Apr 14, 2012

నయనానుష్కల పోటీ!


nayanసినిమా రంగం అంటేనే పోటీ ప్రపంచం. అందులో హీరోయిన్లకైతే ఓ పక్క వయసు, అందం, అభినయం ఇలా అన్ని విషయాలలోనూ పోటీ అనేది సర్వసహజం. ఆల్రెడీ అనుష్క ఉత్తమ నటిగా ప్రూవ్‌ చేసుకుంది అనేక సం దర్భాలలో. ఆమెతో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని కూడా తీయొచ్చని ‘అరుంధతి’ విజయం నిరూపించింది. దీనితో సహజంగానే నిర్మాతల దృష్టి అనుష్కపై పడింది. ప్రస్తుతానికి లేడీ ఓరియెండెడ్‌ చిత్రాలను తీయాలంటే అనుష్కను మించిన తార లేదు అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా తెరపైకి నయనతార వచ్చింది. ఇక ప్రభుదేవాతో పెళ్లిచేసుకుని సినిమా రంగం నుంచి వెళ్లిపోతుందనుకునే సమయానికి మెల్లి గా నయనతార మళ్లీ సినిమాలలో నటిసు ్తన్నానంటూ బాంబు పేల్చింది.

అయితే నయనతార రాకతో ఎక్కువగా నష్టపోయేది అనుష్కేనని సినీ వర్గాలు అనుకుం టున్నాయి. దానికి తోడు అసంకల్పితంగా ఇద్దరికీ ఒకటే పాత్ర చేయాలంటూ ఒత్తిడి వస్తోంది. హిందీలో సూపర్‌ హిట్టయిన ‘డర్టీపిక్చర్‌’ను మొన్న టిదాకా అనుష్కతో చేద్దామనుకున్న నిర్మాతలు ఇప్పుడు నయనతారను తెరపైకి తీసుకువచ్చారు. ఇదిగాక గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘రుద్ర మదేవి’ చారిత్రక సినిమాకు కూడా అనుష్కని పెట్టాలా లేక నయనతారనా అనేది తేల్చుకో లేకపో తున్నారట. అలాగే గోపీచంద్‌ లేటెస్ట్‌ మూ వీలో సైతం అనుష్క స్థానంలో నయనతార వచ్చి చేరింది. ఇలా అనుష్క నటించే సినిమాలకు నయనతార విలన్‌గా మారడం గమనార్హం.

No comments:

Post a Comment