ఈ నెల 26 న కర్నూలు పట్టణంలో జరగాల్సిన రామ్ చరణ్ 'రచ్చ' సినిమా ఆడియో వేడుక వాయిదాపడింది. ఇది మార్చి 4 న జరుగుతుంది. వేలాదిమంది అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ ఫంక్షన్ గా నిర్వించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ వేడుకకు పవన్ కల్యాణ్ అతిధిగా వస్తాడని ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంచితే, ఈ చిత్రానికి సంబంధించి ఇక రెండు పాటలు మాత్రం బ్యాలెన్స్ గా వున్నాయి. హీరో హీరోయిన్లపై వీటిని త్వరలో చిత్రీకరిస్తారు. మార్చ్ 29 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ పక్కన తమన్నా కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం చైనాలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు.

No comments:
Post a Comment