ఏసీబీ దెబ్బకు దెబ్బ తీయడానికి సిద్ధమవుతోంది. పోలీసులు తలచుకుంటే ఏమైనా చేయగలరని మరోసారి తేలనుంది. రాజకీయ పలుకుబడితో బదిలీ వేటు వేసి తమ శాఖ నైతికస్థైర్యాన్ని దెబ్బతీసిన రాజకీయం యంత్రాంగంపై పోలీసు మంత్రాంగం దెబ్బకు దెబ్బ తీయనుంది. పోలీసులతో పెట్టుకుంటే ఎంత విషమ పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందో రుజువుచేస్తున్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ రాజకీయ చతురతతో ఢిల్లీ ద్వారా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి తాత్కాలికంగా లిక్కర్ కుంభకోణం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఏసీబీ మాత్రం పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా, విజయనగరం జిల్లాలో బొత్స బినామీల పీఛమణించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఏసీబీ అడిషనల్ డైరక్టర్ శ్రీనివాసరెడ్డిని తప్పించడంతో దెబ్బతిన్న ఏసీబీ చీఫ్ దెబ్బకు దెబ్బ తీసేందుకు సిద్ధమయ్యారు.
విజయనగరం వ్యవహారాన్ని తాడోపడో తేల్చుకోనున్నారు. అందులో భాగంగా.. శనివారం విజయనగరం జిల్లాలో తెల్లరేషన్‌కార్డులు ఉండి వైన్‌షాపు లైసెన్సులు తీసుకున్న 18 మందిని అరెస్టు చేసి, విశాఖపట్నం తీసుకుని వెళ్లి వారిని రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతుండటం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం సృష్టించింది. అరెస్టయిన వారిలో బొత్సకు బినామీలుగా భావిస్తోన్న 12 మంది ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. వారిలో బొత్స కుటుంబానికి సంబంధించిన సత్య వైన్స్, సత్య స్టోన్ క్రషర్స్, సత్య కాలేజీ, సత్య కేబుల్ సంస్థల్లో ఉద్యోగులుగా పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. వీరి పేర్లను ప్రస్తుతానికి రహస్యంగా ఉంచుతున్నారు. అయితే, ఆదివారం వారి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ అరెస్టు వ్యవహారంలో చాకచక్యంగా అడుగులేస్తున్న ఏసీబీ గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి చాలా జాగ్రత్తగా పావులుకదుపుతోంది.
అరెస్టయిన వారి పేర్లు బయటకు పొక్కనీయకుండా, వారిని ఎక్కడ విచారిస్తున్నారో తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారి తన సెల్‌ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకని, ఎవరికీ అందు బాటులో లేకుండా పోయారు. దీన్ని బట్టి.. ఏసీబీ ఈ అరెస్టు వ్యవహారంలో ఈసారి రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం లేకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అరెస్ట యిన వారిలో బొత్స బినామీలే ఎక్కువమంది ఉండటంతో సత్తిబాబు రాజకీయ భవితవ్యం మరోసారి చిక్కుల్లో పడినట్టయింది. వారంతా ఆయన కుటుంబసభ్యుల ఆధీనంలోని సొంత సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కావ డం, వారికి తెల్లకార్డులు మాత్రమే ఉండటం, కోట్లు, లక్షలు పెట్టి వైన్‌షాపు లైసెన్సులు తీసుకోవడం మరోసారి చర్చనీయాంశమయింది.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల, వంతాడ, విజయనగరం తదితర ప్రాంతాలకు చెంది న బొత్స బినామీలను హటాత్తుగా అరెస్టు చేయడం అటు ఉత్తరాంధ్రలోనూ సంచలనం సృష్టించింది. ఢిల్లీకి వెళ్లే ముందు ఏసీబీ కేసులో తనపై కేసు లేకుండా చూసేందుకు శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయించడంలో ఢిల్లీ ద్వారా ఒత్తిళ్లు చేయించి విజయం సాధించిన బొత్సకు ఆ ఆనందం మూడురోజులయినా నిలవలేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నా యి. ముఖ్యమంత్రి తో కలసి ఉప ఎన్నికల అభ్యర్ధుల కసరత్తులో బొత్స బిజీగా ఉన్న సమయం లోనే ఏసీబీ విజయనగరంలో బినామీలను అరెస్టు చేయడం, వారిలో బొత్స అనుచరులే 12 మంది ఉన్నారని ప్రచారం జరగడంతో బొత్స మరో సారి రాజకీయంగా చిక్కుల్లో పడటం అనివార్యం కానుంది.
ఇప్పటికే శ్రీనివాసర ెడ్డి బది లీపై విపక్షాలు విరుచుకుపడుతుండటంతో సర్కారు- పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోం ది. బొత్సను రక్షించడానికే శ్రీనివాసరెడ్డిని బలిపశువును చేశారని, ఆయన బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. అసెంబ్లీ సమావేశాల సంద ర్భంగా ఏసీబీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని కితాబు ఇచ్చి న కిరణ్ విజయనగరం లో రాజకీయ బినామీల ముసుగు తొలగించే ప్రయత్నం చేస్తున్న శ్రీనివాసరెడ్డిని తొలగించడం విమర్శలకు దారితీసింది. దీనిపై ఒక వ్యక్తి ఏకంగా కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మళ్లీ బొత్స బినామీల బాగోతం అరెస్టు ద్వారా వెలుగుచూడ టంతో ఆయన రాజకీయ భవితవ్యం మరోసారి ప్రమాదంలో పడినట్టయింది. నేడో, రేపో సీఐ గణేష్‌ను కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. బొత్స కుటుంబ సభ్యు ల పేర్లను బయటపెట్టకుండా ఆయన సహకరించారన్న ఆరోపణలు ఏసీబీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈసారి బొత్స తప్పించుకోవడం అసాధ్యమంటున్నారు.

No comments:
Post a Comment