సర్కారుతో ఢీ అంటున్న దర్యాప్తు సంస్ధ
మద్యం సిండికేట్ల కేసులో మరింత దూకుడు
విజయనగరం, మెదక్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి
ఇద్దరు కీలక నేతల బంధువులే టార్గెట్
సమాచారం సేకరణ.. త్వరలోనే అరెస్టులు!
సిట్ బాధ్యతలను స్వయంగా పర్యవే క్షిస్తున్న డీజీ
తెల్లకార్డు లైసెన్ ్సదారులను పట్టుకురండి
ఈ 27 మందినీ తీసుకురావాల్సిన బాధ్యత మీదే
విజయనగరం ఎక్సైజ్ అధికారులకు హుకుం
మెదక్ జిల్లాలో మాజీ సీఐ, సిండికేట్ నేత అరెస్టు
కీలక నేత సోదరుడి బినామీని వదిలేసిన ఏసీబీ
ఎదురుదాడికి దిగిన మద్యం సిండికేట్లు
విజయనగరం జిల్లాలో ఏసీబీపైనే ఎదురు కేసులు

మద్యం సిండికేట్ల కేసు దర్యాప్తు వ్యవహారం ప్రభుత్వం అదుపులోంచి జారిపోతోందా!? ఈ వ్యవహారంలో ఏసీబీ స్వతంత్రంగా ముందుకు సాగుతోందా!? నేతల చుట్టూ మరింత పకడ్బందీగా ఉచ్చు బిగించేందుకు పావులు కదుపుతోందా!? ఏసీబీ సిట్ చీఫ్ శ్రీనివాస రెడ్డి బదిలీతో మొదలైన రగడ మరింత ముదరనుందా!? తాజా పరిణామాలను పరిశీలిస్తే.. 'ఔను' అనే జవాబు వస్తోంది.
హైదరాబాద్, విజయనగరం: ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి శ్రీనివాసరెడ్డి బదిలీ తర్వాత మద్యం సిండికేట్ల కేసు దర్యాప్తు మందకొడిగా మారుతుందని భావించారు. కానీ, దానికి భిన్నంగా ఏసీబీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. శ్రీనివాసరెడ్డి బదిలీ తర్వాత మద్యం కేసుల విచారణకు ఏర్పాటైన సిట్ బాధ్యతలను ఎవరికీ అప్పగించకుండా ఏసీబీ డీజీ భూబతిబాబే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, విజయనగరం, మెదక్ జిల్లాలకు సంబంధించి ఇద్దరు కీలక నేతల బంధువులను ఏసీబీ టార్గెట్ చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే, ఆ నేతల బంధువుల పాత్రకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఏసీబీ అధికారులు సేకరించారని తెలిసింది. విజయనగరం జిల్లాలో మద్యం షాపుల వేలం నుంచి నిర్వహణ వరకు అనేక అవకతవకలు జరిగాయని ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే. ఇక్కడ 2005 మద్యం విధానాన్ని అతిక్రమించి బినామీ వ్యాపారానికి తెరతీసిన కొందరు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి, వ్యవస్థీకృత నేరానికి పాల్పడి 50 శాతానికిపైగా లాభాలను ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది.
ఇందుకు ఎక్సైజ్, పోలీసు అధికారులు సహకరించారని కూడా తెలిసింది. విజయనగరం జిల్లాలోని మొత్తం 202 షాపుల్లో 103 షాపుల యజమానులు తెల్లకార్డు ఉన్నవారేనని గుర్తించింది. వారంతా బినామీలేనని, వారి వెనక సూత్రధారిని పట్టుకోవాల్సి ఉందని వాదిస్తోంది. ఇందులో భాగంగానే, ఆరుగురిని అరెస్టు చేసింది కూడా. అయితే, వీరిలో ఐదుగురు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అనుచరులు ఉండడం చర్చనీయాంశమైంది.
అలాగే, మద్యం సిండికేట్ల వ్యవహారానికి సంబంధించి బొత్స తమ్ముళ్ల పేర్లు చెప్పాలంటూ ఏసీబీ అధికారులు వారిపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో బొత్మ తమ్ముళ్ల పేర్లు చెప్పించడమే ధ్యేయంగా ఏసీబీ దర్యాప్తు ముందుకు సాగుతోందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా, ఎక్సైజ్ అధికారులనే పావులుగా ఏసీబీ వినియోగించబోతోంది. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, మద్యం లైసెన్స్‌లు పొందిన వారిని పట్టుకుని తీసుకు రావాల్సిన బాధ్యత మీదేనంటూ విజయనగరం జిల్లాలోని ఎక్సైజ్ అధికారులకు ఏసీబీ తాఖీదులు పంపినట్లు తెలిసింది.
ఈ మేరకు సోమవారం వారికి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చినట్లు సమాచారం. 33 మంది తెల్లకార్డుదారులు మద్యం లైసెన్స్‌లను కూడా కలిగి ఉన్నారని ఏసీబీ ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారిలో ఆరుగురిని అరెస్టు చేసింది. మిగిలిన 27 మందినీ పట్టుకుని ఏసీబీకి అప్పగించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే, విజయనగరం జిల్లాలో త్వరలోనే మరికొందరిని కూడా అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. ఇక, మెదక్ జిల్లాలో మరో కీలక నేత బంధువులను కూడా ఏసీబీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ కీలక నేత సోదరునికి బినామీ అయిన మెదక్ జిల్లాకు చెందిన సురేందర్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని రెండు రోజులపాటు విచారించిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేయలేదు. కానీ, ఏసీబీ మాజీ సీఐతోపాటు సిండికేట్ నాయకుడు మోహన్‌రెడ్డిని మాత్రం అరెస్టు చేసింది. సురేందర్ గౌడ్‌ను వదిలి వేయడంతోపాటు వీరిద్దరి అరెస్టుల వెనుక కీలక నేత ఒత్తిళ్లే కారణమని భావిస్తున్నా.. ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగానే సురేందర్ గౌడ్‌ను వదిలేసినట్లు తెలుస్తోంది. కీలక నేత సోదరుడికి ఇతను బినామీగా ఉన్నట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో, బాలరాజ్ సిండికేట్లకు సంబంధించి తదుపరి అరెస్టుల విషయంలో ఏసీబీపై ఒత్తిళ్లు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా, మద్యం సిండికేట్ల కేసులో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి? అంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ కేసులో మరింత పకడ్బందీగా ముందుకు సాగాలని ఏసీబీ భావిస్తోంది. మద్యం సిండికేట్ల కేసుకు సంబంధించి ఈనెల 16వ తేదీన హైకోర్టుకు ఏసీబీ నివేదికను సమర్పించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే, ఈ కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు జరిగిన లోటుపాట్లను సవరించుకుని కీలక వ్యక్తుల అరెస్టు దిశగా ముందుకు వెళుతున్నారు. ఈ కేసులో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగడానికి కారకులైన అధికారులతోపాటు సిండికేట్ల నుంచి మామూళ్లు తీసుకున్న మరికొంతమంది పోలీసులను అరెస్టు చేయడానికి ఏసీబీ అధికారులు పావులు కదుపుతున్నారు. అదే సమయంలో, ఏసీబీతో అమీతుమీ తేల్చుకోవడానికి విజయనగరం జిల్లాలోని మద్యం వ్యాపారులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు బాధితుల తరఫున సోమవారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.
తెల్లకార్డు కలిగి ఉండడమే కాకుండా మద్యం లైసెన్స్‌దారులైన మిగిలిన 27 మందినీ పట్టి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను రంగంలోకి దింపడంతో ఏసీబీతో న్యాయపోరాటానికి సన్నద్ధమైనట్లు తెలిసింది. కాగా, తెల్లకార్డుదారులు మద్యం షాపుల లైసెన్స్‌లు తీసుకున్న వ్యవహారం ఇతర జిల్లాల్లోనూ వెలుగులోకి వస్తోంది. గుంటూరు జిల్లాలో 342 మద్యం షాపు లైసెన్స్‌లపై దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 104 మద్యం షాపులు తెల్లకార్డుదారుల పేరిట ఉన్నట్లు గుర్తించారు. ఆ వివరాలను జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రభుత్వానికి పంపా రు.
ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ సొంత జిల్లా గుంటూరులోనే కాకుండా ఆయన స్వగ్రామమైన నిజాంపట్నంలోనూ బినామీ పేర్లతో షాపులు ఉన్నట్లు తెలిసింది. తాజా విచారణలతో మద్యం సిండికేట్లు, ఎక్సైజ్ అధికారులు బెంబేలెత్తుతున్నారు. అదే సమయంలో, మంత్రి మోపిదేవికి రూ.10 లక్షలు ఇచ్చానంటూ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఖమ్మం జిల్లా సిండికేట్ వ్యాపారి నున్న వెంకటరమణకు కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.

No comments:
Post a Comment