"రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు బడి పిల్లల కంటే ఘోరంగా ఢిల్లీలో క్లాసు తీసుకొన్నారు. సీఎం, బొత్స తెలుగువారి పరువు తీశారు. వారికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా సోనియా అవమానించారు'' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దుయ్యబట్టారు. శుక్రవారం ఇక్కడి ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీ నేతలకు గులాంగిరీ చేసి పదవులు నిలబెట్టుకోవడానికే కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు సరిపోతోందని ఆయన విమర్శించారు.
ఢిల్లీ నుంచే రిమోట్‌తో రాష్ట్ర పాలన జరుగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దుకాణం మూతపడే పరిస్థితిలో ఉందనడానికి ఈ పరిణామాలు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌తో బేరం కుదుర్చుకొనే ప్రయత్నంలో ఉన్న జగన్ కేవలం టీడీపీని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. "తాము అధికారంలోకి వస్తే ఎమ్మార్, రహేజా సంస్థల ఒప్పందాలు రద్దు చేసి వాటికి ఇచ్చిన భూములను వెనక్కు తీసుకొంటామని నాడు వైఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పదేపదే ప్రకటనలు చేశారు.
సీఎం అయిన తర్వాత మాట మార్చేసి.. వాటికి ఎర్ర తివాచీ పరిచారు. ఏం ముఖం పెట్టుకొని జగన్ మా గురించి మాట్లాడుతున్నారు? కేజీ బేసిన్‌లోని గ్యాస్ కేటాయింపు వేలం పాటలో మేం పాల్గొనలేదని.. రిలయన్స్‌కు మేలు చేశామని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ వేలం పాటల్లో పాల్గొన్న గుజరాత్ కంపెనీ రూ. 17 వేల కోట్లు నష్టపోయింది. వీటిలో పాల్గొనడానికి ప్రత్యేకంగా కంపెనీ పెట్టిన రాజశేఖరరెడ్డి ఆ విషయం అర్థమై.. దానికి పైసా ఇవ్వకుండా పక్కన పడేశారు.
జగన్ ఏవేవో మాట్లాడతారు గానీ.. తనకు లక్ష కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పరు. వైఎస్ హయాంలోని ఏ ఫైలును కదిలించినా పాపాల పుట్టలు బద్దలవుతున్నాయి. కాగ్ నివేదిక, సీబీఐ చార్జిషీట్లు, ఏసీబీ విచారణలు, విజిలెన్స్ విచారణలు... దేనిని చూసినా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని జగన్ అండ్ కో ఎంతెంత సంపాదించారో పేజీలకు పేజీలు ఉంటున్నాయి'' అని చంద్రబాబు అన్నారు.
ఇక, తానేమీ తక్కువ తినడం లేదని నిరూపించుకొనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కూడా ఉన్నారని, పోలవరం టెండర్లు మొదలుకొని ఎర్ర చందనం అక్రమ రవాణా వరకూ ఆయన ప్రమేయం లేని వ్యవహారం కనిపించడం లేదని విమర్శించారు. విజయనగరం జిల్లాలో తెల్లకార్డు ఉన్న పేదలు కోట్ల రూపాయలు వెచ్చించి వైన్ షాపులు పెట్టడం ఎలా సాధ్యమని రాష్ట్రం అంతా విస్తుపోతుంటే వారి తెల్ల కార్డులు తీసివేయాలని బొత్స సిగ్గులేకుండా చెబుతున్నారని మండిపడ్డారు. ఆత్మహత్యలపై ఆందోళన తెలంగాణ ఆత్మహత్యలపై చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
యువకులు, విద్యార్థులు మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. "తెలంగాణ అంశం తేలడంలో టీడీపీ పాత్ర లేదు. కాంగ్రెస్ పార్టీయే నిర్ణయం తీసుకోవాలి. మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఆ విషయాన్ని అనేకసార్లు చెప్పాం. పార్టీని కాపాడుకొంటూనే తెలంగాణ కోసం ఇంకా ఏం చేయాలన్నదానిపై ఆలోచన చేస్తున్నాం. దీనిపై మా పార్టీ నేతలతో చర్చలు జరిపాం. మళ్ళీ మాట్లాడతాం. ఏం చేయాలో ఆలోచిస్తాం'' అని పేర్కొన్నారు.
మే నెలాఖరులో టీడీపీ మహానాడు
తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడు కార్యక్రమం ఖరారైంది. పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో షెడ్యూల్‌ను ఆమోదించారు. మే 27 నుంచి 29వ తేదీ వరకూ మహానాడు గండిపేటలోగల ఎన్టీఆర్ ఆశ్రమంలో జరుగుతుంది. రెండేళ్ళకు ఒకమారు జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కూడా ఈ నెలలో మొదలు పెట్టనున్నారు.
ఈ నెల 16నుంచి 26వ తేదీ వరకూ అన్ని జిల్లాల్లో గ్రామ కమిటీల ఎన్నికలు జరుగుతాయి. దానికి ముందు గ్రామ కమిటీల ఎన్నికలు నిర్వహించే పార్టీ నేతలకు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో ఈ శిక్షణ కార్యక్రమం చేపడతారు. మే 21 నుంచి 23వ తేదీ వరకూ జిల్లా కమిటీలు, జిల్లా అనుబంధ కమిటీల ఎన్నికలు జరుగుతాయి.
తలసాని డుమ్యా
హరికృష్ణ, మైసూరా హాజరు
జనరల్ బాడీ సమావేశానికి.. పార్టీ నేతలు హరికృష్ణ, మైసూరారెడ్డి హాజరయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాత్రం గైర్హాజరయ్యారు. పార్టీపై తన వ్యాఖ్యలతో ఇటీవల కలకలం రేగించిన.. హరికృష్ణ ముందుగానే వచ్చి వేదికపై కూర్చున్నారు. చంద్రబాబు మొదటి వరుసలో కూర్చుంటే.. హరికృష్ణ రెండో వరుసలో కూర్చున్నారు.
పక్కనే ఉన్న కాల్వ శ్రీనివాస్‌తో హరికృష్ణ కులాసాగా కబుర్లు చెబుతూ.. ఉత్సాహంగా కనిపించారు. రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ కాకపోవడంతో మైసూరా పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. దానికి భిన్నంగా ఆయన ఈ సమావేశానికి వచ్చారు. పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాత్రం ఈ సమావేశానికి రాలేదు.
రాజ్యసభ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై తలసాని వ్యతిరేకతతో ఉన్న విషయం తెలిసిందే. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కుమార్తె వివాహం కూడా హైదరాబాద్‌లో శుక్రవారమే ఉండటంతో.. ఈ సమావేశానికి పార్టీ సీనియర్లు పెద్ద సంఖ్యలో వచ్చారు.

No comments:
Post a Comment