Apr 3, 2012

‘గాలి’ కస్టడీ పొడిగింపు

బెంగళూరు, న్యూస్‌లైన్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ల జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 7వ తేదీ వరకు పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ర్టంలో అక్రమ మైనింగ్ ఆరోపణలపై అరెస్టయిన వారిద్దరి కస్టడీని పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను న్యాయమూర్తి బీఎం. అంగడి అంగీకరించారు. ఇదిలా ఉండగా, తమకు బెయిల్ మంజూరు చేయాలన్న జనార్దనరెడ్డి, అలీఖాన్‌ల అభ్యర్థనను న్యాయమూర్తి ఈ నెల 7న పరిశీలించనున్నారు. ప్రస్తుతం వారిద్దరూ బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment