(ఆంధ్రజ్యోతి వార్త)
రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాం నబీ అజాద్‌పై అమలాపురం కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సరిగా లేరని, పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరచడంలో అజాద్ విఫలమయ్యారని ఆరోపించారు. పీఆర్పీకి అంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా అంటూ హర్షకుమార్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడులూ ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ, మరో వర్గాన్ని పక్కన పెడుతున్నారని, ఇలా అయితే పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అన్నారు.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన దళితవర్గాన్ని పక్కనపెట్టారని హర్షకుమార్ విమర్శించారు. ఏ వర్గం కాంగ్రెస్‌కు ఓటు వేసిందో ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. శంకరరావును బర్త్‌రఫ్ చేసిన తర్వాత అదే వర్గానికి చెందిన వారిని ఎందుకు కేబినెట్‌లోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. తమకు పీఆర్పీ అంటే వ్యతిరేకత లేదని, పార్టీలో విలీనం అయిన తర్వాత కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరిందని, అయితే అందరినీ కలుపుకుపోయే విధంగా అధిష్టానం ఉండాలని హర్షకుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించిన సామాజిక వర్గాన్ని కాదని, వేరేవారికి పదవులు ఇవ్వడం సరికాదని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి ఆజాదే కారణమన్నారు. ఇందుకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. ఆజాద్ తీరును ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళతానన్నారు. ఓక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం మానుకోవాలన్నారు. బొత్స కోరిన విధంగా లిక్కర్ మాఫియాపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
నిజానికి చిరంజీవి తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పిదాల్లో ఒకటి రాజకీయాల్లోకి రావటం - అదీ స్వంతపార్టీతో. తన రామారావు స్థాయి నటుడననీ, ఆయనలాగా సునాయాసంగా ఓట్లుదండుకొని ముఖ్యమంత్రి నైపోతాననీ భావించటం కేవలం చిరంజీవి అజ్ఞానం. లేదా చిరంజీవి చుట్టూ చేరి ఆయనను యెగదోసినవారి అజ్ఞానం,అత్యాస. జరిగినదేదో జరిగి శృంగభంగం ఐనా తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేయక ఆయన ప్రజల దృష్టిలో పలుచనై పోయాడు. రాబోయే యెన్నికలో కాంగ్రెసువాడిగా ప్రచారం చేస్తే జనం నవ్వుతారు - నిన్న రాలినన్ని ఓట్లు గూడా రాలకపోగా - ఆయన ప్రతిపక్షులకు సహాయం చేసినవాడవుతాడు. అందు చేత మెల్లగా కాంగ్రెసు వాళ్ళు ఆయనను మెల్లగా క్రమంగా వదిలించుకొంటారనటంలో సందేహం యేమీ లేదు. అంతా చిరంజీవి స్వయంకృతం.
ReplyDelete