Apr 14, 2012

సినీతారల వృత్తిలో భార్యల పాత్ర


బాలీవుడ్గలో ఇటీవలే ఒక సరికొత్త ట్రెండ్గ ఊపందుకుంది. పెళ్లి కాని హీరోల కంటే పెళ్లరుున హీరోల సినిమాలు భారీ స్థారుులో హిట్‌లుగా నిలుస్తున్నారుు. ఈ ఫార్ములా తమేకమైనా పనికొస్తుందేమోనని కథానాయకులు జాన్‌ అబ్రహవ్గు, షాహిద్‌ కపూర్‌లు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారట. నిజంగా పెళ్ళి చేసుకుంటే భారీ హిట్‌ చిత్రాలు వస్తాయా అనే చిత్రమైన ఆలోచనే ఈ నాటి ధీర ప్రత్యేక కథనం. ఆమీర్‌ ఖాన్‌, షారుఖ్‌, సంజయ్‌, వంటి కథానాయకుల జీవిత భాగస్వామ్యులు ఏ విధంగా తమ తమ భర్తల హిట్‌లో కోసం ప్రయత్నిస్తున్నారో కూడా తెలసుకుందాం.

కాజోల్‌
Kajol90వ దశకం నుంచి నేటికీ బాలీవుడ్‌ టాప్‌ కథానాయికలలో ఒకరిగా అభిమానుల హృదయాలలో గూడు కట్టుకున్న గువ్వ కాజోల్‌. తన పని తాను చేసుకుంటూ వెళ్లే రుషి లాంటి అజేయ్‌ దేవ్‌గన్‌ను ప్రేమ వివాహం చేసెకుంది. వీరిద్దరి ప్రేమకథ తెలిసిన వెంటనే వీరి కాంభినేషన్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. అవన్నీ హిట్‌ కావడం విశేషం. అయితే సింఘం చిత్రం తరువాత అజయ్‌ దేవ్‌గన్‌లోని యాక్షన్‌ హీరొయిజం మళ్లీ బయటికి రావడం వల్ల మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇంతకు ముందు కేవలం కాట్య్సూమ్స్‌ వరకే పరిమితమైన కాజోల్‌...ప్రస్తుతం అజయ్‌ కథానాయికలతో ఏ విధంగా మూవ్‌ అవుతున్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందట. అజయ్‌ నటిస్తున్న సన్‌ ఆఫ్‌ సర్దార్‌ చిత్రాన్ని కాజల్‌ చెల్లెలు తనీషా సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది.ఇక అజయ్‌ గురించి అప్‌డేట్స్‌ ఎవరందిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా?

గౌరీ ఖాన్‌
Gauriషారుఖ్‌ ఖాన్‌ బాలీవుడ్‌ బాద్షా అయినా, ప్రేక్షకుల పాలిట డాన్‌ అయినా ఇంట్లో మాత్రం ఒక మామూలు వ్యక్తిలాగే ప్రవర్తిస్తాడట ్‌. వీరి ప్రేమ వివాహం తరువాత షారుఖ్‌ ఖాన్‌ ఖాతాలో భారీ విజయాలు చేరాయి. ఈ విజయాలలో గౌరీ వాటా కూడా ఉందట. ఎందుకంటే షారుఖ్‌ సినిమా కథలను ఎంచుకోవడంలో గౌరీ కూడా తోడ్పడుతుందట. అంతే కాకుండా అతనిపై వచ్చే పుకార్లలో నిజం ఎంతో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందట. గతేడాది విడుదలైన రా.వన్‌ చిత్రీకరణ సందర్భంలోనూ గౌరీ అతని వెంట ఉండి కాట్య్సూమ్స్‌ నుంచి డైలాగ్స్‌ వరకు అన్ని విషయాలో జోక్యం చేసుకుందట. షారుఖ్‌ నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీ బాధ్యతలను నిర్వస్తూ జీవిత భాగస్వామిగా తన పాత్రను పోషిస్తుంది.

కిరణ్‌ రావు
Kiranకిరణ్‌ రావును ఆమీర్‌ ఖాన్‌ సతీమణిగా కాకుండా ఆమెను ఒక దర్శకురాలిగా, స్క్రీన్‌రైటర్‌గా,డైరక్టర్‌గా ప్రస్తావించాలి. ఎందుంటే ఆమె తన వృత్తి విషయంలో తన భర్త ఆమీర్‌తో కూడా కొన్ని విషయాలలో ఏకీభవించదు. అంతే కాకుండా ఆమీర్‌ చిత్రాల కథల ఎంపిక విషయంలో కూడా ఆమె జోక్యం చేసుకుం టారని వినికిడి. ‘లగాన్‌’ చిత్రంలో కిరణ్‌రావు దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌కు సహాయక దర్శకురాలిగా చేస్తున్న సమయంలో ఆమీర్‌-కిరణ్‌ల మధ్య లవ్‌కుదిరి. 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్‌ రావు అనే కుమారుడు కూడా ఉన్నాడు. లగాన్‌ చిత్రంలో అసిస్టెంట్‌ డైరక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభిం చిన కిరణ్‌ తరువాత..‘స్వదేశ్‌’ చిత్రానికి కూడా సహాయ దర్శకురాలుగా పని చేశారు. ధోబీ ఘాట్‌ చిత్రానికి ఆమె దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి స్క్రీన్‌రైటర్‌గా కూడా ఆమెనే.

య ఈ చిత్రం అమీర్‌ ఒక ఒక చిత్రకారుడి పాత్రలో కనిపిస్తారు. ధోబీ ఘాట్‌ చిత్రం మంచి ప్రేక్షకాధరనను సంపాదించింది. ఆమీర్‌ నటించిన ‘తారే జమీన్‌ పర్‌’ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించారు.ఆమీర్‌ మేనళ్ళుడు ఇర్ఫాన్‌తో ‘డెల్లీ బెల్లీ’ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం ఒక ట్రెండ్‌సెట్టర్‌ చిత్రంగా నిలిచింది.

మానయతా దత్‌
Manబాలీవుడ్‌ కల్నాయక్‌ సంజయ్‌ దత్‌ జీవిత భాగస్వామి మానయతా. తన కవల పిల్లలు ఇఖ్రా...షహ్రాన్‌లతో కలిసి షూటింగ్‌లోకి వెళ్తుందట. తన భర్త ప్రొడక్షన్‌ హౌజ్‌ను బాధ్యతలను నిర్వహిస్తూ..సంజయ్‌ దత్‌ తరపున చారిటీ సంస్థలను కూడా సేవలను అందింస్తుంది. ఆమె వచ్చాకే సంజయ్‌ జీవితంలో విజయాల శాతం పెరిగిందని బాలీవుడ్‌ వర్గాల భావిస్తున్నారు.

No comments:

Post a Comment