అక్కినేని అమల మళ్లీ నటిస్తున్నారు. అవును... నిజం! శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో అమల ఒక కీలకమైన పాత్ర పోషించనున్నట్లు తెలిసింది. నాగార్జున అక్కినేనిని వివాహమాడిన అనంతరం ఆమె పూర్తిగా వెండితెరకు దూరమైన విషయం తెలిసిందే. నటిగా అమల అనగానే మనకు ‘శివ’ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో ఆమె నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూత్‌ని తను ఎంతగానో ఆకట్టుకున్నారు. ‘బోటనీ పాఠముంది... మ్యాటినీ ఆట ఉంది... దేనికో ఓటు చెప్పరా’’ అంటూ సాగిన పాటలో ఆమె నటవిన్యాసం ఎప్పటికీ ప్రేక్షకులు మరువలేరు.
ఆగ్రహం, రక్తతిలకం, కిరాయిదాదా, పుష్పక విమానం, చినబాబు, నిర్ణయం, ఘర్షణ, రాజావిక్రమార్క, అగ్గిరాముడు వంటి చిత్రాల్లో నటించిన అమల ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 1992లో నాగార్జునను పెళ్లి చేసుకున్న అనంతరం పూర్తిగా సినిమాలకు ఆమె స్వస్తి పలికారు. ఆ తర్వాత గృహిణిగా, ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’ సంస్థ అధ్యక్షురాలిగా తన సేవలను కొనసాగిస్తూ వచ్చారు. జంతు సంరక్షకురాలుగా తన పూర్తి సమయాన్ని అంకితం చేస్తూ వచ్చిన అమల... అకస్మాత్తుగా మళ్లీ వెండితెరపై కన్పించాలనుకోవడం ఆమె అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ‘స్వీట్‌షాక్’గా అన్పిస్తుంది.
బహుశా సినిమాల నిర్మాణంలో ‘క్లీన్ ఇమేజ్’ ఏర్పరచుకున్న శేఖర్ కమ్ముల వంటి దర్శకుడు అడగటం వలన ఆమె మళ్లీ మేకప్ వేసుకోవడానికి ముందుకొచ్చారని భావించవచ్చు. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్ వంటి సినిమాలతో శేఖర్‌కు గౌరవప్రదమైన ఇమేజ్ ఉంది. ఆయన సినిమాల్లో ముఖ్యంగా స్త్రీ పాత్రలకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ఆ రకంగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో అమల పాత్ర ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో రేపు తెరమీద చూసి వీక్షించవలసిందే. ఈ వేసవి కానుకగా రాబోతున్న ఈ చిత్రంలో శ్రీయ కథానాయికగా నటిస్తున్నారు. మిగతా పాత్రల్లో అందరూ కూడా నూతనతారలే నటిస్తున్నట్లు సమాచారం.

10-4-12-21411.jpg)
No comments:
Post a Comment