న్యూఢిల్లీ, మార్చి 30 : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకూ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మద్యం కేసులో తనను ఇరికించేందుకు ఏసీబీ ద్వారా సీఎం ప్రయత్నిస్తున్నారన్న సమాచారం వెల్లడవటంతో.. గురువారం ఢిల్లీకి బొత్స ఆగమేఘాలపై వచ్చారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచే ఫోన్ చేసి.. ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ వెంటనే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ను పీసీసీ చీఫ్ శుక్రవారం ఉదయం కలుసుకున్నారు. సీఎం వైఖరిపై ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో, 18 స్థానాల్లో ఉప ఎన్నికలయ్యేంత వరకూ ఓపిక పట్టవలసిందిగా బొత్సను ఆజాద్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా మద్యం దుకాణాల వేలం కేసులో బొత్స, ఆయన సోదరుడు, బంధువుల పేర్లను ఇరికించనందుకు గానూ.. ఏసీబీ సీఐ గణేశ్‌ను ఏసీబీ సిట్ చీఫ్ శ్రీనివాస రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారని, దీనిపై శ్రీనివాస రెడ్డికి గణేశ్ లీగల్ నోటీసు పంపారని తెలియడంతో పీసీసీ అధ్యక్షుడు మండిపడుతున్నట్లు తెలిసింది. దీని వెనుక సీఎం హస్తం ఉన్నదని అనుమానిస్తున్న బొత్స.. ఢిల్లీలోని ఒక ఎంపీ నివాసం నుంచి సీఎంకి ఫోన్ చేశారు.
"మీరేమనుకుంటున్నారు? అందర్నీ కేసుల్లో ఇరికించి మీరు బాగుపడదామనుకుంటున్నారా? నన్ను తక్కువ అంచనా వేయవద్దు.. మీ సంగతి చూస్తా!'' అంటూ సీఎంపై పీసీసీ చీఫ్ విరుచుకుపడ్డట్లు తెలిసింది. ఆ వెంటనే స్వరాన్ని పెంచిన బొత్స.. "నీకు నువ్వు ఏమనుకుంటున్నావ్? నా గురించి ఏమని భావిస్తున్నావ్ సీఎం? నీ సంగతేంది? నీ వ్యవహారం ఏంది? అధిష్ఠానం వద్ద తాడోపేడో తేల్చుకుంటాను'' అని కిరణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
దీంతో, దిగ్భ్రాంతి చెందిన సీఎం కిరణ్ అసలు ఈ ఉదంతమే తనకు తెలియదని, ఏసీబీపై తాను ఎలాంటి ఒత్తిడి చేయలేదని బొత్సకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. "నన్ను నమ్మండి. మీరవన్నీ ఎలా విశ్వసిస్తారు?'' అని కిరణ్ చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో సీఎం, బొత్స మధ్య మాటల యుద్ధమే జరిగిందని తెలిసింది.
సీఎంపై ఆజాద్‌కు ఫిర్యాదు
శుక్రవారం ఆజాద్‌ను కలుసుకున్న బొత్స మద్యం దుకాణాల వ్యవహారంలో కిరణ్ తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ సీఐ గణేశ్ పంపిన లీగల్ నోటీసు ప్రతిని తన వాదనకు మద్దతుగా ఆజాద్‌కు పీసీసీ చీఫ్ అందజేసినట్లు తెలిసింది. ఉప ఎన్నికల కోసం పార్టీ నేతలందర్నీ కలుపుకొని, ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన ముఖ్యమంత్రే పార్టీలో నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆజాద్‌కు బొత్స చెప్పినట్లు తెలిసింది.
కాగా, ఉప ఎన్నికలను జూన్‌లోపే నిర్వహించాలని తాము భావిస్తున్నామని, అందుకు తగిన వ్యూహరచనను ప్రారంభించామని, ఎంపీలతో చర్చలు జరుపుతున్నానని బొత్సకు ఆజాద్ చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. "ఎన్నికల్లో కలిసి పనిచేయాలని సీఎంకి చెబుతాం. మీరు ఈ విషయం రచ్చచేయకుండా జూన్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆగండి'' అని బొత్సను ఆజా ద్ బుజ్జగించినట్లు తెలిసింది. అయితే, ఆగస్టులో ఎన్నికలు నిర్వహించాలని సీఎం భావిస్తుండగా.. ఆజాద్, బొ త్స జూన్‌లోపే నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
పొన్నాల తీరుపై బొత్స వర్గం అనుమానం
ఇక, తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ రావడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎంపీలతో ఆజాద్ ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నాల పాల్గొన్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు ఆజాద్‌తో ఆయన ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
పీసీసీ అధ్యక్ష పదవిని తెలంగాణకు ఇవ్వాలంటూ పార్టీ నేత దామోదర్ రెడ్డి ఇటీవల డిమాండ్ చేసిన నేపథ్యంలో.. పొన్నాల ఢిల్లీలో తన ప్రయత్నాలు ప్రారంభించారని, ఇందుకు సీఎం ఆశీస్సులు కూడా ఉన్నాయని బొత్స వర్గం అనుమానిస్తోంది. ఇలా ఒకర్నొకరు దెబ్బతీసుకునేందుకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు పావులు కదపడం చర్చనీయాంశమవుతోంది.

No comments:
Post a Comment