Feb 13, 2012

పాతబస్తీలో రాంచరణ్ చిత్రం

(ఆంధ్రజ్యోతి వార్త)

రాంచరణ్, కాజల్ జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరుగుతోంది. సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'ఈ నెల 6న షూటింగ్ ప్రారంభమైంది. 22 వరకూ వర్క్ చేస్తాం. కనల్‌కణ్ణన్ సారథ్యంలో యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తున్నాం. పాతబస్తీలో నైట్ ఎఫెక్ట్‌తో వీటిని తీస్తున్నాం. మార్చి ద్వితీయార్థంలో రెండో షెడ్యూల్ ఉంటుంది. ఇంతవరకూ తను చేయని పాత్రను ఈ సినిమాలో రాంచరణ్ చేస్తున్నారు. మరో హీరోయిన్‌ని ఎంపిక చేయాల్సిఉంది' అన్నారు.

రాంచరణ్ మాట్లాడుతూ 'నాన్నగారితో 'ఠాగూర్' వంటి సంచలన చిత్రం తీసిన వినాయక్‌గారి దర్శకత్వంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నా పాత్రలో చాలా డైమన్షన్లు ఉంటాయి. మెగాభిమానులు మా నుంచి ఏమీ ఆశిస్తున్నారో ఆయనకి బాగా తెలుసు. 'మగధీర' తరువాత కాజల్‌తో మళ్లీ చేస్తున్నాను. దానయ్యగారి సంస్థలో తొలిసారిగా నటిస్తున్నాను' అన్నారు. 

దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ 'ఆకుల శివ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. దానికి తగ్గట్లు మాటలు కుదిరాయి. థమన్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది. మెగాభిమానులు రాంచరణ్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉంటుంది' అన్నారు.

No comments:

Post a Comment