలి. రైల్వే భూములు, రైల్వే స్టేషన్ల వాణిజ్యీకరణ ద్వారా నిధులు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల ద్వారా రూ.2.30 లక్షల కోట్లు సమకూర్చుకోవాలి. రైల్వే శాఖ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.1.01 లక్షల కోట్ల డివిడెండుపై స్థూల బడ్జెటరీ మద్దతు కింద రూ.24 వేల కోట్ల రాయితీ ఇవ్వాలి. మిగిలిన మొత్తాన్ని లీజులు, రుణాల ద్వారా రైల్వే శాఖ సమకూర్చుకోవాలి. రైల్వే భద్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లే, రైల్వే ఆధునికీకరణ కోసం కూడా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. పీపీపీ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు వీలుగా పూర్తిగా వాటి బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రత్యేకంగా ఒక అధికారి పోస్టును సృష్టించాలి. పీపీపీ ప్రాజెక్టుల వ్యవహారంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి ఒక అంబుడ్స్‌మన్‌ను నియమించాలి. అంబుడ్స్‌మన్ నిర్ణయానికి అన్ని వర్గాలూ కట్టుబడి ఉండేలా తగిన అధికారాలు కల్పించాలి. నిర్ణీత గడువు విధించుకుని ఆధునికీకరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. హైస్పీడ్ కారిడార్లు, స్టేషన్ల అభివృద్ధి వంటి ప్రధాన ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. రైల్వే లైన్ల విస్తరణను వేగిరం చేయాలి. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 10 వేల కి.మీ. రైల్వేలైన్ల ఏర్పాటుతో పాటు 7500 కి.మీ. లైన్లను విద్యుదీకరించాలి.
రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు: మంత్రి త్రివేదీ
పిట్రోడా కమిటీ నివేదికను అందుకున్న రైల్వే మంత్రి దినేష్ త్రివేదీ, రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని మీడియాకు స్పష్టంచేశారు. రైల్వేలు పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే పనిచేస్తాయన్నారు. రైల్వేల ఆధునికీకరణ కోసం భారీ స్థాయిలో నిధులు సమకూర్చుకోవాల్సి ఉందన్నారు. అయితే, పిట్రోడా సిఫారసులను ఎప్పట్లోగా అమలు చేయనున్నారో చెప్పలేదు.

8:46 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
తెలుగుదేశం సెల్ఫ్ గోల్
శాసనసభను గత మూడు రోజుల నుంచి కుదిపివేస్తున్న మద్యం ముడుపుల వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సెల్ఫ్‌గోల్ చేసుకుందన్న అంతర్మథనం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ప్రధానంగా.. మంత్రి కన్నా, మోపిదేవి తమ అధినేత మీద విరుచుకుపడుతుంటే ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దన్నుగా రాకపోగా, పెళ్ళిళ్ల పేరిట ముఖం చాటేయడం విమర్శలకు తావిస్తోంది. చర్చను ప్రారంభించిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆది నుంచి బాబుపై అనూహ్యంగా విరుచుకుపడ్డారు. అసలు ఆరోజు సభలో కన్నానే హైలెట్‌గా నిలిచారు. గతం, వర్తమానం నాటి అంశాలను ప్రస్తావిస్తూ బాబును తూర్పారపట్టారు.
ఆయనతో పాటు మోపిదేవి కూడా టీడీపీపై విరుచుకుపడ్డారు. అయితే, కన్నా నిర్నిరోధంగా బాబుపై ఒంటికాలితో లేచినా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలెవరూ ఎదురుదాడి చేయకపోవడం, వారి బదులు బాబు-గాలి ప్రత్యారోపణలు చేయటం వల్ల తమ పక్షం ఆత్మరక్షణలో పడినట్టయిందని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు తమ పార్టీ, అధినేతపై విరుచుకుపడుతున్నప్పటికీ ధూళిపాళ్ల నరేంద్ర మినహా మరెవరూ ముందుకురాకపోవడం అటుంచి, అసలు సభలో లేకపోవడం బట్టి తమ ఎదురుదాడి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందంటున్నారు. స్వయంగా సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు ఉన్నప్పటికీ, ఆయన కూడా ఎక్కడా కనిపించకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సభ ముగిసిన తర్వాత రెండురోజులు సెలవులు వచ్చిన సందర్భంగా కనీసం జిల్లాలో కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపై ఎదురుదాడి చేయకపోవడాన్ని టీడీపీ నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
జిల్లాలో కాంగ్రెస్ నేతలతో వ్యాపార సంబంధాలు ఏ స్థాయిలో వర్ధిల్లుతున్నాయో స్పష్టమవుతోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయం అధినేతకు తెలిసినా ఏమీ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఫలితం అనుభవించవలసి వస్తోందని చెప్పారు. కన్నా చర్చ ప్రారంభిస్తారని, మాటలకు పదునుపెట్టడంతో పాటు, ప్రత్యర్థులపై రాజకీయంగా విరుచుకుపడే ఆయన ధాటికి బ్రేక్ వేయాలంటే గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ముందుండాలని, కానీ వారంతా పెళ్లిళ్ల పేరిట మాయమయ్యారని పార్టీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. సభ ముగిసిన తర్వాత రెండు రోజులు సెలవులు వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రులపై విలేకరుల సమావేశం నిర్వహించాలని సూచించినా, ఒక్కరూ నిర్వహించిన దిక్కులేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ విషయంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూడా అయిన పత్తిపాటి పుల్లారావు విఫమలయ్యారని పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. వినుకొండ వెళ్లిన ఆయన అక్కడ కనీసం మీడియా వద్ద కూడా మంత్రులపై మాట్లాడకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ జిల్లాలో కొందరు ప్రముఖులు మంత్రులు, కాంగ్రెస్ ప్రముఖులతో వ్యాపార, రాజకీయ సంబంధాలు నిర్వహిస్తున్నందుకే ఈ దుస్థితి ఏర్పడిందని, దాని ప్రభావం అసెంబ్లీలో స్పష్టంగా కనిపించిందని పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పొన్నూరు మునిసిపాలిటీలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతుదారులయిన కాంట్రాక్టర్లను పక్కకుపెడితే, నరేంద్రను ఎక్కువ మాట్లాడకుండా దారికి తెచ్చెకోవచ్చని స్వయంగా జిల్లా పార్టీ ప్రముఖుడే మంత్రి మోపిదేవికి సలహా ఇచ్చారన్న వార్తలు తమ పార్టీలో అంతర్యుద్ధాన్ని సూచిస్తున్నాయంటున్నారు. లాబీలో ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలను తీసుకువచ్చేందుకు పార్టీ నాయకులు నిర్వహించే కార్యక్రమాలను రద్దు చేసుకోమని సలహా ఇస్తున్నారని, అధికారులతో మాట్లాడి పోరాడే బదులు మంత్రులతో కార్యకర్తల ముందే ఫోన్లు చేస్తుంటే ఇక కార్యకర్తల్లో పోరాటతత్వం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా వ్యాపారాలు, రాజకీయ సంబంధాల కోసం పార్టీనే ఫణంగా పెడుతున్నా వారిపై బాబు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్ధితి నెలకొందని పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఒకరిద్దరిని వదులుకునేందుకయినా సిద్ధమేనని బాబు తరచూ చెప్పడమే తప్ప, ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంవల్లే క్రమశిక్షణారాహిత్యం పెరిగిందంటున్నారు.
కాగా, మద్యం ముడుపుల వ్యవహారంలో మంత్రి కన్నా మాట్లాడతారని ముందే తెలిసినా ఆ మేరకు సమర్ధులను ఎంపిక చేసుకోవడంలో తాము వైఫల్యం చెందామని టీడీపీ ఎమ్మెల్యేలు అంగీకరిస్తున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు సమర్థుడే అయినప్పటికీ, ఈ అంశం రాజకీయాలతో ముడిపడినందున, పార్టీ మారి వచ్చిన గాలితో మాట్లాడించడం సరైందికాదని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎకై్సజ్ మంత్రిగా చేసిన తుమ్మల నాగేశ్వరరావునో, బాగా మాట్లాడగల పయ్యావుల కేశవ్ గానీ, కన్నా జిల్లా అయినందున ధూళిపాళ్లను గానీ, ప్రత్యర్ధులపై దూకుడుగా వెళ్లే రేవంత్‌రెడ్డితో గానీ మాట్లాడిస్తే బాగుండేదంటున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం ఆ జిల్లాకు చెందిన పత్తిపాటి పుల్లారావునయినా మాట్లాడించవలసిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
కాగా, బాబు నేరుగా మంత్రులపై విమర్శలు చేయటం చేయడం సరైంది కాదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విషయం వరకూ చెప్పి, మంత్రులపై ఆరోపణలు చేసే బాధ్యతను మిగిలిన వారికి ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ‘మా సార్ తన గురించి ఎక్కువ చెప్పుకోవడం మానుకోవాలన్నది మా అభిప్రాయం. ఆయన స్థాయిలో మంత్రులపై విమర్శలు చేయకూడదు. ఆ పనిని మాలాంటి వాళ్లకు అప్పగిస్తే సరిపోతుంది. అన్నీ తానే చూసుకోవాలన్న విధానం ఇంకా మానుకోలేకపోతున్నార’ని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తొలిరోజు సభలో పైచేయి సాధించిన తాము రెండోరోజు చేతులెత్తేయడానికి వ్యూహరచన లోపమేనని అంగీకరిస్తున్నారు.

8:45 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
మిడిల్.. డ్రాప్! మనోళ్లు ధర్మ ప్రభువులు ఏసీబీ కష్టం కలం పోటుతో ఫట్
మనోళ్లు ధర్మ ప్రభువులు
ఏసీబీ కష్టం కలం పోటుతో ఫట్
అక్రమార్కులకు పెద్దల అభయం
2004-09 మధ్య 312 కేసులు నమోదు
వాటిలో 68 కేసులు డ్రాప్
మద్యం కేసుల్లో చర్యలుంటాయా!?
2004-09 మధ్య 312 కేసులు నమోదు
వాటిలో 68 కేసులు డ్రాప్
మద్యం కేసుల్లో చర్యలుంటాయా!?
'ఏసీబీ కేసు నమోదు చేసినంత మాత్రాన, ఎఫ్ఐఆర్‌లో పేరు ఉన్నంత మాత్రాన ఏమీ కాదు'... శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ వ్యాఖ్య ఇది! కేసులు, పేర్లు ఉండటం ఏం ఖర్మ! ఏసీబీ కేసు పెట్టి, ఆరోపణలపై విచారణ జరిపి, దోషిగా నిర్ధారించి, శిక్షించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసినా.... ఏమీ కాదు! ఇది నిజంగా నిజం!
హైదరాబాద్ , ఫిబ్రవరి 27 : మన ప్రభువులు ఉత్తుత్తి ప్రభువులు కాదు. అవినీతిపరులకు అభయమిచ్చే 'ధర్మ' ప్ర భువులు! అక్రమార్కులను ఒక్క కలంపోటుతో క్ష మించేస్తారు. ఏసీబీ నానా కష్టాలుపడి, కేసులు పెట్టి, దర్యాప్తు చేసి, సమర్పించే శిక్షల సిఫారసులను కళ్లుమూసుకుని మరీ చెత్తబుట్టలో పడేస్తారు. ఎన్నికల్లో ఉపయోగపడ్డారనో, పైరవీలకు పనికొస్తారనో, చెప్పింది వింటారనో... అవినీతి అధికారులపై చాలా దయ చూపించారు.
మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి... కేసుల ఎత్తివేతలో చేతికి ఎముకే లేదన్నట్లుగా వ్యవహరించారు. 2004-09 మధ్య 312 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. వీటిలో చిన్నస్థాయి ఉద్యోగులను పక్కనపెడితే... ఎమ్మార్వో, ఆపై స్థాయి అధికారులకు సంబంధించిన 68 కేసులను ప్రభుత్వం డ్రాప్ చేసింది. వారికి ఆరోపణల నుంచి విముక్తి ప్రసాదించింది. అన్నింటినీ కలిపి ఓ పదిశాతం కేసుల్లో మాత్రమే శాఖపరమైన చర్యలకు ఆదేశించింది.
మిగిలినవన్నీ డ్రాప్... డ్రాప్... డ్రాప్! వైఎస్‌కు ముందు ఇంత విచక్షణారహితంగా కేసుల ఉపసంహరణ ఉండేది కాదని ఏసీబీ అధికారులే చెబుతున్నారు. వైఎస్ హయాంలో కేసుల నమోదు, కేసుల ఉపసంహరణ రెండూ భారీగానే జరిగాయి. 2003లో అప్పటి ప్రభుత్వం వెంకటేశ్వర్లు అనే డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌పై మాత్రమే విచారణ డ్రాప్ చేసింది. ముఖ్యమంత్రిగా కిరణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఒకే ఒక కేసులో కేసు ఉపసంహరించుకున్నారు. ఆ మధ్యలో ఉన్న కాలమంతా అక్రమార్కులకు స్వర్ణ యుగమే!
ఎత్తివేతల జాతర...
2004లో ఏసీబీ 20 కేసులు నమోదు చేసింది. 2005లో 39, 2006లో 72, 2007లో 58, 2008లో 64, 2009లో 59, 2010లో 30, 2011లో ఐదు కేసులు పెట్టింది. వీటిలో నేరుగా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వారిపైనా ప్రభుత్వం చర్యలు ఉపసంహరించుకుంది. 2004లో వికలాంగులకు «ద్రువపత్రాలు ఇచ్చేందుకు లంచం పుచ్చుకున్న డాక్టర్ భాస్కరరాజుపైనా కేసు ఎత్తివేసింది. ఆపరేషన్ చేసేందుకు లంచం తీసుకున్న డాక్టర్ విజయకుమార్, కేసు నమోదు చేయకుండా లంచం అడిగిన సూర్యచంద్రరావు (సీఐ, గుడివాడ)పైనా కేసులు ఎత్తివేసింది. 2005లో నిజామాబాద్ డీఎస్పీ రాఘవ రెడ్డి, మచిలీపట్నం డీఎస్పీ మార్తాండం లంచాలు తీసుకున్నట్లు ఏసీబీ పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తేసింది.
2006లో కేసుల ఎత్తివేత 'జాతర' స్థాయిలో జరిగింది. ఎల్బీనగర్‌లో ఇంటి అప్రూవల్ ప్లాన్ కోసం లంచం తీసుకోవడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అప్పటి ఎల్బీనగర్ మునిసిపల్ కమిషనర్ జి.చంద్రశేఖర్‌పైనా కేసు ఎత్తివేశారు. 'చేయి తడపందే ఏ ఫైలుపైనా సంతకం పెట్టరు' అనే గొప్ప పేరు చంద్రశేఖర్ సొంతం. 2008లో నాగర్ కర్నూలు ఆర్డీవో కృష్ణారెడ్డి, మెట్రో వాటర్‌వర్క్స్ డీజీఎం డి.శివరాజ్, ఏపీ ట్రాన్స్‌కో టీఈ కృష్ణారెడ్డి, గుంటూరు సోషల్ వెల్ఫేర్ ఈడీ రాఘవరెడ్డి, రిజిస్ట్రేషన్‌కు లంచం తీసుకున్న ఎస్ఆర్ నగర్ రిజిస్ట్రార్ విష్ణువర్ధన్ రాజుతదితరులపై కేసులు ఉపసంహరించుకున్నారు.
2009లోనూ ఇంతే! సాగునీటి శాఖ డీఈఈ శంకర్‌నాయక్, విజయవాడ నగరపాలక సంస్థలో సిటీ ప్లానర్‌గా పనిచేస్తున్న వెంకటరత్నం, అల్వాల్ మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, కాప్రా టీపీఎస్ సురేష్ చంద్రారెడ్డి, హైదరాబాద్‌లో టీపీవో రమేశ్ బాబు, వరంగల్ పంచాయతీ రాజ్ సీఈవో ఎస్. రాజయ్య, ఆర్ఆండ్‌బీ ఈఈ సీహెచ్. రామారావులపై కేసులను ఉపసంహరించుకున్నారు. 2010లో 30 కేసులు నమోదుకాగా... అందులో ఎనిమిదింటిని ప్రభుత్వం ఎత్తివేసింది. 2011లో 5కేసులు నమోదుకాగా.. ఒక్కదానిని ఉపసంహరించుకున్నారు.

8:43 PM
No comments:
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది
| ప్రతిక్రియలు: |
Subscribe to:
Posts (Atom)

23-2-12-18437.jpg)