Jan 20, 2012

రెండేళ్ళ శిక్ష పూర్తయింది: కృష్ణంరాజు


''నేను పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో పాత్రలు సృష్టించడానికి రచయితలు కృషి చేసేవారు. భారతరామాయణ, బైబిల్‌ ఏదైతేనేం.. మత గ్రంథాల్లోని సారాన్ని తెరపైకి ఎక్కించేవారు. ఇప్పుడు ట్రెండ్‌మారింది. అలా రాయాలంటే కష్టపడాలి.. అప్పట్లో పొలం పనిచేసేవారు పంచె కట్టుకోవాలి...ఆ తరహా పాత్రలుండేవి. నేడు ఫ్యాంట్‌తోనే సాగు చేస్తున్నారు.. వంకాయ, బీరకాయలు మార్పుచెందలేదు. వాటిని వండేవిధానంలో మార్పువచ్చింది.. అలాంటి ప్రతిభావంతంగా వండే దర్శకులు నేడు పరిశ్రమకు కావాల్సింది.... అని వివరించారు నటుడు, నిర్మాత యు. కృష్ణంరాజు. ఆయన పుట్టినరోజు శుక్రవారం. పరిశ్రమలోకి వచ్చి 38 పుట్టినరోజు జరుపుకుంటున్నాను. అదికూడా ఫ్యాన్స్‌కోసమేనంటున్న ఆయన గురువారంనాడు విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు...
మిగతా బాషలకంటే మన సినిమాలు మెచ్చుకునేలా ఉన్నాయి. ఈ ఏడాది శుభపరిణామమే. విడుదలైన సినిమాలు సక్సెస్‌సాధించాయి. బిజినెస్‌మేన్‌ కథ పాతదే. నెగెటివ్‌ మెసేజ్‌ అందులో ఉంది. దాన్ని డైలాగ్స్‌తో, స్క్రీన్‌ప్లేతోగానీ దర్శకుడు మెస్మరైజ్‌ చేశాడు. అది డైరెక్టర్స్‌మూవీ. మన సినిమాల సక్సెస్‌ రేటు పడిపోవడానికి పలు కారణాలున్నాయి. అప్పటికంటే ఇప్పుడు కలెక్షన్లు పెరిగాయి. దానితోపాటు బడ్జెట్‌కూడా పెరిగింది. మన చిత్రాల్ని చూసి స్పీల్‌బర్గ్‌ అన్నట్లు.. ఒకే కథను 80ఏళ్ళపాటు తీస్తున్నారు. 'ఐ విల్‌ అప్రిషియేట్‌' అనడంలో ఆశ్చర్యం లేదు.
కార్పస్‌ఫండ్‌
దర్శకుడు, నిర్మాత తను తీసే సినిమాపై క్లారిటీ ఉండాలి. ఎటువంటి టెన్షన్‌లేకుండా ఫ్రీగా ఉండాలి. సగం సినిమా అయ్యాక... ఫైనాన్షియర్‌ సహాయంతో పూర్తిచేస్తే... చేజారిపోతుంది. ఈ సర్కిల్‌ నుంచి బయటపడాలి. అక్కడ డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌పై నిర్మాత ఆధారపడడు. అమెరికన్‌ సినిమాకూ మనకూ తేడా అదే. దీన్నుంచి బయటపడితేనే మంచి సినిమాలు వస్తాయి. సినిమా వ్యాపారం కోసమే టెక్నీషియన్స్‌ను, నటీనటుల్ని పెట్టుకోవాల్సి వస్తుంది. నిర్మాత ధైర్యంగా సినిమా తీయాలంటే... ఇండిస్టీకి డబ్బులు ఇచ్చేట్లు 'కార్పస్‌ఫండ్‌'లా ఏర్పాటుచేసే బ్యాంక్‌ కావాలి. దాని గురించి పెద్దలు ఆలోచించాలి.
దర్శకత్వం, రాజకీయం
ఈ ఏడాది రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాను. గతంలో నాకు నేను వేసుకున్న రెండేళ్ళ శిక్ష పూర్తయింది. అందుకే ముందుకు వస్తున్నా. ఏ పార్టీ అనేది తర్వాత చెబుతాను. ఇది కాకుండా ఈ ఏడాది దర్శకత్వం కూడా చేస్తున్నాను. కథ బాగుంది. 'మన ఊరి పాండవులు' తరహా స్క్రిప్ట్‌. యుగాన్ని బట్టి ధర్మం మారినట్లు... అవినీతికూడా మారిపోయింది. స్వాతంత్య్రానికి ముందుకంటే ఇప్పుడు అవినీతి ఎక్కువైంది. దాని నిర్మూలించాలంటే యువతను ఎలా ఇన్‌స్పైర్‌ చేయాలి అనేది కాన్సెప్ట్‌.
బొబ్బిలిబ్రహ్మన్న సీక్వెల్‌
ప్రభాస్‌ కెరీర్‌ నేను ఊహించినదానికంటే ఎక్కువగా ఎదిగింది. ఆర్టిస్టుగా నేను నేర్చుకోవాల్సిన స్థాయికి పెరిగాడు. 'రెబల్‌' సినిమాలో మంచి పాత్ర పోషించాను. ఆ పాత్ర చేసేటప్పుడు పబ్లిక్‌నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నాకు నచ్చిన పాత్రల్లే చేస్తున్నాను. చాలామంది బొబ్బిలిబ్రహ్మన్న తరహా క్యారెక్టర్లు చెబుతున్నారు. ఎన్నిసార్లు చేస్తాం అటువంటివి. కొత్తవికావాలి.. బొబ్బిలిబ్రహ్మనుకు సీక్వెల్‌ చేయాలనుంది. అదేవిధంగా ప్రభాస్‌కు 'భక్తప్రహ్లాద' అంటేఇష్టం అటువంటి సినిమాకూడా త్వరలో చేస్తాం. డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'విశాల నేత్రాలు' కూడా వస్తుంది. ఇప్పటి నిర్మాణవ్యయం బట్టి 45కోట్లు అవుతుంది. సరైన సమయం చూసి దాన్నిపూర్తిచేస్తాం. ఇవి కాకుండా శనీశ్వరుడుపై సీరియల్‌ ఒకటి చేయాల్సి ఉంది.
అంతా విశ్రాంత నిర్మాతలే
నిర్మాతకు ప్రధాన సమస్య కొత్తగా వచ్చిన వ్యాట్‌ విధానం. అది పక్కరాష్ట్రంలో లేదు. ప్రతి నిర్మాతకూ ఆ విషయం తెలుసు. దానివల్ల ఎన్నోలక్షలు నిర్మాత నష్టపోతున్నాడు. అదంతా వదిలేసి... కార్మికుడి బేటా రూపాయి ఎందుకు పెంచాలి? ప్రొడక్షన్‌లో నాన్‌వేజ్‌ ఎందుకువేయాలి? వంటి చిన్న విషయాలను సీరియస్‌గా తీసుకుంటున్నారు. అసలు నిర్మాత కష్టాల గురించి చర్చించే సమావేశానికి లీగల్‌ ఎడ్వయిజర్‌, ఆడిటర్‌ను కూడా పిలిస్తే... మరిన్ని విషయాలు కూలకషంగా చర్చించవచ్చు. అప్పుడే ముఖ్యమంత్రికిగానీ, కేంద్రానికిగానీ సరైన వివరణ ఇవ్వగలం. ఇప్పుడు కమిటీలోఉన్నవారంతా.. రిటైర్‌ అయినవారే.. ప్రజెంట్‌ నిర్మాతలు లేరు. (ప్రజాశక్తి సినిమా వార్త)

No comments:

Post a Comment