పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గబ్బర్‌సింగ్'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వం వహిస్తున్నారు. శివబాబు బండ్ల సమర్పిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. ఈ నెల 15న పాటలను విడుదల చేయనున్నారు. గణేష్ మాట్లాడుతూ "గ్రాండ్‌గా పాటల్ని విడుదల చేస్తాం. 15న ఉదయం పవన్‌కల్యాణ్‌గారు స్పెషల్ ఫ్లైట్‌లో తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని అభిమానుల్ని కలుసుకుంటారు. వైజాగ్, సింహాచలంలో కూడా దైవదర్శనం చేసుకుని అభిమానుల్ని కలుసుకుంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్‌గా జరిగే 'గబ్బర్‌సింగ్' ఆడియో ఫంక్షన్‌లో పాల్గొంటారు'' అని అన్నారు. శ్రుతిహాసన్ నాయిక.
No comments:
Post a Comment