ఐశ్వర్య మూవీస్ అందిస్తున్న అనువాద చిత్రం 'బిజినెస్ఉమెన్' డబ్బింగ్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల్లోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత వెంకట్ చెప్పారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ 'ఆస్తితో పాటు అందం ఈ చిత్రకథానాయిక సొంతం. అవే ఆమె పాలిట శత్రువులయ్యాయి.ఆస్తి కోసం వెంటపడేవారుడ ఒకడైతే, అందాన్ని అందుకోవాలనుకునేవాడు మరొకడు. వారి నుండి తనని కాపాడుకోవడానికి ఆమె బిజినెస్ఉమెన్‌గా మారుతుంది. ఆద్యం తం ఆసక్తికరంగా సినిమా ఉంటుంది' అన్నారు. రాజ్‌గౌతమ్, సౌమ్యాసింగ్ నటించిన ఈ చిత్రానికి మాటలు: రాకేష్, రమేష్, సంగీతం: మదన్, నిర్మాత: వెంకట్, దర్శకత్వం: అర్జునరాజ్
No comments:
Post a Comment