రెడ్ సిగ్నల్ జంప్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త! జేబు నిండా డబ్బుంటే ఇక నుంచి ఆ పని చేయాలి. ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి సారి సిగ్నల్ జంప్ చేయడం, హెల్మెట్ లేకుండా, సీటు బెల్టు లేకుండా ప్రయాణం చేస్తే జరిమానాను 500 రూపాయలకు పెంచారు.
ఇదే తప్పిదం మరోసారి చేస్తే ఈ రుసుం 1500 వరకు పెరుగుతుంది. మొబైల్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే మొదటిసారి తప్పుకు 500, మరోసారి చేస్తే 5వేల వరకు ఫైన్ విధిస్తారు. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా వాహనాన్ని నడిపితే 20 వేల వరకు జరిమానా వేస్తారు. సవరణలకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతారు.

No comments:
Post a Comment