Apr 9, 2012

గోపీచంద్ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి


గోపీచంద్ కథానాయకుడిగా, నయనతార నాయికగా జయ బాలాజీ రియల్ మీడియా ప్రై. లిమిటెడ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. భూపతి కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. కొమర వెంకటేష్ సమర్పిస్తున్నారు. తాండ్ర రమేష్ నిర్మాత. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. చిత్ర సమర్పకుడు కొమర వెంకటేష్ మాట్లాడుతూ "గోపీచంద్ ఐపీయస్ అధికారిగా నటిస్తున్నారు. పూర్తి కమర్షియల్ విలువలతో చేస్తున్న చిత్రమిది. మార్చి 19నుంచి ఈ నెల 7 వరకు తొలి షెడ్యూల్ చేశాం. 

గోపీచంద్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని భూపతి కథను సిద్ధం చేసుకున్నారు. నయనతార మంచి పాత్ర పోషిస్తున్నారు'' అని అన్నారు. నిర్మాత తాండ్ర రమేష్ చిత్ర విశేషాలను వెల్లడిస్తూ "ఏప్రిల్ 25 నుంచి రెండో షెడ్యూల్ మొదలుపెడతాం. మే 20 వరకు చేస్తాం. ఈ షెడ్యూల్‌లో టాకీతోపాటు రెండు పాటల్ని కూడా చిత్రీకరిస్తాం. జూన్‌లో విదేశాల్లోని సుందరమైన ప్రదేశాలలో పాటలను తెరకెక్కిస్తాం. మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ విషయంలోనూ రాజీపడకుండా రూపొందిస్తున్నాం'' అని అన్నారు. కోట శ్రీనివాసరావు, రఘుబాబు, సాయాజీ షిండే, నాజర్, టార్జాన్, అషుతోష్ రాణా తదితరులు ఇతర పాత్రధారులు.

ఈ చిత్రానికి సంగీతం: తమన్, మాటలు: యమ్.రత్నం, కెమెరా: శక్తి శరవణన్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: కొమర వెంకటేష్, నిర్మాత: తాండ్ర రమేష్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: భూపతి.

No comments:

Post a Comment