హైదరాబాద్, మేజర్ న్యూస్: పీసీసీ చీఫ్ బొత్స మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే మద్యం వ్యవ హారంలో నిండా మునిగిన ఆయన కొత్తగా ఏిసీబీ అధికారి బదలీ వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సీఎం, బొత్సల వ్యవహారం రాజకీయాల్లో శాశ్వత శత్రువు లు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను మరోసారి కళ్ళ కు కడుతోంది. మద్యం సిండికేట్ వ్యవహారంలో ిసీఎం, పీసీసీ చీఫ్ రహస్య రాజీ ఒప్పందంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం హెచ్చరికల నేప థ్యంలో ఇరువురు నేతలు తమ మధ్య నెలకొన్న విభేదా లను పక్కనపెట్టి తాత్కాలికంగా కుదుర్చుకొన్న ఒప్పందం, ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోంది.ఈ రాజీ ఒప్పందంలో భాగంగానే ఏసీబీ ఐజీ, సిట్ అధిపతి శ్రీని వాస్‌రెడ్డి బదిలీ జరిగిందన్న కోణంలో విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. విజయనగరం జిల్లాలో మద్యం సిండికేట్ వ్యవహారంలో బొత్సను టార్గెట్ చేస్తూ ఏసీబీ ఐజీ శ్రీని వాస్‌రెడ్డి నివేదిక రూపొందించేందుకు కిందిస్థాయి అధికా ర్లపై ఒత్తిడిచేశారన్న వార్తలొచ్చాయి. ిసీఎం ప్రోద్భ లంతో నే శ్రీనివాస్‌రెడ్డి ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని బొత్స భావించినట్లు సమాచారం. కాగా శ్రీనివాస్‌రెడ్డిపై సీఐ గణేష్ చేత పరువునష్టందావా కేసు వేయించారన్న ప్ర చారం ఊపందుకొంది. ఈ వ్యవహారంలోనే సీఎం, పీసీసీ చీఫ్ మధ్య విభేదాలు మరింత వెడెక్కాయి. దీనితో పార్టీ అధిష్ఠానం ఇరువురిని హుటాహుటినా ఢిల్లీకి పిలిపిం చింది. కానీ ఈ లోపే మద్యం సిండికేట్ కేసుల వ్యవహా రంలో కిరణ్, బొత్సల మధ్య రాజీ కుది రిందని, అందు లో భాగమే శ్రీనివాస్ రెడ్డి బదిలీ జరిగిం దన్న ప్రచారం ఊపందుకొంది.
మొదట్లో రాజకీయరం గంలో తనకు పోటీగా ఎదుగుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు బొత్సను, సీఎం కిరణ్ లిక్కర్ వ్యవహారంలో ఇబ్బందులు పెడుతున్నా రనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన సంగతి తెలిసిందే. స్వయంగా బొత్స ఈ ఆరో పణలపై సీఎంను బెదిరించానని చెప్పుకున్నారు. నీ అంతు చూస్తా అని ఫోన్‌లో సీఎంను బొత్స బెదిరించాడని వార్తలు గుప్పుమన్నాయి. అంతలోనే ఇద్దరిమద్యా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. పరస్పరం కత్తులు దూసుకున్న నేతలు రహస్య ఒప్పందంతో ఒక్కటయ్యారనే ఆరోపణలు పెరిగాయి.
మొదటినుంచి లిక్కర్ సిండిేట్లపై ఏసీబీ దాడు లు సీఎంకు తెలిసే జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. గతేడాది డిసెంబర్ 13న కరీంనగర్‌లో మొద లైన ఈ దాడుల పరంపర బొత్స ఇలాకా అయిన విజ యనగరం లోనూ జరిగాయి. ఈ జిల్లాలో బొత్స కుటుం బానికి బినామీ పేర్లతో మద్యం షాపులు ఉన్నాయని ఏసీబీ గుర్తిం చింది. లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో బొత్స కీలకపాత్ర పోషిస్తున్నాడని ఏసీబీ పదేపదే పేర్కొంటూ మీడి యాకు లీకులు అందించింది. ఒకదశలో బొత్స అవినీతి వ్యాపారంలో పాత్రపై పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కీలక సమయంలో ఏసీబీ ఐజీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధిపతి శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం ఈనెల 16న అర్దరాత్రి బదలీ చేయడంతో సీఎం, బొత్సల మైత్రికి, రహస్య అవగాహనకు నిదర్శనమని ప్రతిపక్షాలు ఆరోపి స్తున్నాయి.
విజయనగరం జిల్లాకు చెందిన ఎకై్సజ్ సీఐ గణేష్ సిట్ అధిపతి శ్రీనివాస్‌రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. దావా వెనుక పీసీసీ అధ్యక్షుడు బొత్స హస్తం ఉం దని వార్తలు వెలువడ్డాయి. ిసీఐ గణేష్ ఆయన సర్కిల్ పరిధిలోని సిండికేట్లపై నివేదిక అందజేయడంలో జాప్యం కారణంగా సిట్ అధిపతి వార్నింగ్ ఇచ్చినట్లు తర్వాత వెల్ల డైంది. ఈ విషయంలో కినుక వహించిన సదరు ిసీఐ పెద్దల సహకారంతో ఐజీపై పరువు నష్టం దావా వేశా రని అందరూ చర్చించుకున్నారు. అయితే ఏసీబీ విచారణ ముమ్మరంగా సాగి నివేదిక అందజేస్తున్న తరుణంలో ఐజీ శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం అర్ధరాత్రి అంతగా ప్రాధాన్యం లేని తీరప్రాంత భద్రతా విభాగం ఐజీగా బదలీ చేయ డంతో సంచలనం చెలరేగింది. ఈ బదలీ వెనుక సీఎం, బొత్సల కాంప్రమైజ్ కారణమని రాజకీయపార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన రాజకీయపార్టీలు ప్రభుత్వ పెద్దల తీరుపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. వాస్తావాలను కనుమరుగుచేసే కుట్రజరుగుతోందని టీడీపీ, సీపీఐలు ఆరోపిస్తున్నాయి. టీడీిపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లనున్నటు ్ల ఇప్పటికే స్పష్టం చేశారు. వామ పక్షాలు సైతం ప్రజా ప్రయోజ నాలను విస్మ రించి పాలకులు అనైతిక చర్యలతో అక్రమా లను కప్పిపె ట్టడంపై భగ్గుమంటున్నాయి. న్యాయపోరాటం తోపాటు, వాస్తవాలను ప్రజలకు వివరించి అనైతిక రాజకీయ చర్య లపై ్రపచారం చేస్తామని ఇప్పటికే హెచ్చరికలు చేశాయి.
No comments:
Post a Comment