Feb 9, 2012

మోపిదేవికి మద్దతుగా బీసీ సంఘాలు

బీసీ మంత్రి అయినందు వల్లనే మోపిదేవి వెంకట రమణను అగ్రకులాలు కుట్ర చేసి ఇరికించాయని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏపీ అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

నిజాయతీ గల, మచ్చలేని వ్యక్తి మంత్రి వెంకట రమణ అని ఆర్ కృష్ణయ్య అన్నారు. యాబై శాతం ఉన్న బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి పదవులు చేపట్టిన వారు బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని ఆయన అన్నారు. సీఎంకు తెలియకుండా రిమాండ్ రిపోర్టులో మంత్రి పేరును ఏసీబీ అధికారులు ఎలా చేరుస్తారన్నారు. ఈ సమావేశంలో సంస్ధ అధ్యక్షులు బర్రీ ప్రసాద్, పలు బీసీ సంఘాలకు చెందిన నేతలు రామకృష్ణయ్య, వంశీరాజ్, విజయకృష్ణ, చందు, మహేందర్ బాబు, నర్శింహ గౌడ్, ఎస్.కె.షహీదా బేగం, లక్ష్మిలు పాల్గొన్నారు. 

ఇది సీఎం కుట్ర: ఇనుకొండ సుబ్రమణ్యం.
సీఎం కుట్రతోనే ఇదంతా జరిగిందని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఇనుకొండ సుబ్రమణ్యం విమర్శించారు. మత్స్యకారుల కుటుంబానికి చెందిన మోపిదేవి వెంకట రమణను కావాలని ఇందులో ఇరికించారన్నారు.

No comments:

Post a Comment