ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవికి... అసెంబ్లీలో పెద్దపీట వేసేందుకు రంగం సిద్ధమైంది. ఆయనను కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) ఉప నేతగా ఎన్నుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పటికీ... అసెంబ్లీలో సాంకేతికంగా ఆ పార్టీ ప్రత్యేకంగానే కొనసాగుతోంది. అందుకే, పీఆర్పీ శాసనసభాపక్ష నేత హోదాలో చిరంజీవి శాసనసభలో ముందు వరుసలో కూర్చుంటున్నారు. ఈనెల 13 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. స్పీకర్ నాదెండ్ల మనోహర్ పీఆర్పీ విలీన ప్రకటనను ఈ సమావేశాల్లోనే చేసే అవకాశముంది.
అదే జరిగితే, కాంగ్రెస్ సభ్యుల్లో ఒకరిగా, అదీ తొలిసారి ఎమ్మెల్యేగా చిరంజీవి అసెంబ్లీలో వెనుక బెంచీలకు వెళ్లాల్సి వస్తుంది. సభలో చిరంజీవికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటే ఆయనను సీఎల్పీ ఉప నేతను చేయడమే ఉత్తమమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజ్యసభ ఎన్నికలు జరిగితే.. చిరంజీవికి ఎలాగూ పెద్దల సభకు వెళ్లడం ఖాయమని, ఈలోపు శాసనసభలో ఆయనకు గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.

No comments:
Post a Comment