(సూర్య వార్త)
న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కేంద్ర హోంమంత్రి చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరం పాత్రపై విచారణ జరపాలంటూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను పాటియాల హౌస్ కోర్టు కొట్టివేసింది. దీంతో చిదంబరానిి, యూపీఏకు ఊరట లభించింది. 2జీ కేసులో చిదంబరానికి ఎటువంటి సంబంధం లేదని, చిదంబరాన్ని సహనిందితుడిగా చేర్చలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈరోజు పాటియాల హౌస్ కోర్టులో సుబ్రమణ్యస్వామికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఒపి సైనీ తీర్పు వెలువరించారు. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని, అవసరమైతే పాటియాల కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లతామని సుబ్రమణ్యస్వామి అన్నారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment