Apr 27, 2011

సాయి మరణం మిస్టరీ!

సత్యసాయిబాబా అసలు ఎప్పుడు మరణించారు. సాయి ట్రస్టు, సత్యసాయి ఆస్పత్రి వైద్యులు చెప్పినట్టు ఈ నెల 24వ తేదీ ఉదయం 7 గంటల 40 నిముషాలకు మరణించారా ? లేక మార్చి 28న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన ఒకటి రెండు రోజులకే మరణించారా? బాబా ఎప్పుడో మరణించినప్పటికీ సత్యసాయి ట్రస్టు వివాదాల వల్లనే ఇంతకాలం బాబా కొన ఊపిరితో ఉన్నట్లు నాటకాలు ఆడారా? కోట్లాది భక్తులకు నిరంతరం సత్యం గురించి బోధించిన సాయిబాబా మరణానికి సంబంధించిన వాస్తవాలను ‘మహా సమాధి’ చేశారా? బాబా నిర్యాణం అనంతరం ఆయన భౌతిక కాయాన్ని ఉంచిన శీతల శవపేటిక (ఫ్రీజర్) ఎప్పుడు తయారు చేయించారన్న విషయంపై తాజాగా వివాదం చెలరేగడం అనుమానాలకు తావిస్తోంది. బాబా మార్చి 28న ఆస్పత్రిలో చేరగా ఏప్రిల్ మూడోతేదీ గాని బయటి ప్రపంచానికి ఈ విషయం తెలియలేదు. మూడో తేదీనే బాబా మరణించారన్న వార్తలు గుప్పుమనడం, అప్పటికే పుట్టపర్తికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకోవడం గమనార్హం. బాబా ఆస్పత్రిలో చేరిన రెండు రోజులకే శవపేటిక తయారీకి ఎందుకు ఆర్డరు ఇచ్చారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బాబా మరణం, శవపేటికకు సంబంధించి కన్నడ టీవీ చానళ్ళు బుధవారం ఉదయం నుంచి చేస్తున్న ప్రసారాలు కొత్త వివాదానికి దారి తీస్తున్నాయి. 


అనారోగ్యంతో బాబా మార్చి 28న సత్యసాయి ఆస్పత్రిలో చేరగా రెండు రోజులకే అంటే మార్చి ముప్పయ్యో తేదీనే ఫ్రీజర్ తయారీకి బెంగళూరుకు చెందిన ఒక సంస్థకు ఆర్డర్ ఇవ్వడం చూస్తే అప్పటికే మరణించారా లేక ఇక ఒకటి రెండు రోజుల్లో మరణిస్తారన్న ఉద్దేశంతో ఫ్రీజర్ తయారీకి ఆర్డర్ ఇచ్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బాబా భౌతిక కాయాన్ని ఉంచిన ఫ్రీజర్‌ను తయారు చేసిన సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన సంభాషణలను కన్నడ టీవీ చానళ్ళు ఉదయ, సమయ ప్రసారం చేస్తున్న అంశాలు తాజా వివాదానికి కారణమయ్యాయి.

మార్చి 28న బాబా ఆస్పత్రిలో చేరగా మార్చి ముప్పయ్యో తేదీన కర్నాటకలోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శవ పేటికల తయారీ సంస్థకు కర్నాటకలోని రాజేంద్రనాథ్ అనే సాయిసేవా సమితి ప్రతినిధి శవపేటికకు ఆర్డర్ ఇచ్చి యాభై వేల రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించారు. ఏప్రిల్ నాలుగో తేదీన సాయి ట్రస్టు ప్రతినిధులు మళ్ళీ ఆ సంస్థకు ఫోన్ చేసి తమకు ఏడో తేదీ కల్లా శవపేటిక కావాలని వత్తిడి తెచ్చారు. శవపేటికను తయారు చేసేందుకు తమకు కనీసం నెల రోజుల సమయమైనా కావాలని, శవపేటికలో ఉంచే భౌతిక కాయం చెడిపోకుండా ప్రత్యేక రసాయనాలను వాడాల్సి ఉంటుందని ఆ సంస్థకు చెందిన కుమార్ అనే వ్యక్తి ట్రస్టు సభ్యులకు తెలియజేశారు. తమకు అంత సమయం లేదని వెంటనే కావాలని ట్రస్టు సభ్యులు వత్తిడి తెచ్చారు. అలా అయితే తమ వద్ద ఒక శవపేటిక సిద్ధంగా ఉందని, కన్నడ కంఠీరవగా పేరొందిన ప్రముఖ సినీ నటుడు రాజ్‌కుమార్ మరణించినప్పుడు శవపేటికను తయారు చేసినట్లు ఎలక్ట్రిక్ షాక్ కొడుతోందన్న కారణంగా దాన్ని తిప్పి పంపించేశారని, త్వరగా కావాలంటే దానికి మరమ్మతు చేసి పంపిస్తామని బెంగళూరుకు చెందిన సంస్థ ప్రతినిథి కుమార్ చెప్పారు. అందుకు ట్రస్టు ప్రతినిధులు అంగీకరించడంతో రాజ్‌కుమార్ కోసం తయారు చేసిన శవపేటికకు మరమ్మతు చేసి ఏప్రిల్ ఐదో తేదీనే పుట్టపర్తికి పంపించారు. ఆ సంస్థ ప్రతినిధి కుమార్‌కు, సాయి ట్రస్టు ప్రతినిధులకు మధ్య జరిగిన ఈ సంభాషణను కన్నడ చానళ్ళు ప్రసారం చేస్తున్నాయి. శవపేటిక తయారీకి సాయి ట్రస్టు ఇచ్చిన ఆర్డరు రశీదులను కూడా ఆ చానళ్ళు ప్రసారం చేస్తున్నాయి.


బాబా భౌతిక కాయాన్ని ఉంచిన శీతల శవపేటికకు సాయి ట్రస్టు లోగో ఉన్న స్టిక్కర్లను అతికించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏప్రిల్ ఐదో తేదీనే గుట్టు చప్పుడు కాకుండా శీతల శవపేటికను పుట్టపర్తికి చేర్చారు. ట్రస్టు సభ్యులు చెప్పినట్లు బాబా 24వ తేదీ ఉదయం మరణించినట్లు చెప్పగానే సత్యసాయి ఆస్పత్రి వద్ద, ప్రశాంతి నిలయం వద్ద భారీ సంఖ్యలో భక్తులు చేరారు. ఒకవేళ బాబా మరణించిన తర్వాతే శీతల శవపేటికను తయారు చేయించినట్లయితే అంతమంది భక్తుల కళ్ళుగప్పి దాన్ని ఆస్పత్రి లోపలికి ఎలా తీసుకువెళ్ళారన్నది ప్రశ్న. పూర్తిగా బంగారు పూతతో ఉన్న ఆ శవపేటిక తయారీకి ఎంత లేదన్నా ఇరవై రోజుల సమయం పడుతుందని, అప్పటికప్పుడు చేయడం సాధ్యం కాదని అంటున్నారు.
Read more ...

బాబా బ్రతికి ఉండగానే శవపేటిక కోసం ఆర్డర్ ఇచ్చారా?


బాబా బ్రతికి ఉండగానే శవపేటిక
ఏప్రిల్ 1 వ తేదీనే ఆర్డర్
బాబా చుట్టూ దాపరికం ఎందుకు ?

 పుట్టపర్తి సత్యసాయి బాబా శివైక్యం పొందడానికి దాదాపు మూడు వారాలముందే శవపేటికకోసం ఆర్డర్ ఇచ్చారా ? ఆ ఆర్డర్ ఇచ్చింది ఎవరు ? ఎందుకు ఇచ్చారు ? బాబా ఆరోగ్యం మెరుగుపడుతోంది అని ఒకసారి, ఆందోళనకరంగా ఉందని మరోసారి పుట్టపర్తి ప్రశాంతి నిలయంనుంచి ఒక్కోసారి ఒక్కోరకంగా వివరణలు వెలువడిన విషయం తెలిసిందే. బాబా శివైక్యం పొందిన ఆదివారం ముందు రోజున కూడా అన్ని రకాలుగా బాబాకు అత్యాధునిక వైద్య చికిత్సలు అందజేస్తున్నట్టు డాక్టర్ సఫాయా మెడికల్ బులెటిన్‌లో వెల్లడించారు.

అయితే ఏప్రిల్ ఒకటవ తేదీనే ఒక ప్రముఖునికోసం శవపేటిక కావాలని బెంగుళూరులోని ఒక కంపెనీకి ఇమెయిల్ ద్వారా సమాచారం వెళ్లింది. ఆ ఇమెయిల్ హైదరాబాద్‌నుంచి వెళ్లింది. ఆ మెయిల్ పంపిన వ్యక్తి పేరు రాజేశ్వర్ రెడ్డి అని తెలుస్తున్నది. ట్రస్టు నుంచి కాక హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ద్వారా ఈ ఆర్డర్ ఎందుకు వెళ్లిందో అర్థం కావడంలేదు. శవపేటికకు ఎ.సి. సౌకర్యం కూడా ఉండాలని ఆ వ్యక్తి కోరడంతో సదరు కంపెనీ అలాగే తయారు చేసి ఇచ్చారు. శవపేటిక ఎలా ఉండాలో కూడా ఇమెయిల్‌లో ఆ కంపెనీకి నమూనా పంపించారు.

బెంగుళూరుకు చెందిన కుమార్ అండ్ కుమార్ ఇంటర్‌నేషనల్స్ అనే ఈ కంపెనీ మల్లీశ్వరంనుంచి పుట్టపర్తికి ఈ శవపేటికను పంపించారు. ఈ శవపేటికను హైదరాబాద్ మీదుగా ఏప్రిల్ ఐదవ తేదీన పుట్టపర్తికి పంపించారు. ఈ శవపేటికను ప్రశాంతి నిలయం అందుకుంది. బాబాకు ఒకవైపు అత్యాధునిక చికిత్స అందిస్తూనే మరోవైపు శవపేటికకోసం ఆర్డర్ ఇచ్చిన విషయం ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.

ఏప్రిల్ ఒకటవ తేదీనాటికి బాబా బ్రతికే ఉన్నప్పుడు శవపేటికకోసం ఆర్డర్ ఇవ్వవలసిన అవసరం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైగా బెంగుళూరు నుంచి పుట్టపర్తి చాలా దగ్గర. మరి అటువంటప్పుడు ఈ శవపేటికను బెంగుళూరునుంచి హైదరాబాద్‌కు పంపించి, హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి పంపించవలసిన అవసరం ఏమిటన్నది వీరి ప్రశ్న.

బుధవారంనాడు బాబా మహా సమాధి సందర్భంగా టి.వి.లలో ప్రసారమవుతున్న కార్యక్రమాన్ని చూసిన ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులు బెంగుళూరులో స్థానిక టి.వి. ఛానళ్లకు ఫోన్ చేసి ఈ శవపేటికను తామే తయారు చేశామని సగర్వంగా చెప్పుకోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

బాబా బ్రతికే ఉండగా, ఏప్రిల్ 1 వ తేదీనే శవపేటికకోసం ఆర్డర్ ఇచ్చిన విషయం ఇప్పుడు బయటకుపొక్కడంతో బాబా అసలు ఎప్పుడు నిజంగా అంతిమ శ్వాస విడిచారన్న విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాబా విషయంలో అన్నీ ముందే తెలిసినప్పుడు ఎందుకు ఇంత దాపరికం అని భక్తులు అడుగుతున్నారు.

Read more ...

శాస్త్రోక్తంగా బాబా మహా సమాధి

సత్యసాయి మహా సమాధి అయ్యారు. సాయి కుల్వంత్ హాల్‌లో బుధవారం బాబా అంత్యక్రియలు శాస్త్రోక్తంగా పూర్తి అయ్యాయి. మరణ కాల దోష పరిహారం కోసం బాబా సోదరుని కుమారుడు రత్నాకర్‌తో వేద పండితులు దశదానాలు చేయించారు. పీఠాధిపతులు వేదమంత్రోచ్చారణతో బాబాకు హారతి ఇచ్చారు.

బాబా అంతిమ కోర్కె ప్రకారం వేద పండితులు క్రతువు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, పుణ్య నదుల నుంచి తెప్పించిన పవిత్ర జలాలతో బాబా పార్దీవ దేహానికి అభిషేకం చేశారు. అనంతరం పంచద్రవ్యాలతో సంప్రోక్షణ చేసి, ఉపనిషత్తుల ప్రకారం వేద పండితులు పూజలు నిర్వహించారు.

సాయికి మహాహారతితో మహాసమాధి పూర్తి అయ్యింది. ఈ అంత్యక్రియల కార్యక్రమం సుమారు 90 నిమిషాల పాటు కొనసాగింది. పుట్టపర్తిలో ఏర్పాటు చేసి భారీ స్క్రీన్‌ల ద్వారా సత్యసాయి అంతిమ సంస్కార కార్యక్రమాలను భక్తులు వీక్షించారు.

మహా సమాధి కార్యక్రమానికి బాబా కుటుంబసభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, బీజేపీ నేతలు ఎల్‌కె అద్వానీ, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, మర్రి శశిథర్‌రెడ్డి, డీజీపీ అరవిందరావు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, పంజాబ్ గవర్నర్ శివరాజ్‌పాటిల్, వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, పలు రాష్ట్ర మంత్రులు, వీఐపీలు హాజరు అయ్యారు. 

సాక్షి న్యూస్ నుండి

Read more ...

Apr 26, 2011

మరికాసేపట్లో... మహాసమాధి

నేడు బాబా ఆఖరి దర్శనం
 కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్‌ సత్యసాయి బాబా భక్తులకు నేడు ఆఖరి దర్శనాన్ని ఇవ్వనున్నారు. బాబా పార్థివ దేహానికి బుధవారం ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం, సత్యసాయి ట్రస్టు సమన్వయంతో పూర్తి చేసింది. బాబా ప్రతిరోజూ భక్తులకు దర్శనం ఇచ్చి కూర్చునే సభా మంటపం వద్ద బాబాను సమాధి చేయనున్నారు. ఇందుకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేశారు.

SaiSవీటితో పాటు ప్రసిద్ద పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, పుణ్య జలం, దేశ విదేశాల నుంచి పుష్పాలను ట్రస్టు తెప్పించింది. సమాధిని నాలుగు వైపులా పాలరాతితో నిర్మించారు. ఇందులో కింది భాగంలో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెప్పించిన మట్టిని, పుణ్య జలాన్ని చల్లుతారు. అనంతరం బాబా పార్థివ దేహానికి దేశంలోని వివిధ పుణ్య క్షేత్రాల నుంచి తెప్పించిన జలంతో పుణ్య స్నానం చేయిస్తారు. మంగళ స్నానం అనంతరం ప్రతి రోజూ బాబా భక్తులకు దర్శనమిచ్చే వేళలయిన ఏడు గంటలకు దర్శనం ఏర్పాటు చేసి, ఎనిమిది గంటల నుంచి భజనలు, కీర్తనలు మొదలు పెడతారు. తొమ్మిది గంటల నుంచీ వేద పండితులు, వివిధ పీఠాలకు చెందిన పీఠాధిపతుల వేద మంత్రోఛ్చారణల మధ్య హారతి ఇచ్చి బాబా పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. మొత్తం వ్యవహారమంతా పది గంటల లోపే పూర్తవుతుంది.

pm-2అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచీ బాబా సమాధి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇలా రెండు రోజుల పాటు దర్శనం కలిగించిన తరువాత కొన్ని రోజుల పాటు సమాధి దర్శనాన్ని ఆపి వేస్తారు. సమాధిని పూర్తీగా నిర్మిచేంత వరకూ బాబా సమాధి దర్శనానికి అనుమతి లేదు. బాబా అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు 950 మందికి మాత్రమే అనుమతి ఉంది. అంత్యక్రియలకు దేశంలోని ప్రముఖ వేద పండితులతో పాటు దేశంలోని వివిధ పీఠాలకు చెందిన పీఠాధిపతులు కూడా పాల్గొననున్నారు. వీరిలో కంచి, శృంగేరి పీఠాలకు చెందిన పీఠాధిపతులు, విజయేంద్ర సరస్వతి, విద్యాభారతి, గణపతి సచ్చిదానంద స్వామి తదితరులు ఉన్నట్లు సమాచారం.

ఈ మొత్తం కార్యక్రమాలన్నీ ప్రభుత్వ లాంఛనాలతోనే పూర్తవుతాయి. బాబా అంత్యక్రియలకు ముఖ్యమంత్రి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, అద్వానీ, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, కర్ణాటకకు చెందిన మంత్రులు కూడా హాజరు కానున్నారు. వీరితో పాటు విదేశాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కూడా హాజరుకావచ్చని ట్రస్టు వర్గాలు వెల్లడించాయి.

జనసంద్రమైన... పుట్టపర్తి
pcrowdఅనంతపురం, మేజర్‌న్యూస్‌: సత్యసాయి పార్థివ దేహాన్ని దర్శించుకోవడానికి పుట్టపర్తికి భక్తులు బారులు తీరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాలకు చెందిన పలువురు భక్తులు బాబాను కడసారి దర్శించుకోవడానికి పుట్టపర్తికి చేరుకున్నారు. దీంతో పుట్టపర్తి జనసంద్రంగా మారింది. ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. వారి నోటి వెంట నిరంతరం బాబా నామస్మరణ వినిపించింది. పేద, ధనిక, చిన్నా, పెద్దా, వృద్దులు, స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ బాబా పార్థివ దేహ కడసారి దర్శనం కోసం ఎంతో ఆతృతగా పుట్టపర్తికి వస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకే దర్శనం అని ప్రకటించడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. భక్తుల తాకిడిని గమనించిన ట్రస్టు సభ్యులు రాత్రి 12 గంటల వరకూ దర్శనానికి గడువు పొడిగించారు.

puttasఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ ఐదు కిలోమీటర్ల మేర క్యూ కనిపించింది. ఇంత దూరం క్యూ ఉన్నా కూడా భక్తుల్లో ఎలాంటి అలసట కనిపించకపోవడం గమనార్హం. బాబా పార్థివ దేహాన్ని దర్శించుకోవడమే తమ లక్ష్యమన్నట్లుగా వారు కనిపించారు. రద్దీ అధికమవుతున్నా కూడా బాబాను కడసారి చూసేందుకు కొందరు రెండు, మూడు సార్లు గంటల కొద్దీ క్యూలో నిల్చుని దర్శనానికి రావడం కనిపించింది. మంగళవారం ఒక్కరోజే దాదాపుగా ఐదు లక్షల మంది వరకూ బాబా పార్థివ దేహాన్ని దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే పుట్టపర్తికి భక్తుల తాకిడి మొదలయ్యింది. జిల్లాలోని బాబా భక్తులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశ విదేశాలకు చెందిన భక్తులతో పుట్టపర్తి కిటకిటలాడింది.

ఇక్కడకు వచ్చిన భక్తులకు ఏ మాత్రం ఇబ్బందులు కలగకుండా పుట్టపర్తి వాసులు చూసుకున్నారు. తమకు చేతనైనంత రీతిలో పుట్టపర్తిలోని ప్రతి ఒక్కరూ భక్తులకు సేవలందించారు. పేద, ధనిక, చిన్నా, పెద్దా, కులం, మతం తేడా లేకుండా పుట్టపర్తిలోని ప్రతి ఒక్కరూ భక్తులకు తోడ్పాటునందించారు. భక్తులకు కావాల్సిన తాగునీరు, ఆహారం పొట్లాలు, కూల్‌డ్రింకులు, మజ్జిగ లను అందిస్తూ భక్తులకు వారి వంతు సహాయం చేశారు.
ఇలా ఐదు కిలోమీటర్ల మేర పుట్టపర్తి వాసులతో పాటు సాయి భక్తులు కూడా తమకు తోచిన రీతిలో భక్తులకు సాయపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందు పడకుండా చూసుకున్నారు. దీన్ని చూస్తే సత్యసాయి నిత్యం ప్రవచించే ‘‘మానవసేవే మాధవసేవ’’ అన్న సూక్తి గుర్తుకు వచ్చింది. సత్యసాయి కలలు కని, ఆయన ప్రవచించిన ప్రపంచం కళ్లముందు కదలాడింది. విదేశీయులు సైతం భక్తులకు తమకు చేతనైన సాయం అందించి బాబాపై ఉన్న భక్తిని చాటుకున్నారు. సామాన్య భక్తులతో పాటు విఐపిలు బాబా పార్థివ దేహాన్ని దర్శించుకున్నారు. యుపిఏ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ బాబును దర్శించుకున్నారు.

శాంతి సందేశం రాసిన పీఎం, సోనియా
partssaiపుట్టపర్తి, మేజర్‌న్యూస్‌: బాబా పార్థివ దేహాన్ని దర్శించుకోవడానికి మంగళవారం పుట్టపర్తికి వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, యుపిఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీలు ప్రత్యేకంగా శాంతి సందేశాన్నిచ్చారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో వారు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయంలోని శాంతి భవన్‌కు చేరుకున్నారు.

అక్కడి నుంచి సాయి కుల్వంత్‌ హాలులో ఉన్న బాబా పార్థివ దేహాన్ని దర్శించుకుని పుష్పగుచ్ఛం ఉంచి మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేశారు. సర్వమత కీర్తనలు ఆలపించారు. కీర్తనల తరువాత ప్రధాని మన్మోహన్‌, సోనియా గాంధీలు నేలపైనే కూర్చుని సామాన్య భక్తుల్లాగా సాయి సంకీర్తనలు ఆలపిస్తూ భజనలు చేయడం అందరినీ అబ్బుర పరచింది. అక్కడి నుంచి బయలు దేరిన ప్రధాని, యుపిఏ ఛైర్‌పర్సన్‌లు పది నిముషాల సేపు ట్రస్టుసభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శాంతి సందేశాన్ని రాశారు. శాంతి సందేశం వారి మాటల్లోనే ..

ప్రధాన మంత్రి : బాబా అవతార పురుషుడు. ఆయన ఆధ్మాత్మిక విలువలు ప్రపంచానికి ఖ్యాతి తెచ్చి పెట్టాయి.

సోనియా గాంధీ : కోట్లాదిమందికి ఆశాభావం కలిగించిన సత్యసాయి బాబాకు ప్రణామములు.

బాబా అద్వితీయమైన శక్తి
modi-2అనంతపురం, మేజర్‌న్యూస్‌: బాబా అద్వి తీయమైనశక్తి అని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి కొనియాడారు. సత్యసాయి ట్రస్ట్‌ అతిపెద్ద ధార్మిక సంస్థ అని సత్మసాయి బాబా లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు ముందుకు వెళ్తాయని, సత్యసాయి బాబా పార్థివదేహాన్ని దర్శించు కొనేందుకు మంగళవా రం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హిందూధర్మాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు అన్నారు. ప్రపంచానికే మార్గనిర్దేశం చేసిన ధార్మికవేత్త బాబా అన్నారు. మనుషులు ఇంతపెద్ద వ్యవస్థను నిర్మించలేరన్నారు. బాబా ప్రత్యేకశక్తి వలనే ఇది సాధ్యమైందన్నారు.

ప్రముఖుల తాకిడి
అనంతపురం/ పుట్టపర్తి/ కొత్త చెరువు, మేజర్‌న్యూస్‌:పుట్టపర్తి సత్యసాయి బాబా పార్థివ దేహాన్ని కడసారి దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖు లు మంగళవారం పుట్టపర్తికి విచ్చేశా రు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఏ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, శ్రీలంక అధ్యక్షుని సోదరుడు బాసిల్‌ రాజపక్సే, రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రులు మునియప్ప, సాయిప్రతాప్‌, అంబికా కృష్ణ, అంబికాసోనీ, ఎస్‌ఎం. కృష్ణ, పనబాక లక్ష్మి, గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్రమోడి, విహెచ్‌పి నేత అశోక్‌ సింఘాల్‌, నిత్యానంద స్వామి, మాజీ ఎంపిలు నన్నపనేని రాజకు మారి, కనుమూరి బాపిరాజు, రాష్ట్ర మంత్రులు మోపిదేవి వెంకటరమణ, రఘువీరారెడ్డి, గీతారెడ్డి, జాతీయ విపత్తుల ఛైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డిలతో పాటు పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు, జడ్జీలు ఉన్నారు.

(ఈ రోజు సూర్య దిన పత్రిక నుండి) 
Read more ...

Apr 25, 2011

వర్మ కొచ్చిన కొత్త సందేహం?

"నేత్రదానం చేస్తే మరుజన్మలో గుడ్డివాళ్ళుగా జన్మిస్తారేమో అని నా అనుమానం. అందుకే, నేన్నేప్పుడూ నేత్ర దానం చేయదలచుకోలేదు, అని ట్వీటేడు మనకున్న ఒకే ఒక్క మహా మేధావి రామ్ గోపాల్ వర్మ అనే ఒక సినిమా డైరెక్టార్.
దానికి నా వంటి పామరులు కొంచెం ఆవేశపడిపోయి, మరి కొంచెం కోపడిపోయి  'మీ వంటి ప్రముఖ వ్యక్తులు ఇటువంటి మాటలు చెప్తే అది నమ్మి నా వంటి పామరులు నిజమనుకొని, అసలు నేత్ర దానం కార్యక్రమానికే దూరం కారా?అని అక్రోసిస్తే 'నేను అన్న మాటలు అర్ధం చేసుకోవడానికి బుర్రలో కొంతలోకొంతయిన గుజ్జు ఉండాలి, అది ఉంటెనే అర్ధం అవుతుంది, లేక పోతే ఎవరికెంత గుజ్జు ఉంటె దానినిబట్టే అది గోచరిస్తునదని శెలవిచ్చాడు మనోడు.

ఇంతకి ఎవరైయిన బుర్రలో గుజ్జున వాళ్ళు ఉంటె దీనిని మరి కొంత విశదీకరించి చెప్పమని నా ప్రార్ధన.
Read more ...

సత్యసాయి తుది వీడ్కోలుకి ఆహ్వానలా...!

సత్యసాయికి బుధవారం ఉదయం 10-11.30గంటల మధ్య సాయి కుష్వంత్ హలో అంతిమ సంస్కారాలు చేయబోతున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. ఇంత వరకు దాదాపు 2 లక్షల మంది భక్తులు బాబా బౌతిక కాయాన్ని దర్శించుకొన్నట్లు సమాచారం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, వివిధ రాష్ట్రాలకి చెందిన మంత్రులు, ముఖ్య మంత్రులు మరియు ఇతరులు వస్తున్నట్లు సమాచారం. 

అయితే, ఈ రోజు ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో వచ్చిన కధనంలో ఆశ్చర్యకరమయిన వాక్యం ఒకటి ఉంది. బాబా పార్ధివ  శరీరం దర్శించుకోవడానికి ట్రస్ట్ వారు దాదాపు 600 మందికి ఆహ్వానాలు పంపారుట. ఇదేమయిన పెళ్ళా లేక శుభాకర్యక్రమమా ఆహ్వానాలు పంపడానికి? మామూలు మనుషులయితే ఇటువంటి కబురు ఫోన్ ద్వారానో లేక వేరే రూపంగానో తమ అయిన వార్కి తెలియజేయడం పరిపాటి. గాని, బాబా వంటి ప్రముఖ వ్యక్తి మరణం గురించి చాల త్వరగా అందరికి కబురు అందిపోతుంది. మరి ట్రస్ట్ వారు ఏమనుకొని ఆహ్వానాలు పంపారో? లేక, దిన పత్రిక వాళ్లే పొరబడి అలా వ్రాసేసుకోన్నారో తెలియదు. 

ఇదిగో, ఇది చదవండి మీకు ఏదో అనిపించవచ్చు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ మంగళవారం మధ్యాహ్నం పుట్టపర్తికి రానున్నారు. చివరిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి భౌతిక కాయాన్ని దర్శించి, ఆయనకు నివాళులర్పించనున్నారు. బుధవారం ఉదయం సత్యసాయి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేశారు. 650 మంది ప్రముఖులకే ఆహ్వానం అందినట్లు సమాచారం.

భగవాన్ శ్రీసత్యసాయిబాబా పార్ధివ దేహాన్ని చివరిసారిగా సందర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి తరలి వస్తున్నారని మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సోమవారం పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే లక్ష మందికిపైగా భక్తులు బాబా పార్ధివ శరీరాన్ని దర్శించుకున్నారని, మరో లక్షమంది ఈరోజు దర్శనార్ధం వచ్చారని అన్నారు. భక్తులందరికీ బాబా పార్ధివ శరీర దర్శనం లభిస్తుందని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు.

మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు బాబా దర్శనం ఉంటుందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధి మంగళవారం మధ్యాహ్నం పుట్టపర్తికి వస్తున్నారని, చివరిసారిగా బాబా భౌతిక కాయాన్ని దర్శించి, ఆయనకు నివాళులర్పించనున్నారని మంత్రి తెలిపారు. బుధవారం ఉదయం సత్యసాయి అంత్యక్రియలు జరగనున్నాయని, ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. రాబోయే తరాలకు పుట్టపర్తి పుణ్యక్షేత్రంగా వెలుగుతుందని అన్నారు.



Read more ...

బాబా ఆరోగ్యం క్షీణించినప్పుడు ఏమయ్యారు?


ఈ రోజు బాబాను చూసేందుకు వస్తోన్న మంత్రులు, ప్రధాని, ముఖ్యమంత్రులు ఆయ న ఆరోగ్యం క్షీణించినప్పుడు ఏమయ్యారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. బాబా పార్థివ శరీరాన్ని చూసేందుకు చూపిస్తున్న ఆసక్తిలో కొంతైనా ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు చూపించి ఉంటే బాబా బతికి ఉండేవారేమోనని పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

సత్యసాయి బాబా మూడు నెలలుగా భోజనం చేయలేదని, ఆస్పత్రికి వచ్చే సమయానికే ఆయన అచేతనావస్థలో ఉన్నారని డాక్టర్ సఫాయీ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఆరోగ్యం ఎంత నిర్లక్ష్యానికి గురైందో రుజువవుతోందని పేర్కొన్నారు. ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నా.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ నిష్ణాతులైన వైద్యులను పంపి బాబాకు వైద్యం చేయించలేకపోయారని, బాబాకు వైద్యం చేసిన డాక్టర్ల పేర్లు సైతం బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేశారని మండిపడ్డారు.

కొద్ది నెలలుగా బాబాకు ఇచ్చిన మత్తు మందుల నేపథ్యంలో ఆయన ఆరోగ్యం ఎలా క్షీణించిందో, ఏయే మందులిచ్చారో కూడా డాక్టర్ సఫాయీకి కూడా తెలియలేదంటే ట్రస్టు సైతం ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిందో అర్ధమవుతోందన్నారు. కేంద్ర మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీక్ తదితర రాజకీయ నాయకులు బాబా ఆస్తులను కాజేసే యత్నాలు చేస్తున్నట్లుగా వదంతులు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.

బాబా ఆస్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. 'ఆరేళ్ల క్రితం రాజకీయాల నుంచి దూరం కావాలన్న ఉద్దేశంతో బాబా అనుమతి కోసం ఆయన దగ్గరకెళ్లాను. అయితే రాజకీయాల్లో కొనసాగాల్సిందిగా నన్ను ఆదేశించారు. నా కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని కూడా తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇది నా జీవితంలో మరపురాని ఘటన' అని వీరభద్రరావు వెల్లడించారు.
(ఈ రోజు  ఆంధ్ర జ్యోతి దినపత్రికనుండి)
Read more ...

Apr 24, 2011

సత్యసాయి ట్రస్టు ఎవరి చేతిలో...?











(ఈనాడు పేపర్ క్లిప్పింగ్) 
Read more ...

దర్శనం ఇచ్చే చోటే సమాధి


నాలుగు రోజులు సంతాప దినాలు అధికార లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు

భగవాన్ సత్యసాయి బాబా పార్ధివ దేహాన్ని బుధవారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో సమాధి చేయనున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా లక్షలాది మంది భక్తులకు బాబా దర్శనం ఇచ్చిన సాయి కుల్వంత్ హాలులోనే ఆయన్ను సమాధి చేయనున్నారు. సత్యసాయి మృతికి నాలుగు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో బాబా అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. అనంతపురం జిల్లాలో బుధవారం సెలవు దినంగా ప్రకటించారు. ఆదివారం పుట్టపర్తికి వచ్చి బాబా భౌతిక కాయాన్ని దర్శించుకుని నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాలను తెలియజేశారు. సకల ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంతిమ క్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. బుధవారం అనంతపురం జిల్లాలో అన్ని ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, ప్రజలు, భక్తుల సందర్శనార్ధం బాబా భౌతికకాయాన్ని ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్‌హాలులో ఉంచారు. సోమ, మంగళవారాల్లో కూడా సాయి భౌతిక కాయాన్ని కుల్వంత్ హాలులో భక్తుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకుగానీ, పదకొండు గంటలకుగానీ సమాధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, ట్రస్టు సభ్యులతో మరోసారి చర్చించి సమాధి సమయాన్ని ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే ట్రస్టు ప్రతినిధులు, కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు. సోమవారం ఒక నిర్ణయం తీసుకుంటారు.
Read more ...

సత్యసాయి బాబా అరుదయిన ఫోటోలు


































































సత్యనారాయణరాజు అలియాస్ సత్యసాయి బాబా. 1926లో పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకు ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించాడు. సత్యనారాయణ వ్రతం తర్వాత పుట్టిన సంతానం కనుక పిల్లవాడికి అలా పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతకు అవే మోగాయనీ ఇప్పటికీ చెప్పుకుంటారు. 

ప్రొఫెసర్ నారాయణ కస్తూరి రచించిన జీవిత కథ ప్రకారం వ్రతం తర్వాత ఈశ్వరమ్మకు ఒక నీలిరంగు గోళం వంటి కాంతి తనలో లీనమౌతున్నట్లుగా కల వచ్చింది. తరువాత ఆమె గర్భవతి అయ్యింది. బిడ్డ జననం తరువాత పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చింది. అందుకే కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు. 

అయితే ఈ అనుభవాలను గురించి ఆ సమయంలో ఉన్న వ్యక్తుల నుండే విభిన్న కథనాలు వినబడుతున్నాయి. యౌవ్వనంలో సత్యసాయిబాబా దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది. చిన్న వయస్సులోనే నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరచాడు. తర్వాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివాడు. మార్చి కొంత విచిత్రమైన ప్రవర్తన (తేలు కుట్టినట్లుగా) కనబరచాడు. ఈ సంఘటన తర్వాత అతని ప్రవర్తనలో మార్పులు కనబడసాగినట్టు చెప్పుకుంటారు. 

సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవాడు. పురాతన శ్లోకాలు చెప్పేవాడు. భోజనం సరిగా చేసేవాడు కాడు. 1940లో తాను షిరిడీ సాయిబాబా చెందిన ఫకీరు అవతారమని ప్రకటించుకున్నాడు. అదే పేరు తనకు పెట్టుకున్నాడు. కస్తూరి వ్రాసిన జీవిత చరిత్ర ప్రకారం అక్టోబర్ 20, 1940లో, తన 14 యేండ్ల వయస్సు ఉన్నపుడు తన పుస్తకాలు వదిలేసి, "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది" అని చెప్పారు.

తర్వాత మూడేండ్లు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద గడిపాడు. అప్పుడే అతనిచుట్టూ ప్రజలు గుమికూడడం మొదలయ్యింది. వారితో అతను భజనలు చేయించేవాడు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారం అని ప్రకటించాడు. అప్పటినుండి సాయిబాబా అదే విషయం చెబుతూ వచ్చాడు. 1942 నాటి బుక్కపట్నం స్కూలు రికార్డులలో అతని పేరు ఉంది. 

1944లో అనుచరులు (భక్తులు) ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని "పాత మందిరం" అంటారు. ప్రస్తుతం ఇది ఆశ్రమమైన ప్రశాంతి నిలయం. దీని నిర్మాణం 1948లో మొదలయ్యింది. 1963లో తన ప్రవచనంలో తాను శివుడు శక్తిగల అవతారమని ప్రకటించాడు. ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమనీ, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తాననీ చెప్పాడు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించాడు. 

1958లో సత్య సాయిబాబా అనుచరులు సనాతన సారధి అధికారిక పత్రికను ప్రచురిచడం ప్రారంభించారు. అదేసమయంలో పలు ప్రాశ్చాత్య దేశాల నుంచి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారు సత్యసాయిని సందర్శించడం అధికమైంది. ఒక్క 1968లో మాత్రమే ఈశాన్య ఆఫ్రికా ప్రాంతానికి సాయిబాబా భారత దేశం దాటి బయటకు వెళ్ళాడు. 

కాని అతని అనుచరులు, భక్తులు, సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. 1960లో ఒక ప్రవచనంలో తాను ఈ మానవ రూపంలో ఇంకా 59 సంవత్సరాలు ఉంటానని చెప్పాడు. ప్రచురింపబడిన ఒక పుస్తకంలో బాబా ఇలా చెప్పాడని వ్రాయబడింది."నా పాత శరీరంలో నేను ముసలివాడను, బలహీనుడను అయ్యాను గాని ఈ క్రొత్త శరీరంలో అలా కాను." 

పుట్టపర్తే సత్యసాయి ప్రీతిపాత్రమైన స్థలం. పుట్టపర్తిలోనే ఇప్పటికీ నివాసం ఉంటున్నాడు. ఒకప్పటి ఈ చిన్న గ్రామం ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్యజ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల (దీని డిజైనుకు పలు అవార్డులు లభించాయి). ఒక ఆధ్యాత్మిక మ్యూజియమ్, ఒక రైల్వే స్టేషను, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి పెక్కు సదుపాయాలు ఆవిర్భవించాయి. 

పుట్టపర్తి ఆశ్రమాన్ని దేశ విదేశాలకు చెందిన వీవీఐపీలు దర్శించుకున్నారు. సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలల నుంచి 10 లక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారతదేశం నుంచి, 180 ఇతర దేశాల నుంచి 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు. సంవత్సరంలో అధికభాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉంటుంది. వేసవికాలం కొన్నిరోజులు బెంగళూరులోని "బృందావనం" ఆశ్రమంలో గడుపుతాడు. ఎప్పుడైనా కొడైకెనాల్ ‌లోని "సాయి శృతి ఆశ్రమానికి వెళతాడు. 

సత్యసాయిబాబా మూడు ముఖ్య మందిరాలను స్థాపించాడు - అవి ముంబైలోని "ధర్మక్షేత్రం" లేదా "సత్యం", హైదరాబాదులోని "శివం", చెన్నైలోని "సుందరం". బాబా ఆశ్రమాలలో దినచర్య ఉదయం ఓంకార స్మరణ, సుప్రభాతాలతో మొదలవుతుంది. తర్వాత వేద పారాయణ సంకీర్తన, భజనలు జరుగుతాయి. బాబా దర్శనం ఇస్తాడు. ముఖ్యంగా అక్టోబరు, నవంబరు మాసాలలో బాబా ఇచ్చే దర్శనం పట్ల భక్తులకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఎందుకంటే బాబా జన్మదినం ఈ కాలంలోనే వస్తుంది. 

దర్శన సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను, వినతి పత్రాలను స్వీకరిస్తాడు. విభూతిని 'సృష్టించి' పంచుతాడు. కొందరిని ప్రత్యేక దర్శనానికి, మాట్లాడడానికి అనుమతిస్తాడు. ఇలా ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో సంతోష కారణంగా ఉంటుంది. అటువంటి దర్శన సమయాలలో బాబా భక్తుల మనసులోని మాటలను, 
ఇతర అనూహ్యమైన 
విషయాలను వెల్లడిస్తుంటాడని అలా భక్తులు ఆశ్చర్యపడుతారని అంటారు.
(ఇది వెబ్ దునియాలో ఇచ్చిన వివరాలు) 

Read more ...