Feb 21, 2012

కొత్త కాంబినేషన్ప్‌ గురు!

ఏఒకప్పుడు హిట్‌ పెయిర్‌ అని అక్కినేని, వాణిశ్రీ, కృష్ణ...జయప్రద, శోభన్‌బాబు...జయసుధ, ఎన్‌టిఆర్‌...శ్రీదేవిలను చెప్పుకునేవారు. అయితే అప్పటితరానికి ఇప్పటితరానికి మర్పులు వచ్చేశాయి. హిట్‌ పెయిర్‌ అంటూ ఏమీ లేదు మాకు నచ్చిన జంటనే చూస్తామంటున్నారు ప్రేక్షకులు. అందుకే ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్లు చోటుచేసుకుంటున్నాయి. .రాబోయే సమ్మర్‌లో ఈ చిత్రాలన్నీ కూల్‌గా సందడి చేయనున్నాయి. పరుచూరి మురళి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి నిర్మిస్తున్న ‘అధినాయకుడు’లో యంగ్‌ బాలకృష్ణ సరసన సౌత్‌ హాట్‌ స్టార్‌ లక్ష్మీరాయ్‌ నటిస్తోంది. లక్ష్మీరాయ్‌ ‘కాంచన’ హిట్‌తో మళ్లీ అందరి దృష్టిలో పడింది. ఆమె నటించిన తమిళ చిత్రం ‘మాంగత్త’ కూడా హిట్‌గా నిలిచింది. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న చిత్రంలో తొలిసారిగా ఇలియానా అల్లు అర్జున్‌తో జతకట్టనుంది. 

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే రామ్‌చరణ్‌తేజ హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో ఎస్‌.వి.ప్రసాద్‌, పరాస్‌జైన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రచ్చ’ చిత్రంలో తొలిసారిగా తమన్నా రామ్‌చరణ్‌తో జతకట్టనుంది. ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ పవన్‌కళ్యాణ్‌తో నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో శృతిహాసన్‌ కథానాయికగా తొలిసారి పవన్‌కళ్యాణ్‌తో జతకట్టడం విశేషం. ఇక ‘సింహా’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీని అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న ‘దమ్ము’ చిత్రంలో త్రిష తొలిసారిగా యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటించడం విశేషం. ప్రముఖ నిర్మాత పరుచూరి కిరీటి ప్రకాష్‌ తోలేటి దర్శకత్వంలో హీరో రానా, జెనీలియాల తొలికలయికలో రూపొందించిన ‘నా యిష్టం’ విడుదలకు సిద్ధమయింది. ఇవన్నీ కూడా ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టులుగా చెప్పబడుతున్నాయి. మరి ఈ జంటలో ఏజంట సంచలన విజయాలను నమోదు చేస్తుందో వేచిచూద్దాం..

No comments:

Post a Comment