Mar 27, 2012

తెలంగాణ పరిష్కారం రాష్ట్ర నేతల చేతుల్లోనే ఉంది - చిదంబరం

ప్రత్యేక తెలంగాణ సమస్య పరిష్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతల చేతుల్లోనే ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్యాయానికివస్తే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కూడా ఉందని, తలా ఒకటి కోరుకుంటే సమస్య ఎలా పరిష్కరించగలం అని చిదంబరం అన్నారు.

తెలంగాణ అంశంపై ఆ ప్రాంత పార్లమెంట్ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న నేపథ్యంలో మంగళవారం చిదంబరం మాట్లాడుతూ తెలంగాణ అంశంపై రాష్ట్రానికి చెందిన పార్టీలకు స్పష్టత లేకుండా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజం ఏమిటని ఆయన అడిగారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు తెలంగాణ అంశంపై స్పష్టత లేకుండా తాము ఏమీ చేయలేమని చిదంబరం చెప్పారు. అన్ని రాజకీయపార్టీలు కలిసివస్తే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

తెలంగాణపై కాంగ్రెసు, తెలుగుదేశం, మజ్లీస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ వైఖరులను స్పష్టం చేయాల్సి ఉందని, ఆ పార్టీలు స్పష్టమైన వైఖరిని తీసుకుని వస్తేనే తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందని చిదంబరం చాలా కాలంగా చెబుతున్న విషయం తెలిసిందే.

No comments:

Post a Comment