ఇటీవలే గోపీచంద్ వివాహ నిశ్చితార్దం హైదరాబాద్ లో దిల్షుక్ నగర్ కి చెందిన వ్యాపారవేత్త రాంబాబు కూతురు హరితతో జరిగింది. తరువాత, గోపీచంద్ స్వయంగా తన పెళ్లి శుభలేఖలు కూడా ఎంతో ఆనందంగా సినిపరిశ్రమలో వారికీ పంచడం మొదలుపెట్టేడు కూడా. అయితే, హట్టాతుగా వారి వివాహం రద్దు అయింది. పెళ్లి రద్దు కావడంతో మనస్తాపం చెంది హరిత తండ్రి రాంబాబు నిన్న (ఆదివారం) తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
గోపీచంద్ వివాహం రద్దు కావడానికి సరయిన కారణాలు తెలియనప్పటికీ, ఆస్ట్రేలియాలో యం.బి.ఏ.చదివిన హరిత ఎందుకో ఈ పెళ్ళికి నిరాకరించినట్లు సమాచారం. ఏదయినా ప్రేమ వ్యవహారమా లేక గతంలో గోపిచంద్ పై వచ్చిన ప్రేమ, పెళ్లి పుకార్లు కారణమా అనేది తెలియదు. మొన్న మొన్ననే ఒక మంచి 'మొగుడు' ఎలా ఉండాలో చూపించే చిత్రం చేసిన గోపి చంద్ కి మాత్రం శుభలేఖల దాక వచ్చిన పెళ్లి రద్దు కావడం, ఇప్పుడు ఈ సంఘటన నిజంగా ముందే తీరని వ్యధ కలిగించే వ్యవహారమైంది.

No comments:
Post a Comment