దర్శకుడు రోహిత్ శెట్టి గత వారం గోవాలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమం సందర్భంగా అమీషా పటేల్, సంజయ్ దత్ మధ్య గొడవ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో మనస్తాపానికి లోనైన సంజుబాబా ఆ కార్యక్రమానికి హాజరుకాకుండానే ముంబైకి తిరుగుముఖం పట్టాడన్నది వాటి సారాంశం. అమీషా వేసుకున్న జాకెట్ అసభ్యకరంగా అనిపించడంతో ఇతడు ఆమె భుజాల మీదుగా దుపట్టా కప్పే ప్రయత్నం చేశాడు. ఇలా చేయడం అమీషాకు నచ్చకపోవడంతో అతనిపై అరిచినట్టు తెలిసింది. సంజయ్ భార్య మాన్యత, అమీషా మంచి స్నేహితురాళ్లు కావడంతో ఇతడు కాస్త చొరవ తీసుకున్నాడని చెబుతున్నారు. అయితే అమీషా మాత్రం సంజయ్ పద్ధతిపై మండిపడ్డట్టు సమాచారం. తన వ స్త్రధారణపై కాస్త అతి చేశాడని ఈ బ్యూటీ తన స్నేహితురాళ్లతో చెప్పినట్టు తెలిసింది.
అతడు ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు కాబట్టే గొడవ పెట్టుకున్నానని చెప్పిందట. దీనికితోడు తాను నటించబోయే రెండు సినిమాల్లో పాత్రలు చేయాలని అమీషా కోరినా సంజయ్ తిరస్కరించడంతో వీరిద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ‘సంజయ్ సంప్రదాయ ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. స్త్రీలు అసభ్యంగా కనిపిస్తే సహించలేడు. అమీషా తనకు సోదరిలాంటిదని కూడా చెప్పాడు. అయితే ఆమె విపరీతంగా గొడవ చేసింది.
ఇలాంటి విషయాలను నాకు చెప్పడానికి నువ్వెవరు అంటూ దురుసుగా ప్రవర్తించింది. నా గురించి నీకు అనవసరం అని చెప్పడంతో షాక్‌కు గురయ్యాడు. మరునాడే ముంబైకి వెళ్లిపోయాడు’ అని సంజయ్ స్నేహితుడొకరు చెప్పాడు. అయితే ఇదే విషయాన్ని సినీ జర్నలిస్టులు అమీషా దగ్గర ప్రస్తావించగా ‘సంజయ్ నాకు సన్నిహిత మిత్రుడు. నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు. నన్ను ఎవరైనా బాధపెట్టినా అతడు సహించబోడు. ఇవన్నీ పుకార్లు. గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారం’ అని వివరించింది.

No comments:
Post a Comment