"నా జీవితంలో లవ్ ఫెయిల్యూర్స్ చాలానే ఉన్నాయి. కానీ ఈ 'లవ్ ఫెయిల్యూర్' మాత్రం నాది కాదు'' అని చెప్పారు సిద్ధార్థ్. బెల్లంకొండ సురేశ్ సమర్పణలో ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'లవ్ ఫెయిల్యూర్'లో ఆయన హీరోగా నటించారు. ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ ఆయనదే. నూతన దర్శకుడు బాలాజీ మోహన్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 17న (శుక్రవారం) విడుదలవుతున్న సందర్భంగా సిద్ధార్థ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
ఈ రోజుల్లో లవ్ ఫెయిల్ కాగానే కుర్రాళ్లు గడ్డాలు పెంచేసుకొని, బాగా మందు కొట్టేసి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. జీవితం అంటే అది కాదు. ప్రపంచంలో చాలామంది అమ్మాయిలున్నారు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది కాబట్టి లైట్ తీసుకొమ్మని చెప్పే సున్నితమైన సందేశం ఉండే సినిమా ఇది. 'లవ్ సక్సెస్' అని పెడితే రొటీన్‌గా ఉందని తీసేస్తారు.
అందుకే 'లవ్ ఫెయిల్యూర్' అనేది కొంచెం భిన్నంగా, ఎట్రాక్టివ్‌గా ఉంటుందని పెట్టాం. ఇది కొత్త సినిమా. ఓ ప్రయోజనాత్మక ఆధునిక దేవదాసు కథ. ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా నటించడం కొత్త అనుభూతి. నేను, అమలా పాల్ తప్ప అంతా కొత్తవాళ్లే నటించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని అసలైన కాలేజీల్లో షూటింగ్ చేశాం.
బాలాజీ వెరీ టాలెంటెడ్
ఇంతదాకా నేను చేసిన పదిమంది కొత్త దర్శకుల్లో ఇరవై రెండేళ్ల బాలాజీ మోహన్ వెరీ టాలెంటెడ్. విషయాన్ని చాలా క్లారిటీతో తీశాడు. ఓ నిర్మాతగా అతని పనికి చాలా సంతోషంగా ఉన్నా. అతను ఏ దర్శకుడి వద్దా పనిచెయ్యలేదు. కానీ ఎడిటింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. బాలాజీ మొదట ఈ కాన్సెప్టుతో 'హౌ టు మెస్సప్ ఇన్ లవ్' అనే పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్‌లో పెట్టాడు.
అది నాకు చాలా బాగా నచ్చి అతన్ని వెతికి పట్టుకొని రెండు గంటల సినిమా చేద్దామని చెప్పి చేశా. అతని పట్టుదల, కమిట్‌మెంట్ బాగా నచ్చి నేనే స్వయంగా ఈ సినిమా నిర్మించా. ఈ సినిమా ద్వారా ప్రతి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌కు లాభాలు వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నా. ఎటాకీ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై కంటిన్యూగా సినిమాలు చెయ్యాలనుకుంటున్నా. టాలెంట్ ఉన్న కొత్తవాళ్లని ప్రోత్సహిస్తా.
చక్కని నటి
పార్వతిగా అమల నటన ఎక్సలెంట్. మొదట ఆ పాత్రకు కొత్తమ్మాయిని తీసుకోవాలనుకున్నాం. కానీ పార్వతి పాత్రకు నటన తెలిసిన అమ్మాయైతే బాగుంటుందని తనని తీసుకున్నాం. ఎలాంటి పాత్రనైనా చెయ్యాలని చక్కని నటి అమల.
తమన్ సెకండ్ హీరో
తమన్ 'దూకుడు', 'బిజినెస్‌మేన్' సినిమాలతో మంచి టచ్‌లో ఉన్నాడు. ఇందులో చాలా మంచి బాణీలిచ్చాడు. రెండు పాటలకు నా వాయిస్ అయితే బాగుంటుందని నాచేత పాడించాడు. ఇందులోని పాటలు ఇప్పుడు ఎఫ్.ఎమ్.లో మారుమోగుతున్నాయి. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి రెండో హీరో తమనే. 'ధూమ్', 'ధూమ్2', 'బిల్లా' సినిమాలకు పనిచేసిన నిరవ్ షా సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్.
తదుపరి చిత్రాలు
నందినీరెడ్డి దర్శకత్వంలో బెల్లకొండ సురేశ్ నిర్మిస్తున్న చిత్రం చేస్తున్నా. ఇందులో సమంత హీరోయిన్. 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నా. దీపా మెహతా దర్శకత్వంలో 'మిడ్‌నైట్స్ చ్రిల్డెన్', గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'ఫస్ట్ క్లాస్ మెన్' సినిమా చేస్తున్నా.

No comments:
Post a Comment