ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:
‘తెలంగాణలో ఏం జరుగుతున్నదనే విషయంపై సోనియాగాంధీ సొంతంగా విచారణ (ఎంక్వైరీ) చేయిస్తున్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చే దొంగ నివేదికలపైనే ఆమె ఆధారపడడం లేదు. జిల్లాకు 60-70 మందిని పంపించి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు నాకు సమాచారం ఉంద’ని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం కేసీఆర్ వ్యాఖ్యలిలా ఉన్నాయి. ‘కేవలం ప్రభుత్వం, గవర్నరు ఇచ్చే నివేదికలను సోనియాగాంధీ గుడ్డిగా నమ్మడం లేదు. తెలంగాణను వ్యతిరేకిస్తున్నవారు ఇచ్చే నివేదికలు తెలంగాణలోని పరిస్థితికి పూర్తిభిన్నంగా ఉన్నాయని ఆమెకు కూడా అర్థమైంది. క్షేత్రస్థాయికి వెళితే సానుకూలంగానే నివేదికలు వస్తాయి. త్వరలోనే సానుకూల నిర్ణయం రావచ్చు’నని కేసీఆర్ అభిప్రాయపడినట్లుగా తెలిసిం ది. ‘కాంగ్రెస్ అధిష్టానానికి ఎవరు సలహాలు ఇస్తున్నరో ఏమో.. నిజంగా వారికి బుర్ర ఉంటే ఉత్తరప్రదేశ్ సీఎం మాయావతి చేసిన తీర్మానం అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ ఏర్పాటుచేయాలి. ఈ నిర్ణయం తీసుకుంటే అక్కడ యూపీలోనూ, ఇక్కడ ఏపీలోనూ రాజకీయంగా లాభపడొచ్చు. పరిస్థితులన్నీ అను కూలంగాఉన్నాఎందుకు తాత్సారం చేస్తున్నరో..ఏమో..?’ అని వ్యాఖ్యానిం చినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలే కాకుండా అధికారపక్ష ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వంపై అసహనంగా ఉన్నారని కేసీఆర్ అభిప్రాయ పడినట్లు సమాచారం. ‘అవిశ్వాస తీర్మానం నెగ్గి, ప్రభుత్వం పడిపోయే పరిస్థితులున్నాయి. ఈ సమయంలో జగన్ వైఖరి, ఆయన వెంటవచ్చే ఎమ్మెల్యేల బలమే కీలకం కానుంది. సంఖ్యాబలం ఎంత అనేది చాలా ముఖ్యం’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నేడు వరంగల్‌కు కేసీఆర్ హైదరాబాద్: నాసా చట్టం కింద అరెస్టయిన టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పరామర్శించడానికి పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం వరంగల్‌కు వెళ్లనున్నారు. చెరుకు సుధాకర్‌ను కలవడానికి జైలు అధికారుల నుంచి కేసీఆర్ ఇప్పటికే అనుమతి తీసుకున్నట్లుగా పార్టీవర్గాలు ప్రకటించాయి. గురువారం ఉదయమే వరంగల్‌కు కేసీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు. |


















































