మొహాలి : ఐపీఎల్-5 టీ20 ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పుణే వారియర్స్ ఇండియా జట్టు 19 ఓవర్లకే 115 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కింగ్స్ ఎలెవన్ జట్టు 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్ జట్టులో మార్ష్ 64 పరుగులతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా పుణే వారియర్స్‌కు ఇది తొలి ఓటమి.
No comments:
Post a Comment