రామ్ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం మొదలైంది. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రూపొందిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. మల్టీ డైమన్షన్ రజిత్ పార్థసారథి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి స్రవంతి రవికిషోర్ క్లాప్‌నిచ్చారు. బి.గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ "కందిరీగకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అంతకు రెండింతలు యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్ళుంటాయి.
రామ్ పాత్రచిత్రణ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అన్ని వాణిజ్య అంశాలు మేళవించిన పక్కా మాస్ చిత్రమిది'' అని అన్నారు. బెల్లంకొండ సురేష్ చెబుతూ "ఏడాది తిరక్కుండానే 'కందిరీగ' టీమ్‌తో మరలా పనిచేయడం ఆనందంగా ఉంది. వినోదం, యాక్షన్, సెంటిమెంట్ మేళవించిన కథాంశమిది. రామ్ బాడీలాంగ్వేజ్‌కు తగినట్టుగా దర్శకుడు సబ్జెక్ట్‌ను తీర్చిదిద్దాడు. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది'' అన్నారు. సంతోష్‌శ్రీనివాస్‌తో మరలా పనిచేయడం ఆనందంగా ఉందని రామ్ అన్నారు. 'కందిరీగ' టీమ్‌తో ఈ చిత్రం చేయడం హర్షదాయకమని మల్టీడైమన్షన్ వాసు తెలిపారు.
సోనూసూద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, రఘుబాబు, సాయాజీ షిండే, యం.యస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి, హేమ, సురేఖావాణి, సప్తగిరి, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎ.యస్.ప్రకాష్, ఫైట్స్: గణేష్, రామ్-లక్ష్మణ్, రచనా సహకారం: అనిల్ రావిపూడి, సంగీతం: థమన్. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.మహేంద్రబాబు, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.

No comments:
Post a Comment