Apr 8, 2012

అల్లు అర్జున్ 'జులాయి' సినిమా స్టిల్స్

దేశముదురు’గా యువతరం ప్రశంసలందుకున్న అల్లు అర్జున్ త్వరలో ‘జులాయి’గా రానున్నారు. కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి ‘జులాయి’ పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు. నేడు (ఆదివారం) అల్ల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘జులాయి’ విశేషాలను శనివారం తెలియజేస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘టైటిల్ వినగానే అందరూ అభినందించారు.


టైటిల్‌లో ఉన్న కొత్తదనం సినిమాలో కూడా ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. నటుడు అయ్యాక అల్లు అర్జున్ జరుపుకుంటోన్న పదవ పుట్టినరోజు ఇది. ఈ సందర్భం మా చిత్ర నిర్మాణ సమయంలో ఎదురవ్వడం ఆనందంగా ఉంది. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం మా ‘జులాయి’ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి. అభిమానులను రంజింపజేసేలా లావిష్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నాం. 



ఇప్పటికి నాలుగు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫారిన్‌లో పాటలను చిత్రీకరిస్తాం. ఈ నెలాఖరున ఆడియోను, మే నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సోనూసూద్, ఎం.ఎస్. నారాయణ, బ్రహ్మాజి, రావు రమేష్, శ్రావణ్, తులసి, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవీందర్, నిర్మాత: ఎస్.రాధాకృష్ణ, నిర్మాణం: హారికా అండ్ హాసిని క్రియేషన్స్.










No comments:

Post a Comment