Apr 10, 2012

'ఎందుకంటే ప్రేమంట' లోగో ఆవిష్కరణ



రామ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'ఎందుకంటే ప్రేమంట'. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ కృష్ణ చైతన్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. రాజమౌళి లోగోను ఆవిష్కరించారు. రాజమౌళి మాట్లాడుతూ "హృద్యమైన ప్రేమ కథల్ని తెరకెక్కించడంలో కరుణాకరన్ మార్కు వేరు. ముఖంపై చెరగని చిరునవ్వుతో సినిమాని చూడొచ్చు. ఈ సినిమా చూడ్డానికి నేను ఆసక్తికరంగా వేచి చూస్తున్నాను'' అని తెలిపారు.

కరుణాకరన్ చెబుతూ "నేను రవికిశోర్‌గారికి సింగిల్ లైన్ చెప్పాను. పూర్తి కథ అయ్యే వరకు వెయిట్ చేశారు. ఆండ్రూతో పాటు నా టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు. రాజమౌళిగారిని నేను ఫాలో అవుతాను. ఆయన హార్డ్‌వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి '' అని తెలిపారు. రామ్ చెబుతూ "టాలీవుడ్ స్ప్రైట్ మా తొలి ఫంక్షన్‌కి రావడం ఆనందంగా ఉంది. మా టీమ్ లీడర్ కరుణాకరన్ మంచి వ్యక్తి. ఆయన అంత కూల్‌గా ఉండబట్టే సినిమా షూటింగ్ బాగా జరిగింది.

కరుణాకరన్‌తో 'రెడీ' తర్వాత ఓ సారి, 'గణేష్' తర్వాత ఓ సారి చేయాల్సింది. చివరికి ఇప్పుడు కుదిరింది'' అని తెలిపారు. తమన్నా చెబుతూ "పర్ఫెక్ట్ పేరింగ్ మాది. స్విట్జర్లాండ్‌లో 30 రోజులు షూటింగ్ చేశాం. కెమెరామెన్ ఆండ్రూ తెరపై మనుషులను ఫ్లవర్స్ లా చూపిస్తారు '' అని తెలిపారు. కోన వెంకట్ మాట్లాడుతూ "రామ్‌కి పరిశ్రమలోనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓ సంఘటనకి సమాధానమే ఈ ప్రేమ'' అని అన్నారు. మంచి సినిమాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారని స్రవంతి రవికిషోర్ చెప్పారు.

No comments:

Post a Comment