రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వాగ్దానాల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం కద్దు. చంద్రుని కిందకు దింపుతామని కూడా అవి వాగ్దానం చేస్తుంటాయి. ఇప్పుడు అటువంటిదే ఒకటి జరిగింది. గోవాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఆ తరహా వాగ్దానం చోటు చేసుకుంది. అసలు నదే లేని ఒక గ్రామంలో ఒక వంతెన నిర్మిస్తామని పార్టీ వాగ్దానం చేసింది. నెవురా గ్రామంలో ఒక వంతెన నిర్మిస్తామని కాంగ్రెస్ సోమవారం విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. అసలు ఆ గ్రామంలో నదే లేదు. ఈ పొరపాటు గురించి విలేకరుల గోష్ఠిలో ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ అసంబద్ధంగా సమాధానం ఇచ్చారు. ‘నెవురాలో వంతెన అవసరం ఉన్న ప్రదేశం ఏదో ఉండి ఉండాలి’ అని ఆయన అన్నారు. కాని గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుభాష్ శిరోద్కర్ తమ ఎన్నికల ప్రణాళికలోని పొరపాటును అంగీకరించారు. ‘వంతెన అవసరమైన ప్రదేశం కొర్తాలిమ్ అని వారు చెప్పాలనుకుని ఉండవచ్చు. అయినా ఈ పొరపాటును సరిదిద్దవలసి ఉంటుంది’ అని శిరోద్కర్ అన్నారు.
No comments:
Post a Comment