కోయంబత్తూరు : తమిళనాడులో భారీ చోరీ జరిగింది. తిరుప్పూరు కుమరన్ రోడ్డులో జాయ్ అలుక్కాన్ నగల దుకాణంలో సోమవారం రాత్రి భారీగా ఆభరణాలు గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు. సిబ్బంది దుకాణం మూసివేసి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం షాపు తెరిచేసరికి ఆభరణాలు చెల్లాచెదరుగా పడిఉన్నాయి. రూ. 11 కోట్ల మేరకు నగల దోపిడీ జరిగింది. షాపు తెరిచిన మేనేజర్ రాజ్ తొలి అంతస్తులో తలుపులు తెరచిఉంచడం గమనించాడు. సమాచారం అందుకున్న ఎస్పీ బాలకృష్ణన్, డీఎస్పీ రాజారాం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మేనేజర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం 45 కిలోల బంగారు నగలు దోపిడీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ దోపిడీ తెలిసిన వారిపనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment