సుప్రసిద్ధ నిర్మాత పర్వతనేని మల్లిఖార్జునరావు (76) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని మెడ్విన్ ఆసుపత్రిలో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మధుపిక్చర్, భారతీ ఇంటర్, నేషనల్, సునందిని పిక్చర్స్ పతాకంపై పలు తెలుగు, హిందీ చిత్రాలను నిర్మించారు. 1965లో జ్వాలాద్వీప రహస్యం (కాంతారావు- విఠలాచార్య)..ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత ఇద్దరు మొనగాళ్ళు, మంచి కుటుంబం, మంచి మిత్రులు, ఇంటి గౌరవం, ఇంటికోడలు, మహాబలుడు, నేనంటే నేనే తదితర చిత్రాలను నిర్మించారు. హిందీలో హిమ్మత్ (జితేంద్రతో), కీమత్ (ధర్మేంద్ర, రేఖ), మౌసుమ్ (సంజరుకుమార్) చిత్రాలను నిర్మించారు. 1976లో ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసలు లభించాయి. ఇవికాక సంజోగ్, ఆగాడిన్ ఆదిరాత్, ఏతో ఖనాల్ హోగయా, ఏ దేశ్, ఈశ్వర్ తదితర చిత్రాలు నిర్మించారు. 27 జులై 1935లో ఆయన జన్మించారు.

No comments:
Post a Comment