Feb 12, 2012

ఎస్పీ వైపు యూపీ జనం మొగ్గు!

న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించగల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకూ రెండు విడతల పోలింగ్ ముగిసింది. మరో ఐదు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ రెండు దశల్లోని 114 నియోజకవర్గాల్లో (55+59) పోలింగ్ భారీగా నమోదుకావడంతో (తొలి దశలో 62-64 శాతం, రెండో దశ 59 శాతం) ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే విషయమై అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రెండు దశల్లో పోలింగ్ సరళినిబట్టి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అత్యధికంగా 46 స్థానాల్లో విజయం సాధించవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అధికార బీఎస్పీ 30, కాంగ్రెస్ 20, బీజేపీ 10 స్థానాల్లో గెలవచ్చని భావిస్తున్నారు. ఆయా పార్టీల అంతర్గత అంచనాలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. 

2007 అసెంబ్లీ ఎన్నికల రెండు దశల పోలింగ్‌లో బీఎస్పీకి 59 సీట్లు లభించగా ఎస్పీకి 38 సీట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 10, ఇతరులకు 2 సీట్లు లభించాయి. దీన్నిబట్టి చూస్తే ప్రస్తుతం జరిగిన రెండు దశల ఎన్నికల్లో అధికార బీఎస్పీకన్నా ఎస్పీకి ఆధిక్యత కనిపిస్తోంది. ఎస్పీవైపే యూపీ ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. దీనికితోడు యూపీఏ బలహీనపడుతోందంటూ ఇటీవల ఇండియా టుడే వెల్లడించిన ముందస్తు ఎన్నికల సర్వే నిజమవుతుందనే సంకేతాలు విశ్లేషకుల అం చనాలోనూ వ్యక్తం కావడం గమనార్హం. అదే సమయంలో ఎస్పీ, బీఎస్పీ వంటి యూపీఏయేతర, ఎన్డీయేతర పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయన్న సర్వే ఫలితాలకు కూడా ఇది బలం చేకూరుస్తోంది.

తొలి రెండు దశల్లో బలాబలాలు

పార్టీ 2007లో ప్రస్తుతం(అంచనా)
బీఎస్పీ 59 30
ఎస్పీ 38 46
కాంగ్రెస్ 5 20
బీజేపీ 10 10
ఇతరులు 2 8

No comments:

Post a Comment