బాలీవుడ్‌లో సౌత్‌నుంచి వెళ్లిన హీరోయిన్లు ఇప్పుడంతగా రాణించడంలేదు. ఇంతకు ముందు బాలీవుడ్ టాప్‌స్టార్స్‌తో నటించిన అసిన్‌కి సైతం భంగపాటు తప్పలేదు. అప్పట్లో శ్రీదేవి తర్వాత మళ్లీ సౌత్‌నుంచి రాణించిన హీరోయిన్లు అంతగా లేరనే చెప్పాలి. అయితే తాజాగా ఇలియానా ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్ రంగప్రవేశం చేసిన సంగతి విదితమే. ఆ చిత్రంలో ఇలియానా పూర్తి డీగ్లామరైజ్డ్‌గా కనిపించడం విశేషం. అయితే ‘బర్ఫీ’ చిత్ర నిర్మాతలు ఇలియానా నటనకు ముగ్ధులై మళ్లీ తాము తీయబోయే మరో రెండు చిత్రాలలోనూ ఇలియానాను నటించమని కోరారట. పైగా బాలీవుడ్‌కి ఓ మంచి హీరోయిన్ దొరికిందని ఇలియానాకు కితాబు ఇచ్చేశారు.

No comments:
Post a Comment