ఆల్బమ్ కోసం నగరానికి వచ్చిన వైష్ణవి
ప్యారడైజ్ వద్ద ఆమె వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాజధాని నగరంలో బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఓ యువ గాయనిని కబళించింది. వర్ధమాన గాయని, మా టీవీ సూపర్ సింగర్ జి.వైష్ణవి (19) శుక్రవారం సికింద్రాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. మహంకాళి పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన భాస్కర్‌రావు, భారతిల కుమార్తె వైష్ణవి. బండ్లమూడి హనుమాయమ్మ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. జీ తెలుగు, మా టీవీ నిర్వహించే పాటల పోటీల్లో విజేతగా నిలిచింది.
తన ఆల్బమ్ తయారు చేయించుకొనేందుకు మూడు రోజుల క్రితం కొత్తపేటలోని మేనమామ మార్కండేయ ప్రసాద్ ఇంటికి వచ్చింది. ఆయన బోయిన్‌పల్లిలోని ఆంధ్రా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. మూడు రోజులుగా ఆల్బమ్ కోసం ఆమె ప్యారడైజ్ వద్దకు వస్తోంది. ఇదే పనిమీద శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మేనమామతో కలిసి బైక్‌పై వచ్చింది. ప్యారడైజ్ వద్దనున్న పీ ఆండ్ టీ క్వార్టర్స్ ప్రాంతంలో బైకు దిగుతుండగా పఠాన్‌చెరువు వెళుతున్న రాణిగ ంజ్ డిపో ఆర్టీసీ సిటీ బస్సు (ఏపీ 28జడ్ 4871) వారి వాహనాన్ని ఢీకొంది. దీంతో వైష్ణవి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వైష్ణవిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వైష్ణవి మరణించింది. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వైష్ణవి మృతికి గాయని, సూపర్ సింగర్ జడ్జి సునీత, గీత రచయిత చంద్రబోస్ సంతాపం వ్యక్తం చేశారు. వైష్ణవి పాడిన పాటలు ఇంకా తనకు వినిపిస్తూనే ఉన్నాయని సునీత అన్నారు. వైష్ణవి అద్భుత గాయని అని, ఆమె చిరునవ్వుల మోము అందరికీ కలకాలం గుర్తుంటుందని చంద్రబోస్ చెప్పారు.
ప్యారడైజ్ వద్ద ఆమె వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాజధాని నగరంలో బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఓ యువ గాయనిని కబళించింది. వర్ధమాన గాయని, మా టీవీ సూపర్ సింగర్ జి.వైష్ణవి (19) శుక్రవారం సికింద్రాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. మహంకాళి పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన భాస్కర్‌రావు, భారతిల కుమార్తె వైష్ణవి. బండ్లమూడి హనుమాయమ్మ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. జీ తెలుగు, మా టీవీ నిర్వహించే పాటల పోటీల్లో విజేతగా నిలిచింది. తన ఆల్బమ్ తయారు చేయించుకొనేందుకు మూడు రోజుల క్రితం కొత్తపేటలోని మేనమామ మార్కండేయ ప్రసాద్ ఇంటికి వచ్చింది. ఆయన బోయిన్‌పల్లిలోని ఆంధ్రా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. మూడు రోజులుగా ఆల్బమ్ కోసం ఆమె ప్యారడైజ్ వద్దకు వస్తోంది. ఇదే పనిమీద శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మేనమామతో కలిసి బైక్‌పై వచ్చింది. ప్యారడైజ్ వద్దనున్న పీ ఆండ్ టీ క్వార్టర్స్ ప్రాంతంలో బైకు దిగుతుండగా పఠాన్‌చెరువు వెళుతున్న రాణిగ ంజ్ డిపో ఆర్టీసీ సిటీ బస్సు (ఏపీ 28జడ్ 4871) వారి వాహనాన్ని ఢీకొంది. దీంతో వైష్ణవి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వైష్ణవిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వైష్ణవి మరణించింది. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వైష్ణవి మృతికి గాయని, సూపర్ సింగర్ జడ్జి సునీత, గీత రచయిత చంద్రబోస్ సంతాపం వ్యక్తం చేశారు. వైష్ణవి పాడిన పాటలు ఇంకా తనకు వినిపిస్తూనే ఉన్నాయని సునీత అన్నారు. వైష్ణవి అద్భుత గాయని అని, ఆమె చిరునవ్వుల మోము అందరికీ కలకాలం గుర్తుంటుందని చంద్రబోస్ చెప్పారు.
No comments:
Post a Comment