Mar 31, 2011

బ్లాగ్మేతలు

కాకి పిల్ల కాకికి ముద్దు.
ఎవరి బ్లాగు వారికి ముద్దు.

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు. 
కొత్త బ్లాగోడు బ్లాగోదలడు.

ఎంత చెట్టుకి అంత గాలనట్లు,
ఎంత బ్లాగుకి అంత రెస్పాన్సు.

ఎవరి పిచ్చి వారికానందం.  
ఎవరి బ్లాగ్ దురద వారిది. 



ఎగిరెగిరి దంచినా అంతే కూలి, రోటి కాడ పాడిన అంతే కూలన్నట్లు, 
ఏకి బ్లాగినా అంతే రెస్పాన్సు, సినిమా బొమ్మలెట్టుకొని బ్లాగినా అంతే రెస్పాన్సు.









  
Read more ...

టెర్రర్ యిష్టుల్లార భారత్ లోకి సుస్వాగతం

అడగందే అమ్మయిన పెట్టదనే సామెత బహుశః పంజాభి భాషలో లేనందునో మరేమో గాని, మన మన్మోహనులవారు పాకిస్తాన్ ఏలికలని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో వారు అడగక ముందే కడుపు తడిమి ఇంత అన్నం పెట్టె ప్రయత్నం చేసేసారు. మహారాజశ్రీ గిలాని దొరవారిని మరియు తదితర పాకిస్తానీ ప్రభువులని ప్రసన్నం చేసుకొనేందుకు, పాక్ ఆక్రమిత కాశ్మీరుకి ఇటువైపునున్న మన చిన్న పాటి కాశ్మీరు ముక్క గేటుకి 'టెర్రర్ యిష్టుల్లార భారత్ లోకి  సుస్వాగతం' అని తాటికాయంత అక్షరాలతో వ్రాయించిన బ్యానర్లు కట్టించడమే గాకుండా, అలా లోనికి విచ్చేసిన వారందరికీ మూడు నెలలికి బదులు ఇప్పుడు ఆరు నెలలపాటు సకల షోడోపచారాలు చేసుకొని  మా జన్మలు ధన్యం చేసుకోగలమని మన మన్మోహనులవారు తలపోశారు. ఈ ముక్క గిలాని వారి చెవిలో వూదకముందే ఆయనని  ఆశ్చర్యానందభరితుని చేద్దామని, ఒక కొత్త ఆర్డరు పాసు చేసేసారుకూడా.

అయితే వ్రతం చెడ్డా ఫలం ధక్కలేధన్నట్లు, వారి టీముని ఓడించిన పాపానికి, ఆ పెద్ద మనిషి మనసు నొచ్చుకొని వెళ్లి పోయాడు. కనీసం 'శేహ్బాష్  మన్మోహన్!' అని కనీసం భుజం కూడా తట్టకుండా వెళ్లి పోయాడు. అప్పటికీ గిలాని దొరవారికి నచ్చే వంటకాలన్నీ వండి వడ్డించేము కూడా. అయిన ఏమి లాభం, జరగా రానిది జరిగి పోయింది. పాకిస్తాన్ వోడిపోయింది. ఇంకా మన కాశ్మీరు తలుపులు  తెరిచే ఉన్నాయి. ఆ తెరిచిన తలుపులు  మువ్వన్నెల జెండా భుజాలకెత్తుకొని వస్తున్న మన భారతీయులకోసమని ఎవరు బ్రమ పడనవసరం లేదు. అటువంటి ప్రయత్నం ఎవరైనా చేయదలిస్తే వారిని విద్వేషాలు రెచ్చగొట్టే తీవ్రవాదులకింద పరిగణించి, వూరు పొలిమేరలలోనే ఆపి తరిమి తరిమి కొట్టిన అనుభవం వివేకం మన స్వంతం. 

ఇక, మ్యాచ్ గెలవడం మన అధ్రుష్టమో లేక మన దురద్రుష్టమో త్వరలోనే మన గిలానీ ప్రభువుల వారు తమ ముష్కర మూకలతో మాట్లాడి నిర్ణయిస్తారు. అందుకు తగిన దండనా విధిస్తారు. శంకంలో పోస్తేగాని నీరు తీర్ధం కాదన్నట్లు, గిలాని దొరవారు ముందుగా నాలుగు అవాకులు చావాకులతో నోరు శుద్ధి చేసుకోన్నాక,ఇక మన కోసం తదనంతర ఏర్పాట్లు చేస్తారు. అవి, ఏ ముంబైలోనే పేలబోయే బాంబులు కావచ్చు, లేదా ఏ రైల్లోనో అమర్చిన బాంబులు కావచ్చు. ఏది ఏమయినా పాకిస్తాను ఏలికలికి మన మీద  చాల కోపం మాత్రం వచ్చేసిందని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం కాయం. మనమూ, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా, అందుకే 'ద్వారములు తెరిచేయే ఉంచి' టెర్రర్ యిష్టుల్లార స్వాగతం సుస్వాగతం అని ఎలుగెత్తి పిలుదాము.  

Read more ...

Mar 30, 2011

పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం




భారత్ పాకిస్తాన్ల  మధ్య  నేడు  మొహాలిలో  జరిగిన  సెమి  ఫైనల్  మ్యాచ్ లో భారత్  29 పరుగుల  తేడాతో  విజయం  సాధించింది . పాకిస్తాన్  49.5 ఓవర్లలో  231 పరుగులు  చేసి  ఆల్  అవుట్  అయింది . మ్యాచ్  చివరివరకు  కొంత  ఉత్కంటగా  కొనసాగినప్పటికి  భారత్ దే  పైచేయని  25 ఓవర్లకే  తెలిసిపోయింది. చివరికి  పాకిస్తాన్  పై  భారత్  పైచేయి  సాధించి  వరల్డ్  కప్  ఫైనల్కి కి మార్గం సుగమం చేసుకొంది .

ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ అత్యంత సంతోషం కలిగించే ఈ శుభవార్తని అందించిన మన భారత్ క్రికెట్ టీం కి మన అందరి అభినందనలు.
Read more ...

50 ఓవర్లలో భారత్ 260/9



Read more ...

4 విక్కెట్లు కోల్పోయిన భారత్

 సైకిల్  స్టాండులో  ఒక  సైకిలును  తోస్తే  వరుసగా  అన్ని  పడిపోయినట్లు  మన  భారత్  బ్యాటింగ్  బ్యాట్స్మన్  కూడా  అవసరమయిన  అతి  కీలక  సమయములో   చేతులెత్తేయడం  మనం  చాల  సార్లు  చూసాము.

ఇంత  వరకు  సెహ్వాగ్, గౌతంగంభీర్ , విరాట్ కోహ్లి, యువరాజ్, వరుసగావచ్చి,వచ్చినంత  వేగంగానూ వెనక్కి వెళ్లి  పోయారు.

ప్రస్తుతం  భారత్ స్కోరు:
154/4 (27.4 ఓవర్లలో)
సెహ్వాగ్ :38, టెండూల్కర్ :67; గౌతం  గంభీర్ :27; విరాట్  కోహ్లి9 : యువరాజ్ :0; ధోని :8; యక్స్త్రాలు:8 

Read more ...

మొదటి విక్కేటు కోల్పోయిన భారత్

ఇండియా  పాకిస్తాన్  మ్యాచ్  మొదలైయింది. భారత్ టాస్  గెలుచుకొని బ్యాటింగ్ ఎంచుకొంది. ఓపెనింగ్  బ్యాట్స్  మాన్గా    వచ్చిన  సెహ్వాగ్  కేవలం  38 రన్స్  చేసి  అవుట్  అయ్యేడు . సచిన్ టెండూల్కర్  19 బల్ల్స్లో  19 రన్స్  చేసి  నిలకడగా  ఆడుతున్నాడు . సెహ్వాగ్  స్తానం కి  గౌతం  గంభీర్  వచ్చేడు.
ప్రస్తుతం భారత్ స్కోరు: 68/1 (9.0ఒవర్లలొ)

Read more ...

భారత్ పాక్ సెమి ఫైనల్ మ్యాచ్ వీరాభిమానుల ఫోటోలు














Read more ...

Mar 29, 2011

నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ ఇక లేరు మనకి

ఎన్నో గొప్ప పాత్రలని అవలీలగా చేసి ప్రేక్షకుల మన్ననలు పొందిన నూతన్ ప్రసాద్ ఈ రోజు అనగా బుధవారం  ఉదయం చనిపోయారు. అందాల రాముడు సినిమాతో తన సిని పయనం ఆరంబించిన ఆయన చలి చీమలు, ముత్యాల ముగ్గు వంటి ఎన్నెనో మంచి సినిమాలు చేసి, తెలుగు సిని చరిత్రలో తనకొక ప్రత్యెక స్థానం ఏర్పరుచుకొన్నారు. 

బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ సందర్బంలో తన రెండు కాళ్ళు పోగొట్టుకోన్నపటికీ ఆత్మా విశ్వాసం పోగొట్టుకోలేదని చాటి చెప్పుతూ ఆ తరువాత అనేకానేక సినిమాలలో టి వి సీరియళ్ళలో నటించి శభాష్ అనిపించుకొన్నారు. 

తెలుగు సినిమా ఒక మహా నటుడిని కోల్పోయింది.




Read more ...

జీతాలు పెంచుకొందాము కలిసిరండి

మన గౌరవ శాసన సభ సభ్యులు ఏ విషయములోనైన ఒకరితో ఒకరు విభేదించవచ్చు గానీ, తమ జీతాల పెంపు విషయంలో మాత్రం అందరిదే ఒకే మాట ఒకే పల్లవి. ఇందుకు వారి పార్టి సిదాంతాలు గానీ, ఆంధ్ర తెలంగాణా ప్రాంతియబావాలు గానీ, మత పరమైన విభేదాలు గానీ అడ్డు కావు. మనమంతా భారతీయులమనే బిన్నత్వంలో ఏకత్వం ఈ ఒక్క విషయంలో మాత్రం చక్కగా నిరూపిస్తారు.

ప్రజలకి ఉపయోగమైన ఏ ఒక్క చర్చ, నిర్ణయం గానీ చట్ట సభలలో చేయక పోయినా నిసిగ్గుగా జీతాలు తీసుకొంటున్న మన ప్రజా ప్రతినిదులిప్పుడు, తమ జీతాలు పెంచాలని ఏకగ్రీవంగా ఓ నిర్ణయం తీసుకోవడము, వెన్వెంటనే అది అమలులోకి వచ్చేలా చకచక ఏర్పాట్లు చేసుకోవడం జరిగిపొంది. అంతటితో ఆగక, నష్టాల ఉభిలో కురుకు పోయి మనుగడే ప్రశ్నార్ధకంగా మారిన ఏ.పీ .యస్.ర్.టి.సి, గిరిజన్ కార్పోరేషన్ వంటి ప్రభుత్వ సంస్థలనుండి, ల్యాప్ టాపులు, సూట్కేసులు, తేనే సీసాలు, గిఫ్టు ఒచర్లు వంటి బహుమతులు కూడా బలవంతంగా ఇప్పించుకొని బస్తాలకేత్తుకొని మోయలేక మోసుకు వెళ్లారు మన శాసన సభ్యులు.

గత కొద్ది వారాలుగా మన శాసన సభ్యులు సభలలో చేసిన ఘనకార్యాలు ఇవి:
1.తోటి శాసన సభ్యులను పచ్చి భూతులు తిట్టడం, కొట్టడం.
2.గవర్నరు మీద దాడి చేయడం, అవమానించడం.
3. అసంబ్లిలోపలె ముష్టియుద్ధాలు చేయడం.
4. వాల్కౌట్లు చేయడం, మాక్ అసంబ్లిలని నిర్వహించడం.
5. అసంబ్లికి పిండ ప్రధానం చేయడం. 
పైన పేర్కొన్న పనులన్నీ ఎంతో చక్కగా, ఎంతో బాధ్యతగా నిర్వర్తిన్చిననదుకు ప్రభుత్వమిచ్చిన నజరానాలు ఇవి:

(అది ఆంధ్రుల సభ అని వెలివేసిన గౌరవనీయ తెరాస శాసన సభ్యులుకుడా, ఇతర తెలంగాణా వాదులుకుడా అదే సభ అందజేస్తున్న ఈ తయిలాలని తీసుకొనేందుకు మొహమాట పడలేదు, సిగ్గు పడలేదు. డబ్బెవరికి చేదని గనత వహించిన మన శాసన సభ్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఈ సందర్బంగా బహు బాగా సెలవిచ్చారు కూడా.నిజమే! డబ్బెవరికి చేదు? డబ్బుకి మతముందా, కులముందా, లేక ప్రాంతముందా? డబ్బు డబ్బే.)





Read more ...

అంబటి పిల్లి శాపాలు

నిన్న శాసన సభలో మంత్రి వివేకులవారు రెచ్చిపోయి వీరంగం ఆడేసి అలిసి పోయిన తరువాత స్వర్గియులైన మా అన్న గారిని అలా దుషిస్తుంటే తట్టులేక చెంప పగులగోట్టేనని సెలవిచ్చేరు. మంచిదే! చనిపోయిన వై .యస్.ర్ ని ఎవరైనా తిడుతుంటే ఆయన కుటుంభ సభ్యులకి, అతనిని అభిమానించే వారికి చాల కోపం రావచ్చు. అందుకే, శాసన సభలో నిన్న జరిగిన ఆ ముష్టి యుద్దానికి కొందరు నూరు మార్కులు వేయవచ్చు. మరి జగన్ పార్టికి చెందిన అంబటి రాంబాబు పెట్టె పిల్లి శాపాలు కూడా విన ముచ్చటగా ఉన్నాయి, 

మీడియా వారితో మాట్లాడుతూ ఆయన, ముందుగా మీరు స్వర్గీయ వై .యస్.ర్కి స్వయానా తమ్ముడు లక్ష్మనుడిగా గుర్తింపు పొందాలనుకొంటున్నారో లేక విబిషనుడి  పాత్ర పోషించాలనుకొంటునారో  తెలియజేయమని గట్టిగా అడిగారు. ఒకవేళ, లక్ష్మనుడిగా గౌరవం పొందాలనుకుంటే వెంటనే కాంగ్రెసును వీడి జగన్ పార్టీలోకి వస్తే సగౌరవంగా ఆహ్వానించి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. అలా గాక కాంగ్రేసునే అంటకాగుతు, రోజు ఎవరో ఒకరు తన అన్నగారిని తిడుతుంటే, ఇలా వీరంగామాడుతూ నాటకాలు అడోదని ఒక ఉచిత సలహా కూడా పడేసారు నోర్రున్న మన అమ్బటివారు.  

ఇంతకి, వివేకానంద రెడ్డి గారు తమ మనసులో ఎమనుకొంతున్నారో ఇంకా తెలియదు. చూద్దాము అయన లక్ష్మనుడే అవుతాడో లేక విబిషనుడే అవుతాడో?



Read more ...

తెలుగు సినిమా కబుర్లు

యన్టీఆర్ అందాల ఖజానా ఇలియానా నటించిన శక్తి సినిమా ఏప్రిల్ 1 వ తేదిన విడుదల అవుతోంది.













Read more ...

Mar 28, 2011

లిబియాలో తెలుగువారు విల విలా

అప్పు చేసి పొట్ట చేత బట్టి 
తన వారిని, ఉన్న ఊరిని వదిలిపెట్టి
ఏడేడు సంద్రాలు దాటుకొని 
గల్ఫు దేశం జేరుకొన్నతెలుగు బిడ్డా  
జరా బద్రంగుండు బిడ్డా.

ఎండనక వాననుక  
కడుపు కాల్చుకొని శ్రమిస్తున్న 
తెలుగు బిడ్డా 
మారు మొగుత్తున్న తుపాకుల మధ్య 
జరా బద్రంగుండు బిడ్డ.
ఎక్కడున్నా క్షేమంగుండు బిడ్డా.


Read more ...

మా అన్న మంచోడే గాని,

 అన్నను తిడితే సహించలేని వివేకం 
వదినమీదే పోటి చేయాలనుకోవడం అవివేకం 
ఎటు తేల్చుకోలేని అయోమయం


Read more ...

ప్రజా సేవంటే మాటలా?

మన ఏలినవారు పెంచుకొన్నారు తమ జీతబత్యాలు ఇబ్బడి ముబ్బడిగా
ఆ చేత్తోనే మనకి ఇన్ని పన్నులు పెంచి కుషి చేసుకోమని సెలవిచ్చారు మన ఏలినవారు.

ఆ పెద్ద మనుషులు మన కోసం చట్ట సభలలో సిగ పట్లు పట్టి ముష్టి యుద్ధాలు చేస్తుంటే,
రవ్వంత జాలి పడక వారి జీతాలు చూసి అసుయపడుతున్నారు ఈ పామర జనం.






Read more ...

Mar 25, 2011

హలో జిలాని సాహెబ్ గారేనా? నేను మన్మొహన్ని!



హలో జిలాని సాహెబ్ గారేనా? నేను మన్మొహన్ని!

హలో! పాకిస్తాన్ ప్రధాని జిలాని సాహెబ్ గారేనా? నేనే, ఇండియా నుండి మన్మోహన్, మీ మన్మోహన్ సింగు మాట్లాడుతున్నాను. అపుడెపుడో, మీవాళ్ళు మా కొంపల మీద బంబులేసారానో, లేకపోతే మా జనాల్ని ఉచాకోత కోసారనో మిమ్మలిని దెప్పిపొడవడానికి నేను ఫోన్ చేయట్లేదు.ఆ మాట కొస్తే మేమా విషయం మరిచిపోయి చాలాకాలమే అయిపోయిన్దికుడా. కావాలంటే మీవాడు అదే కసాబ్ అండీ, అతనిని అడగండి.లేదా అతనికి ఉడిగం చేస్తున్న మా పోలీసులని అడగండి.

ఆ! ఆ...అలాగయితే అతనికి ఎందుకు ఉరిశిక్ష వేసామంటారా?

అయ్యా జిలాని సాహెబ్ గారు, మీకు తెలియనిదేముంది ఇందులో. మా జనాల బాధ పడలేక ఏదో ఉరిశిక్ష వేసామే తప్ప అది నిజంగా అమలు చేస్తే మీరూరుకొంటార మావాళ్ళు ఊరుకొంటారా? చెప్పండి. నిజం చెప్పాలంటే అతనిని పట్టుకొని మాకు మేమే ఉరిశిక్ష వేసుకోన్నామంటే నమ్మండి. ఇప్పటికే, న్యాయం ధర్మం పేరిట మా వాళ్ళు అతనికి రాచమర్యాదలు చేస్తుంటే ఇక్కడ మా ఖజానాలు ఖాళ్లి పోతున్నయంటే నమ్మండి. అయినప్పటికీ మేము మా ప్రజలు తిన్న తినక పోయినా పస్తులున్డయినా, మీ కసాబ్ కీ కబాబులు బిర్యానీలు తినిపిస్తూనే ఉన్నాము కధ, అయినా ఇంకా మీ వాడిని బాగా చుసుకోలేదని మమ్మలిని నిందిస్తే ఎలా చెప్పండి హుజూర్.

అవునవును, మా ఆర్ధిక ఇబ్బందులు తమరు పెద్దమనసుతో అర్ధం చేసుకోబట్టే గదా ఎంతో ఉదార హృదయంతో మా కరెన్సీ నోట్లని మీదేశంలో అచ్చేయించి మా దేశంలో గుప్తదానాలు చేస్తున్నారు. కానీ మా వాళ్లకి మీ మంచి మనసు అర్ధం చేసుకొనే అంత వివేకం లేక మీ వితరణ గుణానికి కూడా నకిలీ నోట్ల చలామణి అంటూ చెడ్డా పేరు ఆపాదిస్తున్నారు. చీ చీ! ఈ పాడులోకం ఎప్పుడు ఇంతేనండి. మా వాళ్ళ మాటలు మిరసలే పట్టించుకోవద్దు జిలాని సాహెబ్ గారు. వాళ్ళు నన్నే వదలలేదు.

మీరు నా మూతిమీధ మీ బూటు కాలితో తన్నినా నేను ఆ బూటునే ఎప్పుడు నాకేందుకు ఇష్టపడతానని, ఇంకా ఆ 2G, 3G స్కాముల గురించి, ఇస్రో స్కాముల గురించి, యగస్ పార్టీల వాళ్ళని డబ్బులిచ్చి కొనుకోడం గురించి నాకు ఏమి తెలియదని ఎంత మొత్తుకొన్న వినరే మా జనాలు? ఇక వాళ్ళు మిమ్మలిని వదిలి పెదతారండి మీ వెర్రి కాకపొతేను?

ఆ! ఆ...ఎందుకు ఫోను చేసానో చెప్పలేదని కోప్పడకండి. నెత్తిన పగిడి ఉన్నంత మాత్రాన్నమీ మాట దిక్కరించేంతటి వీరాది విరుడ్నికాను నేను. దయచేసి కోపగించు కోకుండా నా మనవి మరి వినాలి తమరు. ఏం లేదు, రేపు మీ వాళ్ళు మా వాళు కలిసి మొహాలిలో సరదాగా క్రికెట్ మ్యాచ్చు ఆడుకొందామని ప్లానేసుకొన్నారు. దానికి మీరు, మన అధ్యక్షులువారు స్వయంగా విచ్చేసి మా స్వాగత సత్కారాలు అందుకోవలిస్న్దిగా నా ప్రార్ధన. బ్బాబ్బాబు జిలానిగారూ, రాలేనని మాత్రం అనకండి. మీ రాక వల్ల మా వాళ్లకి కాస్తంత మనసులు నొచ్చు కొంటాయేమోనని మీరు అసలు ఫిలవధ్దు. అదంతా ఆటలో ఆరటి పండు వంటిది అనుకోవాలి. పైగా మిరొస్తే మ్యాచ్చు మీవాళ్ళు గెలిచే అవకాశాలు కూడా మెరుగవుతాయని తమరికి నేను వేరేగా చెప్పనవసరం లేదు కదా?

ఇంతకీ, ఇంతగా నేను ఎందుకు మిమ్మలిని ప్రాదేయపడుతున్నని మీరు నన్ను అడగావద్దు నే విడమరిచి చెప్పలేను. మా దేశంలో ఎన్నికలోస్తున్నాయని చిన్న క్లూ మాత్రం ఇవ్వగలను. అంతకంటే ఒక్క ముక్క కూడా చెప్పేందుకు మా మేడంగారు నాకు అనుమతి ఇవ్వలేదు.

ఆ..ఆ. ..మీ రాకకీ, మా ఎన్నికలకి సంబంధమేమిటని అడగొద్దు.బోడి గుండికి మోకాలికి ఉన్న సంబంధం వంటిదే అదీను.

ఇంతకీ, నా మాట మన్నిస్తున్నరాలేద ఏలిన వారు? ఆ ఆ అప్పుడే చెప్పలేనంటారా? పోనీ మేము ఈ లోపుగా తమరి రాకకి ఏర్పాట్లు చేసుకోనేన్దుకయినా మమ్మలిని అనుమతించారు? ఇంకా బ్యాండు వాళ్ళని చూసుకోవాలి, తోరణాలు కట్టుకోవాలి, స్టారు హోటళ్ళని కాలి చేయించుకొని దానికి మీ హుందాకి తగ్గట్లుఏర్పాట్లు చేసుకోవాలి, తమరికి ఇష్టమయిన వంటకాలు వండగాలిగే వంటవల్లని వెతుకోవాలి, మళ్లీ మీకు తగిన బద్రతకోసం భారి ఏర్పాట్లు చేసుకోవాలి, ఒకత రెండా చెప్పండి.ఆహా ఇక మీరు నా మాట కాదనకండి హుజూర్. మమ్మలిని కనికరించి మా దేశం విచ్చేయాలి మరి తప్పదు. ఆనక మళ్లీ మీరు మీ దేశం వెళ్లి పోయేక నన్ను నా దేశాన్ని ఎన్ని భూతులు తిట్టినా పరవాలేదు. మా వాళ్ళవి ఎంతమంది ప్రాణాలు తీసుకొన్న పరువలేదు. ఇప్పుడు మాత్రం నా మాట కొట్టేయకండి బ్బాబ్బాబు జిలాని గారూ.

ఆ.. ఆ.. నేనేమి మిమ్మలిని ఫైనల్ మ్యచ్చ్ చూడడానికేమి పిలువట్లేదుగా? ఇందులో మీ వాళ్ళు ఏ బామ్భులు పెట్టిన్నట్లు మాకేమి సమాచారం లేదు. ఒక్క ఫైనల్ మ్యచుకే మీ వాళ్ళు యేవో బామ్బులాటలు, గన్ను ఫైరింగులుకీ ఏర్పాట్లు చేసుకొన్నట్లు, అందుకు ఓ 17 టికెట్లు కూడా కొనుకోన్నట్లు మా వాళు చెప్పారు నాకు. నాకు మీ వాళ్ళ నిజాయతి చూస్తే ముచ్చాతెస్తోందంటే నమ్మండి. మా వాళ్ళలాగ గోడలు దుకో లేకపోతే బ్లాకులో టికెట్లు కొన్నుకోనో వచ్చి లోపల పడాలనుకోలేదు మీ వాళ్ళు. అందుకు మీ వాళ్లకి నా తరపున, నా ప్రభుత్వం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేయండి.

అయ్యా జిలాని గారు, నాది మరో చిన్న మనవి మీకు మివాల్లకి కూడా. ఈ సారయినా పనియిపోగానే ఎలా వచ్చారో అలా గుట్టుచ్చప్పుడు కాకుండా వెళ్లి పొమ్మని చెప్పండి మీ వాళకి. మళ్లీ వాళ్ళు కాస్త మా పోలిసుల చేతికి చిక్కడం, వారికి మళ్లీ మేము జైళ్లల్లో రాచ మర్యాదలు చేయడం ఇక మా వల్ల కాదు. మీరెంత ఉదారంగా డబ్బు పంపుతున్నా అవి నకిలివని మా బ్యాన్కులవాళ్ళు గోల బెడుట్టునారు గనుక వాటితో మీ వాళ్ళకీ సదుపాయాలు చేయలేము. ఆనక మళ్లీ, ఇప్పటిలాగే తమరు నా మీద కోప్పడితే వల్లకాదు మరి ముందే చెప్పేస్తున్నాను. మరి ఉంటాను, ఇంకా చాలా ఏర్పాట్లు చేసుకోవాలి మరి. తమరు అనుమతిస్తే ఫోను పెట్టేస్తాను.
Read more ...

Mar 23, 2011

ఎవడిగోల వాడిదే


నా కున్న బాధలు సరిపోవన్నట్లు, మధ్యలో ఈ కెసిఆర్ ఒకడు ఓ చేత్తో మా వాళ్ళని ఎగదోస్తునే మరో వైపు నాకు మంట పెడదామని ఓ తెగ ఐడీయాలు చేసి ఏదో రకంగా నన్ను ఇరికించి ఆనందిస్తుంటాడు. పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదేనేమో? ఏదో నా రెండు కళ్ళ సిధాంతాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చావలేక బ్రతకలేక నా మాన్నాన్ననేను గుట్టుగా రోజులు వెల్లదిస్తుంటే, ఈ కెసిఆర్ పున్యామని చచ్చే చావోచ్చి పడిన్దినాకు. ఆరు నెలలు గరిడి సాము నేర్చి ములన్నున్న ముసలమ్మ మీద కర్ర ఎత్తినట్లు, ఆ కెసిఆర్ ఇప్పుడు నా మీద పడి వెంటనే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టమంటేమిటి? అతని మాట విని నేను ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఇక నా వెనుక మిగిలే యంయల్యేలేందరు? అలాగని పెట్టక పోతే, ఉరువాడ ఏకం చేసి నేను కాంగ్రెస్ పార్టీతో మిలాకత్ అయిపోతున్నాని ఆ కెసిఆర్ టముకు వేసి నా ఉన్న పరువుకుడా గంగలో కలిపెస్తున్నాడు. ముందుకేల్తే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యి అన్నట్లుంది నా పరిస్థితి ఇప్పుడు. అయినా, కెసిఆర్ కి తెలంగాణా కావాలంటే డిల్లికి వెళ్లి ఆ సోనియమ్మా కాల్లో పట్టుకోవాలి గానీ, ఇలా నా వెంటపడతాడెందుకో ఎంత ఆలోచించినా నాకు అర్ధం కావట్లేదు?

గిదో బాబు, నా మాటిన్కొని మా తెలంగాణాకి పార్టీని సపరేట్ చేసి, నా మాదిరస్సంతోన్కి అప్పజెప్పరాదే? ఇక నీజోల్కి ఎవరొస్తారో నే చుస్కొనేతోడినే గందా? నీకా మెత్తగా ఎంత జెప్పినా సమజవుతలేదు. నీకు పార్టీని నడిపేటి తీరు తెల్వదు వేరొకరు సెప్తే ఇన్కోవు? ముందగల నీ మైండ్ సెట్ జర మార్సుకోరాదే?

ఆ! నువ్వా నాగం?నువ్వు కూడా నాకే పాటాలు నేర్పుతున్నవే గుడ్దోచి కోడినీ వెక్కిరించినట్లు? ఈ నీ తెలివితేటలేవో ఆ కెసిఆర్నినిలువరించేందుకు ఉపయోగిస్తే సంతోషిస్తాను. లేదంటే, అతని దయ వల్ల ఇక మన పార్టీ మిగలదు, మీరు మిగలరు? నా కంటే, నా వ్యాపారాలు నాకున్నాయి. ఎలాగైనా బ్రతికేయగలను, గానీ నీ మాటేమిటి? ఇంత నోరు అంత బొజ్జ తప్ప నీదగ్గర ఏమి తెలివితేటలున్నాయి చెప్పు? రేపు నేను మన దుకాణం కట్టేసే పరిస్థితి వస్తే నువ్వేమి చేస్తావు? వెళ్లి డి.యస్. కాళ్ళు పట్టుకున్తావ లేక ఆ కెసిఆర్ మోచేతికింద నిల్లు తాగుతూ బ్రతుకుతావ చెప్పు? దేవందర్ అంతటోడికే దిక్కు లేక తిరిగి తిరిగి నా పంచన చేరాడు. ఇక నువ్వేపాటి? తోక కత్తిరించేయగలను కబడ్దార్ జాగ్రత్త! నన్నే మైండ్ సెట్ మార్చుకోమని సలహా ఇస్తావా? ముందు నువ్వే నీ మైండ్ సెట్ మార్చుకో, లేకపోతే తోక తెగిపోద్ధి జాగ్రత్త!

సచ్చినన్రా దేముడ, ఇట్లా ఫసాయిన్చినానేటి? అయినా ఇన్తో పెట్టుకొనుడు నాదే మిస్తేకుల గోడ్తాంది. అన్నా, సేంద్రన్నఅట్లా గోప్పడితే గెట్లన్న? ఏదో మా జనాలు ఓ లొల్లి సేత్తా ఉంటే, ఉర్క సప్పుడు సేయక కుర్సున్నట్టు కొట్టరాదని గట్ల డ్రామా నడిపినా మల్లా, అంతే గానీ మాకేంద్కి లొల్లి? వస్తా మరి, జర ధర్నాలు చేస్కనేదాన్కి పోవాల్నమరి. లేకుంటే, ఆ కెసిఆర్ మడుసులు నా ఇంటికి పేడనీల్లు సెల్లి, గలీజు చేసి పోతారు. వస్తా సెంద్రన్న? జై తెల్గు దేశం. జై సెంద్రబాబు నాయుడు!

ఆ అట్లా దారికి! అందుకే ముందుగానే అందరి తోకలు కత్తిరించేసి, నా చేతిలో పెట్టు కొన్నానుగదా? ఇక నా మీద తిరుగుబాటు ధైర్యం మా పార్టీలో ఎవడికుంది?

Where are you going నాగంగారూ? If,you don't mind మీరుకూడా మాపార్టీలోకి జంప్అవొచ్చుకదా Mr.నాగంగారూ?How long can you stick మీ చంద్రబాబు? అసలు మీకు అక్కడ తగిన respect లేదని నాకుతెలిసినా I can't help you with out your interest అనిమీకు వేరేచెప్పలా? What do say నాగంగారూ?ఇప్పుడు మీరుకానీ మా పార్టీలోకి jump అవుతానని నాకు promise చేస్తే రేపే I will go to Delhi and talk to my మేడం సోనియా గాంధీగారు. మీకు,మా తెలంగాణా responsibilities టోటల్గా ఇస్తానని I can't promise but, తప్పకుండ మీకు మాపార్టీ తెలంగాణా అధికారప్రతినిధి postకి చాలా స్ట్రాంగ్గా I will recommend you? ఏమంటారు నాగంగారూ?

నీకో దండం,నీ హైకమెండుకో దండం బెడ్తగానీ నా ఎనకమాల ఇట్టా తిరగామాకన్నా. నీతో గిట్ల ముచట్లతుండానని ఎవులైన మా బాబుకి సెవిలో ఎసినారే అన్కో, ఇక నాపని ఖతం.అయినా, గిట్ల ఎవులని సూస్తే ఆలేనుకబడుటేన? తంతే బుర్లగంపలబడినట్లు సీదాగా సియం కుర్సిలో బడినోడివి. నీ నసీబ్ సక్కగుంటే మరోఆరునెలలు సక్క్కగా సర్కార్ నడ్ప్కొని మస్తుగా నాల్గు పైసల్ వెనకేసుకోరాదే? అయినా, తుమ్మితే ఉదేటి ముక్కులేకున్న నీపదవి, నీ ప్రభుత్వంలోకి పిల్సుకుపోయేటందుకు వేరేవరు నీకు సిక్కలేదా ఏమి? ఇట్లా నాఎంటబడుతుండే? నీకే దిక్కు లేనోటిడివి మల్లా నా ఉసు నీకెలా కిరనన్న?

గదేదో సమేత సెప్పినట్లు మెడకో డోలు తిరుగుంది నీపిలుపు.అయినా, నీ పార్టీల సేరేటందుకు నేనేమైన సిరంజివినో కెసిఆర్నో కాదు గందా? నీ పార్టీల నేకేమైన ఇజ్జతుందా నా ఇజ్జత్ గురించి మాట్లాడు తుండావు? కనీసం ప్రజలైన నిన్ను గుర్తు పడ్త లేరు గదా? మరి నీకెలా నాతో ఉసులు?

what Mr. నాగం గారూ? You are talking rubbish. పోనీ కదా గాలికి తిరుగుతున్నావని పిలిచి పీట వేస్తానంటే You are insulting me. I am already నా రచ్చబండతో become very famous and strong అని మీకు తెలుసు కదా. Now, I can get the appointment of my party high command any time (they wish) you know?

ఇంతకూ ముందంటే, నేనెవరో ప్రజలకి తెలియదు. గానీ now they gradually start recognising me as CM of the state. ఇంత శ్రమ పడి ఇంత బాధలుపడి నేను రచ్చబండ కార్యక్రమాలు చేపట్టెనుకదా దేనికి అనుకొన్నారు? ప్రజలకి రేషన్ కార్డులు, పించన్లు ఇచ్చేతాన్కి అనుకొన్నారా? Where is money?

మా రోశయ్య మాష్టారు గల్లపెట్టె కాలిఅయిపోగానే,నాకుఅప్పచెప్పి ఎంచక్కాగా పంచె దులుపుకుపోయి బయట మా ఆఫీసులో కూర్చోనివచ్చిపోయేవారికి పిట్ట కధలు చెప్పుకొంటు టైంపాస్చేస్తున్,నేను ఇంత strain అయ్యి ఈ రచ్చబండ కార్యక్రమం చేసానని మీకు తెలుసు కధ? అయినా, నేను ఇంత కష్టపడి ఈ రచ్చబండ డ్రామా ఎందుకు నడిపెనంటావు Mr.నాగం గారూ?

Now, I become as popular as late YSR. ఎందుకంటే, ఆ చనిపోయిన ఆ పెద్దమనిషితో నాకు ఎంత close relationship ఉందో అందరికి చెప్పి బాగా popular అయిపోయాను కదా? So, I thought to help people like you. But,జాలిపడి నిన్నుinviteచేస్తే నన్నే ఇన్ని మాటలంటావ Mr.నాగంగారూ?This is too much. It's Ok. మీలాంటి గాలికి తిరిగే వాలతో మాట్లాడే టైం నాకులేదు.వెంటనే ఢిల్లీ రమ్మని మా మేడంగారూ order వేశారు.If,I don't go now immediately, some one will grab my chair. అవసమైతే call చేయండి bye Mr.Nagam గారు.

ఈ గోషకి అంతేక్కడా?మరిక శెలవా? 
Read more ...

బందులు చేసుకుందాము రండి


చదువులొద్దు, చదువులు చెప్పే బడులసలె వద్దు.
మా తెలంగానే మాకు ముద్దు.
బుగ్గి పాలవుత్తున్న మన పిల్లల భవితకి
చేతగాని ప్రభుత్వాన్ని భాద్యుని చేసి చేతులు దులుపుకొని
రండి, మనమందరం బందులు చేసుకొందాము.
ఎందుకంటే తెలంగానే మనకి ముద్దు.

బడికి పోలేదని దిగులే వద్దు
పాటాలు చెప్పలేదని ఆత్మ న్యునతలసలె వద్దు,
తెలంగాణా వస్తే మంత్రమేసి అంతా మర్చేసుకొందాము
ఇప్పుడు బడులు, పనులు మాని
సర్కారు మెడలు వంచే పనిలో పడదాము
తెలంగాణా సాధిధాము
ఆనక మన నేతల తోకలు పట్టి గోదారి ఈదేధాము.


గానుగెద్దు ఉద్యోగంతో అలసి సొలసిన మాకూ
ఓ బంధుల బ్రేక్ కావాలి లైఫ్లో
ఓ రహదారి విందులు కావాలి
ఓ బ్రతుకమ్మ కమ్మటి పాట వినాలి
అందుకే కధలిపోదాము రండి బందులు చేసుకుందుకు

మన బస్సులు, రైళ్ళు మంట బెట్టుకొని చక్కగా చలి కాగుతు
ఆట పాటలతో రహదారి బోజనాలు చేసుకొందాము.
తల్లి తెలంగాణా నీడన ఇంత సేద ధీరుధాము
రండి బంధుల విందులు చేసుకుందాము తరలి రండి


పని చేయకనే పగారు కోరేందుకు ఆత్మన్యునతలసలె వద్దు
సర్కారు మేడలు వంచి జీతాలు రాబట్టగల నోరు మనకుంది
కాధన్నవాడికీ పిడి గుద్దులు గుద్ధగల బలంముంది మనకి
అయినా గాంధేయ మార్గమే మనదనే నోరు జోరు ఉంది మనకి
రండి బంధులు చేసుకొందాము


మన పిల్లలచేయి పట్టి మనమే
బంధుల ఓనమాలు నేర్పుకొందాము
రాళ్ళు రువ్వించి వారిని తీర్చి దిదుకొందాము
వారి జీవితాలతో ఆటలడుకొందాము
ఆనక ఆడలేదని మనకి నిలాపనింధలసలె వద్దు.
రండి బంధు చేసుకొందాము, బస్సులు తగులబెట్టుకొందాము.
Read more ...

నా ఉజ్జమం నా ఇష్టం


నన్నడుగలే...ఇయ్యలరేపు ఈ కోదండం సారేమిటికి అంతా ఒంటిగా గిట్ల డెషన్లు తిస్కబట్టే? ఏదో పాటాలు జెప్కొని బతికేటి పంతుల్ని జర పక్కన బెట్టుకొని నాది మేధావుల ఉద్యమని సేప్కోనేందుకు తెచ్చిపక్కన బెత్కొంటే, ఇదేమ్ధిర భాయ్ ఇడు పక్కలో పాము లేక్క, పక్కలో బల్లెం లెక్క మారి నాకే గాలి తీసేందుకు ట్రై జేస్తుండు. అయినా ఆని గాలెట్ల తీయాలో నాకు తెల్వద ఏమి? ఇగో, ఇక సుడున్డ్రి ఆడు మిలియన్ మార్చ్ అని గొప్పగా చాటిమ్పెసుకొని ఎగిరిండా? నేనీడ, మన పిల్ల బతుకులతో మనమే చెలగాటమాడుకోవద్దని ఓ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ పంతులు గాలెట్ల తీసిన జుసిండ్ర? ఇప్పుడు ఆ పంతులు మిలియన్ మార్చ్ కాదు కనీసం ఓ వెయ్యి మందినైన పోగేయగలాడ రేపటికి? కెసిఆర్ అంటే మజాక్ కాదు మరీ.

పంతులు పని మానుకొని ఉజ్జమాల్కొచ్చి పడిండు గదాయని జర జాలి పడి, ఆ జేయేసి కుర్సీమేన సక్కగా కూర్సో బెట్టి చైర్మన్గా జేసి, పోయి నాల్గు ముక్కలు జెప్పుకొని, నాల్గ్ కాలేజిలు, కంపనిలని బెదిరించి నాల్గ్ పైసలేనకేస్కో మని జెప్పి నా ఉజ్జమంలో షేరూ పెడితే, ఇదేందిరా భాయ్నా ఇడు నాకే పంగనామాలు బెడుతుండు? అందుకే, ఉరుకురా బిడ్డా ఎంత లెక్క ఉరుకుతవో అని ఎగ దోసినంక, ఇప్పుడు సట్టుకున వెనకమాల నూకిన. అంతే! సుడున్ద్రి ఇప్పుడు ఆ పంతులేట్ల గిల గిల కొట్టుకొంటున్డో? సక్కగా నా ఎన్కమాల తిరుకొంటే మంచి గుండె, గానీ, అని లెక్కన ఆడు ఉజ్జమాలు జేస్క బొత ఉంటే ఇక ఈ కెసిఆర్ ఎందుకు ఈ ఉజ్జమాలేందుకు? నాసొంత బిడల్నే ఎన్క బెట్టుకొని తిర్గాతండ గానీ ఆల్లకేప్పుడు సరే ఇగ మీరు సంపయిన్చుకొంద్రని నా ఉజ్జమాలని దానం సేయలేగాధ? మరిక, ఈ పంతులేపాటి నాకు? అయినా మంచిగ సదువుకోనోనికి ఆ మాత్రం దిమాక్ లేకుంటే అడిన్కేలేక్క మేధావావుతాడు?

అయినా, ఇయ్యాల రేపు అందరు తెలంగాణా పార్టీలు పెట్టేతోల్లె! అందరు నాల్గ ధమికిలిచ్చుకొని పైసలు ఎనకేసుకుందుకు ఉరికేత్తోల్లె? ఏది నా లెక్క నాల్గు ఇడ్లిముక్కలు దిన్కొని సెలైను బెట్ట్కొని ఆమరణ నిరాహార దీక్ష జేసి జుపమను? ఓ అందరు నాఎన్క పడి ఎడుసుడే గానీ నీనేంత కష్టపడి, సెమటోడ్సి, నా ప్రాణాలు పణంగా బెత్కొని ఈ పేరు, పైసల్ సంపైంచిన అని ఎవురు అడగరు మరీ. అయినా, ఈ ఉజ్జమం ఇవ్వాళా రేపు అయిపొయిడిదా ఏమిటి? ఒక వేళ ఈ మతి మాలిన కాంగ్రెసోళ్ళు పోనీ తెలంగాణా ఇచ్చేందుకు ముందుకొచ్చిన, నేను ఏదో కిరి కిరి జేసి మరో పది పదిహేను ఏళ్ళు సాగేల జేస్కోకపోతే, ఆనక నా మొకం సుసేడిది ఎవరు? నాకు ఇంత మందు పోసేతోల్లెవారు?

అయినా, గా పక్క సీమాన్ద్రోల్లు ఉండగా మనకెలా దిగులు? అదేదో సామెత జెప్పినట్లు, బక్తుడు కోరింది అదే దేముడు వరమిచ్చింది అదే అన్నలేక్కన, మనం ఇడ తెలంగాణా తెలంగాణా అని ఓ ఒకటే లొల్లి జేస్తూనే ఉండాలే, గా పక్క ఆంధ్రోల్లని బెధరగోద్తానే ఉండాలే, పోయి ఆలె అడ్డు పడి తెలంగాణా రాకుండా జేసి పోతారు. గి లెక్కన ఈ ఉజ్జమం ఎన్ని దినాలు, ఏళ్ళు నడిసిన నాకు నా ఫామిలికి సక్కగాసాగిపోది మరీ. ఇగోఇసుమంటి అమాయక పంతుల్నినడిమిట్ల దేస్తే, ఆడు తెల్వి తక్కువగా ఉజ్జమం నడిపి తెలంగాణా దెచిన దెస్తాడు. అన్థుకే, చిన్న పామునైన పెద్ద కార్రతో సంపమన్నారు పెద్దలు. మరీ, ఆ పంతులు గాలి దిస్తే నాదెట్ల తప్పవుద్ధి?
Read more ...

లైట్గా తీసుకోకు బిడ్డా!




ఇదో మన్మోహన్ నీకు సక్కగా సెప్తే సమాజ్ కాదా ఏంది? ఇంతకీ నువ్వు మా తెలంగాణా మా కిస్తావ లేదా ఒక్క ముక్క సెప్పరాదే? ఆనక మేమేం జేయాలనో మేం జేస్తామని చెప్తాన ఉండాముగందా. ఏదో పెద్దోడివి, ప్రధాన మంత్రివి, నెత్తిన పగిడి ముకాన్నఇంత గెడ్డం పెంచిన్తోడివని ఏదో ఈ పాటి మర్యాదగా సంజయిస్తుంటే, నువ్వేందిరా భాయ్ అట్టా సడి సప్పుడు సేయక సల్లగ కుర్సోని గట్ల దిక్కులు సుత్తావ్? అయినా నిన్నని ఏమి లాబంలే? నీకు ఆ సోనియమ్మ కీ ఇస్తే గాని సప్పుడు సేయవని ఎరికైనకూడా ని కాడ కోచ్చుడే నా బుద్ది తక్కువ. నేరుగా పోయి ఆ సోనియమ్మ కే కాల్మొక్త. తెలంగాణా ఇయ్యే తల్లీ నీకు గుళ్ళు గోపురాలు గట్టి పూజలు సేత్తమని వేడుకొంట. అయినా ఇన్కపోతే నీ బొంద పెడ్తామని గట్టిగ హెచ్చరించి వస్తా, ఆనక మావూరు పోయినంక మీ ఇద్దరి కధ ఊరూరు తిర్గి మరీ ప్రేచారంసేత్త. ఆ! కెసిఆర్ అంటే ఎమనుకొంటున్నవో. గొంతుల ఇంత సుక్కఎయకనే సెప్తున్న మాటిది. అన్నా! మన్మోహన్నన ఇదే సేప్తన్నఈ తెలంగాణాపులిని లైట్గా తీస్కొని ఆనక మల్లా నా పైన అగ్గామవుతనంటే మరీ కుదరదు. మరీ నే వస్తా.

యేంటి, అప్పుడే పగిడి తీసి పక్కన పెడతండావు? నేను పోత నన్నందుకు సంతోసమ లేక నేను వేల్లోస్తన్ననందుకు నెత్తిగోకుడుక ఆ పాగా తీస్త? మా తెలంగన్నోల్లని సూస్తే ఇంత సులకనగా కొడ్తన్నర? కబడ్ధార్! మేముగాని ఈడ మా ఆట పాట మొదలెట్టినామనే అనుకో, అగో ఆ కుతుబ్మినారు పలిగి పోవాలె. మీ పార్లమెంటు గడ గడ లది పోవల్నే. అయినా నాక తెల్వక అడుగుతుండా రొట్టె ముక్కలు తిని బతికేతోడివి ఎప్పుడైనా మా జావాన్నం తిన్నావా?మా తెలంగాణా పవరేపటితో నీకు ఎరుకనేనా? అని నేను అడుగుతుండా? మా ఆడోల్లు సాలు. ఆల్లు గానీ ఇడకోచ్చి బతుకమ్మ ఆట పాట ఇక్కడ అడినారే అన్కో, అనక నీయంతట నువ్వే మా తెలంగాణా మాకియక తప్పదు. మేము మంచిగ సేప్పిన్నపుడు సక్కగా ఇన్కొని మా తెలంగాణా మాకీయారాదే ఎందుకీ అనవసరలోల్లి? మేము గానీ ఈడకొచ్చి లొల్లిసేస్తే నీకు మంచిగుండదు, మాకు మంచిగ ఉండదు. ఆనక ని ఇష్టం బిడ్డా. మళ్లీ ఆనక నేరం నామిదేస్తే ఉరుకోనేడిది లేదు.

ఆ! గేన్ది అట్లా మిర్రిమిర్రి సూస్తే నేను బయపడి మా ఊరుకి ఉర్కతననుకొన్నావా? నువ్వు కాదంటే ఆ బిజేపీ వొళ్ళు సాల్నాల్లుగా మాకు సైగలు సేస్తనే ఉండారు. మళ్లీ అల్లెనుక తిరుగుడేందని ఇట్టా మీ కొంపల సుట్టూ తిరిగి తిరిగి యేసరిపోయినా.

ఇక, మీతో ఇట్టా మర్యాదగా మాటాడితే పనిగాదు. ఇక, మా ఉర్ల పోయి నీకు ని కాంగ్రెస్స్ పార్టీకి బొంద పెట్టుడు కాయం! అయినా, ఇంత సేపలినింది ఇట్టా గొంతు సించుకు నేను అరుసుడేగాని, ఏమి నీ నోట్లనుంచి ఒక్క ముక్క, ఒక్క ముక్క సరే మీ తెలంగాణా ఇస్తమని ఒక్క ముక్క రాదే? సరే, నికదేపాటిదో నాకు సక్కగా సమజ్అయినది. ఇక నీ కాడ ఈ కన్తసోష అనవసరం అని తేలిపోయింది. మరో సారి నీ గుమ్మం తొక్కితే నీ సేప్పిచ్చుకొట్టు.

పోయి ఆ సల్లని తల్లీ సోనియమ్మనే కల్మోక్కి వేడుకొంట. ఆమెగానీ ఇయకపోతే ఆడనే ఇంత మందు తాగి, అన్నో! నేను అనెడిది నేను పొదుగల, పొద్దుగాల తాగేడిది ఆమందు గాదు, పురుగుల మందు, అది తాగి ఆమె కాళ్ళ మినె నా ప్రాణాలు టిస్క సస్త. అప్పుడైనా ఆమె మనసు కరుగుద్దేమో సుద్ధారి, ఆ మరీ శెలవా?
Read more ...

ఇదేందిరా భాయ్ ఈల్లు మా ఎనుక పడుతుండ్రు?

కెసిఆర్: తమ్మీ జగను నాకో మాట తెల్వక అడుగుతున్నా, ఆ సినిమా పోరాగాడేదో ప్రజలకి సేవ చేసుకున్దురని ఓ పార్టీ ఎట్టి ఆనికి దానిని నడుపుడు చాతగాక ఎల్లి దానిని కాంగ్రేసులో నూకితే, సక్కగా అనితో దోస్తి జేస్కోవలె గానీ, ఇదేందిరా భాయ్ ఈల్లు మా ఎనుక పడుతుండ్రు? అయినా, మదేమైన సినిమా పార్టీల గొడ్తోందా ఎవులకైన? అదెప్పుడో జర మూడు మంచిగా లేన్నపుడన్నా మాట పట్ట్కొని ఈ కాంగ్రెసోళ్ళు మా ఎనుక బడుటేందిరా?

జగన్: రోలోచ్చి మద్దెలతో మొర బెట్టుకోవడమంటే మరిదే! నేనేదో నానా తిప్పలూపడి పార్టీ పెట్టుకోవాలని కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతుంటే మీరొచ్చి నన్నెందుకు అడుగుతున్నారు? అయినా, ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలొస్తే అక్కడ మీరు, ఇక్కడ నేను గెలిచేస్తామని మిమ్మలిని మేమేమి సర్టిఫికేటు అడగలేదుకదా? తమరి నోటి ధూలవల్లనే గదా వాళ్ళు ఇప్పుడు ఏకమై నా కొంప మీదకి తెచ్చారు? చేసిందంత చల్లగా చేసి, మళ్లీ ఏమి ఎరుగనట్లు నన్నెందుకు అడుగతారు? మీకు రెండు చేతులెత్తి దండం పెడతా, ఇంకా కావాలంటే రెండు దీక్షలు చేసిపెడతా, గానీ ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రం కొన్ని రోజులు నా జోలికి రాకుండా చూడండయ్యా కెసిఆర్ గారూ!

కెసిఆర్: అదేమ్ధిర మరీ పిల్లగాయి లెక్క మాటలాడుతుండవు? నీ ఎనుక మేము లేము? జర జై తెలంగాణా అని ఓ కేకయరాదే, ఆనక నీ జోలికి ఎవరొస్తారో మేము సుస్కుంటాము? గావాల్నంటే, మేమే మికాడికొచ్చి బందులు ధర్నాలు సక్కగా ఎట్లా సేయ్యాలో మీ పోరాగాలక్కి పక్క ట్రైనింగ్ ఇస్తాము, ఎమందువురా భాయ్?

జగన్: అది ఇప్పుడే చెప్పలేను, గానీ నాల్రోజులు ఆ కాంగ్రేసోల్లని మాత్రం కొంచెం నీ ఎనుక తిప్పుకోవయ్యా బాబు కెసిఆర్. ఆనక కాస్త ఉపిరి తీసుకొన్నాక అన్ని తీరికగా కూర్చోని ఆలోచిధాము. సరేనా?

కెసిఆర్: సరే నీ మాటెందుకు కాధనాలే? రేపే మల్ల బందులు మొదలు బెట్టుడు షురూ చేస్తాం, గానీ మా తెలంగాణాకి నీకాలు అడ్డంబెట్టకు బిడ్డా? సరేనా?

జగన్: సరే!
Read more ...

Mar 21, 2011

మా కల్లు దుకనాలు తెరిపియ్యలె:కెసిఆర్


ట్యాంక్ బండ మిదిల విగ్రహాలు మా పోరగాల్లు కుల్చినరని ఈ ఆంధ్రోల్లు మా తెలంగానోల్లని తాలిబాన్ల లెక్క జమచేసి తెల్విగా బద్నాం జేస్తుండ్రు. అయినా నాకు తెల్వక అడుగుతుండ, మొన్న మా పోరాగాల్లె మా తెలంగాణా తల్లిని విగ్రహం తగులబెట్టిన్నాడు ఇల్లందరు ఏడకి బోయినారని అడుగుతుండా? ఆ రోజు ఈ ఆంధ్రోల్లకి ఏమి తప్పుగా కొట్టలేద అని అడుగుతుండా? అయినా అల్లనని ఏమి లాభం? మావోళ్ళు వట్టి చవటలని నేనాడో సెప్పిన గాని ఎవరు ఇన్కోలె. ఏదో ప్లానేస్కని విగ్రహాలని కుల్చుడే అనుకొంటిరతప్ప ఆనక మేమేలేక్కన కవరింగియ్యలె అని ప్లానియ్యలె ఎవలు. అయినాగానీ, మాకు తప్పేటిది కాదు గదా. అందుకే, మంచి నోర్రున్న నా కూతురు కయితమ్మని తోడిచ్చి ట్యాంక్ బండ మీదకి మా తెలంగాణా కవులని తోలిచ్చిన. నిజం సేప్పల్నంటే నా ముదుల కయితమ్మ 'సాభిమన్ యాత్రో మరే యాత్రో గాని నా నోరు తిర్వని యాత్ర పేరొకటి జెప్పుకొని దానికి ఓ బ్యానర్ తగించుకొని సాలసక్కగా ఇస్టోరి నడిపింది. ఇలెక్కన జూస్తే రేపు నా ఉజ్జమధన్దాలన్ని ఆమెకే రాసి చెయ్యాలని నాకన్పిస్తోంది. గానీ, అట్లా జేస్తే నా కొడుకు నా అల్లుడు సప్పుడు సేయక కుసున్టార అనేదె నా డౌటు. ఆల్లకీ తెలంగాణాలో నడిసే ఆంధ్రోల్ల కాలేజిలు, కంపెనీలు  చేరి సగం వాటాయేసి పంచిఇచిన. అయినా గానీ, బంగారు బాతు లెక్క గుడ్లేట్టే నా ఉజ్జమమే రాసియమంటే ఏమి జేయల్నే. ఇంత వరకు సడి సప్పుడు సేకుండా ఈ ఉజ్జమం పేరు జెప్కొని నాల్గు పైసలు వెన్కసిన. అది గాస్త యిళ్ళకుమ్ములాటలో యెడ బయట పెడుతురో అని సాన బెంగాగుందే నాకు. 

ఆ...! మిడియవోల్లోచింద్రా? బయటనే గుస్సోమను. ఆల్లుగానీ లోనికి వస్తే ఉర్రోల్లందరికీ కల్లు తాగమని సెప్పి నేనీడ ఫారిను సరుకు లోనికి నుకుతున్డానని ఓ ఒకటే ఇక లొల్లి జేస్తారు. ఆనక మళ్లీ దీనికి నేను కవరింగు ఇచ్చేతానికి నా తల పేనాలు తోకలోకి రాబట్టే. వస్తే వచ్చినారుగాని గిప్పుడు మంచి మూడుల ఉన్నగనుక, పోయి ఈ టాపిక్ మీదనే లేచ్చారిస్తే బోలా? ఇగో సెగట్రీ నా ముతిల మందు వాసనగాని కొడ్తందా ఏమి? 

 ఆ...ఆ...ఇగో...వచ్చిన...ప్రతి దినాము మీరు నన్ను ప్రశ్నలు అడుకోవడము, దానికి నేను సమాధానాలు జెప్పుడు ఏంది. ఈ రోజు మంచి మూడుల ఉన్న గనుక నేనే సెప్తా రాసుకొండ్రి. ఈ సర్కారే లెక్కన పని జేస్తున్నదో నాకు తెల్వదు గానీ, మా నదులు, కాల్వలు  అన్నిటిని ఆంధ్రోల్ల పోలాలైపు పారించినారు. కనీసం మా కల్లు దుకనాలు అయినా మకియ్య రాదే? ఆడ ఆంధ్రలో యిదికొక  కల్లు దుకనమాట, పేటకి పది మందు దుకనాలట యెడ బోయిన నా అసుమంతోల్లు నాల్క తడుపుకొనే తానికి సక్కగా ఎక్కడికక్కడ సౌకర్యం జేస్కొని మస్తుగా కుషి జేస్తుందే. గానీ మా కాడ మాత్రం సక్కగా నడిసేటి మా ౪౦౦ కల్లు దుకనాలు ముతబెట్టించి మా నాల్కలు ఎండ బెడుతుండే. గిదేమి న్యాయమని అడుగుతుండా? ఏమి మా నాల్కలు నాల్కల్ గావ అని అడుగుతుండా? ఈ సర్కారు ఎలేక్కన ఉందంటే ఇయ్యాల రేపు తాగెతందుకు మంచి నీళ్ళ  మాట దేవుడెరుగు, నా అసుమంతోడికి జర నాల్క పికితే పోయి ఆ ఆంధ్రోల్లనే కల్లు పోయమని అడ్డుకునేల జేసినా జేస్తారు. అందుకే, నేనీ గవర్నమెంటుని డిమాండ్ జేస్తున్న, మూసేసిన మా ౪౦౦ కల్లు దుకనాలు మల్లా తెరిపియ్యాలే, అంతే గాదు మరో ౧౦౦౦ దుకనాలు కూడా తెరిపియ్యాలే వెంటనే. లేదంటే మల్లా నేనే ఇడ్లి ముక్కలు తిన్కొంటు నిరాహార దీక్ష మొదలెట్టేడిది కాయం అని హేచ్చారిస్తుండా. అయినా మేమేమి  ఇప్పటికీ ఇప్పుడే తెలంగాణా ఇయ్యమని ఎవర్ని అడుగుత లేదు గదా. ముందుగల మా కల్లు దుకనాలు మా కిస్తే చాలు. లేదంటే మళ్లీ లొల్లి తప్పదు మరీ అని గోవేర్నమెంటుని  హేచ్చారిస్తుండా.

ఇప్పటికీ సాలా మరీ. లోన సాన పనుండే. అయినా, ప్రేస్సోల్లోచినారని జెప్తే అన్ని పక్కనెట్టి బయటకి ఉరికోచ్చినా. సెలవ? నా స్టేట్మెంటు మరీ సక్కగా రావలె. జై తెలంగాణా!
 
Read more ...

ఆ నేనే! మీ సురేఖని సెప్తున్నా ఇనుకొండ్రి


మీడియా: మేడం, మీరు జగన్గారికి కటిఫ్ చెప్పి, మళ్లీ డియస్(కాంగ్రెస్)హస్తం పటుకొన్తున్నారని,అందుకే ఇన్నాళ్ళు జగన్కి మొహం చాటేశారని మాకు తెలిసింది. దానికి మీరేమంటారు మేడం?     

కే.సురేఖ: నాల్గ దినాల్ కనబడకుంటే అట్లా నా పైన ఏవేవో కధల్లలుడేనా? ఇదేమన్నా మీకు నాయంగుందే? ఆ నాకు తెల్వక అడుగుతుండా, ఉర్రోల్లని అందరిని బందులు సేయండ్రి, బస్సులు తగులు పెట్టున్డ్రని ఉరిమీకి అమ్పినంక, ఇంట్లో కుస్సోని మందుకోట్టేటి ఆ కెసిర్ మీకు కానరాకున్దేనా, పార్టీల ఎంతలొల్లి అవుతున్నగమ్మున కుసుండే ఆచంద్ర బాబు, మీకు అగుపడ్తలేదా? 

ఆడదాన్నిసేసి,అనగారినోల్లని చేసి ఇట్లా మాయెంటపడుటేనా? ఏంది? అయినా, నేనేడకి పోయినానని, మీరు నాపైన కధలు కధలు గట్టి రాసుకు పోతుండ్రు? నేను నా ఇంట్లనే కుసుండి, రేపు నా బతుకేట్లా తెల్లరుద్దా అని పరేశాన్ అవుతా, అలోసనలు సేత్తుండా! అదిగూడ నేను మీకు సమ్జయిన్చాల్నా? పోయి, రెండు కళ్ళు మూడు కళ్ళు అనేటి ఆ బాబు నడుగుండ్రి, నడుమిట్ల గేడ దాకున్నావని? పోయి ఆ మందు బాబు కెసిఆర్ ని అడుగుండ్రి మద్దె మద్దెలో అట్లా సప్పుడు  సేయక సల్లబడినవెందుకని? అంతే గానీ, నా ఎనుక పడితే యెట్లా అన్నా? అసలే నోరు లేని ఆడదాన్ని! కనీసం నా తోటి ఆడది ఆ సోనియమ్మాకైన నా గోడు సేప్పుకొందామని నా సేక్రటరిని బట్కోని, ఇన్ని దినాలుగా సప్పుడు సేయకుండా తొమ్మిది పేజీల ఉత్తరం రాసుకుర్సున్న! ఇదో! ఆ ఉత్తరం నమ్మ కుంటే మీరే  సుస్కొండ్రి. ఆనక, దానేనుక మల్ల కొత్త కధల్లల్లి, నాకు మా తమ్మీ జగనుకు ముళ్ళు పెట్టమాకండి. ఆ సోనియమ్మ నా మాటినుకొని, నాడే మా జగనుని చెన్కనేక్కిన్చుకొనుంటే,ఈదినం ఆ చిరంజీవిని నెత్తిన ఎత్తుకోనే పని లేదుగా? అయినా ఏవరినని ఏమి లాభం మా పెద్దన్న రాజసేకరుడు లేన్నపుడు? అంతా, మా నసిబుల ఇలాగె జరుగుండాలనిరాసుండే మరీ? ఏవరినని ఏమి లాభం? 
Read more ...

నేన్నేపుడో చెప్పా మీ మైండ్ సెట్ మారాలని...


అలిపిరిలో తిరుపతి వెంకన్న సాక్షిగా నా మీద నక్సలైట్లు దాడి చేసినప్పుడు కూడా గూడా నేనింత బాధ పడలేదు. ఎందుకంటే, మళ్లీ ఎన్నికలలో ఎలా నెగ్గుకు రావాలా అని తల పట్టుకు కూర్చొన్న నాకు, ఆ వెంకన్న దేముడే ఇలా దాడి జరిపించి, చేతికి బ్యాండేజి వేసుకొని, ఎన్నికలకి వెళ్లి గెలుచుకో పో అని అదేసిస్తునాడేమోనని తలచి అర్ధంతర ఎన్నికలకి గంటకొట్టి, నా పదవికి నేనే ఎసరు తెచ్చుకొన్నాను. అది మొదలు నాటినుండి నేటి వరకు నేను ఏనాడూ కంటి నిండా నిద్ర పొయింది లేదు, కడుపు నిండా ఇంత తిన్నది లేదు. అయినప్పటికీ, పని లేని కుక్కకి తీరిక కూడా లేదనట్లు, రాష్ట్రాన్ని ఆ కొస నుండి ఈ కొస వరకు చెడతిరిగేను గాని, అటు ప్రజలని మేల్కొల్ప లేకపోయాను, ఇటు మా జన్నాని హుషారు చేయలేక పోయాను. ఎక్కడికి వెళ్ళినా, అందరు ముందుగా నా మైండ్ సెట్ మారాలని  నామాట నాకు అప్పచెప్పే వారేగానీ, ఎవరు కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవలనుకోక పోవడం నిజంగా విడ్డురం కదూ? నా తెలివి తేటలతో ఆ బుష్షు దొరని, క్లింటను బాబుని కూడా బుట్టలో వేయగలిగేనని ఎంతో మురిసేనుగానీ, పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనట్లు, నేను కూడా మన జననానికి పనికి రాకుండా పోతానని ఏనాడు కలలో కూడా ఊహించలేదు. అలాగని బూడిదలో కప్పడిన వజ్రం వంటి నా విలువ నాకు తెలియధనుకోలేను కదా! అందుకే, నా ప్రయత్నాలు నేను చేసుకు పోతున్నాను. గానీ,  మధ్యమధ్యలో ఓసారి నా వంటి లోకోపకారికి, నిస్వార్ధ ప్రజా సేవకుడికి, మేధావికైనా అగ్ని పరిక్షలు తప్పవు కదా?

"ఏటి సెంద్రబాబుగోరు మీలో మీరే ఏటేటో  మాట్లాడేసుకొంటున్నారు? పదవి పోయిన కాడినుండి తవర్ని సూత్తనే ఉన్నా, తవరిలో ఏటో  తేడా అగపడుతూనే ఉన్డాది... "
" ఏయ్ ఎవడ్రా నువ్వు?"
"ఆయ్, నేనేనండి, మిడిల్ కలాసోడిని.ఆనాడు తవరు ఓటేయమని అడగెందుకు మాకాడికి ఒచ్చి నారుకాదండి? ఆన్నేనండి. మీరలా ఆఫీసులో దిగాలుగా కూర్చోని కానోస్తే, మనసుగ్గబట్టుకోనేక ఇట్టా ఓ పారి తవరిని పలకరించి పోదారని పారొచ్చి నానండి. యేటండయ్యా, అలా దిగాలు పడి వల్లకకూసుంటే, అయినకాడికి మివోల్లే మీ ఎనుక అంతా సక్క బెట్టేసేసి, ఆనాడు మీరు మామ గారూ ఎన్టివోడిని బయటకి  అమ్పినట్లే మీకు బయటకి సాగానంపుతారేమో జాగ్రత్త పడండి మరి. ఆనక మీ మాగారల్లె మీరు సేతులు కాలేక ఆకులు పట్టుకొని ఎడసి పయోజనం ఉండదు." 
(నువ్వన్నది కరక్టే అయినా, అది నేను పైకి ఒప్పు కోలేను కదరా సచ్చినోడా?)
మిగిలిన ఘోష మళ్లీ రేపు...ఇక్కడే చదవండి ... 

ఆ, అంతా ధైర్యం మా పార్టీలో ఎవడికుంది? అందరి తోకలు కత్తిరించేసి, నా చేతిలో పెట్టు కొన్నానుగదా?            

Read more ...


రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలేదన్నట్లు, అన్న చిరంజీవి సోనియమ్మ కొంగుచాటున బ్రతుకుతున్నా, పులిలాంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఈతి  బాధలు తప్పట్లేదు ఎందుకో. ఆనాడు మంచి జోష్ మీద ఉండి ప్రజల మనసులు రంజిపజేయాలనే సదుదేశ్యంతో కాంగ్రెసువారి పంచేలుడదిసి మరీ తరిమి కొటండనీ సరదాగా పలికిన నాలుగు ముక్కలను పట్టుకొని, అమాయకుడైన తనని ఇలా కోర్టుకి ఈడుస్తారని కలలోనయిన ఉహించలేదు పాపం పవన్ కళ్యాణ్. అయినా, ఆనాడు ఎలాగు మనమే అధికారంలోకి వచ్చేస్థామనే వెర్రి నమ్మకమొకటి కూడా కొంపముంచింది. అప్పటికీ,  నోరు ఎంత అదుపు చేసుకోమని అన్నగారు చెప్పినా వినకుండా నోటికి ఎంతోస్తే అంతా వాగేసి, ఇలా ఇప్పుడు కోర్టుల చుట్టుతిరగాల్సివస్తుందని ఉహించని పవన్ తమ్ముడికి ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చిపడింది.

వనపర్తి కోర్టువారు (మెహబూబ్ నగర్) మన పవనుడికి మార్చ్ 7వ తేదిన స్వయంగా కోర్టుకి హాజరు అవ్వల్సిన్ధిగా తాజా ఆదేశాలు జారి చేసింది. మరీ, స్వయం కృషితో కాస్తంత, సామాజిక మార్పుతో మరికాస్తంత అలా అలా అంచెలంచలుగా పైకెదిగి, ప్రస్తుతం కాంగ్రెస్ హస్తం దొరక బుచ్చుకొని కాంగ్రెస్ రాగం ఆలపిస్తున్న మెగా అన్న చిరంజీవి, తన తమ్ముడిని కాపాడేందుకు కొత్తగా పొడుచుకొచ్చిన తన సరికొత్త కాంగ్రెస్స్ హస్తం  అడ్డువేసి కాపాడుకోకుండా ఉంటాడా? లేక చట్టం తన పని తానూ చేసుకు పోతుందని ఓ సినిమా డైలోగ్ కొడతాడ చూడాలి మరీ.
Read more ...

telugu

తెలుగు వారందరికీ నా బ్లాగులోకి స్వాగతం సుస్వాగతం. అతి త్వరలో కొన్నికొత్త పాత కబుర్లను ఇక్కడే మనమందరము కలబోసుకొంధము.
ఇట్లు మీ 
తెలుగ్గోడు 
Read more ...