Apr 4, 2012

వానా...వానావెల్లువాయె


all-he
వర్షం పాటలు ఏ కాలంలోనైనా కుర్రకారుకు వేడెక్కించేవే. దానికంటూ సీజన్‌..అన్‌ సీజన్‌ అంటూ ఏదీలేదు. అప్పుడెప్పుడో ఆత్మబలం చిత్రంలో ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే చెంతన ఉంటే’ పాటను ఈనాటికీ ఎవర్‌గ్రీన్‌ పాటగా సినీ ప్రేక్షకులు తేల్చేశారు. ఇంకో రెండు మూడు తరాల దాకా ఈ పాటను చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌, శోభన్‌బాబు, కృష్ణలతో సహా అందరూ ఈ వానపాటల్లో తడిసినవాళ్లే. వెంకటేష్‌, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలు కూడా వానపాటలకు చిందేసినవాళ్లే.

లేటెస్ట్‌గా రామ్‌చరణ్‌తేజ రచ్చ చిత్రంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రంలో వేసిన ‘వానా వానా వెల్లువాయె’ పాటకు స్టెప్పులను మళ్లీ తన ‘రచ్చ’ చిత్రంలో గ్లామర్‌ క్వీన్‌ తమన్నాతో కలిసి రిపీట్‌ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమా నిర్మాతల దృష్టి వానపాటల మీదకు మళ్లిందనిపిస్తోంది. తమన్నా తాజాగా ప్రభా్‌ సతో కలిసి నటించనున్న చిత్రంలో కూడా వాన పాటలో తన అందాలను ఆరబోయనుంది. త్రిష, అనుష్క, ఛార్మి...వీరంతా వాన పాటలో తడిసి ప్రేక్షకజనాన్ని తరింపజేసినవారే! వాన పాట హాయి హాయి.

No comments:

Post a Comment