‘‘మీ అభిప్రాయం కరెక్టే. నేను ముందులా లేను’’ అంటున్నారు అమలాపాల్. తమిళ చిత్రం ‘మైనా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ మలయాళ సుందరి. ఆ చిత్రంలో పల్లెపడుచు పాత్ర చేశారామె. అందులో అమలా కనబర్చిన నటనను సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా మెచ్చుకున్నారట. తనకంత పేరు తెచ్చిపెటింది మైనా పాత్ర. కానీ ఇప్పుడు మాత్రం అమలాపాల్ అలాంటి పాత్రలు చేయడంలేదు. గ్లామర్ బాటలో సాగుతున్నారు. ఎందుకలా? అని అడిగితే.. పై విధంగా స్పందించారామె.
పాత్రల ఎంపిక విషయంలో తనలో మార్పొచ్చిన విషయం నిజమేనని అమలాపాల్ చెబుతూ, ‘‘సినిమా విజయానికి కావల్సిన అంశాల్లో ‘గ్లామర్’ ఒకటి. సినిమా సక్సెస్ కోసం హీరోయిన్లు గ్లామర్‌గా నటించాల్సి ఉంటుంది. అందులో తప్పు లేదు. నేను గ్లామరస్ రోల్స్ చేస్తే ప్రేక్షకులకు నచ్చదేమోనని భయపడ్డాను. కానీ నన్ను ఆశ్చర్యపరుస్తూ.. వాటిని కూడా ఆదరించారు. అందుకని అలాంటి పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నాను. ఇతర నాయికల విషయానికొస్తే.. నాకెంతో ఇష్టమైన అనుష్క గురించి చెప్పుకుందాం. అనుష్క ఎన్నో గ్లామర్ పాత్రలు చేస్తుంటారు.
అలాగే ‘అరుంధతి’లాంటి నటనకు అవకాశం ఉన్న పాత్రను కూడా చేశారు. ఇక, కాజల్ అగర్వాల్‌ని తీసుకుందాం. ఆమె కూడా గ్లామరస్ రోల్స్ చేస్తుంటారు. తమిళ చిత్రం ‘నాన్ మహాన్ అల్ల’లో సింపుల్ గాళ్‌గా కనిపించారు. అలాగే త్రిష గురించి చెప్పుకుంటే... గ్లామర్‌తో పాటు ‘విన్నైత్తాండి వరువాయా’లో జెస్సీలాంటి పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు కూడా చేశారు. వీళ్లందరూ చేస్తున్న పాత్రలను పరిశీలించిన తర్వాత ఇటు గ్లామర్ అటు పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలు చేయాలనే విషయం నాకు స్పష్టమైంది’’ అని చెప్పారు.

No comments:
Post a Comment