Sep 30, 2011

రాష్ట్రం అంధకారమే !


ఈ రోజు సూర్య దినపత్రిక లో వచ్చిన వార్త ఇది:


రాష్ట్రంలో అంధకారం అలుముకోనుంది. నేటినుంచి రాష్టవ్య్రాప్తంగా కరంటు కోతలు మరింత ఎక్కువ కానున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోళ్లు గడువు ముగియడంతో రాష్ట్రం యావత్తూ చీకటిలో మగ్గనుంది. సకల జనుల సమ్మె ప్రభావంతో రామగుండం శుక్రవారం ఎన్టీపీసీకి బొగ్గు కొరత ఏర్పడింది. ఈ కారణంతో ఎన్టీపీసీ 7వ యూనిటల్‌లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం నుంచి పరిశ్రమలకు కూడా రెండురోజుల పవర్‌హాలిడేను ప్రకటించను న్నారు. ప్రస్తుతం 268 మిలియన్‌ యూనిట్లకుగాను 233 మిలియన్‌ యూనిట్ల విద్యు త్‌ మాత్రమే సరఫరా జరుగుతోంది.

ఈ తరుణంలో రాష్ట్రంలోని అన్ని థర్మల్‌ కేంద్రాలనూ ఒక్కటొక్కటిగా మూత వేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీని ప్రభావం గృహావసర విద్యుత్‌ సరఫరాపై పడింది. డిమాండ్‌ మేరకు విద్యుత్‌ ఉత్పాదన నమోదు కాకపోవడం వల్ల రాష్టవ్య్రాప్తంగా విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా పలు గ్రామాల్లో 6 నుంచి 8 గంటల పాటు సరఫరా నిలిపివేస్తున్నారు. పట్టణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల చొప్పున కోత విధించారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తున్నామని ట్రాన్స్‌కో చెబుతున్నా..వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. సమ్మె కొనసాగితే..పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకూ విద్యుత్‌ను నిలిపివేయాల్సి వస్తుందనే ఆందోళన ట్రాన్స్‌కో అధికారుల్లో వ్యక్తమౌతోంది. సింగరేణిలో బొగ్గు తవ్వకాలు స్తంభించిపోయిన ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపైనా పడటంతో పొరుగు నుంచీ విద్యుత్‌ను కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు.

పండుగల్లో కోత లేకుండా చర్యలు : సీఎం
పండుగ రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్‌ కోత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సకల జనుల సమ్మె ప్రభావంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. రానున్న దసరా పండుగను పురస్కరించుకుని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగ రద్దీ దృష్ట్యా 500 అద్దె బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
Read more ...

ఆల్‌టైమ్ రికార్డు దిశగా 'దూకుడు'


                                           ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:

మహేశ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన 'దూకుడు' చిత్రం 80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు దిశగా దూసుకుపోతోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జి. రమేశ్‌బాబు సమర్పణలో నిర్మించిన 'దూకుడు' (డేరింగ్ అండ్ డాషింగ్) చిత్రం విడుదలైన తొలి వారం రోజుల్లోనే రూ. 50.07 కోట్ల గ్రాస్, రూ. 35.01 కోట్ల షేర్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించిందని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తెలిపారు.

"ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర భారతదేశంతో పాటు విదేశాల్లోనూ సంచలనం విజయం సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రిక 'దూకుడు' సాధించిన అద్భుత విజయంపై స్పెషల్ ఆర్టికల్స్ రాయడం చూస్తే అక్కడ ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ సృష్టిస్తున్నదో తెలుస్తోంది'' అని వారు చెప్పారు.

వారు అందించిన వివరాల ప్రకారం 'దూకుడు' రికార్డుల వివరాలు...
నైజాం - గ్రాస్ రూ. 12.51 కోట్లు, సీడెడ్ - 6.30 కోట్లు, గుంటూరు - 2.84, కృష్ణా - 2.11, నెల్లూరు - 1.25, తూర్పు గోదావరి - 2.25, పశ్చిమ గోదావరి - 1.75, వైజాగ్ - 2.90, కర్ణాటక - 4.55, ఒరిస్సా - 0.45, ఉత్తర భారతం - 0.60, తమిళనాడు - 1.05, యు.ఎస్.ఎ. - 8.12, యు.కె. - 1.26, ఆస్ట్రేలియా - 0.65, మలేషియా, సింగపూర్ - 0.48, ఓవర్సీస్ (ఇతరం) - 1.00 కోట్లు. మొత్తం - గ్రాస్ రూ. 50.07 కోట్లు, షేర్ రూ. 35.01 కోట్లు.
Read more ...

‘టీ’ బంతి మళ్లీ రాష్ట్రానికి!


ఈ రోజు సూర్య దినపత్రిక లో వచ్చిన వార్త ఇది:
తెలంగాణ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్చార్జి గులాం నబీ ఆజాద్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి నివేదిక ఇవ్వడానికి ముందే హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన మళ్లీ కథ మొదటికొచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేయడం ద్వారా.. తెలంగాణ అంశాన్ని మరికొంత కాలం నాన్చివేసే వ్యూహంతో కాంగ్రెస్‌ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

రాష్ట్రంలోని కాంగ్రెస్‌, తెలుగుదేశం, మజ్లిస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయాలు చెప్పలేదని, వారి అభిప్రాయాల కోసం మరోసారి అఖిలపక్షం ఏర్పాటుచేయవలసి ఉందని చెప్పారు. దీన్ని బట్టి అఖిలపక్షం, అందులో పాల్గొనే రాజకీయ పార్టీలు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాలను ఆసరా చేసుకుని, మరికొంతకాలం తెలంగాణ అంశాన్ని సాగదీయాలని కేంద్రం యోచిస్తున్నట్లు చిదంబరం మాటల్లో స్పష్టమవుతోంది.

తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన కేంద్రం ఆ బాధ్యత నుంచి తప్పించుకుని బంతిని మళ్లీ రాష్ట్రం కోర్టులో నేర్పుగా నెట్టివేస్తున్నట్లు చిదంబరం మాటలు చెప్పకనే చెబుతున్నాయి. ఎలాగూ టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ అఖిలపక్ష సమావేశానికి రావని, సమావేశానికి హాజరయ్యే మజ్లిస్‌ రాష్ట్ర విభజనకు అంగీకరించదని, కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రతినిధులు స్వంతంగా ఎలాంటి అభిప్రాయం ప్రకటించే అవకాశం లేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణపై నోరు విప్పదు కాబట్టి, అఖిలపక్షం పేరుతో మరికొంత కాలం సాగదీయవచ్చన్న వ్యూహంతో వెళుతోంది.

ఇదిలాఉండగా.. కేంద్రానికి 2-జి స్పెక్ట్రం వ్యవహారం గుదిబండగా పరిణమించిన నేపథ్యంలో, అది తేలేవరకూ తెలంగాణ అంశాన్ని ఈ విధంగా అఖిలపక్షం, ఏకాభిప్రాయ సాధన పేరుతో గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. ఆర్‌బీఐ చైర్మన్‌ డి.సుబ్బారావు నివేదిక కేంద్రాన్ని వణికించే స్థాయిలో ఉండటంతో ప్రస్తుతం అధిష్ఠానం తెలంగాణ అంశానికి ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఈ క్రమంలోనే ఒకవైపు అఖిలపక్షంతో సమావేశాలు, కేంద్రానికి బృందాల రాక వంటి చర్యల ద్వారా తాము తెలంగాణ అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలు ఇవ్వనుంది. అహ్మద్‌పటేల్‌ సైతం తెలంగాణపై మరికొన్ని భేటీలు జరగాలని, ఆ తర్వాతే దానిపై ఓ నిర్ణయం తీసుకోగలమని చెప్పడం ద్వారా.. తెలంగాణపై కేంద్రం వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో జరుగుతున్న బందులను దృష్టిలో ఉంచుకుని బందులు జరగడం వల్ల అభివృద్ధి ఆగిపోతుందని వ్యాఖ్యానించడం ద్వారా తన అసంతృప్తి చెప్పకనే చెప్పినట్టయింది.
Read more ...

నవరసాల జల్లు.. అల్లు!


ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:
                                             
                                               ఈ రోజు పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి 


'రామలింగయ్యగారు డాక్టరూ.. యాక్టరూ. మానసిక బాధలకు హాస్యాన్ని మందుగా ఇస్తాడు. శారీరక రుగ్మతలకు మందును మాత్రం హాస్యంగా ఇవ్వడు' అని ఓ సందర్భంలో పద్మశ్రీ అల్లు రామలింగయ్య గురించి ఆచార్య ఆత్రేయ చెప్పిన మాటలు అక్షరసత్యాలు. ఎందుకంటే దాదాపు 50 ఏళ్ల పాటు తన నటనతో ప్రేక్షకులకు కితకితలు పెట్టించి కడుపుబ్బ నవ్వించి హాస్యానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారారాయన.

కామెడీ ఆర్టిస్టుగానే కాకుండా కేరెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, సైడ్ విలన్‌గా రకరకాల పాత్రలో ్ల ఒదిగిపోయి ఆ యా పాత్రల్లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. స్వతహాగా హోమియో వైద్యుడైన రామలింగయ్య ప్రేక్షకుల నాడిని సరిగ్గా పట్టుకోవడంలో విజయం సాధించారు. ముఖ్యంగా కామెడీ ఆర్టిస్టుగా ఆయన టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఇతరులు అనుకరించాలన్నా వీలులేనవి. మెలికలు తిరిగిపోతూ ఆయన చెప్పే డైలాగులు అందర్నీ నవ్వించేవి.

రామలింగయ్య నటనకు పునాది నాటకరంగం. ప్రజానాట్యమండలి కళాకారుడైన రామలింగయ్య 'కూడు గుడ్డ', 'ఆడది', 'పల్లెపడుచు', 'పశ్చాత్తాపం' వంటి నాటకాలు ప్రదర్శిస్తూ ఊరూరు, వాడవాడ తిరిగేవారు. వీటిల్లో 'పశ్చాత్తాపం' నాటకంలోని పేరయ్య శాస్త్రి పాత్ర ఆయనకు పేరు తేవడమే కాదు ఎన్నో బహుమతులను సంపాదించి పెట్టింది. అంతేకాదు రామలింగయ్య సినీరంగ ప్రవేశానికి ఈ పాత్రే దారి చూపించింది.

ప్రజానాట్యమండలి సభ్యుడైన డా.గరికపాటి రాజారావు ఆ నాటి మద్రాసు చేరి 'పుట్టిల్లు' పేరుతో చిత్రనిర్మాణం ప్రారంభిస్తూ , ఇతర సభ్యులకు కూడా ఇందులో అవకాశాలు కల్పించారు. 'పశ్చాత్తాపం' నాటకంలో పేరయ్య శాస్త్రి పాత్ర బాగా పేరు తేవడంతో 'పుట్టిల్లు'(1953) చిత్రంలో అదే పాత్రను 'శాస్త్రులు' పేరుతో అల్లు రామలింగయ్యతో పోషింపచేశారు రాజారావు. ఆ పాత్రను ఆయన పోషించిన వేళావిశేషం ఏమిటో కానీ ఆ తరువాతి కాలంలో శాస్త్రి పాత్ర అనగానే దర్శకనిర్మాతలకు రామలింగయ్యే గుర్తుకు వచ్చేవారు.

1957లో వచ్చిన 'మాయాబజార్' చిత్రంలో 'తానా శాస్త్రి.. తందానా శర్మ' పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండే పాత్రలు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన 'దొంగరాముడు' సినిమాలో హాస్టల్ వార్డెన్ వేషం వేశారు రామలింగయ్య. ఆ పాత్రతో కె.వి. దృష్టిల పడటంతో ఆయన 'మాయాబజార్' చిత్రంలో శర్మ వేషం రామలింగయ్యకు ఇచ్చారు. అంతే. ఈ చిత్రంలో ఆయన పోషించిన 'తందానా శర్మ' పాత్ర దాదాపు 20 ఏళ్ల సినీ జీవితాన్ని ప్రసాదించింది.

ఇలా 'మాయాబజార్' చిత్రంలో శర్మ పాత్రతో రామలింగయ్య కెరీర్‌కు ఊతాన్నిచ్చిన కె.వి. స్వీయదర్శకత్వంలో తను నిర్మించిన 'శ్రీకృష్ణార్జున యుద్ధం' సినిమాలో 'చిన ముని' పేరుతో మరోసారి బ్రాహ్మాణుని పాత్ర ఇచ్చారు. అంతే కాదు ఎన్టీఆర్, ఎఎన్నార్‌లాంటి అగ్రశ్రేణి కథానాయకులు నటించిన ఆ చిత్రంలో రామలింగయ్యకు ప్రత్యేకంగా ఓ పాట పెట్టడం ఓ విశేషం. 'అంచెలంచెలు లేని మోక్షం చాల కష్టమే భామినీ' అని సాగే ఆ పాట ప్రేక్షకుల్ని కావలసినంత వినోదాన్ని అందించి రామలింగయ్య స్థాయిని పెంచింది. అప్పటినుంచి ఎన్నో చిత్రాల్లో శాస్త్రి వేషాలు వేసినప్పటికీ ప్రతి పాత్రకు మధ్య వైరుధ్యాన్ని ప్రదర్శించడంతో ఆడియన్స్ ఎప్పుడూ మొనాటనీ ఫీలవలేదు.

రేలంగి తరువాత పద్మశ్రీ పురస్కారం పొందిన హాస్యనటుడు రామలింగయ్యే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి 'కళై సెల్వం' , ఫిలింఫేర్ లైఫ్ టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డ్ ... ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఆయన్ని వరించాయి. తమ విలువని పెంచుకున్నాయి.

జీవించి ఉండగానే తను పుట్టిన పాలకొల్లు నడిబొడ్డున కాంస్య విగ్రహ ప్రతిష్ట జరగడం, ఆయన శ్రేయోభిలాషి, ఆ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపబడటం... ఏ కళాకారుడికైనా ఇంతకంటే ఏం కావాలి?

Read more ...

ఆజాద్‌ నివేదిక అంతరార్థం అదే...


ఈ రోజు సూర్య దినపత్రిక లో వచ్చిన వార్త ఇది:
తెలంగాణ అంశంపై తాను ఇచ్చిన గడువు శుక్రవారంతో తీరిపోయిన నేపథ్యంలో ఆజాద్‌ మధ్యాహ్నం అధినేత్రి సోనియా గాంధీని కలసి నివేదిక సమర్పించారు. 45 పేజీలు, నాలుగు అధ్యాయాలతో కూడిన ఈ నివేదికలో ఆజాద్‌ తెలంగాణపై నిర్దిష్ట సిఫారసులేవీ చేయలేదని తెలుస్తోంది. 
  • విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆజాద్‌ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ....
  • సకల జనుల సమ్మె, ఇతర ఆందోళనల ఫలితంగా అభివృద్ధి ఆగిపోయింది...
  • సమన్వయంతో కూడిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది...
  • తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నష్టం...
  • అధిష్టానం ఆలోచనా ధోరణి, వైఖరి గుర్తించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు.
  • దీనివల్ల పార్టీకి ఇంకా నష్టం జరుగుతుంది...
  • ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్రం చేజారిపోయే ప్రమాదం...
  • కొంతకాలం పాటు కేంద్రపాలిత ప్రాంతం...
  • ఆదాయం రెండు ప్రాంతాలకు చెరి సమానం...
  • చండీగఢ్‌ తరహా ఉమ్మడి రాజధాని...
  • ఆరవ సిఫార్సు ప్రాధాన్యం... రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వచ్చిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికలోని ఆరవ సిఫారసుకే ఆజాద్‌ ప్రాధాన్యం ఇచ్చినట్టు చెబుతున్నారు. రెండు ప్రాంతాలకు కలిపి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, వచ్చే ఆదాయాన్ని రెండు ప్రాంతాలకు చెరి సమానంగా పంచాలని ఆరవ సిఫారసులో శ్రీకృష్ణ పేర్కొన్నారు. ఉభయ ప్రాంతాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఉమ్మడి రాజధాని ప్రతిపాదనే ఆమోదయోగ్యంగా, ఆచరణ సాధ్యంగా ఉంటుందని ఆజాద్‌ ప్రతిపాదించినట్టు సమాచారం. సీమాంధ్రలో నిలిచేందుకే.... ఆజాద్‌ ఆషామాషీగా ఈ నివేదిక తయారు చేయలేదని, భవిష్యత్తులో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంతాన్ని కాపాడుకునేందుకే ఉమ్మడి రాజధాని ప్రతిపాదన చేశారని కాంగ్రెస్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో ఆర్థికంగా, సామాజికంగా బలమున్న నేతలంతా పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆజాద్‌ పసిగట్టారని వారంటున్నారు. ఇప్పటికే జగన్‌ పార్టీ వైపు సీమాంధ్ర నుంచి పలువురు కీలక నాయకులు వలస వెళ్నిన నేపథ్యంలో ఉన్న వారినైనా దారి తప్పకుండా నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోనే ఆజాద్‌ ఈ ప్రతిపాదన చేసినట్టు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దూకుడుకు అడ్డుకట్ట కోసమే... అదీ కాకుండా ఇటీవలి కాలంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, గతంలో సీమాంధ్ర నేతలు సమన్వయం చేసుకోకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతుండటం పార్టీకి ఇబ్బందికర పరిణామం అని ఆజాద్‌ గుర్తించారంటున్నారు. ప్రత్యేకించి టీ కాంగ్రెస్‌ నేతలు ఇటీవల అధిష్ఠానంపై పూర్తి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కేకే లాంటి వారు ఇటు ముఖ్యమంత్రినీ, అటు అధిష్ఠానం పెద్దలనూ దాదాపు కించపరచే ధోరణిలో మాట్లాడారు. మరి కొందరు మరీ ముందుకు పోయి తెలంగాణ ఆందోళన విషయంలో ముఖ్యమంత్రి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారన్న ఆరోపణలు మొదలు పెట్టారు. ఇక సీమాంధ్ర ప్రాంతం నేతలూ తక్కువ తినలేదు. ఇటు టీ కాంగ్రెస్‌ నేతలపై ఎదురు దాడికి దిగుతూ అధిష్ఠానాన్ని ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల నేతలనూ కట్టడిలో పెట్టి భవిష్యత్తులో పార్టీ మరింత దిగజారి పోకుండా చూసేందుకే ఆజాద్‌ తన నివేదికలో ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. చండీగఢ్‌ ప్రయోగం... గతంలో పంజాబ్‌, హర్యానాకు ఉమ్మడి రాజధానిగా చండీగఢ్‌ ఉన్నట్టే ఇప్పుడు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఖరారు చేస్తే ఏ ఇబ్బందీ ఉండదని ఆజాద్‌ తన నివేదికలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. అలాంటప్పుడు ఎవరికీ అభ్యంతరం ఉండదని, ఇరు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి ఒప్పించవచ్చునన్న అభిప్రాయాన్ని ఆజాద్‌ తన నివేదికలో వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరో ప్రత్యామ్నాయం కేంద్రపాలితం... ఆజాద్‌ తన నివేదికలో పేర్కొన్న మరో ప్రత్యామ్నాయం కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం. కొంతకాలం పాటు ఇలా చేసి, రాజధానిగా హైదరాబాద్‌నే కొనసాగించి వచ్చే ఆదాయాన్ని రెండు ప్రాంతాలకూ సమానంగా కేటాయించాలని, తద్వారా అన్ని చోట్లా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రాంతీయ వాదన్ని, ఆందోళనలను చల్లార్చవచ్చునన్న అభిప్రాయాన్ని సైతం ఆజాద్‌ తన నివేదికలో వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read more ...

బంద్‌లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొం టున్న మాట వాస్తవమే కేసీఆర్‌


ఈ రోజు సూర్య దినపత్రిక లో వచ్చిన వార్త ఇది:

జంటనగరాల ‘బంద్‌’కు దయచేసి అన్ని వర్గాల ప్రజలు సహకరించండి... సమీప భవి ష్యత్తులో ఇక బంద్‌లుండవంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధినేత కే.చంద్రశేఖర్‌రావు గురువారం సాయం త్రం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ఇదే అంశా న్ని ప్రస్తావించారు. బంద్‌లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొం టున్న మాట వాస్తవమేనని, సమీప భవిష్యత్తులో ఇక బంద్‌ పిలుపులివ్వొద్దని నిర్ణయించుకున్నామన్నారు. నిన్నటి.. మొన్న టి వరకు తమ ప్రజలు ఎన్ని ఇబ్బందులకైనా సిద్ధమేనంటూ, తెలంగాణ సాధించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పుకుంటొచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలు ఒక్కసారిగా స్వరం మార్చ డం సర్వత్రా చర్చంశనీయంగా మారింది.

బంద్‌లు, రైల్‌రోకో లు, ఆటోల బంద్‌తో తెలంగాణ ప్రజానీకం ఉక్కిరి బిక్కిరవు తున్నారనే విషయాన్ని టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం ఆలస్యంగా గ్రహించినట్లు తెలుస్తోంది. సకల జనుల సమ్మె విజయవం తంగా కొనసాగుతుందని చెప్పుకుంటూ వస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకత్వం అంతర్లీనంగా పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను అంచనా వేసే పనిలో పడింది. తెలం గాణ జిల్లాలో అత్యంత వైభవోపేతంగా జరుపుకునే దసరా పండుగకు ముందు ‘సకలం’ బంద్‌ కావడాన్ని సాధరణ ప్రజ లు, నాల్గవ తరగతి ఉద్యోగులు జీర్ణించు కోలేకపో తున్నారు. పండుగ ముందు పనిదినాలకే వేతనమంటూ ప్రభుత్వం మెలిక పెట్టడంతో నాల్గ వ తరగతి ఉద్యోగులు నెత్తిన పిడుగు పడ్డట్లయింది. కొత్త బట్ట లు, పిండి వంటలు లేకుండా దసరా పండుగ ఏలా జరుపుకునేదంటూ తమలో, తామే మథనపడిపోతున్నారు.

hyderabadఅ ప్పు చేద్దామన్న తోటి ఉద్యోగులు సైతం సమ్మెలోనే పాల్గొనడం వల్ల అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారికి సమ్మెలో పాల్గొన్న జీతం కంటే గీతమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బందులేమి లేవన్నారు. తమలాంటి వారి పరిస్థితి దారుణం గా తయారయిందని కొన్ని ప్రభుత్వశాఖల నాల్గవ తరగతి ఉద్యోగులు వాపోతున్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా రాజకీయ జేఏసీ ఇస్తున్న బంద్‌లు, రైల్‌రోకోలు, ఆటో బంద్‌ పిలుపులతో జనజీవనం అస్తవ్యస్థంగా తయారవుతోంది.

బంద్‌లు, రాస్తారోకోలు, రైల్‌ రోకోలపై ప్రజల్లో క్రమేపీ వ్యతిరేకత పెరగుతోందని టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం ప్రాథమికంగా ఒక అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రవాణా రంగం తీవ్రంగా స్తంభించడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జంట నగరాల్లో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడం వల్ల సామాన్యులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొం టున్నారు. రోజు వారి కూలీ చేసుకునేవారికి పూటగడవని దుస్థితి నెలకొంది. నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి కూలీ పనులు చేసుకుని వారి ఆర్టీసి బస్సుల బంద్‌ శరాఘాతంగా మారింది. ఆర్టీసి ఉద్యోగుల సమ్మెలో పాల్గొనడంతో జంట నగరాల్లో ఆటో డ్రైవర్ల దోపీడి శృతిమించిందంటున్నారు. నగ రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరాలంటే వందల్లోనే అడుగుతున్నారని వాపోతున్నారు.

రోజు కూలీ చేసు కుని బ్రతికే తమకు వందలాది రూపాయలు ఆటోలకు చెల్లించి వెళ్లి పనులు చేసుకునే స్థోమత లేదంటూ వాపోతున్నారు. టీ- జేఏసీ ఇచ్చిన రైల్‌రోకోల ప్రభావం దూర ప్రాంతాలకు వెళ్లాల నుకునే ప్రయాణీకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇటీ వల 48 గంటల రైల్‌రోకో విజయవంతంగా నిర్వహించిన టీ- జేఏసీ, రెట్టించిన ఉత్సాహంతో ఈ నెల 9,10,11వ తేదీల్లో మూడు రోజుల పాటు రైల్‌రోకో నిర్వహించాలని నిర్ణయిం చడం సర్వత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఇప్పటికే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలవన్నట్లు సమ్మెను దీర్ఘకాల పొడిగించటం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో అంతర్లీనంగా వ్యక్తమౌతున్న అసంతృప్తిని టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం గ్రహించి, త్వరలోనే సమ్మెకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది.

సకల జనుల సమ్మె ప్రభావాన్ని కేంద్రానికి వివరించి, త్వర గా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరడం మినహా ప్రస్తుతం తమ ముందు మరో ప్రత్యామ్నాయం లేదని టీజేఏసీ నాయకులు అంతర్గత చర్చల్లో పేర్కొంటున్నారు. సమ్మెను సుదీర్ఘకాలం నిర్వహించడమంటే కత్తిమీద సాము వంటిదే నంటున్నారు. సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్న నాటి నుంచి విద్యుత్‌కోతతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంట చేతికందొచ్చిన సమయంలో విద్యుత్‌కోతలు రైతులను తీవ్రంగా కలిచివేస్తున్నాయని పేర్కొన్నారు. సమ్మెపై కేంద్రం వెంటనే ఒక నిర్ణయం తీసుకు నేవిధంగా ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్‌ చేయాలన్నది టీఆర్‌ఎస్‌, టీజేఏసీ సరికొత్త వ్యూహాంగా కనిపిస్తోంది. అందుకే సమీప భవిష్యత్తులో బంద్‌లు ఉండబోవని గులాబీ దళపతి కేసీఆర్‌, యువనేత కేటీఆర్‌ ధీమాగా చెబుతున్నట్లు సమాచారం.
Read more ...

మిగతా పార్టీలు కూడా ముందుకు వస్తే అఖిలపక్షం

 ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:
ప్రత్యేక తెలంగాణ అంశం అధిష్టానం దృష్టికి వచ్చిందనందున సకల జనుల సమ్మె కొనసాగించడం అనవసరమని కేంద్ర హోంమంత్రి చిదంబరం పేర్కొన్నారు. రైల్‌రోకోలు, బంద్‌లను ఏ ప్రభుత్వం సమర్ధించదని, సమ్మెవల్ల తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. నిరవధిక బంద్‌లు, సమ్మె వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని చిదంబరం పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై కేంద్రం దృష్టి సారించినందున ఇక సమ్మె విరమించాలని ఆయన తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు.

అజాద్ ఈరోజు నివేదిక సమర్పించిన నేపథ్యంలో కోర్ కమిటీలో తెలంగాణపై చర్చ జరుగుతుందని, అలాగే రాష్ట్రంలోని మిగిలిన రాజకీయ పార్టీలు కూడు ముందుకు వస్తే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చిదంబరం పేర్కొన్నారు. ఇంకా నాలుగు పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పలేదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, మజ్లిస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పవలసి ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం తెలుగుదేశం పార్టీ, మజ్లిస్ పార్టీ చూస్తున్నాయని చిదంబరం చెప్పారు. త్వరలో పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని, ఆ తరువాత ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై నిరంతర పోరు జరుగుతుందని, నక్సల్ప్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేస్తామని చిదంబరం పేర్కొన్నారు.
Read more ...

తెలంగాణపై 10రోజుల్లో నిర్ణయం: కోర్ కమిటీ


ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:
తెలంగాణపై పది రోజులలో నిర్ణయం ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కోర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు గంటన్నర జరిగింది. అయినా సభ్యులు మాత్రం తెలంగాణపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. సమావేశంలో ప్రధానితోపాటు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులామ్ నబీ ఆజాద్ పాల్గొన్నారు. తెలంగాణ అంశమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలోని పరిస్థితులను, తెలంగాణ ఇస్తే పార్టీకి జరిగే నష్టాన్ని ఆజాద్ సభ్యులకు వివరించారు. ఆజాద్ నివేదికపైనే చర్చ జరిగింది. నివేదిక అసంపూర్తిగా ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. సుదీర్ఘంగా చర్చించినప్పటికీ వారు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. తుది నిర్ణయం కోసం మరికొంత సమయం కావాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

(తెలంగాణా పై సరైన నిర్ణయం తీసుకొనే భాద్యత ప్రణబ్ ముఖర్జీ పై పెట్టినట్లు సమాచారం.)
Read more ...

పిల్ల జమీందార్ పోజులు























Read more ...

ఉద్యమాన్ని హింస వైపు మళ్లించే కుట్ర ! : కేసీఆర్


ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:
ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వం కుట్రపూరితంగా హింస వైపు మళ్లించే యత్నం చేస్తోందని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. పార్టీఎల్పీ నేత ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఇతర నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శుక్రవారం ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లే ముందు తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.

"ఎలాంటి హింసకు తావులేకుండా 18 రోజులుగా సకల జనుల సమ్మె సాగుతోంది. గడిచిన మూడు, నాలుగు రోజులుగా అంతా గమనిస్తున్నారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై దాడి జరిగింది. స్వామిగౌడ్‌పై ఏకంగా హత్యాయత్నంచేశారు. ఈ వరుస సంఘటలన్నీ అప్రజాస్వామికమే. వద్దని ఎంత చెప్పినప్పటికీ, కంటిన్యూ అవుతున్నాయి. వీటిపై ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, ఇతర పెద్దలు, ముఖ్య నేతలకు వివరించటానికే ఢిల్లీకి వెళ్తున్నాం'' అని కేసీఆర్ చెప్పారు.

ప్రధానిని కలిసినప్పుడు తెలంగాణపై సత్వర నిర్ణయం ప్రకటించాలని కోరుతామన్నారు. "నాతోపాటు, జేఏసీ భాగస్వామ్య పక్షాలకు చెందిన దాదాపు 30 మంది ప్రతినిధులం ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నాం. శనివారం ఉదయం మరో 8-10 మంది ఢిల్లీకి వస్తారు. అంతా అక్కడికి చేరుకున్నాక ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకొని అన్నీ వివరిస్తాం'' అని తెలిపారు.


ఇప్పుడే అందిన వార్త:
కుకట్పల్లి వద్ద నిలిపి ఉంచిన రెండు వోల్వో బస్సులకు  కొందరు తెలంగాణా వాదులు నిప్పు పెట్టేరు. వాటిలో ఒకటి కేసినేని ట్రావెల్స్ కి చెందినదిగా గుర్తించబడినది. గురువారం నాడు మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి కి చెందినా ఒక బస్సుకి ఇదేవిధంగా నిప్పు పెట్టారు.
(దీన్నేమొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడం అంటారా?)

Read more ...

Sep 29, 2011

ట్రాన్స్ ఫార్మర్‌లు బద్దలు కొట్టడాలు లాంటివి నేను చేయలేను:‘అల్లరి’నరేష్


ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:

సినిమా కంటెట్ ఏమిటో టైటిల్‌లోనే సూచాయగా చెప్పాలని మా నాన్నగారు చెప్పేవారు. ఆ రీతిలోనే నా సినిమా టైటిల్స్ ఉంటాయి. ‘మడతకాజా’ టైటిల్ బట్టే సినిమా ఎంత కామెడీగా ఉంటుందో ప్రేక్షకులకు అర్థమైపోతుంది. ఇంతకుముందు వచ్చిన నా సినిమాలతో పోలిస్తే ఇది మెచ్యూర్డ్ ఎంటర్‌టైనర్. ఎంతటి శక్తివంతుడినైనా తన బుద్ధిబలంతో బురిడీ కొట్టించే పాత్ర నాది. చివరకు తనకు నచ్చిన అమ్మాయికి కూడా డెరైక్ట్‌గా ఐ లవ్యూ చెప్పకుండా, ఆమెతోనే తనకు ఐ లవ్యూ చెప్పించుకుంటాడు. రెండున్నర గంటల సినిమాలో పుష్కలంగా వినోదం ఉన్నప్పటికీ సెంటిమెంట్‌కీ కొదవ లేదు. కామెడీ సెపరేట్ ట్రాక్‌లా కాకుండా, టిట్‌బిట్స్‌లా ఉండి అలరిస్తుంది. హీరోయిన్ స్నేహాఉల్లాల్ మాతో పోటీపడి కామెడీ పండించింది. డాన్సులైతే అదరగొట్టింది. ఆహుతిప్రసాద్ నైజాం మాండలికంలో చేసిన పాత్ర కొత్తగా ఉంటుంది. ఇందులో జయప్రకాష్‌రెడ్డికి 40 మంది హీరోయిన్లు ఉంటారు. సీతారామరాజు దర్శకత్వంలో మార్చి నుంచి మరో సినిమా చేయబోతున్నా. నిర్మాతలు ఓ పేషన్‌తో ఈ సినిమా చేశారు.

నేను చేయలేను
సినీ ప్రపంచంలో ఎన్ని ట్రెండ్‌లు వచ్చినా కామెడీ సినిమాకు తిరుగేలేదు. ఒకప్పుడు యాక్షన్ కింగ్ అనిపించుకున్న బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ కామెడీ స్లాట్ మొదలెట్టాకే టాప్ హీరో అయ్యాడు. ఇప్పుడు మిగతా కొందరు హీరోలూ కామెడీ చేస్తున్నారు. ఇది ఓ రకంగా మంచి పోటీనే. వాళ్లు కామెడీ చేస్తున్నారని నేను మాత్రం వాళ్ల రూట్‌లోకి వెళ్లను. గాల్లోకి సుమోలు ఎగిరించడాలు, ట్రాన్స్ ఫార్మర్‌లు బద్దలు కొట్టడాలు ఇలాంటివి నేను చేయలేను. ప్రజలు అసలే కష్టాల్లో ఉన్నారు. వాళ్లకు వినోదం కావాలి. వాళ్లను ఏడిపించడానికి ఎలాగో టీవీ సీరియల్స్ ఉన్నాయి. వరుసగా కామెడీ సినిమాలు చేసినా మధ్య మధ్యలో ‘గమ్యం’లాంటివి కూడా చేస్తాను. ఎప్పుడూ నవ్వించేవాడు సడన్‌గా ఏడిపిస్తే ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతారు.

తమిళంలో ఏడాదికో సినిమా
తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో ‘పోరులి’ చేశాను. నవంబర్‌లో తెలుగులో కూడా డబ్ అవుతుంది. మరో ఏడు తమిళ ఆఫర్లు ఉన్నాయి. ఏడాదికి ఒక తమిళ సినిమా చేయాలనుకుంటున్నా. తమిళంలో నా మార్కెట్ పెరిగితే మన నిర్మాతలకు మరింత బిజినెస్ వస్తుంది కదా. ఇప్పుడు తెలుగులో నాలుగు సినిమాలు ఓకే చేశాను. కృష్ణవంశీ శిష్యుడు నారాయణ దర్శకత్వంలో శర్వానంద్, శ్రీయ కాంబినేషన్‌లో ఓ సినిమా ఈ శనివారం మొదలవుతుంది. భీమినేని శ్రీనివాసరావు, ఇ.సత్తిబాబు, దేవీప్రసాద్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేయాలి. ఇవి కాక ఇంకో పెద్ద సినిమా ఉంది.
Read more ...

సంసార జీవితంలో మాత్రం చరణ్ కు మనశ్శాంతి ఉండదట...?

 థట్స్ తెలుగు వన్ఇండియా.కాం నుండి :

మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ తెరంగ్రేటం చేసిన రామ్ చరణ్ తేజ సినీ కెరీర్ సూపర్ గా సాగుతోంది. కేవలం మూడు సినిమాలే చేసినప్పటికీ మంచి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు చరణ్. దాదాపు కెరీర్ లో సెట్టయినట్లే కాబట్టి పెళ్లి ఆలోచనతో తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసను పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడు. తొలుత కొన్ని ఇబ్బందులు ఏర్పడినా ఇరుకుటుంబాల వారు ఒప్పుకోవడంతో అంతా ఓకే అయింది. పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి కూడా. నిశ్చితార్థం, పెళ్లి తేదీలో అతి త్వరలోనే ఇరు కుటుంబాల వారు ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత చరణ్ జీవితం ఎలా ఉంటుందనే దానిపై ఆస్ట్రేలియాకు ప్రముఖ జోతిష్యుడు చెప్పిన వ్యాఖ్యలు అభిమానుల్లో కలకలం రేకెత్తిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన దదీచి అనే జోతిష్యుడు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ...పెళ్లి తర్వాత అతని సినీ కెరీర్ మరింత మెరుగు పడుతోందని, అయితే సంసార జీవితంలో మాత్రం చరణ్ కు మనశ్శాంతి ఉండదని జోష్యం చెప్పాడు. ఈయన చెప్పిన వన్నీ నిజమౌతాయా? అనే డౌట్ మీకు రావచ్చు ఈయన ఆషామాషీ వ్యక్తి సామాన్యు జ్యోతిష్కుడు కాదు. 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఇతగాడు చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. మరి దదీచి చెప్పినట్లు చరణ్ సంసార జీవితంలో కలతలు తప్పవేమో? వేచి చూడాలి.
Read more ...

శంకర్రావు లంచావతారం!

ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:
కార్పొరేటర్ అభ్యర్థిత్వం కోసం డబ్బులు!
ఆ దృశ్యాలు బయటపెట్టిన టీవీ-5 చానెల్

సహచర మంత్రులపై రోజుకో అవినీతి ఆరోపణల అస్త్రాన్ని సంధిస్తున్న రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి పి.శంకర్రావు తానే అవినీతిలో కూరుకుపోయారు. 2009 చివరలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేయదలచిన ఓ ఆశావహుడి నుంచి పార్టీ అభ్యర్థిత్వం కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేసి, రెండు విడతలుగా రూ.5 లక్షల చొప్పున తీసుకున్నారన్న ఆరోపణలో ఇరుక్కుపోయారు. రెండో విడతగా రూ.5 లక్షలు తీసుకుంటుండగా రహస్యంగా చిత్రీకరించిన దృశ్యాలను తాజాగా టీవీ5 న్యూస్ చానెల్ బయటపెట్టింది. కారులో నగదు తీసుకుని లెక్కిస్తూ, అభ్యర్థిత్వం ఆశించిన వ్యక్తితో జరిపిన సంభాషణలు కూడా ఆ టేపుల్లో బయటపడ్డాయి. టీవీ 5 ఛానెల్ ప్రసారం చేసిన ఈ టేపుల్లో ఉన్న సంభాషణలు ఇవీ..

శంకర్రావు: ఇవి ఎన్ని ఉన్నాయి?
అభ్యర్థి: ఇవి రెండు లక్షలున్నాయి. అవి రెండు లక్షలు.
శంకర్రావు: ఇవ్వెన్ని?
అభ్యర్థి: అవి వన్ లాక్
శంకర్రావు: సరే.. నువ్ అక్కడికెళ్లి పనిచూసుకో. అక్కడి నుంచి ఆర్గనైజ్ చేయి.
అభ్యర్థి: సరే సర్..
శంకర్రావు: వీళ్లు చేయిస్తారు.. ఈ కొడుకులు సొబటేజ్ చేస్తారు. లోపల లోపల చేయిస్తారు. దాన్ని ఓవర్ కమ్ కావాలె.
అభ్యర్థి: మరి నా టికెట్?
శంకర్రావు: నువ్వు పో.. నీ టికెట్ పని అయిపోయింది..
Read more ...

కే.సి.ఆర్.ని అర్రెస్ట్ చేస్తే కోదండరామ్ ఖండిస్తాడు..కోదండరామ్ ని అర్రెస్ట్ చేస్తే...

కే.సి.ఆర్.ని అర్రెస్ట్ చేస్తే కోదండరామ్ ఖండిస్తాడు.
కోదండరామ్ ని అర్రెస్ట్ చేస్తే కే.సి.ఆర్.ఖండిస్తాడు.
ఇద్దరినీ అర్రెస్ట్ చేస్తే హరీష్రావు ఉన్నాడు, కేటిఆర్ ఉన్నాడు.

ఉద్యమాల పేరు చెప్పుకొని గూండాగిరి చేసే ఈ నేతలే 
రేపు తెలంగాణా ప్రజలకి సుకశాంతులిస్తారట!

తనని ఎవరు ఎన్నుకోన్నారని ఉద్యోగుల జీతాలకు హామీలు ఇస్తున్నాడు కెసిఆర్?
ఏ అధికారం తో మొట్ట మొదటి సంతకం చేస్తానని అంటున్నాడు కెసిఆర్?
పని చేయకు, జీతాలు మాత్రం అడగమని ఉపదేశిస్తున్న ఈ నేతలు, 
రేపు ఇదే పద్దతిని తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పుడు అమలు చేయగలరా?
  
లక్షలాది విద్యార్దుల జీవితాలు బుగ్గి పాలు చేసే వీరు
అత్మహుతులు బలిదానాలు వద్దంటూనే 
వారేమి చేయాలో అన్యోపదేశంగా చెపుతుంటారు. 
ఆనక వారి ఫొటోలకి దండలేసి మొసలి కన్నీరు కారుస్తారు.
పుత్ర శోకంతో విలవిలలాడే ఆ కన్నతల్లి తండ్రుల బాధకి  
లక్ష రూపాయల చెక్కులతో వెలగడతారు.

ఉద్యమాలకి తన విద్యార్దుల బ్రతుకులనే సమిదలుగా 
చేసుకొన్న కోదండరామ్, మరి తన ఉద్యోగం చక్కగా 
ఎందుకు కాపాడు కొంటున్నాడో అతనికే తెలియాలి.
అయినా, 
రాష్ట్రం ఏర్పడగానే కెసిఆర్ ముఖ్య మంత్రయితే
విద్య శాఖా మంత్రిగ పదవి తీసుకొనే వీలునప్పుడు,
ప్రొఫెసరు ఉద్యోగం పట్టుకు వేలాడటం ఎందుకో మరి?
కెసిఆర్ మీద నమ్మకం లేకనా,
లేక తన జాగ్రత్తలో తను ఉండటం మంచిదనా?

తెలంగాణా కోరుకొంటే తప్పు లేదు అన్యాయము లేదు.
గాని విద్యార్దుల జీవితాలను సోపానాలుగా చేసుకొని 
ఒక గురువు తన రాజకీయ జీవిత గమ్యం
 చేరుకోవలనుకోవడమే మహా దౌర్భాగ్యం.

ఉద్యమాలు చేసే రాజకీయ నాయకులందరికీ 
ఉజ్వల బవిష్యత్ కళ్ళెదుట కనిపిస్తోంటే,
వారి కోసం త్యాగాలు చేస్తున్న తెలంగాణా ప్రజలకి
నిత్యం నరకం కనిపిస్తూనే ఉంది. ఇక బవిష్యత్తు
మరెంత గొప్పగా ఉండబోతోందో చెప్పనవసరమే లేదు. 

ఉద్యమాలు నేతలకి రాజకీయ ఉపాదిని కల్పిస్తే
విద్యార్దుల బవితకి శాపాలు గాబోతున్నాయి.
పోయిన కాలాన్ని ఏ కెసిఆర్ తెచ్చివగలడు?
ఏ కోదండరామ్ చేరిపేయగలడు?

పిల్లల బ్రతుకులు బుగ్గి పాలు అవుతున్న
తన రాజకీయ గమ్యాన్ని కలలో కూడా మరువని గొప్ప నేతలు వీళ్ళు
నిజంగా తెలంగాణా ప్రజలు ఎంతో అదృష్టవంతులు  మరి! 
ఈ నేతల తీరెరిగిన ఎవరయినా 
వారు తమ భవితకి మేలు చేయగలరని నమ్మకంగా చెప్పగలరా?

కాంగ్రేసు గడ్డి తిని బ్రతికిన వాళ్ళు ఇప్పుడు దానికే నిప్పు పెట్టేందుకు రెడి
తెదేప ఉప్పు తిని పెరిగిన నేతలిప్పుడు దానితోనే డీకి రెడి
తమ బవిష్యత్ కోసం స్వంత పార్టీలకే ఎసరు పెట్టె నేతలు వీళ్ళు.
ఇటువంటి వాళ్ళనా మనం నమ్మాలి? 

ఎసి కార్లలో తిరుగుతూ, ఎసి రూముల్లో బ్రతుకుతూ తిరిగే ఈ నేతల
పేద ప్రజల గురించి ఆలోచించేది?

తెలంగాణా కోరుకొంటే తప్పు లేదు అన్యాయము లేదు.
ఉద్యమాల రధచక్రాల క్రింద నలేగేది మాత్రం 
రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులే, 
వారే ఎందుకు బలి గావాలని 
ఆలోచించని దొరల నైజమే నీచాతి నీచం.

కలిసి ఉన్నంత కాలం ఉన్నాము.
వద్దనుకోనప్పుడు ఈ పాకులాట లెందుకు
ముసుగులో గుద్దులాట లెందుకు?

ఈ కోడేద్దుల పోరాటంలో అమాయకుల బలి ఎందుకు?


Read more ...

Sep 28, 2011

మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట..ఆజాద్ నోటంటా...

థట్స్తెలుగు వన్ ఇండియా.కాం నుండి:

రెండు, మూడు రోజుల్లో తెలంగాణ బంతి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కోర్టులోకి పడనుంది. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివేదిక అందిస్తానని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది సోనియానే అని ఆజాద్ తెలంగాణ కాంగ్రెసు నేతలకు చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ నేతలతో ఆయన బుధవారం సాయంత్రం రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఆజాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీపరంగా తన సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిందని, సమగ్ర నివేదికను సోనియాకు, మన్మోహన్‌కు అందజేస్తానని ఆయన చెప్పారు. తన నివేదిక తర్వాత కూడా జాతీయ స్థాయిలో మరిన్ని సంప్రదింపులు అవసరం కావచ్చునని ఆయన అన్నారు. 

2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటనకు ముందు ఇలాంటి సంప్రదింపులు జరగకపోవడం వల్లనే సమస్య తలెత్తిందని, తాము సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే చూస్తున్నామని, ఈసారి సమస్య కావచ్చునని ఆయన అన్నారు. తాను నివేదిక సమర్పించిన తర్వాత అందరితోనో, ప్రతిపక్షాలతోనో, జాతీయ పార్టీలతోనో సంప్రదింపులు జరపాలా, వద్దా అనే విషయంపై సోనియా నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. తెలంగాణపై తాము తీసుకుని నిర్ణయానికి యుపిఎ భాగస్వామ్య పక్షాలు అంగీకరిస్తాయని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో పరిస్థితి తనకు తెలుసునని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపిస్తానని, సకల జనుల సమ్మెపై మాట్లాడుతానని, లగడపాటి వ్యవహారంపై కూడా చర్చిస్తానని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణపై సానుకూల ప్రకటన వచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటామని, ఇదే తమ ఆఖరి సమావేశమని ఆజాద్‌తో భేటీ అనంతరం రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. రేపు తెలంగాణపై సోనియాకు నివేదిక ఇవ్వాలని తాము ఆజాద్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఇచ్చేదీ తెచ్చేదీ తామేనని చెబుతూ వచ్చామని, ఇప్పుడు ఉత్త చేతులతో హైదరాబాదు వెళ్లలేమని ఆజాద్‌తో చెప్పినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసు తెలంగాణ నేతలు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

పనిలో పనిగా మన కాశ్మీరీ బాబు గులాం నబి ఆజాద్ మరో ముక్తాయింపు కూడా ఇచ్చేడు తన స్టేట్మెంటుకి. అదే, తెలంగాణా సమస్యని పరిష్కరించడానికి ఖచ్చితమయిన గడువు ఏది లేదన్నాడు. అంటే, ఆపరేషన్ సక్సస్ పేషంటు డేడ్ అన్నట్లు. చర్చలు విజయవంతమయ్యాయి గాని పరిష్కారం దొరకలేదు అనర్దమన్నమాట.
Read more ...

శంకర్‌రావు మాటే తూటా!


ఈ రోజు సూర్య దినపత్రిక లో వచ్చిన వార్త ఇది:

సబిత, మోపిదేవిలపై ఆరోపణలమీద హైకోర్టు సీరియస్
ఇది విచారణకు స్వీకరించదగ్గ విషయం

ఆరోపణలు రుజువు చేయకుంటే చర్యలు
జస్టిస్ నర్సింహారెడ్డి హెచ్చరిక
సంబంధిత బెంచ్‌కు అప్పగించిన కోర్టు
ప్రతివాదుల్లో మంత్రులు, సీబీఐ
హైదరాబాద్, సెప్టెంబర్ 27 : మంత్రి శంకర్ రావు మరో సంచలనం సృష్టించారు. జగన్, ఎమ్మార్ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆయన రాసిన లేఖ కారణంకాగా ఇప్పుడు ఆయన మాటలే సహ మం త్రులపై విచారణ జరిపే పరిస్థితిని కల్పిస్తున్నాయి. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణలపై ఆయన సోమవారం చేసి న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సిం హారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించే (టేకెన్అప్) బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

పిటిషన్‌లో సీబీఐని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఆరోపణలను రుజువుచేసే ఆధారా ల కోసం మంత్రి శంకర్ రావును ప్రతివాదులుగా చేర్చాలన్నారు. ఒకవేళ ఆరోపణలను రుజువు చేయకపోతే మం త్రిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జడ్జి హెచ్చరించారు. "హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు, సోదరుడు, కొంతమంది ఉన్నతాధికారులు పోలీసు ఆఫీసర్ల బదిలీల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారని, ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా అవినీతికి పాల్పడుతున్నారని శంకర్‌రావు చేసిన ఆరోపణలు మంగళవారం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి.

ఇద్దరు కేబినేట్ సహచరులపై మరో మం త్రి ఆరోపణలు చేసినప్పుడు వాటిపై దర్యాప్తు చేయకుం డా వదిలేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎంతమాత్రం మంచిది కాదు. ఈ ఆరోపణలను ఇలాగే వదిలిపెడితే వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించదగ్గదే. కోర్టుకు ఆ అవసరం ఉంది'' అని జడ్జి అభిప్రాయపడ్డారు.

"ఇది అరుదైన సంఘటన. ఒక కేబెనెట్ మంత్రి మరో ఇద్దరు కేబినెట్ మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవినీతి మంత్రులకు ముఖ్యమంత్రి సహకరించరాదని కోరారు. ఆయన చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం ఉన్నా చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే ఆరోపణలు ఎదుర్కొన్నవారి గౌరవానికి భంగం కలగకుండా చూడా లి. ఆరోపణలు చేసిన వ్యక్తిపై సివిల్/క్రిమినల్ నేరాల కిం ద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది'' అని తెలిపారు.

మరోవైపు... తానుగానీ,తన కుటుంబ సభ్యులుగానీ ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేస్తే విచారణ జరపాలంటూ ఆగస్టు 1న శంకర్ రావు రాసిన లేఖపై లోకాయుక్త మంగళవారం విచారణ జరిపింది. గత ప్రభుత్వ హయాంలో భూముల కేటాయింపు, అక్రమ గనుల తవ్వకం వంటి అవకతవకలపై కూడా విచారణ జరపాలని ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. డీజీపీ కార్యాలయంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల అదృశ్యం, ఆయుధాలు, చౌకబారు బూట్ల కొనుగోలు వంటి అక్రమా లు జరిగాయని ఆరోపించారు. కర్ణాటక లోకాయుక్త స్ఫూర్తితో వీటన్నింటిపై విచారణ జరపాలని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో రూ.కోట్ల దుర్వినియోగం, అవకతవకలతో బాగా పలుకుబడి కలిగినవారికి సంబంధాలున్నాయని కూడా ఆరోపించారు. అయితే... ఆయన కోరిన విధంగా తాము విచారణ జరపడానికి ఆరోపణలేవీ అందలేదని లోకాయుక్త పేర్కొంది. మంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై ఎవరైనా అటువంటి ఆరోపణలు చేసి ఉంటే ఆస్తుల వివరాలను అందచేయాలని గతం లో రెండుమార్లు కోరింది. దీనిపై శంకర్‌రావు స్పందించకపోవడంతో నవంబర్ 29 లోగా తగిన వివరాలు అందించకపోతే లేఖను తప్పుడు ఫిర్యాదుగా భావించి కేసు మూసేస్తామని స్పష్టం చేసింది.

న్యాయవ్యవస్థ పారదర్శకం: శంకర్‌రావు
రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పారదర్శకంగా పనిచేస్తోందని, ప్రతి సామాన్యుడికీ న్యాయం దొరుకుతోందని శంకర్‌రావు పేర్కొన్నారు. హోం, ఎక్సైజ్‌శాఖ మంత్రులపై తన ఆరోపణలమీద హైకో ర్టు స్పందించడం మంచి పరిణామమన్నారు. హోం, రెవెన్యూ, ఎక్సైజ్, ఇరిగేషన్, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖలకు సంబంధించి 15 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా మహారాజులు, పైగా, సీలింగ్, శిఖం, తదితర భూముల అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఆ భూములను వెనక్కు తీసుకుంటే పన్ను వేయకుండా ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించవచ్చునని తెలిపారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి వారిని తగిన పురస్కారంతో ప్రోత్సహించాలంటూ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, సోనియాగాంధీ, ప్రణబ్ ముఖర్జీలకు లేఖలు ఫ్యాక్స్ చేస్తున్నానన్నారు. రానున్న కాలంలో నాలుగైదు కేసులు సీబీఐ దర్యాప్తునకు వచ్చే అవకాశముందని, ఆ విభాగానికి అదనపు సిబ్బందిని కేటాయించాలని కోరారు.

పెంచిన సెక్యూరిటీ వద్దు
పెంచిన సెక్యూరిటీ తనకు అవసరం లేదని శంకర్ రావు డీజీపీ దినేశ్ రెడ్డికి లేఖ రాశారు. ఎం దుకు విరమించుకుంటున్నదీ త్వరలో చెబుతానన్నా రు. అయితే, మంత్రి నుంచి ఎలాంటి లేఖ అందలేదని శాంతిభద్రతల అదనపు డీజీ హుడా తెలిపారు.
Read more ...

Sep 26, 2011

80 ఏళ్ల ఇండస్ట్రీలో అరుదైన రికార్డు ‘దూకుడు’


ఈ రోజు సూర్య దినపత్రిక లో వచ్చిన వార్త ఇది:

రిలీజైన అన్ని కేంద్రాల్లో రికార్డ్‌ వసూళ్తు తెస్తోంది మా సినిమా. ఈ ఘన విజయానికి ప్రధాన కారణం ప్రిన్స్‌ మహేష్‌. స్క్రిప్టు మరో కారణం. తమన్‌ సంగీతం, గుహన్‌ కెమెరా పనితనం అదనపు అస్సెట్స్‌. ఇంత పెద్ద విజయా న్ని ఇచ్చిన ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలు’’ అన్నారు శ్రీనువైట్ల. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘దూకుడు’. మహేష్‌ కథానాయకుడు. సమంత కథానాయిక. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా తొలి 3రోజుల్లో 21.22కోట్ల షేర్‌తో టాలీవుడ్‌ రికార్డులను తిరగరాసింది. రిలీజ్‌ రోజే రూ.12 కోట్ల 56లక్షల గ్రాస్‌ (10కోట్ల 11లక్షల షేర్‌)తో గత రికార్డులన్నిటినీ..అధిగమించింది. 80ఏళ్ల తెలుగు సినీచరిత్రలో ఇదో అరుదైన రికార్డ్‌. విజయో త్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనువైట్ల, అనీల్‌, గోపి, రామ్‌, రచయిత గోపిమోహన్‌ పాల్గొన్నారు. శ్రీనువైట్ల మరిన్ని విశేషాలు ముచ్చటిస్తూ ‘‘రిలీజ్‌ మరుసటి రోజే నా పుట్టినరోజు కావడం యాధృచ్ఛికం. ఈ విజయా న్ని పుట్టినరోజు కానుకగా భావిస్తున్నా. పాత్రధా రులు..బ్రహ్మానందం, ఎంఎస్‌ నారాయణ, ప్రకాష్‌రాజ్‌, సమంత..అంతా అస్సెట్స్‌ అయ్యారు’’ అన్నారు. అనీల్‌ సుంకర మాట్లాడుతూ ‘80ఏళ్ల తెలుగు సినిమా చరిత్ర రికార్డును తిరగరాసింది ఈ సినిమా.

srinu-meetingవిదేశాల్లో ‘దబాంగ్‌’ రికార్డును అధిగమించింది. ఒక్క అమెరికాలోనే 2రోజుల్లో 15లక్షల డాలర్లను వసూలు చేసి రికార్డ్‌ సృష్టించింది. ఓ తెలుగు సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. ‘నా ట్రాక్‌ రికార్డ్‌ ఇది కాదు..’ అన్న మహేష్‌ డైలాగ్‌ చందాన ..సినిమా వసూళ్లు కూడా సాగుతు న్నాయి. అన్ని పండగలకి సరిపడే ఆనందాన్నిచ్చిన సినిమా ఇది’’ అన్నారు. రామ్‌ ఆచంట మాట్లా డుతూ- ‘దేశ, విదేశాల్లో ఈ స్థాయి రికార్డులను సాధించడం అందరికీ ఆనందాన్నిచ్చింద’ని అన్నా రు. పైరసీని ప్రోత్సహించకుండా ప్రేక్షకులు థియే టర్‌లో సినిమా చూసి ప్రోత్సహించాలని గోపి చంద్‌ ఆచంట అన్నారు. 1600పైగా థియేటర్లలో సినిమా రిలీజైందని ఆయన తెలిపారు. ఓ గొప్ప సినిమాకి పనిచేసిన అనుభూతి కలిగిందని రచయిత గోపిమోహన్‌ అన్నారు.
Read more ...

పడిపోతున్న పసిడి ధరలు


ఈ రోజు సూర్య దినపత్రిక లో వచ్చిన వార్త ఇది:
నిన్న మొన్నటి వరకూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళిన పుత్తడి జోరు..ఇప్పుడు తగ్గింది. రోజుకో రికార్డును నెలకొల్పిన పసిడి ధరలు..ప్రస్తుతం అంతే వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2,500 పడిపోగా..సోమవారం ఒక్క రోజే రూ.600 మేర దిగజారింది.అంతర్జాతీయంగానూ ఔన్సు ధర 1,600 డాలర్ల దిగువకు దిగడంతో ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.26,740 పలికింది. అయితే ఒకానొక దశలో 10 గ్రాముల విలువ రూ.1,540 వరకూ పతనమై రూ.25,800లకు చేరింది. కానీ మార్కెట్‌ ముగింపు సమయానికి కోలుకోవడంతో చివరకు మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత దిగే అవకాశం భయాందోళనలకు గురిచేసిన బంగారం ధరలు మరింత పడిపోయే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొనుగోళ్ళ విషయమైనా, పెట్టుబడుల విషయమైనా ఆచితూచి వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లోనూ అక్టోబర్‌ నెలలో పసిడి ధరలు తక్కువ స్థాయిలో ట్రేడ్‌ అవడంతో మున్ముందు రోజుల్లో మరింత తగ్గే అవకాశం లేపోలేదంటున్నారు. అయితే రానున్న దీపావళి సీజన్‌లో 10 గ్రాములు రూ.30,000 మార్కుకు చేరనున్నాయనే దానిపైన నిపుణుల్లో స్పష్టత కొరవడటం సామాన్యులను అయోమయానికి గురి చేస్తోంది.

వెండి ధరల్లో పతనం
మరోవైపు బంగారం ధరలతోపాటు వెండి ధరలూ క్రమేణా క్షీణిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో రూ.14,200 పడిపోయింది. ఈ క్రమంలోనే నిన్న ఒక్క రోజులోనే రూ.500 మేర దిగజారింది. దీంతో కిలో వెండి ధర రూ.53,500గా నమోదైయ్యింది. అయితే ఒకానొక దశలో కిలోకు రూ. 3,200 దిగజారి అంతర్జాతీయ మార్కెట్‌లో 31 ఏళ్ళ కనిష్ఠ స్థాయిని తాకింది. సాధారణంగా అంతర్జా తీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్న సమయం లో మదుపర్లు బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై మక్కువ ప్రదర్శించ డం సహజం. అయితే అందుకు విరుద్ధంగా అటు స్టాక్‌ మార్కెట్లు, ఇటు బంగారం, వెండి ధరలు రెండూ తగ్గుతుండటంతో మదుపర్ల నాడిని పట్టుకోవడం అంతర్జాతీయ నిపుణులకూ సాధ్యపడకుండా తయారవుతోంది.

ఎగుమతులు పెరిగే అవకాశం
gold1బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ఆభరణాల ఎగుమతిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ధరలు ఎక్కువగా ఉండటంతో పడిపోయిన ఎగుమతులు తిరిగి పుంజుకునే వీలుండటమే ఇందుకు కారణం. కాగా భారత్‌ నుంచి బంగారం అధికంగా ఎగుమతయ్యే దేశాలలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) 31 శాతంతో ముందుందని, ఆ తర్వాత హాంగ్‌కాంగ్‌, యూఎస్‌లున్నాయని జెమ్స్‌, జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ సంజయ్‌ కొతారి తెలిపారు. కాగా 2010-11 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల దృష్ట్యా జెమ్స్‌, జ్యుయెల్లరీ ఉత్పత్తులు మూడో స్థానంలో నిలిచాయి. వీటి విలువ 33.54 బిలియన్‌ డాలర్లుంటుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరం (2011-12)లోనూ ఏప్రిల్‌-ఆగస్టు వ్యవధిలో ఎగుమతులు 16 శాతం పెరిగి 18.12 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం విశేషం.

గత వారం రోజుల బులియన్‌ మార్కెట్‌
సోమవారంనాడు బంగారం భారీ ఎత్తున పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం భారీగా పడిపోవడంతో దుశీయంగా ఉన్న స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను వదిలించుకున్నారు. 31 సంవత్సరాలల్లో గత రెండు రోజుల నుంచి బంగారం ధర పడిపోవడంతో ఇదే మొదటిసారి
Read more ...

Sep 25, 2011

గురి మార్చిన జ‘గన్‌’ ?


ఈ రోజు సూర్య దినపత్రిక లో వచ్చిన వార్త ఇది:
తమకు ప్రత్యర్థి కాంగ్రెస్సేనని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రూటు మార్చారా అన్న కోణంలో చర్చ సాగుతోంది. సీబీఐ విచారణకు ముందు కాంగ్రెస్‌ పార్టీపై ఆ పార్టీ అధినాయకురాలు సోనియాపై దుమ్మెత్తిపోసిన జగన్‌ ఇప్పుడు విమర్శనాస్త్రాలను టీడీపీపై ఎక్కిపెడుతున్నారు. అకస్మాత్తు గా యువనేతలో వచ్చిన ఈ మార్పు వెనక కారణం లేకపోలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నా యి. ఏ పార్టీ అయినా సరే అధికార పక్షం పైనే ప్రధానంగా విమర్శలు చేస్తాయి. అందుకు భిన్నంగా ప్రస్తుతం జగన్మోహన్‌రెడ్డి ఎందుకు వ్యవహ రిస్తున్నారో అవగాహన చేసుకొంటేచాలు వాస్తవం ఏమిటో తెలుస్తుందని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత పేర్కొన్నారు.

విమర్శల జోరు తగ్గించడంద్వారా జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి పరోక్షంగా స్నేహ హస్తం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంగా పేర్కొంటూ విమర్శలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన విమర్శనాస్తల్రు చేయడం ఇందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. కడప ఉప ఎన్ని కల్లో కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఎంత తీవ్రంగా జగన్‌ విమర్శలు చేశారో ఇప్పుడు ఆవేశం ఆయనలో కనిపించడంలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా ధృవీకరిస్తున్నారు. జగన్‌ దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఓ నేత చెప్పడం విశేషం.

అయితే తమ నేత కాంగ్రెస్‌కు అందిస్తున్న స్నేహ హస్తం ఎంత వరకు ఫలిస్తుందో, తమ పార్టీకి ఎంత నష్టం చేకూర్చుతుందోనని కూడా ఆయన పేర్కొన్నారు. సీబీఐ విచారణతో ఉక్కిరి, బిక్కిరి అవుతున్న జగన్‌ జాతీయ స్థాయిలో పార్టీల మద్దతు కోరుతూ ఢిల్లీలో లాబీయింగ్‌ మొదలెట్టారు. కానీ అది అంతగా కలసి రాకపోవడంతో అవసరమైతే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని జగన్‌ ఓ మీడియాతో అన్నారు. దీంతో ఆయనకు బాసటగా నిలిచిన బీజేపీ సైతం దూరమైంది. అదే సందర్భంలో కాంగ్రెస్‌ వైపు నుంచి జగన్‌ వ్యాఖ్యలపై పెద్దగా స్పందన రాలేదు.

సీబీఐ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్‌ మద్దతు ఎంతో అవసరమని గమనించే జగన్‌ తన వాయిస్‌ మార్చారని ఓ కాంగ్రెస్‌ నేత పేర్కొన్నారు. ఏ పార్టీ అయినా అధికార పీఠం అధిరోహించేందుకు సహజంగా అధికారపార్టీనే టార్గెట్‌ చేసుకొంటుంది. అవసరమైతే తమకు ధీటుగా ఉన్న ఇతర పార్టీలను టార్గెట్‌ చేసుకొంటారు. కానీ ఇందుకు భిన్నం గా అధికార పక్షమైన కాంగ్రెస్‌ పార్టీని వదిలేసి, కేవలం టీడీపీనే టార్గెట్‌ చేస్తూ జగన్‌ చేస్తున్న వ్యాఖ్యల మర్మమేమిటి అన్న చర్చ రాజకీయవర్గాలో సాగుతోంది. ఢిల్లీ యాత్ర తరువాత జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్రలో ఆయన చేస్తున్న విమర్శలలో సోనియా పేరుగానీ, కాంగ్రెస్‌ అన్న పథం కాని వినిపించడంలేదు. ఎక్కువగా టీడీపీని టార్గెట్‌ చేస్తున్నట్లు ప్రసంగాలు కొనసాగుతున్నాయి.

మరోవైపు ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారే గానీ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటూ విమర్శలు చేయకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారని కాంగ్రెస్‌ చెందిన ఓ నేత పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో స్నేహం కోసం అనుకూల వాతా వరణం సృష్టించు కొనేందుకు జగన్‌ ఈ రకమైన వైఖరిని అవలంభిస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సీబీఐ విచారణలతో తన రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందులు ఏర్పడకూడదన్న ఉద్దేశంతోనే జగన్‌ ఇలా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఓదార్పుయాత్రలో టీడీపీపై విమర్శలు చేయడం ద్వారా సోనియా ఆశీస్సులు దక్కుతాయన్న వ్యూహంలో జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ఓదార్పు యాత్రతో తన బలాన్ని గుర్తించడమే కాకుండా కాంగ్రెస్‌ అధిష్ఠానం తన అవసరాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుంటుందన్న ఆలోచన యువనేతలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ సానుకూల ధృక్పథంతో ఆలోచించినప్పుడేనన్నది కూడా అని ఆయన భావిస్తున్నారు. తనపట్ల సానుకూల ధృక్పథం రావాలంటే కాంగ్రెస్‌పై, సోనియాపై విమర్శవేడి తగ్గించడమే మార్గంగా జగన్‌ గుర్తించారని ఓ కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కాంగ్రెస్‌ స్నేహ హస్తం కచ్చితంగా అవసరమని యువనేత గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే జగన్‌ తన గురిని మార్చినట్లు సమాచారం.
Read more ...

‘నూరేళ్ల తెలుగు కథ’ ఆవిష్కరణ


ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:

ఆంగ్ల మాధ్యమం ప్రభావం తీవ్రంగా ఉన్న ఈ కాలంలో కొత్తతరం తమ మూలాల ను మరచిపోకుండా తమ వంతు కృషి చేయడానికే ‘సాక్షి’ దినపత్రికలో సాహిత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని సంస్థ ఎడిటోరియల్ డెరైక్టర్ ఎస్. రామకృష్ణారెడ్డి చెప్పారు. రచయితలను, మేధావులను కోరి వారు చదువుతున్న మంచి పుస్తకాలను పరిచయం చేసే శీర్షికలను కూడా ప్రారంభించే యోచన ఉన్నట్టు ఆయన తెలిపారు. ప్రముఖ కథకుడు మహ్మద్ ఖదీర్‌బాబు సంకలనం చేసిన ‘నూరేళ్ల తెలుగు కథ’ పుస్తకాన్ని రామకృష్ణారెడ్డి ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ కథలన్నీ ‘సాక్షి’ దినపత్రికలోని ఫ్యామిలీ విభాగంలో ఖదీర్‌బాబు చేసిన పునఃకథనాలే. డాక్టర్ గురువారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖదీర్ కలం నుంచి ఇలాంటి రచనలు ఇంకా ఎన్నో రావాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

తెలుగులో సహ రచయితల రచనలను మెచ్చుకునే ధోరణి తక్కువని, వాటి గొప్పతనాన్ని ప్రస్తావించవలసి వచ్చినా చాలా కష్టపడి ఆ పని చేస్తారని ప్రముఖ రచయిత్రి డాక్టర్ సి. మృణాళిని తన ప్రసంగంలో అన్నారు. అయితే ఖదీర్ ఇతరుల రచనలను, వాటి వైశిష్ట్యాన్ని సహృదయతతో ఆవిష్కరించారని అభినందించారు. ఇలాంటి ప్రయత్నాలు గతంలో కూడా జరిగినా వాటికి రాని పేరు ప్రఖ్యాతులు ఈ రచయితకు వచ్చాయంటే అందుకు కారణం ఖదీర్ ప్రతిభేనని ఆమె ప్రశంసించారు.

రచయిత, విమర్శకుడు వాడ్రేవు చినవీరభద్రుడు ప్రసంగిస్తూ, మన పూర్వుల రచనలను, సమకాలికుల రచనలను ఏదో ఒక పద్ధతిలో చర్చించుకోవడం ఆరోగ్యకరమైన అంశమని అన్నారు. ఈ పుస్తకంలో కథను పరిచయం చేయడం, ఆ కథ మీద, రచయిత మీద చక్కని వ్యాఖ్యలు చేయడం ఎంతో ప్రతిభావంతంగా జరిగాయని ఆయన అన్నారు. ఇంత పెద్ద కథా సాహిత్య ప్రయాణంలో కొన్ని కథలు ఎంపిక చేయడంలో ఇబ్బందులు తప్పవనీ, అయినా జరిగిన లోటును చెప్పక తప్పదని అంటూ వీరభద్రుడు, ఇందులో శ్రీశ్రీ, త్రిపుర వంటివారి రచనలు లేకపోవడం లోటేనని అన్నారు. ఇలాంటి యత్నాలకు పూర్వం నుంచి ఉన్న ఆదరణను, జరిగిన కృషిని పముఖ విమర్శకుడు, కవి డాక్టర్ అంబటి సురేంద్రరాజు విశ్లేషించారు.

కాగా ‘సాక్షి’ యాజమాన్యం తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇలాంటి కథలను పరిచయం చేయడానికి ముందుకు వచ్చినందునే ఇది సాధ్యమైందని సంకలన కర్త ఖదీర్ అన్నారు.

సభ కు ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి అధ్యక్షత వహించారు. ఇలాంటి మరో వంద కథల మీద ఖదీర్ విశ్లేషణ అందించాలని ఆయన కోరారు. ప్రముఖ రచయితలు సి. రామచంద్రరావు, అక్కిరాజు భట్టిప్రోలు, సతీశ్‌చంద్ర, ఆర్. శాంతసుందరి, పలువురు పత్రికా రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read more ...

కోదండకు లక్ష... ఉద్యోగులకు శిక్షా ?


ఈ రోజు సూర్య దినపత్రిక లో వచ్చిన వార్త ఇది:
 తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామిరెడ్డిపై ఎదురుదాడి తీవ్రమవుతున్నది. సమ్మె సెగ పెరుగుతున్న కొద్దీ, రాజీనామాల డిమాండ్‌ మరిం త ఊపందుకుంటున్న కొద్దీ కోదండరామిరెడ్డిపై విమర్శలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామాలు చేయాలని పదే పదే డిమాండ్‌ చేస్తు న్న కోదండరామిరెడ్డి తన ప్రొఫెసర్‌ ఉద్యోగానికి రాజీనామా ఎందుకు చేయరన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది.

గతంలో ఇదే ప్రశ్న ఎదురైనప్పుడు ఉద్యోగం అనేది తన వ్యక్తిగతం అని, చేయాలో వద్దో నిర్ణయించుకోవలసింది తానే తప్ప ఇత రుల సలహా ప్రకారం నడుచుకోబోనని కోదండరామిరెడ్డి తే ల్చి చెప్పారు. తాజాగా శుక్రవారం మరో ప్రకటన చేస్తూ ఉ ద్యోగాలు వదులుకోవటం అంటే హక్కులు వదులుకోవటమే అని, దానికి సిద్ధంగా లేమని కోదండరామిరెడ్డి వ్యాఖ్యానించా రు. దీనిపై తెలంగాణ ప్రాంత మంత్రులు మండిపడుతున్నా రు. కోదండ డిమాండ్‌ చేసినట్టు తాము మంత్రి పదవు లకు రాజీనామాలు చేస్తే తమ హక్కులు కోల్పోయినట్టు కాదా అన్న ది వారి ప్రశ్న.

సర్వే సవాల్‌ను స్వీకరిస్తారా?
కోదండరామిరెడ్డి ముందు తన ప్రొఫెసర్‌ పదవికి రాజీనా మా చేసి ఆ తర్వాత మాట్లాడాలని మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ ఘాటైన సవాల్‌ చేశారు. ఉద్యోగానికి రాజీనా మా చేయకుండా జేఏసీకి నాయకత్వం వహిస్తున్నందుకు ఎం పీ హోదాలో సర్వేను సస్పెండ్‌ చేయాలని తాను సిఫారసు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కోదండరామిరెడ్డి ఈ సవాల్‌ను స్వీకరించిన దాఖలాలు లేవు. గతంలో నూ సర్వే కోదండరామిరెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినా అవతలివైపు నుంచి ఎలాంటి జవాబూ రాలేదు.

దానం ప్రశ్నకు జవాబేదీ?
శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మంత్రి దానం నాగేందర్‌ రాజీనామా డిమాండ్‌పైన, వేతనాలు తీసు కోవటం, సౌకర్యాలు అనుభవించటం పైన రాజకీయ జేఏసీ, ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా తప్పు పట్టారు. ప్రొఫెసర్‌ ఉద్యోగం చేస్తూ నెలకు రూ.లక్ష రూపాయలు తీసుకుంటున్న కోదండ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. అదే విషయం ఇతర ఉద్యోగ సంఘాల నేతలకూ వర్తిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై కోదండ కానీ, ఇతర నేతలు కానీ మౌనం పాటిస్తున్నారు.

చిరుద్యోగులదీ అదే అభిప్రాయం...
సకల జనుల సమ్మెలో కీలకపాత్ర పోషిస్తున్న కింది స్థాయి ఉద్యోగులు సమ్మెను వ్యతిరేకించకపోయినా, కోదండ తదితర నేతల వైఖరిని తప్పు పడుతున్నారు. పని చేయని ఉద్యోగులకు వేతనాలు బంద్‌ అని సర్కార్‌ బెదిరింపులకు దిగినా తాము జడవ లేదని, అయితే ఒకరిని వేలెత్తి చూపేట ప్పుడు తమ నిజాయితీని, చిత్తశుద్ధిని ముం దుగా చాటుకోవాలన్నది కోదండ, ఇతర నే తలు తెలుసుకోవాలని వారంటున్నారు. వాస్తవానికి సమ్మె కారణంగా తమ లాంటి చిన్న ఉద్యోగులకే ఆర్థిక అభద్రత ఏర్పడు తుందని, నేతలకు ఆ ఇబ్బంది ఎక్కడ ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.

వేతనాలు రాకపోతే ఆదుకుంటామని అట్ట హాసంగా ప్ర టించిన నేతలు ఇప్పుడు ఆ మాటనే మరచిపోయినట్టున్నార న్న ఆవేదనను వారు వ్యక్తం చేస్తున్నారు. నెలాఖరులో ఇంటి అద్దెలు, నిత్యావసర సరకులు, స్కూలు ఫీజులు వంటివి తప్ప నిసరిగా చెల్లించాల్సి ఉంటుందని, పైగా దసరా పండుగ, బతు కమ్మ పండుగ వంటివి వస్తున్న నేపథ్యంలో పప్పన్నం తినేం దుకైనా ఇబ్బంది ఏర్పడుతుందన్న సంగతి నేతలకు తెలియదా అని వారు అడుగుతున్నారు. డబ్బుకు ఇబ్బంది పడితే ఆదుకుంటామన్న వారు, ఇంటికి 10 రూపాయలు చందా వసూలు చేసి ఇస్తామన్న వారూ ఇప్పటినుంచి ఆ పనిలో ఉంటే తమకు కాస్త అయినా వెసులుబాటు దొరుకుతుందన్న అభిప్రాయాన్ని కింది స్థాయి ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.
Read more ...

Sep 23, 2011

మహేష్ బాబు ఏవిదంగా దూకేడంటే...

నిన్న మహేష్ బాబు దూకుడు గురించి ఇదే బ్లాగులో లైవ్ అప్ డేట్స్ వ్రాయడం జరిగింది. అందువలన, మళ్లీ మొదటినుండి చెప్పకుండా డైరెక్టుగా కధలోకి వచ్చేస్తున్నాను.

ముందే అనుకొన్నట్లు మహేష్ బాబు దూకుడు బాగా సాగింది గానీ అక్కడక్కడ కధ కూడా కొంత సాగింది. అయితే, అవన్నీ చిన్న చిన్న లోపలే అని చెప్పవచ్చు. బ్రహ్మానందానికి జత కలిసిన యం యస్ నారాయణ అసలు కామెడీ అంటే ఏమిటో రుచి చూపించాడు. సినిమాలో అందరి నటన బాగుంది. మహేష్ బాబు స్టైలు, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, పాటల చిత్రీకరణ, వగైరాలన్నీ చక్కగా ఉన్నాయి. వోల్ మొత్తంగా అంతా బాగుంది. ఇక కధ సంగతి చూదాము.

కొత్తగా మనం కధలు వెతికి తెచ్చుకోవడం కన్నా ఉన్నవాటికే మెరుగులు దిద్దుకొని చూసేయడం అలవాటయి పోయింది గనుక మనం 'దూకుడు' లో ఎవరిని తప్పు పట్టనవసరం  లేదు. ఎందుకంటే, మహేష్ బాబు ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా రోమాన్స్ చేయాలి, ఇలా కామెడి చేయాలి, ఇలా విలన్లని చిదగోట్టాలి, ఇలాంటి డైలాగులు ఊ నాలుగయినా తప్పక చెప్పాలి అని కొన్ని గైడ్ లైన్సు మనము అతనికి ఇప్పటికే ఇచ్చేసి ఉన్నాము గనుక, అవ్వన్నీ చూపాలంటే, ఫార్ముల కధ తప్పదు మరి.

ఆ ఫార్ములా క్లుప్తంగా చెప్పుకొంటే ఇలా ఉంటుంది. 
అనగనగా ఒక మంచి మనిషి.మరి కొందరు చెడ్డ మనుషులు. వాళ్ళకి అడ్డుతగలడం మంచి మనిషి పని, గనుక అతనిని లేపేయాలనుకోవడం చెడ్డ వాళ్ళ నైజం. ఆ మంచి మనిషి కొడుకు పోలీసు ఆఫీసరు అవడం, అది కూడా మన దేశం లోనే, ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే బెస్ట్ పోలీసు ఆఫీసరవడం షరా మామూలే. ఆ పనిలో ఎవరు సాహసించని ఒక విలన్ని ఎదుర్కొని ఎడం చేత్తో చితగ్గోటేయడం, పనిలో పనిగా అక్కడే హీరోయిన్ తో నాలుగు పాటలు పాడుకొని లవ్వు లో పడిపోవడం కూడా షరా మామూలే. ఆ తరువాత, తండ్రి ఎదుర్కొని తనకోసం వదిలేసిన విలన్ల భరతం పట్టడం. ఇంతే.

అదే కధని ఇప్పుడు వివరంగా మరోసారి చెప్పుకొందాము. అంతా చెప్పేసి మళ్లీ ఎందుకు అని సందేహ పడకండి. మనం రామాయణం, భారతం కధలు ఎన్ని సార్లు వినలేదు? ఇది అంతే! పరువాలేదు మొహమాట పడకుండా వినండి.


అసలు కధేమిటంటే:
శంకర నారాయణ (ప్రకాష్ రాజ్) కొడుకు అజయ్ (మహేష్ బాబు) ఒక మంచి, తెలివయిన, సాహసవంతుడయిన, అందమయిన, బలమయిన, వగైరా...వగైరా పోలీసు ఆఫీసరు. ప్రజల కోసం మంచివాడయిన ప్రకాష్ రాజ్ కొంత మంది మాఫియా (కోట శ్రీనివాసరావు, సుప్రీత్,సాయాజీ షిండే) వాళ్లతోతలపడతాడు.అతని మీద వారు దాడి చేస్తారు.అతను చనిపోయడనుకొంటారు.గాని, అతను వాళ్ళు కొట్టిన దెబ్బలకి మైండు బ్లాకయిపోయి సినిమా కధ సౌలభ్యం కోసం ఏకంగా 14 ఏళ్ళు కోమాలోకి వెళ్లి పోతాడు.  ఇంతవరకు, మనం రామాయణంలో లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి (14 ఏళ్ళు), అదే రామాయణంలో కుంభకర్ణుడు (6 నెలలు) వారు పొందిన వరాల వల్ల నిద్రపోయినట్లు మాత్రం విని ఉన్నాము. గాని, ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో ప్రకాష్ రాజ్ తన14 ఏళ్ళు కోమాతో సరికొత్త రికార్డు  నెలకొలిపి మన మందారం గర్వ పడేలా చేసాడు. ఇక, మన ప్రకాష్ రాజ్  క్లైమాక్స్ దగ్గిర పడిందని ఎవరో కలలో చెప్పినట్లు సడెన్గా కోమా లోంచి లేస్తాడు. (కోమాలో కలలు రావని మీరు నాతో వాదిన్చొద్దు, వస్తాయి అంతే!)

ఈ లోగా  మన మహేష్ బాబు మాఫియా డాన్ సోనుసూద్ ని ఎదుర్కొనేందుకు ఫారిన్ వెళ్లి, పనిలో పనిగా లోకేషన్లు బాగున్నాయని అక్కడే హీరోయిన్ సమంతాతో ఓ నాలుగు పాటలేసుకొని, మంచి డ్రెస్సులు వేస్కొని కాస్త రోమాన్స్ చేస్తాడు. అది మన కన్నుల పండుగ చిత్రీకరించబడింది గాబట్టి మనకీ పెద్దగ ఇబ్బంది అనిపించదు. అలాగని, విలన్ని విడిచిపెట్టేయాడు. పాటకి పాటకి మద్యలో గ్యాపోచ్చినప్పుడల్లా, అతని సంగతి చూస్తూనే ఉంటాడు. ఇలా చెప్పడం మీకు నచ్చక పొతే ఇంకోలా చెపుతాను. విలన్ని ఉతికేస్తున్నపుడు మద్య మద్య గ్యాపు వచ్చినప్పుడు హీరోయిన్ తో పాటలు పాడు కొంటాడు.

తండ్రి కోమలోంచి బయటపడిన సంగతి తెలుసుకొని హడావుడిగా ఆసుపత్రికి వెళ్తే,  అప్పుడు ఏ సినిమా డాక్టరయినా  ఏమి చెప్తాడో సరిగ్గా ఆ దూకుడు డాక్టరు మహేష్ బాబుకి అదే చెప్తాడు. అదే, అతనికి ఎటువంటి సెన్సేషనల్ న్యుసులు చెప్పకూడదని. చెప్తే మళ్లీ కోమాలోకి వెళ్లిపోవచ్చునని వగైరాలు. అప్పుడు, తండ్రి మనసెరిగిన కొడుకు గాబట్టి యం.యల్.ఏ. వేషం కట్టి ప్రజా సేవ చేస్తున్నాని కధ నడిపిస్తూ, తండ్రిని ఆ స్తితికి తెచ్చిన దుష్టుల గురించి ఫీడ్ బ్యాక్ అందుకొని, వాళ్ళ సంగతి తేల్చేస్తాడు.

ఇంకేముంది, చెప్పేందుకు, వినేందుకూ?
విలన్లు హీరో చేతిలో చచ్చేరు, 5 పాటలు పడుకొన్న హీరోయిన్ సామంత పక్కనే ఉంది, వాళ్లిదరినీ ఆశీర్వదించేందుకు    తండ్రి కొమాలోంచి లేచి అక్షింతలు పట్టుకొని సిద్దంగా ఉన్నాడు. అంతే!


Read more ...

ఖనిజాసురులపై సుప్రీం కోర్టు మూడో కన్ను


ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:

ఇనుప గనులు కేంద్రంగా 'గాలి' చేసిన పాపం మరింత పక్వానికి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అక్రమాలు తవ్వితీస్తున్న సీబీఐ.... కర్ణాటకలోనూ అడుగు పెట్టనుంది. గాలి అక్రమ స్వరూపాన్ని తవ్వి తీసిన కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) నివేదికను సర్వోన్నత న్యాయస్థానం సంపూర్ణంగా ఆమోదించింది. 'అసలు గుట్టు విప్పండి! 'కర్ణాటకాంధ్ర' గనుల బంధంపై నిగ్గు తేల్చండి' అంటూ సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.


న్యూఢిల్లీ: సరిహద్దులు చెరిపేసి, ఎడాపెడా ఖనిజాన్ని రవాణా చేసిన 'గాలి యవ్వారం' మరింత బట్ట బయలు కానుంది. చంచల్‌గూడ జైలులో కటకటాలు లెక్కిస్తున్న మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన రెడ్డి పాపం మరింత పండనుంది. కర్ణాటకలోని గనుల్లో ఖనిజాన్ని తవ్వడం... దానిని ఓబుళాపురం తరలించి, దొంగ పర్మిట్లతో విదేశాలకు ఎగుమతి చేయడం! ఇది కొన్నేళ్లపాటు గాలి సాగించిన వ్యాపారం.

ఇలా... 'కర్ణాటకాంధ్ర' మధ్య గాలి ముఠా అక్రమ గని బంధం కలిపింది. ఈ విషయాన్ని సీఈసీ తన నివేదికలో పేర్కొంది. 'ఔను! ఇది నిజమే అని విశ్వసించేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయి' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా, జస్టిస్ అఫ్తాబ్ ఆలమ్, జస్టిస్ స్వతంత్ర కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది.

"బళ్లారి జిల్లాలోని అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ), దక్కన్ మైనింగ్ సిండికేట్ (డీఎంఎస్) గనుల్లో తవ్విన ఖనిజాన్ని... ఆంధ్రప్రదేశ్‌లోని ఓబుళాపురం మీదుగా తరలించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఇదే ఖనిజాన్ని విశాఖపట్నం, కృష్ణపట్నం రేవుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారని స్పష్టమైంది. బళ్లారి - అనంతపురం మధ్య ఉన్న ఈ అక్రమ గని బంధాన్ని ఛేదించాల్సిందే. దీనిపై దర్యాప్తు జరపాల్సిందిగా సీబీఐకి నోటీసులు జారీ చేస్తున్నాం'' అని ధర్మాసనం ప్రకటించింది.

అంతేకాదు... ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఓబుళాపురం గనులపై జరుతుప్ప విచారణ ఎందాకా వచ్చిందో చెప్పాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. అమికస్ క్యూరీ ద్వారా సీబీఐకి నోటీసులు జారీ చేసింది. గాలి కంపెనీ తన పరిధులు దాటి... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ గనులనూ ఆక్రమించిందని... ఇందుకు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.

అక్రమాల గుట్టురట్టు చేసేందుకు సీబీఐకి సర్వాధికారాలు అప్పగించింది. ఖనిజ సంపద ఈ-వేలం, గనుల సరిహద్దుల నిర్ణయం, సర్వేకు సంబంధించి సీఈసీ ఈనెల 21న సమర్పించిన నివేదికపై సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకివాయిదా వేసింది.

శివమెత్తిన చీఫ్ జస్టిస్
ఖనిజ సంపదను పర్యవేక్షక కమిటీ ఆధ్వర్యంలో ఈ-వేలం (ఆన్‌లైన్ ద్వారా వేలం) వేయాలన్న సీఈసీ సిఫారసుపై ఒక కంపెనీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఇలా వేలం వేస్తే నాణ్యత ఉన్న ఖనిజం మాత్రమే అమ్ముడుపోతుంది. అందువల్ల మొత్తం కొనుగోలు చేసేందుకు అనుమతించండి'' అని ఆ న్యాయవాది కోరినప్పుడు చీఫ్ జస్టిస్ కపాడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"కొనకపోతే వదిలేయండి. కొనాల్సిందిగా ఎవరూ మిమ్మల్ని బతిమాలడడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను ఇప్పటిదాకా దోచుకున్నది చాలు! భవిష్యత్ తరాలకు మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది!'' అని ఆగ్రహంతో ఊగిపోయారు.

దీంతో సీనియర్ లాయర్లు ఒక్కసారిగా విస్తుపోయారు. కోర్టు హాలులో కొద్దిసేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. జస్టిస్ కపాడియాలో అంత కోపాన్ని ఎప్పుడూ చూడలేదని సీనియర్ న్యాయవాదులు పేర్కొన్నారు.

Read more ...

తెలంగాణ అష్టదిగ్బంధం


ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:
తెలంగాణలో పూర్తిగా స్తంభించనున్న ప్రజా రవాణా
నేటి నుంచి రెండు రోజులు ఆటోలు, రైళ్లకు బ్రేక్
ఇప్పటికే ఐదు రోజులుగా నడవని ఆర్టీసీ బస్సులు
స్కూళ్లు, ఆస్పత్రులు, కోర్టుల బంద్ యథాతథం
అటెండర్లు కూడా రాక కలెక్టర్ల చేతిరాత నివేదికలు
జంట నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు
తీవ్రతరమైన సకల జనుల సమ్మె
పెరిగిన కరెంటు కోతతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు
నేడు పెట్రోల్ బంకులు, వైన్‌షాపులు,
బార్ల బంద్‌కు టీఎస్ జాక్ పిలుపు
‘దూకుడు’ ప్రదర్శననూ అడ్డుకుంటామని హెచ్చరిక




హైదరాబాద్, న్యూస్‌లైన్: సకల జనుల సమ్మె కీలక ఘట్టానికి చేరింది! పది రోజులుగా కాస్తో కూస్తో నడిచిన ప్రజా రవాణాకు పూర్తిగా బ్రేకులు పడ్డాయి! రాజధానితో పాటు తెలంగాణ అంతటా రవాణా సేవలు శనివారం నుంచి రెండురోజుల పాటు పూర్తిగా స్తంభించనున్నాయి. ఐదు రోజులుగా ఆర్టీసీ సేవలు స్తంభించగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆటోలు కూడా 48 గంటల సమ్మెకు దిగాయి. దాంతో తెలంగాణవ్యాప్తంగా రెండు లక్షల ఆటోలు ఆగిపోనున్నాయి. ఈ ప్రభావం హైదరాబాద్‌తో పాటు పట్టణాలపై తీవ్రంగా పడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోజుకు క నిష్టంగా కోటి మంది ప్రయాణికులకు ఉపయోగపడుతున్న సెవన్ సీటర్ ఆటో సేవలూ పూర్తిగా నిలిచిపోతున్నాయి. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శని, ఆదివారాల్లో తెలంగాణలో రైల్‌రోకో జరుగుతుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి మాదిరిగా మారింది. ఇప్పటిదాకా కాస్తోకూస్తో ప్రయాణికులను ఆదుకుంటూ వచ్చిన రైళ్ల సేవలు కూడా నిలిచిపోనున్నాయి. మరోవైపు ప్రైవేటు వాహనాలనూ ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. దాంతో పట్టణవాసులకు సొంత వాహనాలు, దూర ప్రాంతాలకు విమానాలు తప్ప మరో ప్రయాణ సౌకర్యమేదీ లేకుండా పోయింది! అక్కడక్కడా తిరుగుతున్న ప్రైవేటు వాహనాలు ముక్కు పిండి విపరీతమైన చార్జీలు వసూలు చేస్తూ కాసుల పంట పండించుకుంటున్నాయి.

శనివారం పెట్రోలు బంకుల బంద్‌కూ తెలంగాణ విద్యార్థి జేఏసీ పిలుపునివ్వడంతో రవాణా పరిస్థితి పూర్తిగా కుదేలవనుంది. బంకులతో పాటు తెలంగాణవ్యాప్తంగా అన్ని వైన్‌షాపులు, బార్లూ స్వచ్ఛందంగా శనివారం బంద్ పాటించాలని టీఎస్ జాక్ పిలుపునిచ్చింది. లేదంటే దాడులకూ వె నుకాడబోమని హెచ్చరించింది. ‘దూకుడు’ సినిమా యూనిట్ సభ్యులు విద్యార్థులపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఆ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించింది. థియేటర్లపై ప్రత్యక్ష దాడులకు దిగుతామని పేర్కొంది. సమ్మె నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ వి.దినేశ్‌రెడ్డి శుక్రవారం సమీక్షించారు. రైల్‌రోకో నేపథ్యంలో రాష్ట్ర రైల్వే పోలీసు అధికారులు అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకున్నారని అదనపు డీజీ వీఎస్‌కే కౌముది ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మరోవైపు ఉద్యోగులకు జీతాలు నిలిపేస్తామని ప్రభుత్వం తేల్చడం, సమ్మెను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండటంతో భావి కార్యాచరణపై చర్చించేందుకు ఉద్యోగుల జేఏసీ శనివారం విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

స్తంభించిన జనజీవనం

మరోవైపు సమ్మెతో సాధారణ జన జీవనం కూడా పూర్తిగా స్తంభించింది. స్కూళ్లు, కాలేజీల మూసివేత కొనసాగుతూనే ఉంది. వైద్యుల సమ్మెతో అత్యసవర సేవలు మినహా సర్కారీ దవాఖానాల్లో సేవలన్నీ నిలిచిపోయాయి. కోర్టుల సమ్మె శుక్రవారమూ కొనసాగింది. ప్రభుత్వ కార్యాలయాలన్నింట్లోనూ కార్యకలాపాలు స్తంభించాయి. విద్యుత్ ఉద్యోగులూ సమ్మెలోనే ఉన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే సమ్మె నుంచి మినహాయింపునిచ్చారు. సింగరేణిలో 11 రోజులుగా సంపూర్ణ సమ్మె జరుగుతుండటంతో బొగ్గు వెలికితీత నిలిచిపోయి విద్యుదుత్పత్తి బాగా పడిపోయి కరెంటు కోతలు తీవ్రతరమవుతున్నాయి. సచివాలయంలోనూ సమ్మె ప్రభావం తీవ్రతరం కావడంతో సాధారణ కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి.

అటెండర్లు కూడా విధుల్లోకి రాకపోవడంతో తెలంగాణ జిల్లాల కలెక్టర్లు చేతి రాతతో ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు! జంటనగరాల్లోని వాణిజ్య పన్నుల కార్యాలయాలన్నింటికీ తాళాలు వేసినట్టు ప్రభుత్వానికి నివేదిక అందింది. రవాణా, రిజిస్ట్రేషన్లతో పాటు అన్ని కార్యాలయాలదీ ఇదే పరిస్థితి! ఏపీసీపీడీసీఎల్‌లో శుక్రవారం కేవలం 3.25 శాతం మంది ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. వారూ అధికారులు, కొద్దిమంది కాంట్రాక్టు సిబ్బందే! క్షేత్రస్థాయి కార్యాలయాల్లో సిబ్బంది హాజరు వివరాలను ఫోన్లలో చెప్పేవారు కూడా విధులకు రాలేదు. చాలా కార్యాలయాలకు తాళాలే పడ్డాయని సంస్థ ఎండీ ప్రభుత్వానికి నివేదించారు.

కదలని బస్సులు
శుక్రవారం వరుసగా ఐదో రోజూ డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. సీమాంధ్ర నుంచి వచ్చే బస్సులతో పాటు అంతర్ రాష్ట్ర సర్వీసులు కూడా నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో మాత్రం 360 సర్వీసులను పోలీసుల సాయంతో నడపగలిగినా కార్మిక సంఘాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. ఎన్‌ఎంయూ ఫోరం ఆధ్వర్యంలో డిపోల ఎదుట కార్మికులు వంటావార్పు, మానవహారాలు నిర్వహించారు. ఆర్టీసీ ఆదాయానికి ఇప్పటికే రూ.42 కోట్ల దాకా గండిపడింది. దీన్ని, ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించాల్సిందిగా ఆర్టీసీ సిబ్బందికి ఎండీ ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.

రైల్వేకు రూ.30 కోట్ల నష్టం!

48 గంటల రైల్‌రోకో దెబ్బకు దక్షిణ మధ్య రైల్వే సుమారు రూ.30 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది. రోజూ 800 రైళ్లు, 100 పై చిలుకు గూడ్సుల ద్వారా సగటున రూ.20 కోట్ల వస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ప్రధాన రైళ్లన్నీ రద్దవడంతో ఆ మేరకు ఆదాయానికి గండిపడ్డట్టే. దక్షిణ, ఉత్తర భారతాలకు తెలంగాణ మీదుగా నడిచే దూర ప్రాంత రైళ్లను దారి మళ్లిస్తుండటంతో ఆ మేరకు నిర్వాహణ వ్యయమూ పెరగనుంది. సింగరేణి సమ్మెతో బొగ్గు రవాణా ఆదాయాన్ని కోల్పోతున్న రైల్వే శాఖకు ఇది మరో దెబ్బ!

28 కేంద్రాల్లో జేఏసీ నేతృత్వంలో రైల్‌రోకో

సకలజనుల సమ్మెలో భాగంగా రెండ్రురోజుల పాటు నిర్వహించనున్న రైల్‌రోకోలో 28 కేంద్రాల్లో జేఏసీ రైల్‌రోకో చేయనుంది. ఈమేరకు ఆయా నియోజకవర్గాలు, పట్టణాల బాధ్యుల జాబితాను జేఏసీ విడుదల చేసింది. సికింద్రాబాద్‌లో బండారు దత్తాత్రేయ, కాజీపేటలో దాస్యం వినయ్‌భాస్కర్, జి.విజయరామారావు, నిజామాబాద్‌లో యెండల లక్ష్మీనారాయణ, ఖమ్మంలో న్యూడెమెక్రసీ, సిర్పూర్-కాగజ్‌నగర్‌లో కావేటి సమ్మయ్య, తాండూరులో కల్వకుంట్ల కవిత, పాలమూరులో ఏపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైల్‌రోకో చేపడతారు.
Read more ...

జన్ లోక్‌పాల్ ఉంటే చిదంబరం జైల్లో: అన్నా హజారే


ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:
ముంబై/రాలేగావ్‌సిద్ధి: ఇప్పుడుగనుక జన్ లోక్‌పాల్ చట్టం ఉండి ఉంటే కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం జైల్లో ఊచలు లెక్కిస్తూ ఉండేవారని అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే చెప్పారు. 2జీ కుంభకోణంలో చిదంబరం పాత్రపై తాజా వివాదం నేపథ్యంలో శుక్రవారం తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో అన్నా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో ఆయన ఇంటికి వెళ్లాల్సిందేనని.. గతంలో చిదంబరాన్ని ‘ఖోడ్సాల్’ (ఈ మరాఠీ పదానికి దుష్టుడు లేదా నిజాయితీలేని వ్యక్తి అనే అర్థాలున్నాయి)గా అభివర్ణించిన హజారే అన్నారు. జన్ లోక్‌పాల్ విషయమై దీక్ష అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చినప్పుడు ఢిల్లీలో తన అరెస్టు, విడుదలపై మాట్లాడుతూ చిదంబరాన్ని ‘ఖోడ్సాల్’ అంటూ ఆయన ధ్వజమెత్తారు. 2జీ విషయంలో ప్రధానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ రాసిన లేఖ వెలుగుచూసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ముక్తకంఠంతో హోం మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధానికి హజారే లేఖ: దేశంలో ఎన్నికల సంస్కరణలు సహా ఇతర కీలక అంశాలకు సంబంధించి ప్రధాని మన్మోహన్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలపాలని కోరుతూ అన్నా హజారే ఆయనకు లేఖ రాశారు. ‘మన ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థలు ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై ప్రధాని అభిప్రాయం ఏమిటో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. రీకాల్ హక్కు, తిరస్కరణ హక్కు సహా ఇతర అంశాలపై ఆయన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని కోరాను’ అని హజారే తెలిపారు. ఇదిలాఉండగా, ఎన్నికల సంస్కరణలపై ప్రచారం చేపట్టనున్నట్టు చెప్పారు. పటిష్ట లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తల నియామకానికి మద్దతివ్వాలని కోరుతూ మహారాష్ట్రలోని సర్పంచ్‌లకు, గ్రామ పంచాయతీ సభ్యులకు లేఖ రాయనున్నట్టు పేర్కొన్నారు.
Read more ...