
సూపర్‌స్టార్ రజినీకాంత్, దీపికాపదుకొనే జంటగా రజినీ కుమార్తె సౌందర్య ఆర్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందునున్న యానిమేషన్ చిత్రం 'కొచ్చడియాన్' ఈనెల 21న చెన్నరు ఎవిఎం స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖదర్శకుడు కెఎస్.రవికుమార్ కధను అందించగా యూరోస్ ఇంటర్నేషనల్ సంస్ద మరియు సౌందర్య సంయుక్తంగా నిర్మించనున్నారు. 'రాణా' చిత్రం షూటింగ్ సమయంలో అనారోగ్యం పాలయి సింగపూర్‌లో చికిత్స అనంతరం ఏడు నెలల క్రితం రజనీకాంత్ చెన్నరు చేరుకున్నారు. అప్పట్లో తిరిగి రాణా చిత్రం ప్రారంభం అవుతుందని వార్తలు వెలువడినా, అప్పుడే రజినీ అనారోగ్యం బారిన పడడంతో తాత్కాలికంగా వాయిదాపడింది. రజినీకాంత్ తదుపరి చిత్రం ఏమిటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె నిర్మిస్తున్న యానిమేషన్ చిత్రంలో నటించనున్నారు. అలాగే దేశీయ సినీచరిత్రలో మొట్టమొదటి సారిగా మోషన్ కాప్చర్డ్ టెక్నాలజీని (ఎంఓసిఏపి) విధానాన్ని వాడనున్నారు. చిత్రంలోని యానిమేషన్ పాత్రలను 3డిలో మరింత స్పష్టంగా కనిపించేందుకు ఈ విధానాన్ని వాడనున్నారు. రజినీకాంత్ నటించనున్న సన్నివేశాలను స్టూడియోలో వేసిన సెట్టింగులలో 80 కెమెరాలతో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించే పనిలో ఎఆర్. రహమాన్ నిమగమయివున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం అనంతరం షూటింగ్ మొత్తం యుకెలో నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment