(ఆంధ్రజ్యోతి వార్త)
ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని సర్కారు నిర్ణయం
బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లకు ఉత్తర్వులు
పీజీ ప్రవేశ పరీక్ష రాసే అర్హత ఇక లేనట్లే!
హైదరాబాద్/గుంటూరు, ఫిబ్రవరి 13 : హౌస్‌సర్జన్లపై వేటు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పీజీ ప్రవేశ పరీక్ష రాయకుండా వారిని అనర్హులను చేయాలని నిర్ణయించింది. ఇంటర్న్‌షిప్‌లో హాజరు తక్కువగా ఉన్నవారికి 'ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్లు' ఇవ్వొద్దని రాష్ట్రంలోని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లకు ఫాక్స్ ద్వారా ఉత్తర్వులు పంపింది. దీంతో రాష్ట్రంలోని 1,980 మందిపై వేటు పడనుంది. సమ్మెలో పాల్గొనని అనంతపురం వైద్యకళాశాలకు చెందిన 100 మంది హౌస్‌సర్జన్లకే మినహాయింపు లభించనుంది. దీంతో హౌస్‌సర్జన్లు చాలాచోట్ల సూపరింటెండెంట్లను ఘెరావ్ చేశారు.
నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ చేసిన తర్వాత విద్యార్థులు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. జూనియర్ డాక్టర్ల ఆందోళనలో వీరూ పాల్గొంటున్నారు. దీంతో వీరికి 4-6 వారాల ఇంటర్న్‌షిప్ తక్కువ పడుతుందని వైద్య విద్యావర్గాలు చెబుతున్నాయి. హౌస్‌సర్జన్సీ పూర్తి కాగానే ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష రాస్తారు. ఈ పరీక్ష రాయాలంటే 365 రోజుల పాటు హౌస్‌సర్జన్సీ చేయడం తప్పనిసరి. సమ్మెలో పాల్గొంటున్న వారికి ఇందులో కొంత కోత పడుతుంది. వీరెవ్వరికీ ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్లు వచ్చే అవకాశాల్లేవు.
పీజీ ప్రవేశపరీక్ష దరఖాస్తుకు ఈ నెల 15వ తేదీ తుది గడువు. ఈలోపు ఇంటర్న్‌షిప్ పూర్తి కావాలి. కానీ హౌస్ సర్జన్లకు సూపరింటెండెంట్లు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఫలితంగా 1,980 మంది పీజీ ప్రవేశపరీక్షకు అనర్హులయ్యే ప్రమాదం ఉంది. గైర్హాజరైన కాలానికి సంబంధించి తిరిగి డ్యూటీలు చేయాలన్నా అందుకు 40 రోజులు సమయం పడుతుంది. అప్పటికే పీజీ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. దీంతో ఈ ఏడాది హౌస్ సర్జన్లకు పీజీ ప్రవేశ పరీక్ష ద్వారాలు మూసుకుపోయినట్లేనని భావిస్తున్నారు. సమ్మెను విరమించి విధుల్లో చేరితే ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని వైద్య విద్యా సంచాలకులు (అకాడమిక్) విష్ణుప్రసాద్ చెప్పారు.

No comments:
Post a Comment