Feb 27, 2012

మహేష్‌బాబుతో అక్షర!

ప్రిన్స్‌ మహేష్‌బాబు సుకుమార్‌ దర్శకత్వంలో నటించబోయే చిత్రంలో గతంలో అనుకున్నట్లుగా తమన్నా కాదని సమాచారం. డేట్స్‌ ఎడ్జెస్ట్‌మెంట్‌ చేయలేకపోవడంతో తమన్నాను కాదని ఇప్పుడు ఆమె స్థానంలో బెంగళూరు భామ అక్షరగౌడని మహేష్‌బాబు సరసన నటింపజేస్తున్నారని తాజా సమాచారం. మోడల్‌గా తన కెరీర్‌ ఆరంభించిన అక్షరగౌడ గతంలో కొన్ని బాలీవుడ్‌ సినిమాలలో నటించింది. ప్రస్తుతం జాన్‌ అబ్రహాంతో ఇంకా పేరు పెట్టని ఓ చిత్రంలో నటిస్తోంది. అక్షరగౌడకు గతంలో క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌తో ఎఫైర్‌ ఉండేదని ప్రచారం జరిగింది. కాగా అక్షర స్థానంలో కింగ్‌ ఫిషర్‌ భామ ఏంజిలా జాన్సన్‌ కూడా పోటీపడుతోందని...వీరిద్దరిలో మాత్రం అక్షరకే నిర్మాతలు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమయింది. హీరోయిన్‌ ఎంపిక మాత్రం జరగలేదు. మహేష్‌బాబు ఈ చిత్రంలో తొలిసారిగా లెక్చరర్‌గా నటిస్తున్నాడని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నాయి.

No comments:

Post a Comment