Apr 14, 2012

ప్రభుదేవా నాకు మాటిచ్చారు



ఏప్రిల్ 3 ప్రభుదేవా పుట్టినరోజు. ఈ సందర్భంగా చెన్నయ్‌లో పెద్ద పార్టీ జరిగింది. ఆ పార్టీలో త్రిష స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఆ పార్టీలో ఆమె బాగా అల్లరి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. బర్త్‌డే బోయ్ ప్రభుదేవాను పొగడ్తలతో ముంచెత్తారు త్రిష. ‘‘నా జీవితంలో మరచిపోలేని హిట్‌ని ఇచ్చారు ప్రభుదేవా. అందుకే ఆయనంటే నాకు ఇష్టం. అంతేకాదు... ఆయన ముక్కుసూటి మనిషి. మాట మీద నిలబడతారు. ఏదైనా మాట ఇచ్చారంటే తప్పరు’’ అంటూ తెగ పోగిడేశారు త్రిష.

ఇంతకీ ప్రభుదేవా మీకిచ్చిన మాటేంటి? అనడిగితే -‘‘ఆయన దర్శకత్వంలో మళ్లీ నటించాలనేది నా కోరిక. ఆ కోరికనే ఆయన ముందు వ్యక్తపరిచాను. ‘‘తప్పకుండా చేద్దాం’’ అన్నారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో ‘సిరి’ పాత్ర నా నటజీవితానికే మేలి మలుపు. అలాంటి మరో పాత్రను నాకిస్తానని ఆయన మాటిచ్చారు’’ అని ఆనందంతో చెప్పారు త్రిష. పెళ్లి చేసుకుంటానని నయనతారకు మాటిచ్చి, అలాంటి ముఖ్యమైన విషయంలోనే మాటతప్పిన ప్రభుదేవా... త్రిషకిచ్చిన ఈ చిన్న మాటకు ఎటువంటి ప్రాముఖ్యతను ఇస్తాడో... వేచి చూడాలి అని అక్కడున్నవారందరూ చెవులుకొరుక్కున్నారట.

No comments:

Post a Comment