‘‘జెనీలియా పాలిటిక్స్‌లోకి రాబోతున్నారు. వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మామ విలాస్‌రావు దేశ్‌ముఖ్ తరఫున జెన్నీ ప్రచారంలో పాల్గొనబోతున్నారు’’. బాలీవుడ్‌లో హాట్ హాట్‌గా వినిపిస్తున్న గాసిప్ ఇది. ఈ పాలిటిక్స్ సెగ జెన్నీని అంటుకోవడానికి కారణం ఆమె మాజీ ముఖ్యమంత్రి కోడలు కావడమే అని పలువురు బాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని జెనీలియాని అడిగితే- ‘‘రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి? అదేం నేరం కాదే. అయినా ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే స్థితిలో లేను. నేను పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. నా ఇంటికోసం, నావారి కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే తప్పకుండా వస్తాను. దానికి మావారి అభిప్రాయమే కాదు... మా మామగారి అంగీకారం కూడా అవసరం.
నిజంగా అంకుల్‌కి నేను ప్రచారం చేస్తే మంచి జరుగుతుందనుకుంటే... ఆయన కోడలిగా ప్రచారానికి తప్పకుండా వెళతాను. అయితే... ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్పు మాత్రం ఎవరో పనిలేనివాళ్లు క్రియేట్ చేసినది. ఈ గాసిప్పుతో మా ఇంట్లో ఎవరికీ ప్రమేయం లేదు’’ అని చెప్పారు జెన్నీ. అల్లరి హాసినిని భవిష్యత్తులో రాజకీయ తెరపై చూసే అవకాశాలు ఎక్కువగా కన్పడుతున్నాయి... ఆమె మాటలను బట్టి.

No comments:
Post a Comment