(ఆంధ్రజ్యోతి వార్త)
స్విస్ బ్యాంకుల్లో ఎక్కువ నల్లధనం మన వారిదే
బ్లాక్‌మనీని వెనక్కి తేవడం చాలా కష్టం
అవినీతి వ్యతిరేక చర్యలపై ఢిల్లీలో ఇంటర్‌పోల్ సదస్సు ప్రారంభం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: అక్షరాలా రూ. 25 లక్షల కోట్ల నల్లధనాన్ని విదేశీ బ్యాంకులలో మన వాళ్లు దాచుకున్నారట. ఈ విషయాన్ని ఏ విదేశీ సంస్థో వెల్లడించలేదు. మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఈ సంగతి బయటపెట్టింది. స్వయానా సీబీఐ డైరెక్టర్ ఎ.పి.సింగ్ ఈ నమ్మలేని నిజాన్ని వెల్లడించారు. అంతేకాదు స్విస్ బ్యాంకులలో అతి ఎక్కువ స్థాయిలో బ్లాక్‌మనీ దాస్తున్న వారిలో భారతీయులే ప్రథమ స్థానంలో ఉన్నారని కూడా ఈయన చెప్పారు. 'అవినీతి వ్యతిరేక చర్యలు- ఆస్తుల స్వాధీనం' అనే అంశంపై ఇంటర్‌పోల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి సదస్సును సింగ్ సోమవారమిక్కడ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. దాదాపు రూ. 25 లక్షల కోట్ల నల్ల ధనాన్ని భారతీయులు విదేశాల్లో దాచినట్లు వెల్లడించారు. స్విస్ బ్యాంకులలో అత్యధిక డిపాజిట్లు ఉన్నవాళ్లు భారతీయులేనని కూడా తెలుస్తోందన్నారు. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలుగా పేరుపడ్డ మారిషస్, స్విట్జర్లాండ్, లీష్టెన్‌స్టీన్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లాంటి ప్రాంతాలకు మన డబ్బు అక్రమ మార్గాల్లో తరలుతోందని చెప్పారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తగులుతోందన్నారు. "భారతీయులకు చెందిన దాదాపు 500 బిలియన్ డాలర్ల (రూ. 24.5 లక్షల కోట్లు) నల్లధనం విదేశా బ్యాంకులలో దాచినట్లు అంచనా'' అని చెప్పారు.
నిజానికి.. భారతీయుల నల్లధనం విదేశీ బ్యాంకులలో ఎంత ఉందన్న దానిపై అనేక అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. రూ. 25 లక్షల కోట్ల నుంచి రూ. 75 లక్షల కోట్ల వరకు ఈ డబ్బు ఉండొచ్చని పలువురు అంటున్నప్పటికీ.. వీటిపై తమ వద్ద ఎలాంటి అధికారిక లెక్కలు లేవని కేంద్రం ఇన్నాళ్లూ చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. 'గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ' అనే అంతర్జాతీయ సంస్థ ఒకటి విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం రూ. 25 లక్షల కోట్లు అని ఇటీవల ప్రకటించింది. సీబీఐ డైరెక్టర్ కూడా ఇప్పుడు ఇదే సంఖ్యను పేర్కొనడం గమనార్హం.
అక్రమార్కులకు కొత్త కొత్త అవకాశాలు
"ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకారం అతి తక్కువ అవినీతి గల దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్, ఐదో స్థానంలో ఉన్న సింగపూర్, ఏడో స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ వంటి దేశాలే మన దేశంలోని అవినీతిపరులకు స్వర్గధామాలుగా మారాయి'' అని సింగ్ వివరించారు. దోచుకున్న డబ్బును అవినీతిపరులు ఎక్కడ దాచారో తెలుసుకోవడం, దాన్ని స్తంభింపజేయడం, వెనక్కి తెప్పించడం అన్నది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని చెప్పారు. "ఎందుకంటే.. ఆయా దేశాల్లోని చట్టాలు ఇందుకు సహకరించాలి.
దర్యాప్తు ప్రతి దశలోనూ.. ఒక్కో ఖాతా వివరాల కోసం న్యాయపరమైన అభ్యర్థనను ఆయా దేశాలకు మనం పంపాలి. ఇదంతా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. పైగా ప్రభుత్వాల రాజకీయ నిబద్ధత కూడా ఇందుకు అవసరమే'' అని వివరించారు. నేరస్తులు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని.. వాళ్లు రెండు మూడు దేశాల్లో నేరాలు చేసి, మూడో దేశంలో పెట్టుబడి పెట్టి ఎవరికీ దొరక్కుండా తప్పించుకుంటున్నారని సింగ్ అన్నారు. "సీబీఐ ఇటీవల దర్యాప్తు చేసిన 2జీ స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ క్రీడలు, మధుకోడా అక్రమార్జన వంటి అవినీతి కేసుల్లో సొమ్మును మన దేశం నుంచి దుబాయ్, సింగపూర్, మారిషస్‌లకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి స్విట్జర్లాండ్ తదితర దేశాలకు మళ్లించినట్లు తేలింది.
నేరస్తులు ఇలా కొన్ని దొంగ కంపెనీలను సృష్టించి, కేవలం కొన్ని గంటల్లోనే ఒక కంపెనీ ఖాతా నుంచి మరో కంపెనీ ఖాతాకు సొమ్ము బదలాయిస్తూ.. విదేశాలకు డబ్బు దొంగచాటుగా తరలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ లావాదేవీలకు సరిహద్దులు లేకపోవడాన్ని వారు ఇందుకు అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు'' అని చెప్పారు. అంతేగాకుండా కమ్యూనికేషన్ల రంగం అభివృద్ధి చెందడం కూడా ఆర్థిక నేరగాళ్లకు వరంగా మారిందన్నారు. ఆర్థిక నేరాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుంచి మరో దేశంలోకి తరలిపోతున్న డబ్బు విలువ 1.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసిందని సింగ్ తెలిపారు. ఇక.. అవినీతి అన్నది పరిపాలనలో అతి పెద్ద సమస్యగా తయారైందని సింగ్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన 'యథారాజా తథా ప్రజా' అన్న ప్రాచీన సూక్తిని గుర్తు చేశారు. రాజు అవినీతిపరుడైతే.. ఆయన కింద ఉండే సిబ్బంది కూడా అలాగే ఉంటారని చెప్పారు. కాబట్టి పరిపాలనలో నీతిసూత్రాలను పాటించడం అన్నది ఏ సమాజాంలోనైనా సుపరిపానలకు కీలకమన్నారు. మన దేశ పరిపాలనలో అతి పెద్ద సవాలుగా అవినీతి నిలుస్తోందని చెప్పారు. కాగా.. 'అవినీతి వ్యతిరేక చర్యలు- ఆస్తుల స్వాధీనం' అనే అంశంపై ఇంటర్‌పోల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో 18 దేశాలకు చెందిన దర్యాప్తు అధికారులు భాగస్వాములవుతున్నారు. దేశా సరిహద్దులు దాటి జరుగుతున్న ఆర్థిక నేరాల గుట్టుమట్టులను విప్పడం, దొంగ సొమ్మును రికవరీ చేయడంపై సరికొత్త పద్ధతులను నేర్చుకుంటున్నారు.
జెనీవాలోని హెచ్ఎస్‌బీసీ ఖాతాల్లో 565 కోట్లు
నల్లధనంపై ప్రభుత్వ ముసాయిదా నివేదిక భారతీయులకు సంబంధించిన రూ. 565 కోట్ల నల్ల ధనం జెనీవాలోని హెచ్ఎస్‌బీసీ ఖాతాల్లో ఉందని.. నల్లధనంపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలోని సభ్యులకు అందించిన ఒక ముసాయిదా నివేదికలో కేంద్రం పేర్కొంది. భారతీయులకు చెందిన 350 ఖాతాలలో ఉన్న నల్లధనం వివరాలు తెలియజేయాలంటూ వివిధ దేశాలకు తాము లేఖలు రాశామని తెలిపింది. "అనుమానాస్పదంగా జరిగిన 30,765 ఆర్థిక లావాదేవీలను ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ సేకరించింది. దర్యాప్తు సంస్థలు వీటి వివరాలను సేకరిస్తున్నాయి'' అని పేర్కొంది.

No comments:
Post a Comment