10-4-12-22177.jpg)
తారకరత్న, అర్చన, కృష్ణుడు ప్రధాన తారాగణంగా వీరు. కె. దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆర్.ఎ.ప్రొడక్షన్స్ పతాకంపై జాని నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా జాని, వీరు.కె. మాట్లాడుతూ ఈ నెల 15 లేదా 16న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.
లవకుశలో ఎన్.టి.రామారావు, బాలరామాయణంలో జూనియర్ ఎన్.టి.ఆర్., శ్రీరామరాజ్యంలో బాలకృష్ణ... రాముడి పాత్రను పోషించి, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారని, వారి కోవలోనే తారకరత్న ఈ చిత్రంలో రాముడిగా కనిపించనుండటం ఓ విశేషం అన్నారు.
కలియుగ సీతగా అర్చన, రావణాసురుడిగా కృష్ణుడు కనిపిస్తారని, గతంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రంలో గోపాలంగా నటించిన నరేష్ అదే పాత్రను ఈ చిత్రంలో కొనసాగిస్తూ, సూపర్‌స్టార్ కృష్ణ పాటలకు డ్యాన్స్ చేసి అలరిస్తారని చెప్పారు.
No comments:
Post a Comment